స్పైడర్‌గా కొత్త మ్యాన్ | The new Spider-Man | Sakshi
Sakshi News home page

స్పైడర్‌గా కొత్త మ్యాన్

Published Sat, Jun 27 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

స్పైడర్‌గా కొత్త మ్యాన్

స్పైడర్‌గా కొత్త మ్యాన్

అతను హైస్కూల్ కుర్రాడు... తెలివైనవాడు కానీ అమాయకుడు. అందరి చేతిలోనూ దెబ్బలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా ఓ సాలీడు కుట్టడం వల్ల ఎగురుతాడు, గోడ మీద పాకుతాడు... ఎంత ఎత్తు మీద నుంచైనా దూకుతాడు. ప్రపంచాన్నే కాపాడే స్థాయికి ఎదుగుతాడు. ఈ కథ విన్న వాళ్లెవరికైనా గుర్తొచ్చే సూపర్‌హీరో ‘స్పైడర్‌మ్యాన్’.
 
 చెప్పాలంటే పిల్లల్నీ, పెద్దలందరినీ ఆకట్టుకుంటాడీ స్పైడర్ హీరో.  ప్రేక్షకుల మనసుల్లో ఈ సాలీడు వీరుడు గూడు అల్లేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ  హీరో వెండితెరపై చాలాసార్లు కనిపించాడు. గడచిన పదమూడేళ్లల్లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ సిరీస్ చిత్రాల్లో ఇద్దరు నటులు ఈ హీరో పాత్ర చేశారు. ఒకరు - టొబే మాగ్వైర్, మరొకరు - ఆండ్రూ గ్యార్‌ఫీల్డ్. హైస్కూల్ విద్యార్థులుగా ఈ ఇద్దరు నటులు మంచి అభినయం కనబరిచారు.
 
 ఈ సినిమాలో నటించే సమయానికి వారికి 26, 27 ఏళ్లున్నాయి. ఇప్పుడు మళ్లీ ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌ను మొద లుపెట్టడానికి సోనీ, మార్వెల్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఈ పాత్రకు కొత్త కుర్రాణ్ణి ఎంపిక చేశాయి. అలా ఈ తాజా స్పైడర్‌మ్యాన్ పాత్ర కు బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల టామ్ హాలాండ్‌ను ఎంపిక చేశారు. సో... ఇప్పుడీ కుర్రాడు ఈ మధ్యకాలంలో ముచ్చటగా మూడో స్పైడర్ మ్యాన్ అన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement