Tom Holland
-
సీక్రెట్ వార్స్‌కు చాన్స్ ఇవ్వండి
హాలీవుడ్ సూపర్ డూపర్‌హిట్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్’. ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమా రానుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ తనకు దక్కితే బాగుంటుందని దర్శక–నిర్మాత, రచయిత శ్యాముల్ ఎమ్ రైమి చేసిన వ్యాఖ్యలు హాలీవుడ్లో చర్చనీయాంశమయ్యాయి. ఇక దర్శకుడిగా ‘ది ఈవిల్ డెడ్’, ‘ది ఈవిల్ డెడ్ 2’, ‘స్పైడర్ మేన్’, ‘స్పైడర్ మేన్ 2’, ‘స్పైడర్ మేన్ 3’ వంటి సినిమాలను తెరకెక్కించారు శ్యాముల్. మరి.. ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ శ్యాముల్ కోరుకున్నట్లు ఆయనకు దక్కుతుందా? అనేది చూడాలి. మరోవైపు ‘అవెంజర్స్: సీక్రెట్ వార్స్’ సినిమాలోని ప్రధాన తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు మార్వెల్ సంస్థ. అయితే టామ్ హాలండ్, క్రిస్ హెమ్వర్త్, ఆంథోనీ మాకీ లీడ్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. -
హిట్ జోడీ రిపీట్
టామ్ హాలండ్, జెండయా హిట్ జోడీ. ‘స్పైడర్ మేన్’ సిరీస్‌లో వెండితెరపై ప్రేమికులుగా కనిపించిన ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమికులు కూడా. అయితే బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు ఈ మధ్య వస్తే... ‘అలాంటిదేం లేదు’ అంటూ ఈ జంటను ఇష్టపడేవారిని ఖుషీ చేశారు టామ్. ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరో ఖుషీ కబురు అందింది. ‘స్పైడర్‌మేన్’ సిరీస్‌లోని నాలుగో భాగంలోనూ ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారన్నది ఆ కబురు. నిజానికి ‘యుఫోరియా’ సిరీస్‌లోని మూడో సీజన్లో నటిస్తున్నందున జెండయా ‘స్పైడర్‌మేన్ 4’లో నటించడానికి వీలుపడని పరిస్థితి. అయితే ‘యుఫోరియా’ కథ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సిరీస్ కమిట్ అయిన నటీనటులకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకునే వెసులుబాటుని ఇచ్చిందట యూనిట్. దాంతో తాను ఎంతగానో ఇష్టపడే ‘స్పైడర్‌మేన్’ చిత్రానికి డేట్స్ కేటాయించే పని మీద ఉన్నారట జెండయా. ఇక టామ్ హాలండ్ తాను ఇష్టపడే చిత్రాల్లో ‘స్పైడర్‌మేన్’కి ప్రముఖ స్థానం ఉందని అంటుంటారు. సో.... పీటర్ పార్కర్ (టామ్ చేసే స్పైడర్‌మేన్ పాత్ర పేరు), ఎమ్జె (పీటర్ గాళ్ ఫ్రెండ్‌గా జెండయా చేసే పాత్ర పేరు)ల ప్రేమను మరోసారి ‘స్పైడర్‌మేన్ 4’లో చూడొచ్చన్న మాట. ఈ హిట్ జోడీ రిపీట్ అయ్యే విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఆరంభం కానుంది. -
అవన్ని ఉత్త ముచ్చట్లే.. నేను ఏ ఇల్లు కొనలేదు.. తాళాలు దొరికితే
స్పైడర్ మ్యాన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోహీరోయిన్లు టామ్ హోలాండ్, జెండయా. 'స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్' చిత్రంతో తొలిసారిగా కలుసుకున్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి లండన్‌లో ఒక ఖరీదైన భవంతిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఖరీదైన భవంతి విలువ అక్షరాలా రూ. 36 కోట్లు అని హాలీవుడ్ వర్గాల భోగట్టా. అయితే ఈ వార్తలపై హీరో టామ్ మౌనం వీడాడు. అవన్ని వట్టి పుకార్లని 'లైవ్ విత్ కెల్లీ అండ్ ర్యాన్' అనే షోలో తేల్చేశాడు. 'నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను సౌత్ లండన్‌లో ఇల్లు కొన్నానని. ఇది పూర్తిగా తప్పు. నేను ఏ కొత్త ఇల్లు కొనుగోలు చేయలేదు.' అని తెలిపాడు టామ్. అలాగే దీనికి కొనసాగింపుగా తాను కొత్త ఇల్లు కొన్నానన్న వార్తపై 'వావ్.. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆ ఇంటి తాళాలు ఎప్పుడూ దొరుకుతాయా అని.' అంటూ చమత్కారంగా స్పందించాడు. -
17 సార్లు కారుతో గుద్దించుకున్న హీరో
పదిహేడు సార్లు కారుతో గుద్దించుకొని మరీ టేక్ ఒకే చేయించుకున్న హాలీవుడ్ స్టార్ న్యూ ఏజ్ స్పైడర్ మ్యాన్ టామ్ హాలాండ్. ఇటీవలే 'స్పైడర్: నో వే హోమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ హీరో. తాజాగా అన్ ఛార్టెడ్ అనే యాక్షన్ మూవీలో నటించాడు. ఈ మూవీలో వచ్చే కీలక సన్నివేశం కోసం ఏకంగా పదిహేడు సార్లు కారుతో గుద్దించుకోవాల్సి వచ్చిందట. అన్ చార్టెడ్ అనే ఓ వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమా సిద్ధం అయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల కానుంది. -
ఖరీదైన ఇంటిని కొన్న స్పైడర్ మ్యాన్, ప్రియురాలితో ఉండటానికే!
టామ్ హాలండ్, జెండయా.. వీరిద్దరూ నటించిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' రూ.12 వేల కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత మరింత హ్యాపీగా ఉన్న ఈ జంట తమ బంధాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం యూకేలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దీని విలువ ఎంతనుకుంటున్నారు. భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా 36 కోట్ల రూపాయలు. టామ్, జెండయా 2016లో 'స్పైడర్ మ్యాన్: హోమ్ కమింగ్' సినిమా సెట్స్‌లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే ఇద్దరూ లవ్‌లో పడ్డారట. ఆ తర్వాత స్నేహితుల పెళ్లికి ఈ లవ్‌బర్డ్స్ కలిసే వెళ్లేవారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్న వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక వీరు డేటింగ్ చేయడానికి ఒక ఇల్లు ఉండాలనుకున్నారో ఏమో కానీ ఇప్పుడేకంగా లండన్‌లో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. ఇందులో సినిమా థియేటర్, జిమ్ ఇలా అన్నీ ఉన్నాయట! టామ్‌కు యూకేలో ఇదివరకే మూడు గదుల ఫ్లాట్ ఉండగా, జెండయాకు లాస్ ఏంజిల్స్‌లో సొంత ఇల్లు ఉంది. -
ఆ ఒక్క సీన్ వల్లే అంతపెద్ద హిట్.. హీరో ఆసక్తికర వ్యాఖ్యలు
Tom Holland On Spider Man No Way Home Hit: హాలీవుడ్ సూపర్ హీరోస్ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సిరీస్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అంచనాలు భారీగానే ఉంటాయి. అలా భారీ అంచనాల మధ్య వచ్చిన 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' అందుకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. కరోనా సమయంలోనూ ఎన్నో ఆంక్షల మధ్య విడుదలై వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 12 వేల కోట్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ సినిమాగా ఈ చిత్రం రికార్డుకెక్కింది. అయితే ఇందులో స్పైడర్ మ్యాన్ రోల్లో అలరించిన టామ్ హోలాండ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని నాకు ముందే తెలుసు. కానీ మరీ వేల కోట్లు వసూలు చేస్తుందని, ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని మాత్రం ఊహించలేదు. మేము ఆన్లైన్ ప్రేక్షకుల స్పందన తెలుసుకున్నప్పుడు వారు కేవలం ఒక్క సీన్ కోసమే ఈ చిత్రాన్ని చూడటానికి వచ్చారని అర్థమైంది. అది నాకు చాలా నచ్చిన విషయం.' అని టామ్ హోలాండ్ తెలిపాడు. అలాగే ఎమ్సీయూలో 27వ చిత్రంగా వచ్చిన ఈ మూవీలో ఆండ్య్రూ గ్యారీఫీల్డ్, టోబే మాగ్వైర్లు కూడా స్పైడర్ మ్యాన్ పాత్రల్లో అలరించారు. వీరు ఇదివరకూ సిరీస్‌ల్లో స్పైడర్ మ్యాన్ పాత్రలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'లో కీలక పాత్రల్లో నటించనున్నారని ఈ సినిమా విడుదలకు ముందు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ చిత్రంపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే అలాంటేదేమి లేదని, ఆ వార్తలు రూమర్స్ అని మేకర్స్ కొట్టిపారేశారు. కానీ సినిమాలో వారిద్దరూ నిజంగా నటించేసరికి అభిమానులు, ప్రేక్షకులు ఆనందంతో ఆశ్యర్యానికి గురయ్యారు. దీంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ క్యూ కట్టారు. -
బంపరాఫర్: స్పైడర్‌మ్యాన్ టికెట్లపై ఎన్ఎఫ్టీ టోకెన్లు
మార్వెల్ సినిమాల్లో ఇప్పటిదాకా ఏమూవీకి రానంత హైప్ ‘స్పైడర్ మ్యాన్ నో వే హోం’కి క్రియేట్ అయ్యింది. కథలో భాగంగా నలుగురు సూపర్ విలన్లతో.. ముగ్గురు స్పైడర్మ్యాన్లు పోరాడనున్నారనే ప్రచారంతో ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 17న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ఆన్లైన్ బుకింగ్ హడావిడి ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ఒకానొక దశలో బుకింగ్ ప్రభావంతో సర్వర్లు సైతం క్రాష్ అయినట్లు ప్రచారం వినిపించింది. తాజాగా టికెట్ బుకింగ్‌పై బంపరాఫర్ ప్రకటించింది ఏఎంసీ థియేటర్స్. ఉత్తర అమెరికాలో Spider-Man: No Way Home డిసెంబర్ 16నే రిలీజ్‌కాబోతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే ఎన్ఎఫ్టీలు ఇస్తామని ప్రకటించింది ఏఎంసీ థియేటర్స్. సోనీ-మార్వెల్ తరపున రాబోతున్న సందర్భంగా సుమారు 86 వేల ఎన్ఎఫ్టీలను పంచుతామని, అదీ ముందు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకేనని తెలిపింది. క్లబ్ స్టూడియోస్ డిజైన్ చేసిన ఈ ఎన్ఎఫ్టీలు.. వేటికవే ప్రత్యేకమైన విలువను(భారీ) కలిగి ఉంటాయి. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికన్లకు మాత్రమే! అంతేకాదు బయటి దేశాలకు వాళ్లకు వీటిని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదనే కండిషన్లు విధించారు. టామ్ హోలాండ్ స్పైడర్‌మ్యాన్‌గా లీడ్ రోల్లో కనిపించనున్న ఈ చిత్రంలో.. గతంలో స్పైడర్మ్యాన్లుగా అలరించిన టోబీ మాగుయిర్, ఆండ్రూ గార్ఫీల్డ్ సైతం కనిపించనున్నారనే ప్రచారంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన స్పైడర్ మ్యాన్ నో వే హోంకి జోన్ వాట్స్ డైరెక్టర్. ఎన్ఎఫ్టీ అంటే.. సినిమాలు, సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు. చదవండి: Spider-Man: No Way Home.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడంటే.. -
అమెరికా కంటే ముందుగా భారత్‌లో విడుదల.. ఏంటో తెలుసా?
Spider Man No Way Home Release In India Before The US: విపరీతమైన క్రేజ్ సంపాందించుకన్న హాలీవుడ్ చిత్రాలలో స్పైడర్ మ్యాన్ సిరీస్ ఒకటి. స్పైడర్ మ్యాన్ సిరీస్, అమెజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్, మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌ల్లోని అన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వండర్ విజువల్స్‌తో వస్తోన్న చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ చిత్రానికి మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ట్వీట్ చేసింది. టామ్ హాలండ్, జెండయా నటించిన ఈ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని అమెరికాలో కంటే ఒకరోజు ముందే భారతదేశంలో విడుదల చేస్తున్నారు. 'స్పైడర్ మ్యాన్, మార్వెల్ అభిమానులందరికీ మేము కొన్ని ఆసక్తికర వార్తలు ఇవ్వనున్నాం. మన అభిమాన సూపర్ హీరో యూఎస్ కంటే ఒకరోజు ముందుగానే స్వింగ్ చేయనున్నాడ. డిసెంబర్ 16న స్పైడ్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చూడండి.' అని 'సోనీ పిక్చర్స్ ఇండియా' పోస్ట్ చేసింది. అంటే దీని అర్థం అమెరికాలో కంటే ముందే ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రపంచానికి స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోతుంది. అది సమస్యగా మారుతుంది. దీంతో తాను స్పైడర్ మ్యాన్ అని తెలీకుండా ఉండేందుకు డాక్టర్ స్ట్రేంజ్ సహాయం కోరుతాడు స్పైడీ. ఇందులో నలుగురు విలన్లతో స్పైడీ పోరాడనున్నట్లు సమాచారం. We have some exciting news for all the Spider-Man & Marvel fans! Our favourite superhero will be swinging in one day earlier than the US! Catch #SpiderManNoWayHome on December 16 in English, Hindi, Tamil & Telugu. pic.twitter.com/uUNQNJ7e3h — Sony Pictures India (@SonyPicsIndia) November 29, 2021 ఇది చదవండి: విజువల్ వండర్‌గా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్.. -
విజువల్ వండర్‌గా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్..
Spider Man: No Way Home Trailer Out: స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్‌లకు వరల్డ్‌వైడ్‌గా ఎంతో ఆదరణ ఉంది. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్టశక్తులతో స్పైడీ చేసే పోరాట విన్యాసాలు ఎప్పుడూ ఆకట్టుకుంటునే ఉంటాయి. ఇప్పుడు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'. జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హోలాండ్, జెండీయా, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఒక విజువల్ వండర్‌గా సాగింది. యాక్షన్ సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో లీడ్ రోల్ చేసిన టూబే మాగ్యూర్, ఆండ్య్రూ గారీఫీల్డ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో మాత్రం వారెవరూ కనిపించలేదు. కానీ హీరో స్పైడీ నలుగురు విలన్లతో పోరాడనున్నట్లు తెలుస్తోంది. చదవండి: స్పైడర్ మ్యాన్-నో వే హోమ్ పోస్టర్ విడుదల.. ఇవి గమనించారా..! -
Spider Man No Way Home : నలుగురు విలన్లతో హీరో స్పైడీ పోరాటం
హాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ స్పైడర్ మ్యాన్- నో వే హోమ్ అధికారిక పోస్టర్‌ను సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంస్థలు విడుదల చేశాయి. స్పైడర్ మ్యాన్‌గా టామ్ హోలాండ్, డాక్టర్ ఆక్టోపస్‌గా ఆల్ఫ్రెడ్ నటిస్తున్నారు. ఈ పోస్టర్లో డాక్టర్ ఆక్టోపస్‌ను చూపించకున్న తన మెటల్ అవయవాలు పీటర్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్ విడుదల స్పైడర్ మ్యాన్ అభిమానులను పెద్దగా ఆశ్చర్యపర్చకున్నా.. అందులోని కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్ గాబ్లిన్ (విలియమ్ డాఫో) తన ఐకానిక్ గ్లైడర్‌పై రైడ్ చేయడం చూడొచ్చు. పోస్టర్‌లోని మెరుపులు ‘ఎలక్ట్రో’ కు సూచనగా కనిపిస్తున్నాయి. అలాగే మేఘం లాంటి ధూళి రేణువులను బట్టి చూస్తే 'సాండ్ మ్యాన్' కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు ఊహించినట్లేం ‘సినిస్టర్ సిక్స్’ విలన్లు ఈ స్పైడీ మూవీలో ఉంటారనడానికి ఇది సాక్ష్యంగా మారింది. The Multiverse unleashed. #SpiderManNoWayHome is exclusively in movie theaters December 17. pic.twitter.com/DchHdpKKFy — Spider-Man: No Way Home (@SpiderManMovie) November 8, 2021 అత్యంత శక్తివంతమైన నలుగురు విలన్లు మూవీలో ఉన్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. అయితే కామిక్ పుస్తకాల నుంచి తీసుకొని అయిన నో వే హోమ్ చిత్రంలో ‘సినిస్టర్ సిక్స్’ విలన్లను చూపిస్తారో లేదో వేచి చూడాలి.