-
నటిపై అత్యాచారం.. హలీవుడ్ మొఘల్కు 16 ఏళ్ల జైలు శిక్ష
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్(70) లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్ నటిపై బెవర్లీ హిల్స్ హోటల్ గదిలో అఘాయిత్యానికి పాల్పడినందుకు లాస్ ఏంజెల్స్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఇప్పటికే లైంగిక వేధింపుల తరహా కేసుల్లో న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న వేన్‌స్టీన్ తాజా తీర్పుతో మరో 16 ఏళ్లపాటు అంటే తన జీవితకాలం జైల్లో ఊచలు లెక్కిస్తూ గడపాల్సిందే. వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరైన 70 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత.. దయచేసి తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు. దానికి తాను అర్హుడిని కాదని.. ఈ కేసులో చాలా లోసుగులు ఉన్నాయని కోర్టుకు విన్నపించాడు. అయితే అతన్ని వాదనలు పట్టించుకొని న్యాయమూర్తి లిసా లెంచ్.. అత్యాచారానిక పాల్పడినందుకు మొత్తం 16 సంవత్సరాల పాటు మరో మూడు శిక్షలు విధించారు. కాగా 2013లో నటి, మోడల్‌పై హార్వే వేన్‌స్టీన్ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్లోనే లాస్ ఏంజెల్స్ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే. బాధితురాలైన నటి వైన్‌స్టీన్‌ను వీలైనంత గరిష్ట శిక్ష విధించాలని కన్నీళ్లతో జడ్జి ముందు వేడుకుంది. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యలు కారణంగా తన జీవితం నాశనం అయ్యిందని తెలిపింది. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అతను జీవితాంతం జైల్లోనే ఉన్నా సరిపోదని అన్నారు. ఇదిలా ఉండగా హాలీవుడ్లో అగ్రనిర్మాతగా గుర్తింపు పొందిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీశాయి. -
నటిపై అత్యాచారం.. నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష..!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ తాజాగా మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్ఏంజెల్స్ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది. ఇప్పటికే ఇతర లైంగిక కేసుల్లో నేరం చేసినట్లు రుజువు కావడంతో అతను న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ తీర్పుతో అతనికి మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మొత్తం నలుగురు బాధితుల కేసులను కోర్టు విచారణ చేపట్టింది. 2010లో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మసాజ్ థెరపిస్ట్ చేసిన ఆరోపణల కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చింది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ భార్య, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత జెన్నిఫర్ సిబెల్ న్యూసోమ్‌కు సంబంధించిన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుతోపాటు మరో మహిళ కేసులో జ్యూరీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు హార్వే తన న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు అతని తరఫు ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీసిన సంగతి తెలిసిందే. అతను జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నా అని తీర్పు అనంతరం ఆ ఇటాలియన్ నటి ప్రకటన విడుదల చేశారు. -
బాలీవుడ్లో కామాంధుడిని బయటపెడతా: సల్మాన్ మాజీ ప్రేయసి
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సోమీ అలి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది. బాలీవుడ్‌లోని ఓ కామాంధుడిని బయటపెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. 'హార్వే వెన్‌స్టన్ ఆఫ్ బాలీవుడ్. నీ గురించి ఈ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ ఎలాగైతే ధైర్యాన్ని ప్రదర్శించిందో అదే విధంగా నువ్వు వేధించిన మహిళలందరూ ఏదో ఒకరోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారు' అని రాసుకొచ్చింది. దీనికి సల్మాన్ ఖాన్ 'ఆతే జాతే హస్తే గాతే' సాంగ్ స్టిల్‌ను జత చేసింది. కానీ వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరును వెల్లడించకుండానే కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం. చదవండి: సూర్యతో సినిమా, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న బేబమ్మ కాగా హాలీవుడ్ స్టార్ హార్వే వెన్‌స్టన్ సుమారు 200కు పైగా సినిమాలు నిర్మించాడు. మీటూ ఉద్యమంలో ఎంతోమంది మహిళలు హార్వే తమను లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి యత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం 2020 మార్చి 11న అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పిన హాలీవుడ్ స్టార్ -
కరోనా నెగటివ్: నిర్మాత క్వారంటైన్ పూర్తి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ భయానకంగా మారుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. మరికొంత మంది కోవిడ్ లక్షణాలతో క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా బారిన పడిన కొందరు సినీ ప్రముఖులు ప్రాణాలు కొల్పోగా మరికొంతమంది చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో క్వారంటైన్ నుంచి ఇంటికి పయనమవుతున్నారు. (కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి) తాజాగా హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్ కూడా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. న్యూయార్క్ జైల్లో ఉన్న హార్వే వెయిన్‌స్టీన్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని జైలులోనే ప్రత్యేక నిర్భందంలో ఉంచారు. ‘మెడికల్ ఐసోలేషన్ (క్వారంటైన్) నుంచి హార్వీ విడుదలయ్యారు. ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని హార్వే అధికార ప్రతినిధి జుడా ఎంగెల్మేయర్ తెలిపారు. మీ టూ ఉద్యమంలో భాగంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. అందులో భాగంగానే ఆయనకు మార్చి 11న అత్యాచారం, లైంగిక వేధింపులకుగాను 23 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. రైకర్స్ ద్వీపంలోని జైలులో ఆయన వారం రోజలు తర్వాత వెండేలోని జైలుకు తరలించబడ్డారు. అనంతరం అతనికి కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ కావటంతో క్వారంటైన్‌కి తరలించారు. వెయిన్‌స్టీన్ జైలు అధికారి క్రెయిగ్ రోత్ఫెల్డ్ మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేకమైన చట్టాల ప్రకారం వెయిన్‌స్టీన్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేము. అతని గోప్యతను భంగం కలిగించలేము. ఇప్పటికీ ఆయన వెండే సిఎఫ్ లోని రీజనల్ మెడికల్ యూనిట్లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు’ అని తెలిపారు. ఇక వెయిన్‌స్టీన్‌కి ప్రత్యేకమైన సౌకర్యాలను జైలు అధికారులు కల్పించటం లేదని పలు విమర్శలు వస్తున్నాయి. -
ఇక్కడైతే బతికిపోయేవాడు
హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్ కూడా కాదనలేడు!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
- హమ్మయ్య బంగారం దిగొచ్చింది! తులం ఎంతంటే..
- శుభకార్యానికి వెళ్తూ అనంతలోకాలకు..
Advertisement