ఉప్పెన హీరోయిన్‌కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! | Uppena Fame Krithi Shetty Open About Harassment With Hero Son | Sakshi
Sakshi News home page

Krithi Shetty: బర్త్‌డే పార్టీకి రమ్మని టార్చర్.. స్టార్ హీరో కుమారుడు వేధింపులు!

Published Mon, Jul 3 2023 5:16 PM | Last Updated on Tue, Jul 4 2023 1:21 PM

Uppena Fame Krithi Shetty Open About Harassment With Hero Son - Sakshi

టాలీవుడ్‌లో ఉప్పెన ఫేం కృతి శెట్టి పేరు తెలియని వారు ఉండరు. తెలుగులో మొదటి సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తన అందంతో సినీ ప్రియులను కట్టిపడేసింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో ఛాన్స్‌లు కొట్టేసింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. ఇటీవలే నాగచైతన్య సరసన కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

(ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!)

అయితే గ్లామర్ ఫీల్డ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్‌గా నిలకడగా రాణించాలంటే అన్నింటిని తట్టుకుని నిలబడాలి. ఇటీవలే ఆర్‌ఎక్స్100 భామ పాయల్ రాజ్‌పుత్‌ కొందరు డైరెక్టర్స్‌ తన ఫేమ్‌ని వాడుకుని వదిలేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

తాజాగా కృతి శెట్టి సైతం వేధింపులకు గురైనట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఆమెను ఓ స్టార్ హీరో కుమారుడు టార్చర్ చేస్తున్నాడట . ఇటీవలే ఓ హీరో కుమారుడు కృతికి ఫోన్ చేసి తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నాడట. ఇటీవల తన బర్త్‌ డే పార్టీకి రావాలని ఆహ్వానం కూడా పంపినట్లు సమాచారం. పార్టీకి వస్తే డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తానంటూ ఆఫర్‌ కూడా ఇచ్చాడట.  అయితే ఆ స్టార్ హీరో కుమారుడు ఎవరా నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. కృతి ప్రస్తుతం శర్వానంద్ సరసన నటిస్తోంది.  మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

(ఇది చదవండి: ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. వీడియో డిలీట్‌ చేసిన దుల్కర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement