Tom Holland On Spider Man No Way Home Hit - Sakshi
Sakshi News home page

Tom Holland: ఆ ఒక్క సీన్​ వల్లే అంతపెద్ద హిట్​.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

Published Fri, Jan 28 2022 4:27 PM | Last Updated on Fri, Jan 28 2022 6:02 PM

Tom Holland On Spider Man No Way Home Hit - Sakshi

Tom Holland On Spider Man No Way Home Hit: హాలీవుడ్​ సూపర్​ హీరోస్​ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మార్వెల్​ సినిమాటిక్​ యూనివర్స్​ నుంచి వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్పైడర్​ మ్యాన్​ మూవీ సిరీస్​కు సెపరేట్​ ఫ్యాన్​ బేస్​ ఉంది. ఈ సిరీస్​ నుంచి సినిమా వస్తుందంటే చాలు అంచనాలు భారీగానే ఉంటాయి. అలా భారీ అంచనాల మధ్య వచ్చిన 'స్పైడర్​ మ్యాన్:​ నో వే హోమ్'​ అందుకు తగినట్లుగానే బాక్సాఫీస్​ వద్ద సూపర్​ హిట్​ అందుకుంది. కరోనా సమయంలోనూ ఎన్నో ఆంక్షల మధ్య విడుదలై వరల్డ్​వైడ్​గా సుమారు రూ. 12 వేల కోట్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా ఈ చిత్రం రికార్డుకెక్కింది. 



అయితే ఇందులో స్పైడర్​ మ్యాన్​ రోల్​లో అలరించిన టామ్​ హోలాండ్​ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నాకు ముందే తెలుసు. కానీ మరీ వేల కోట్లు వసూలు చేస్తుందని, ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని మాత్రం ఊహించలేదు. మేము ఆన్​లైన్​ ప్రేక్షకుల స్పందన తెలుసుకున్నప్పుడు వారు కేవలం ఒక్క సీన్​ కోసమే ఈ చిత్రాన్ని చూడటానికి వచ్చారని అర్థమైంది. అది నాకు చాలా నచ్చిన విషయం.' అని టామ్​  హోలాండ్ తెలిపాడు. అలాగే ఎమ్​సీయూలో 27వ చిత్రంగా వచ్చిన ఈ మూవీలో ఆండ్య్రూ గ్యారీఫీల్డ్​, టోబే మాగ్వైర్​లు కూడా స్పైడర్​ మ్యాన్​ పాత్రల్లో అలరించారు. వీరు ఇదివరకూ సిరీస్​ల్లో స్పైడర్​ మ్యాన్​ పాత్రలు చేసిన విషయం తెలిసిందే. 



అయితే ఈ ఇద్దరూ 'స్పైడర్​ మ్యాన్:​ నో వే హోమ్​'లో కీలక పాత్రల్లో నటించనున్నారని ఈ సినిమా విడుదలకు ముందు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ చిత్రంపై భారీగా ఎక్స్​పెక్టేషన్స్​ పెరిగాయి. అయితే అలాంటేదేమి లేదని, ఆ వార్తలు రూమర్స్​ అని మేకర్స్​ కొట్టిపారేశారు. కానీ సినిమాలో వారిద్దరూ నిజంగా నటించేసరికి అభిమానులు, ప్రేక్షకులు ఆనందంతో ఆశ్యర్యానికి గురయ్యారు. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్​ క్యూ కట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement