shelved
-
మరో భారీ బడ్జెట్ మూవీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో సూర్య?
వైవిధ్యభరిత కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నటుడు సూర్య. ఇటీవల సూరరై పోట్రు, జై భీమ్ వంటి చిత్రాలతో మంచి హిట్లు అందుకున్నారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది ఆయనకు 42వ చిత్రం. దీన్ని సూర్యనే తన 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించడం విశేషం. బాలీవుడ్ బ్యటీ దిశా పటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షటింగ్ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రానికి ముందే బాలా దర్శకత్వంలో సూర్య వణంగాన్ అనే చిత్రంలో నటించడం మొదలెట్టారు. దీనికి తనే నిర్మాత. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు నందా, పితామగన్ వంటి చిత్రాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. దీంతో వణంగాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది విభేదాల కారణంగా వణంగాన్ చిత్రం నుంచి సూర్య వైదొలిగారు. కాగా, సూర్య కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం వాడివాసల్. వెట్రివరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్నారు. ఇది జల్లికట్టు నేపథ్యంలో సాగే చిత్రం. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ హాస్య నటుడు సరిని కథానాయకుడిగా పరిచయం చేస్త విడుదలై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత సూర్య హీరోగా నటిస్తున్న వాడివాసల్ చిత్రంపై వెట్రివన్ దృష్టి సారిస్తారని సమాచారం. అలాంటిది తాజాగా వణంగాన్ చిత్రం మాదిరిగానే వాడివాసల్ నుంచీ సూర్య వైదొలగిన వదంతులు సావజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నిర్మాత కలైపులి ఎస్.ధాను వాడివాసల్ చిత్రం గురిం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంబంధింన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. -
తోకముడిచిన చైనా.. భారత్ పైచేయి
China Suspends Energy Projects In Sri Lanka: డ్రాగన్ కంట్రీ మరోసారి భారత్‌పై తన అక్కసును ప్రదర్శించింది. భారత్ పేరును ప్రస్తావించకుండా.. అంతర్జాతీయ సమాజంలో బద్నాం చేసే కుట్రకు తెర తీసింది. ఈ మేరకు శ్రీలంక తీరం వెంట నిర్మించతలబెట్టిన భారీ ప్రాజెక్టునొకదానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. భారత్ తీరుపై ఆగ్రహం ప్రదర్శించింది చైనా. అయితే ఈ వ్యవహారంలో అంతిమంగా పైచేయి మాత్రం భారత్‌దే కావడం విశేషం. చైనాకు చెందిన సినో సోర్ హైబ్రిడ్ టెక్నాలజీ కంపెనీ, శ్రీలంక జాఫ్నా తీరం వెంబడి డెల్ఫ్ట్, నాగాదీప, అనల్‌థివు దీవుల్లో హైబ్రిడ్ రెనెవబుల్ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బయటి దేశం నుంచి భద్రతా పరమైన సమస్యలు ఎదురుకావొచ్చనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టను రద్దు చేస్తున్నట్లు గురువారం సినో సోర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ అభ్యంతరం మేరకే.. వాస్తవానికి చైనా ఏర్పాటు చేయాలనుకుంటున్న దీవుల సముదాయ ప్రాంతం తమిళనాడుకు దగ్గర్లో ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సమయంలోనే భారత్ నిరసన గళం గట్టిగానే వినిపించింది. కొసమెరుపు ఏంటంటే.. లంక ప్రభుత్వం కూడా తొలుత ఈ ప్రాజెక్టును వ్యతిరేకించినా.. సెయిలోన్ బోర్డు(CEB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు కావడంతో సైలెంట్ అయ్యింది. కానీ, భారత్ మాత్రం ఏడాదిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి చైనాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. అయితే ఇంత జరిగినా భారత్‌ను బద్నాం చేయాలనే కుట్రను మాత్రం చైనా ఆపలేదు. లంకతో ఒప్పందాల విషయంలో బయటి దేశం జోక్యం ఎక్కువైందని, పైగా ఆ దేశం వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందంటూ పరోక్షంగా భారత్‌ను తెరపైకి తెచ్చింది. ఇదే ప్రాజెక్టును మాల్దీవుల సముదాయంలో నిర్మించబోతున్నట్లు సినో సోర్ హైబ్రిడ్ టెక్నాలజీ కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో భారీ ప్రాజెక్టుల కోసం చైనా అంతేభారీగా పెట్టుబడులు పెట్టింది. 2017లో హంబాన్‌టోటా పోర్ట్‌ను అప్పుల నుంచి బయటపడేందుకు 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లకు 99 ఏళ్లపాటు చైనాకు లీజ్‌కు ఇచ్చింది లంక. ఇక గతంలో కొలంబో పోర్ట్ కంటెయినర్ టెర్మినల్ అభివృద్ధి కోసం భారత్-జపాన్‌లతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న శ్రీలంక.. కారణాలేంటో చెప్పకుండా ఒప్పందం రద్దు చేసుకుని చైనాతో తిరిగి ఒప్పందం చేసుకుంది. ఇవేగాక వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (BRI)లో ప్రాజెక్టులు చేపడుతుండడంపై ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ వంకతో లంకను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చైనా ప్రొత్సహిస్తోందంటూ అంతర్జాతీయ సమాజం ఆరోపిస్తోంది కూడా. క్లిక్ చేయండి: చైనా ఉత్పత్తులపై చర్యలు తీసుకోకుంటే.. మనకు కష్టమే ! -
నాగ్ మల్టీస్టారర్ ఆగిపోయిందా..?
ఈ ఏడాది దేవదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. బాలీవుడ్లో అతిథి పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి చేసిన నాగ్, కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌కు ఓకె చెప్పాడు. పవర్ పాండి సినిమాతో దర్శకుడిగా మారిన తమిళ స్టార్ హీరోగా ధనుష్ ఓ భారీ మల్టీస్టారర్‌ను డెరెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ముందుగా ఈ మల్టీస్టారర్‌లో రజనీకాంత్‌ను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగినా.. తరువాత ఆ స్థానంలో నాగార్జునను తీసుకున్నారు. పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల ధనుష్ మారి 2 రిలీజ్ తరువాత మల్టీస్టారర్ పనులు ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే మారి 2 రిలీజ్ అయిన వెంటనే ధనుష్ , అసురన్ అనే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అసురన్ షూటింగ్ జనవరిలోనే ప్రారంభమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ధనుష్ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్ ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. తేనాండల్ మూవీస్ ఆర్థిక సమస్యలు కూడా ఈ ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టడానికి ఓ కారణం అని తెలుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
వెనక్కి తగ్గిన నాని
సహజమైన నటనతో మూడేళ్లపాటు వరుసగా విజయాలు అందుకున్న నానిపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తదనం లేకపోగా.. పైగా కమర్షియల్ రూట్లో వెళ్తున్నాడంటూ క్రిటిక్స్ ఏకేస్తున్నారు. వరుస విజయాలకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం విషయంలో నాని అలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని.. నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్యా డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ.. కథ నచ్చటంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలన్న నాని నిర్ణయించుకున్నాడంట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందే తప్ప.. పెద్దగా పేరు రాదనే అంచనాకు నాని వచ్చినట్లు సమాచారం. అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి ఇద్దరితో స్టోరీ డిస్కషన్లు అవుతుండటంతో.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
శ్రద్ధా ఫెయిల్.. ఆ చిత్రం ఆగిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు గత కొంత కాలంగా సక్సెస్ రేటు లేకుండా పోయింది. ఓకే జానుతోపాటు భారీ అంచనాల నడుమ విడుదలైన హసీనా పార్కర్ కూడా ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రద్ధా ప్రభాస్ సాహో షూటింగ్లో పాల్గొంటూనే.. మరోపక్క సైనా నెహ్వాల్ బయోపిక్కు సన్నద్ధమవుతోంది. అయితే అనూహ్యంగా సైనా బయోపిక్ రద్దైనట్లుగా బాలీవుడ్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. బ్యాడ్మింటన్ నేపథ్యం కావటంతో గత కొన్ని రోజులుగా సైనా, గోపీచంద్‌ల సమక్షంలో శ్రద్ధా ఆటను సాధన చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆమె ఆటలో పరిపూర్ణత సాధించలేకపోవటంతో ఈ బయోపిక్ యత్నాన్ని దర్శకుడు అమోల్ గుప్తే విరమించుకున్నాడని ప్రముఖ మీడియా సంస్థ మింట్ కథనం ప్రచురించింది. అయితే ఆ వార్తలను చిత్ర యూనిట్ ఖండించినట్లు మరో కథనం వెలువడింది. శ్రద్ధా సాధన కోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తోందని.. అమోల్ కూడా అందుకు అంగీకరించటంతో కాస్త ఆలస్యంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆ కథనం పేర్కొంది. ఇక మరో కథనం అయితే ఏకంగా శ్రద్ధాను తప్పించి.. ఆ స్థానంలో బ్యాడ్మింటన్ ఆటలో ప్రావీణ్యం ఉన్న దీపిక పదుకునేను తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తను ప్రచురించింది. ఏది ఏమైనా మేకర్లు, చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తేనే ఈ పుకార్లపై స్పష్టత వచ్చేది. -
స్టార్ హీరోయిన్ సినిమా ఆగిపోయింది..!
సౌత్ లో మంచి ఫాంలో ఉన్నా... బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది స్టార్ వారసురాలు శృతిహాసన్. కాటమరాయుడు సినిమాలో తన లుక్స్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ భామ తరువాత సౌత్ సినిమాలేవి అంగీకరించలేదు. చేతిలో ఉన్న సంఘమిత్ర నుంచి కూడా తప్పుకొని పూర్తిగా బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన బెహన్ హోగీ తేరి సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన శృతికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. శృతి హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'యారా' ఆగిపోయింది. విధ్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్న ఈసినిమా చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ చిత్ర నిర్మాణం కొనసాగించలేమని భావించిన యూనిట్, నిర్మాణం ఆపేస్తున్నామని తెలిపారు. తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమా తప్ప మరే సినిమా కూడా శృతి హాసన్ చేతిలో లేదు. ఆ సినిమా కూడా ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం శృతి బాయ్ ఫ్రెండ్ తో విదేశాల్లో చక్కర్లు కొడుతుందన్న ప్రచారం జరుగుతోంది. -
తమన్నా వల్లే ఆగిపోయింది..!
బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. ఫైనల్‌గా తమన్నా హీరోయిన్గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది. క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్‌ను పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని తెలిపాడు. -
తమిళ 'క్వీన్' ఆగిపోయిందా..!
బాహుబలి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తమన్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే అభినేత్రి సినిమాతో ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించిన క్వీన్ రీమేక్ లో నటించే అవకాశం రావటంతో తెగ సంబరపడిపోయింది. మోస్ట్ టాలెంటెడ్ రేవతి దర్శకత్వంలో సుహాసిన మణిరత్నం రైటర్ గా క్వీన్ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. అయితే తాజాగా క్వీన్ రీమేక్ ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కారణలేంటో సరిగా తెలియకపోయినా.. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని యూనిట్ సభ్యులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్వీన్ రీమేక్ తో నటిగానూ ప్రూవ్ చేసుకోవాలని భావించిన తమన్నాకు ఆ కోరిక తీరేలా కనిపించటం లేదు.