Report Says Andrew Garfield & Alyssa Miller Break Up - Sakshi
Sakshi News home page

Andrew Garfield: బ్రేకప్‌ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది!

Published Sat, Apr 2 2022 11:14 AM | Last Updated on Sat, Apr 2 2022 2:32 PM

Andrew Garfield and Alyssa Miller Breakup, Deets Inside - Sakshi

హాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ ఆండ్య్రూ గార్‌ఫీల్డ్‌, అలైసా మిల్లర్‌ బ్రేకప్‌ చెప్పుకున్నారు. క్షణం తీరికలేని పనిలో పడిపోయి కనీసం చూసుకోవడానికి కూడా కుదరకపోవడం వల్లే విడిపోతున్నట్లు తెలుస్తోంది.. కాగా గార్‌ ఫీల్డ్‌, మిల్లర్‌ గతేడాది నవంబర్‌లో ప్రేమలో పడగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టినట్లు సమాచారం. మొదట్లో ఎంతో అన్యోన్యంగా కలిసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా బేధాభిప్రాయాలు తలెత్తాయట. అందులోనూ వరుస షెడ్యూల్స్‌తో ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా రాకపోవడంతో ఇదే మంచి సమయం అని విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా 'స్పైడర్‌ మ్యాన్‌' నటుడు గార్‌ఫీల్డ్‌కు ఈ బ్రేకప్‌ కొత్తేమీ కాదు. హాలీవుడ్‌లో చాలామంది అమ్మాయిలతో డేటింగ్‌ చేసి ఆ తర్వాత సైడ్‌ అయిపోయేవాడు. అందులో స్పైడర్‌ మ్యాన్‌ కోస్టార్‌ ఎమ్మా స్టోన్‌, సింగర్‌ రీటా ఒరా వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరోవైపు అమెరికన్‌ మోడల్‌ మిల్లర్‌ కూడా గతంలో జేక్‌ గిలెన్‌హాల్‌తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత సింగర్‌ క్యామ్‌ అవెరీని పెళ్లి చేసుకుని, కొంతకాలం పాటు కలిసున్నారని వదంతులు కూడా పుట్టుకొచ్చాయి.

చదవండి: 2 పెళ్లిళ్లు.. 8వ సారి సంతానం.. 63 ఏళ్ల వయసు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement