Tom Holland and Zendaya Buy New House in South West London - Sakshi
Sakshi News home page

Spider Man Stars: కొత్త ఇల్లు కొన్న స్పైడర్‌ మ్యాన్‌ ప్రేమ జంట

Published Mon, Jan 31 2022 1:43 PM | Last Updated on Mon, Jan 31 2022 2:12 PM

Tom Holland and Zendaya Buy New House in South West London - Sakshi

టామ్‌ హాలండ్‌, జెండయా.. వీరిద్దరూ నటించిన 'స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌' రూ.12 వేల కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ తర్వాత మరింత హ్యాపీగా ఉన్న ఈ జంట తమ బంధాన్ని నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం యూకేలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దీని విలువ ఎంతనుకుంటున్నారు. భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా 36 కోట్ల రూపాయలు.

టామ్‌, జెండయా 2016లో 'స్పైడర్‌ మ్యాన్‌: హోమ్‌ కమింగ్‌' సినిమా సెట్స్‌లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే ఇద్దరూ లవ్‌లో పడ్డారట. ఆ తర్వాత స్నేహితుల పెళ్లికి ఈ లవ్‌బర్డ్స్‌ కలిసే వెళ్లేవారు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్న వీడియోలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఇక వీరు డేటింగ్‌ చేయడానికి ఒక ఇల్లు ఉండాలనుకున్నారో ఏమో కానీ ఇప్పుడేకంగా లండన్‌లో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. ఇందులో సినిమా థియేటర్‌, జిమ్‌ ఇలా అన్నీ ఉన్నాయట! టామ్‌కు యూకేలో ఇదివరకే మూడు గదుల ఫ్లాట్‌ ఉండగా, జెండయాకు లాస్‌ ఏంజిల్స్‌లో సొంత ఇల్లు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement