వెనక్కి తగ్గిన నాని | Nani Vikram Kumar Movie Almost Shelved | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 30 2018 12:23 PM | Last Updated on Mon, Apr 30 2018 3:39 PM

Nani Vikram Kumar Movie Almost Shelved - Sakshi

సహజమైన నటనతో మూడేళ్లపాటు వరుసగా విజయాలు అందుకున్న నానిపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తదనం లేకపోగా.. పైగా కమర్షియల్‌ రూట్‌లో వెళ్తున్నాడంటూ క్రిటిక్స్‌ ఏకేస్తున్నారు. వరుస విజయాలకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్‌ వేసింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం విషయంలో నాని అలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నాని.. నాగార్జునతో కలిసి శ్రీరామ్‌ ఆదిత్యా డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ.. కథ నచ్చటంతో నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలన్న నాని నిర్ణయించుకున్నాడంట. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్తే ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందే తప్ప.. పెద్దగా పేరు రాదనే అంచనాకు నాని వచ్చినట్లు సమాచారం. అవసరాల శ్రీనివాస్‌, హను రాఘవపూడి ఇద్దరితో స్టోరీ డిస్కషన్లు అవుతుండటంతో.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement