నటిపై అత్యాచారం.. నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష..! | Harvey Weinstein Found Guilty Of Rape And Sexual Assault Case | Sakshi
Sakshi News home page

నటిపై అత్యాచారం.. మీటూ ఉద్యమానికి అతనే నాంది..!

Published Tue, Dec 20 2022 9:14 PM | Last Updated on Tue, Dec 20 2022 9:48 PM

 Harvey Weinstein Found Guilty Of Rape And Sexual Assault Case  - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌ తాజాగా మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్‌ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్‌ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది. ఇప్పటికే ఇతర లైంగిక కేసుల్లో నేరం చేసినట్లు రుజువు కావడంతో అతను న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ  తీర్పుతో అతనికి మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

మొత్తం నలుగురు బాధితుల కేసులను కోర్టు విచారణ చేపట్టింది. 2010లో ఓ హోటల్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మసాజ్ థెరపిస్ట్ చేసిన ఆరోపణల కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చింది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ భార్య, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత జెన్నిఫర్ సిబెల్ న్యూసోమ్‌కు సంబంధించిన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుతోపాటు మరో మహిళ కేసులో జ్యూరీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు హార్వే తన న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు అతని తరఫు ప్రతినిధులు తెలిపారు.

దశాబ్దాలపాటు హాలీవుడ్‌లో నిర్మాతగా వెలిగిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్‌ నటీమణులు,  మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్‌, జెన్నిఫర్‌ ఐన్‌స్టన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీసిన సంగతి తెలిసిందే. అతను జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నా అని తీర్పు అనంతరం ఆ ఇటాలియన్‌ నటి ప్రకటన విడుదల చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement