అమెరికా కంటే ముందుగా భారత్‌లో విడుదల.. ఏంటో తెలుసా? | Spider Man No Way Home Release In India Before The US | Sakshi
Sakshi News home page

Spider Man No Way Home: అమెరికా కంటే ముందుగా భారత్‌లో విడుదల.. ఎంటో తెలుసా ?

Nov 29 2021 4:07 PM | Updated on Nov 29 2021 4:14 PM

Spider Man No Way Home Release In India Before The US - Sakshi

Spider Man No Way Home Release In India Before The US: విపరీతమైన క్రేజ్‌ సంపాందించుకన్న హాలీవుడ్‌ చిత్రాలలో స్పైడర్ మ్యాన్ సిరీస్‌ ఒకటి. స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌, అమెజింగ్‌ స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌, మార్వెల్‌ స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌ల‍్లోని అన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. మార్వెల్ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వండర్ విజువల్స్‌తో వస్తోన్న చిత్రం స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌. ఈ చిత్రానికి మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. తాజాగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్‌ ట్వీట్‌ చేసింది. టామ్‌ హాలండ్‌, జెండయా నటించిన ఈ స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ చిత్రాన్ని అమెరికాలో కంటే ఒకరోజు ముందే భారతదేశంలో విడుదల చేస్తున్నారు. 

'స్పైడర్‌ మ్యాన్, మార్వెల్‌ అభిమానులందరికీ మేము కొన్ని ఆసక్తికర వార్తలు ఇవ్వనున్నాం. మన అభిమాన సూపర్‌ హీరో యూఎస్‌ కంటే ఒకరోజు ముందుగానే స్వింగ్‌ చేయనున్నాడ. డిసెంబర్‌ 16న స్పైడ్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ చిత్రాన్ని ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చూడండి.' అని 'సోనీ పిక్చర్స్‌ ఇండియా' పోస్ట్ చేసింది. అంటే దీని అర్థం అమెరికాలో కంటే ముందే ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రపంచానికి స్పైడర్‌ మ్యాన్ ఎవరో తెలిసిపోతుంది. అది సమస్యగా మారుతుంది. దీంతో తాను స్పైడర్‌ మ్యాన్ అని తెలీకుండా ఉండేందుకు డాక్టర్‌ స్ట్రేంజ్ సహాయం కోరుతాడు స్పైడీ. ఇందులో నలుగురు విలన‍్లతో స్పైడీ పోరాడనున్నట‍్లు సమాచారం. 


ఇది చదవండివిజువల్‌ వండర్‌గా స్పైడర్‌ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement