సూపర్ మ్యాన్ సాహసాలు వికటిస్తే..!
సూపర్ మ్యాన్ అనగానే మనకు కళ్లు తిరిగే సాహసాలు గుర్తొస్తాయి.. ఎవరు ఎలాంటి ఆపదలో ఉన్నా.. మెరుపువేగంతో స్పందించి.. ఆపదలతో పోరాడి సూపర్ మ్యాన్‌లు బాధితులను కాపాడుతుంటారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్‌మన్ ఇలా అందరూ అద్వితీయమైన సాహసాలు చేసినవారే.. ఇదే కోవలో మన ఇండియన్ సూపర్ హీరో ‘ఫ్లయింగ్ జాట్’ కూడా సాహసాలు చేయబోతాడు. కానీ అవి వికటిస్తాయి. ఆపదలోని బాధితుల్ని కాపాడబోయి తానే కష్టాల్లో పడతాడు. అన్నీ ఉల్టాపల్టా చేయబోతాడు..
ఇలా విచిత్రమైన సాహసాలతో ’ఫ్లయింగ్ జాట్’గా కండలు తిరిగిన యువహీరో టైగర్ ష్రఫ్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. ఈ సినిమాలో అతీత శక్తులున్న సూపర్ హీరోగా టైగర్ కనిపించనున్నాడు. అయితే, అతడు చేసే సాహసాలన్నీ మొదట్లో వికటిస్తాయి. ఆ తర్వాత విలన్లు ఎంట్రీ అవుతారు. మొత్తానికీ, రెగ్యులర్ సూపర్ హీరో సినిమాల మాదిరిగా కాకుండా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందినట్టు కనిపిస్తోంది. టైగర్ కు జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ఫేస్‌బుక్‌లో విడుదలైంది.