
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సోమీ అలి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది. బాలీవుడ్‌లోని ఓ కామాంధుడిని బయటపెడతానంటూ కీలక వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ. 'హార్వే వెన్‌స్టన్ ఆఫ్ బాలీవుడ్. నీ గురించి ఈ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ ఎలాగైతే ధైర్యాన్ని ప్రదర్శించిందో అదే విధంగా నువ్వు వేధించిన మహిళలందరూ ఏదో ఒకరోజు నిజాన్ని నిర్భయంగా బయటపెడతారు' అని రాసుకొచ్చింది. దీనికి సల్మాన్ ఖాన్ 'ఆతే జాతే హస్తే గాతే' సాంగ్ స్టిల్‌ను జత చేసింది. కానీ వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరును వెల్లడించకుండానే కాసేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం గమనార్హం.
చదవండి: సూర్యతో సినిమా, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న బేబమ్మ
కాగా హాలీవుడ్ స్టార్ హార్వే వెన్‌స్టన్ సుమారు 200కు పైగా సినిమాలు నిర్మించాడు. మీటూ ఉద్యమంలో ఎంతోమంది మహిళలు హార్వే తమను లైంగికంగా వేధించాడని, అత్యాచారానికి యత్నించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం 2020 మార్చి 11న అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment