స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..! | Shruthi Haasan, vidhyuth Jamwal yaara Shelved | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..!

Published Wed, Aug 2 2017 1:10 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..!

స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..!

సౌత్ లో మంచి ఫాంలో ఉన్నా... బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది స్టార్ వారసురాలు శృతిహాసన్. కాటమరాయుడు సినిమాలో తన లుక్స్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ తరువాత సౌత్ సినిమాలేవి అంగీకరించలేదు. చేతిలో ఉన్న సంఘమిత్ర నుంచి కూడా తప్పుకొని పూర్తిగా బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది.

అయితే ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన బెహన్ హోగీ తేరి సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన శృతికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. శృతి హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'యారా' ఆగిపోయింది. విధ్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈసినిమా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్ర నిర్మాణం కొనసాగించలేమని భావించిన యూనిట్, నిర్మాణం ఆపేస్తున్నామని తెలిపారు.

తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా తప్ప మరే సినిమా కూడా శృతి హాసన్ చేతిలో లేదు. ఆ సినిమా కూడా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం శృతి బాయ్ ఫ్రెండ్ తో విదేశాల్లో చక్కర్లు కొడుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement