Andrew Garfield
-
ఏమిటేమిటి? ఈ మాత్రం దానికే విడిపోయారా?
హాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆండ్య్రూ గార్ఫీల్డ్, అలైసా మిల్లర్ బ్రేకప్ చెప్పుకున్నారు. క్షణం తీరికలేని పనిలో పడిపోయి కనీసం చూసుకోవడానికి కూడా కుదరకపోవడం వల్లే విడిపోతున్నట్లు తెలుస్తోంది.. కాగా గార్ ఫీల్డ్, మిల్లర్ గతేడాది నవంబర్‌లో ప్రేమలో పడగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టినట్లు సమాచారం. మొదట్లో ఎంతో అన్యోన్యంగా కలిసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా బేధాభిప్రాయాలు తలెత్తాయట. అందులోనూ వరుస షెడ్యూల్స్‌తో ఒకరినొకరు కలుసుకునే అవకాశం కూడా రాకపోవడంతో ఇదే మంచి సమయం అని విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా 'స్పైడర్ మ్యాన్' నటుడు గార్ఫీల్డ్కు ఈ బ్రేకప్ కొత్తేమీ కాదు. హాలీవుడ్లో చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసి ఆ తర్వాత సైడ్ అయిపోయేవాడు. అందులో స్పైడర్ మ్యాన్ కోస్టార్ ఎమ్మా స్టోన్, సింగర్ రీటా ఒరా వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరోవైపు అమెరికన్ మోడల్ మిల్లర్ కూడా గతంలో జేక్ గిలెన్హాల్తో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత సింగర్ క్యామ్ అవెరీని పెళ్లి చేసుకుని, కొంతకాలం పాటు కలిసున్నారని వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. చదవండి: 2 పెళ్లిళ్లు.. 8వ సారి సంతానం.. 63 ఏళ్ల వయసు.. -
ఆ ఒక్క సీన్ వల్లే అంతపెద్ద హిట్.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు
Tom Holland On Spider Man No Way Home Hit: హాలీవుడ్ సూపర్ హీరోస్ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అంచనాలు భారీగానే ఉంటాయి. అలా భారీ అంచనాల మధ్య వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అందుకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ ఎన్నో ఆంక్షల మధ్య విడుదలై వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 12 వేల కోట్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా ఈ చిత్రం రికార్డుకెక్కింది. అయితే ఇందులో స్పైడర్ మ్యాన్ రోల్లో అలరించిన టామ్ హోలాండ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నాకు ముందే తెలుసు. కానీ మరీ వేల కోట్లు వసూలు చేస్తుందని, ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని మాత్రం ఊహించలేదు. మేము ఆన్లైన్ ప్రేక్షకుల స్పందన తెలుసుకున్నప్పుడు వారు కేవలం ఒక్క సీన్ కోసమే ఈ చిత్రాన్ని చూడటానికి వచ్చారని అర్థమైంది. అది నాకు చాలా నచ్చిన విషయం.' అని టామ్ హోలాండ్ తెలిపాడు. అలాగే ఎమ్సీయూలో 27వ చిత్రంగా వచ్చిన ఈ మూవీలో ఆండ్య్రూ గ్యారీఫీల్డ్, టోబే మాగ్వైర్లు కూడా స్పైడర్ మ్యాన్ పాత్రల్లో అలరించారు. వీరు ఇదివరకూ సిరీస్‌ల్లో స్పైడర్ మ్యాన్ పాత్రలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'లో కీలక పాత్రల్లో నటించనున్నారని ఈ సినిమా విడుదలకు ముందు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ చిత్రంపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే అలాంటేదేమి లేదని, ఆ వార్తలు రూమర్స్ అని మేకర్స్ కొట్టిపారేశారు. కానీ సినిమాలో వారిద్దరూ నిజంగా నటించేసరికి అభిమానులు, ప్రేక్షకులు ఆనందంతో ఆశ్యర్యానికి గురయ్యారు. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ క్యూ కట్టారు. -
స్పైడర్‌గా కొత్త మ్యాన్
అతను హైస్కూల్ కుర్రాడు... తెలివైనవాడు కానీ అమాయకుడు. అందరి చేతిలోనూ దెబ్బలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా ఓ సాలీడు కుట్టడం వల్ల ఎగురుతాడు, గోడ మీద పాకుతాడు... ఎంత ఎత్తు మీద నుంచైనా దూకుతాడు. ప్రపంచాన్నే కాపాడే స్థాయికి ఎదుగుతాడు. ఈ కథ విన్న వాళ్లెవరికైనా గుర్తొచ్చే సూపర్‌హీరో ‘స్పైడర్‌మ్యాన్’. చెప్పాలంటే పిల్లల్నీ, పెద్దలందరినీ ఆకట్టుకుంటాడీ స్పైడర్ హీరో. ప్రేక్షకుల మనసుల్లో ఈ సాలీడు వీరుడు గూడు అల్లేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ హీరో వెండితెరపై చాలాసార్లు కనిపించాడు. గడచిన పదమూడేళ్లల్లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ సిరీస్ చిత్రాల్లో ఇద్దరు నటులు ఈ హీరో పాత్ర చేశారు. ఒకరు - టొబే మాగ్వైర్, మరొకరు - ఆండ్రూ గ్యార్‌ఫీల్డ్. హైస్కూల్ విద్యార్థులుగా ఈ ఇద్దరు నటులు మంచి అభినయం కనబరిచారు. ఈ సినిమాలో నటించే సమయానికి వారికి 26, 27 ఏళ్లున్నాయి. ఇప్పుడు మళ్లీ ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌ను మొద లుపెట్టడానికి సోనీ, మార్వెల్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఈ పాత్రకు కొత్త కుర్రాణ్ణి ఎంపిక చేశాయి. అలా ఈ తాజా స్పైడర్‌మ్యాన్ పాత్ర కు బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల టామ్ హాలాండ్‌ను ఎంపిక చేశారు. సో... ఇప్పుడీ కుర్రాడు ఈ మధ్యకాలంలో ముచ్చటగా మూడో స్పైడర్ మ్యాన్ అన్నమాట. -
వెడ్డింగ్ ప్లాన్!
నాలుగేళ్లుగా నడుస్తున్న డేటింగ్షిప్కు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టారు ఎమ్మాస్టోన్, అండ్రూ గార్ఫీల్డ్. ఇప్పటి వరకు వీరి రొమాన్స్‌పై వచ్చిన రూమర్లకు తెరదించుతూ... ప్రేమాయణానికి శుభం కార్డు వేయనున్నారని ఓ వెబ్సైట్ కథనం. ఇన్నాళ్లూ రొమాంటిక్ టచ్‌లో ఉన్న ఇద్దరూ... వచ్చే సమ్మర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వాస్తవానికి గత ఏడాది మేలోనే ముహూర్తం పెట్టుకున్నారట. కానీ... అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందట. ఈసారి రోమ్‌లో సిటీ హాల్ బుక్ చేద్దామనుకున్నాడట అండ్రూ. కానీ ఎమ్మా మాత్రం... ఈ అకేషన్‌ను మరింత గ్రాండ్‌గా, అంతకు మించి మెమరబుల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని యోచిస్తుందని సమాచారం.