Superhero
-
సూపర్ హీరో పాత్రలో బాలకృష్ణ?
హీరో బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించబోతున్నారా? సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. 'అఖండ' తర్వాత డిఫరెంట్ మూవీస్, పాత్రలు చేస్తున్న బాలయ్య.. ఇప్పుడు తర్వాత మూవీ కోసం సూపర్ హీరోగా కనిపిస్తారని అంటున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని అంటున్నారు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలకృష్ణ, సూపర్ హీరోగా కనిపిస్తారు సరే. కానీ దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది లాంటి అంశాలపై ప్రస్తుతానికి సస్పెన్స్. రీసెంట్ టైంలో పురాణాల్లోని పలువురు సూపర్ హీరోలని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. 'హనుమాన్', 'కల్కి' ఈ తరహా చిత్రాలే.ఇప్పుడు బాలయ్య కూడా ఇలాంటి సినిమానే చేయబోతున్నారని తెలుస్తోంది. లేదంటే ఇదంతా కూడా కొడుకు మోక్షజ్ఞ నటించే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది. మరి బాలయ్య సూపర్ హీరో అనేది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే ఏం మాట్లాడలేం!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
త్రీడీ సూపర్ హీరో
‘కాంచన 3’ సూపర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు రాఘవా లారెన్స్. ప్రస్తుతం తన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’ సినిమాను అక్షయ్ కుమార్‌తో ‘లక్ష్మీ బాంబ్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సూపర్ హీరోగా లారెన్స్ ఓ చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని 3డీలో తెరకెక్కించే ఆలోచనలో లారెన్స్ ఉన్నారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సూపర్ హీరో సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుందని సమాచారం. -
సూపర్ మ్యాన్ సాహసాలు వికటిస్తే..!
సూపర్ మ్యాన్ అనగానే మనకు కళ్లు తిరిగే సాహసాలు గుర్తొస్తాయి.. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా.. మెరుపువేగంతో స్పందించి.. ఆపదలతో పోరాడి సూపర్ మ్యాన్లు బాధితులను కాపాడుతుంటారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మన్ ఇలా అందరూ అద్వితీయమైన సాహసాలు చేసినవారే.. ఇదే కోవలో మన ఇండియన్ సూపర్ హీరో ‘ఫ్లయింగ్ జాట్’ కూడా సాహసాలు చేయబోతాడు. కానీ అవి వికటిస్తాయి. ఆపదలోని బాధితుల్ని కాపాడబోయి తానే కష్టాల్లో పడతాడు. అన్నీ ఉల్టాపల్టా చేయబోతాడు.. ఇలా విచిత్రమైన సాహసాలతో ’ఫ్లయింగ్ జాట్’గా కండలు తిరిగిన యువహీరో టైగర్ ష్రఫ్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాలో అతీత శక్తులున్న సూపర్ హీరోగా టైగర్ కనిపించనున్నాడు. అయితే, అతడు చేసే సాహసాలన్నీ మొదట్లో వికటిస్తాయి. ఆ తర్వాత విలన్లు ఎంట్రీ అవుతారు. మొత్తానికీ, రెగ్యులర్ సూపర్ హీరో సినిమాల మాదిరిగా కాకుండా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందినట్టు కనిపిస్తోంది. టైగర్ కు జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఫేస్బుక్లో విడుదలైంది. -
స్పైడర్‌గా కొత్త మ్యాన్
అతను హైస్కూల్ కుర్రాడు... తెలివైనవాడు కానీ అమాయకుడు. అందరి చేతిలోనూ దెబ్బలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా ఓ సాలీడు కుట్టడం వల్ల ఎగురుతాడు, గోడ మీద పాకుతాడు... ఎంత ఎత్తు మీద నుంచైనా దూకుతాడు. ప్రపంచాన్నే కాపాడే స్థాయికి ఎదుగుతాడు. ఈ కథ విన్న వాళ్లెవరికైనా గుర్తొచ్చే సూపర్‌హీరో ‘స్పైడర్‌మ్యాన్’. చెప్పాలంటే పిల్లల్నీ, పెద్దలందరినీ ఆకట్టుకుంటాడీ స్పైడర్ హీరో. ప్రేక్షకుల మనసుల్లో ఈ సాలీడు వీరుడు గూడు అల్లేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ హీరో వెండితెరపై చాలాసార్లు కనిపించాడు. గడచిన పదమూడేళ్లల్లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ సిరీస్ చిత్రాల్లో ఇద్దరు నటులు ఈ హీరో పాత్ర చేశారు. ఒకరు - టొబే మాగ్వైర్, మరొకరు - ఆండ్రూ గ్యార్‌ఫీల్డ్. హైస్కూల్ విద్యార్థులుగా ఈ ఇద్దరు నటులు మంచి అభినయం కనబరిచారు. ఈ సినిమాలో నటించే సమయానికి వారికి 26, 27 ఏళ్లున్నాయి. ఇప్పుడు మళ్లీ ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌ను మొద లుపెట్టడానికి సోనీ, మార్వెల్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఈ పాత్రకు కొత్త కుర్రాణ్ణి ఎంపిక చేశాయి. అలా ఈ తాజా స్పైడర్‌మ్యాన్ పాత్ర కు బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల టామ్ హాలాండ్‌ను ఎంపిక చేశారు. సో... ఇప్పుడీ కుర్రాడు ఈ మధ్యకాలంలో ముచ్చటగా మూడో స్పైడర్ మ్యాన్ అన్నమాట. -
బిగ్ బి...ద సూపర్‌హీరో!
‘పీకు’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు సూపర్ హీరో అవతారం ఎత్తారు. 72 ఏళ్ల వయసులో సూపర్‌హీరో పాత్ర ఏంటంటారా! బుల్లితెరపై రానున్న ఓ యానిమేటేడ్ సిరీస్ కోసం అమితాబ్ రూపురేఖల్లో సూపర్ హీరో పాత్ర ఉంటుంది. అంతరిక్షంలో జరిగిన యుద్ధంలో గాయపడి భూమ్మీదకు వచ్చేసిన అస్త్ర అనే సూపర్‌హీరో అది. ‘అస్త్ర ఫోర్స్’గా డిస్నీ చానల్లో 2017 నుంచి ఈ టీవీ సిరీస్ ప్రసారం కానుంది.