
హీరో బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించబోతున్నారా? సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 'అఖండ' తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు తర్వాత మూవీ కోసం సూపర్ హీరోగా కనిపిస్తారని అంటున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని అంటున్నారు.
(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)
బాలకృష్ణ, సూపర్ హీరోగా కనిపిస్తారు సరే. కానీ దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది లాంటి అంశాలపై ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్ టైంలో పురాణాల్లోని పలువురు సూపర్ హీరోలని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. 'హనుమాన్', 'కల్కి' ఈ తరహా చిత్రాలే.
ఇప్పుడు బాలయ్య కూడా ఇలాంటి సినిమానే చేయబోతున్నారని తెలుస్తోంది. లేదంటే ఇదంతా కూడా కొడుకు మోక్షజ్ఞ నటించే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది. మరి బాలయ్య సూపర్ హీరో అనేది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే ఏం మాట్లాడలేం!
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్)
Comments
Please login to add a commentAdd a comment