పోలీసులకు లొంగిపోయిన సినీ దిగ్గజం | Harvey Weinstein Surrenders Over Sex Assault Charges | Sakshi
Sakshi News home page

పోలీసులకు లొంగిపోయిన వెయిన్‌స్టీన్‌

Published Fri, May 25 2018 5:34 PM | Last Updated on Fri, May 25 2018 5:39 PM

Harvey Weinstein Surrenders Over Sex Assault Charges - Sakshi

న్యూయార్క్‌ పోలీసుల ఎదుట లొంగిపోయిన హార్వీ వెయిన్‌స్టీన్‌

న్యూయార్క్‌ : ఎందరో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్‌ నిర్మాత, సినీ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌ న్యూయార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉదయాన్నే స్టేసన్‌కు వచ్చిన వెయిన్‌స్టీన్‌ తెల్ల షర్ట్‌, డార్క్‌ డెనిమ్‌ జీన్స్‌ ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నారని అధికారులు చెప్పారు.

పాత్రికేయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వెయిన్‌స్టీన్‌ స్పందన కోసం వేచిచూశారు. పోలీసు అధికారులు ఆయనకు ఎస్కార్ట్‌గా నిలిచారు. వెయిన్‌స్టీన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా, హాలీవుడ్‌ సెలబ్రిటీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని వెయిన్‌స్టీన్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

దశాబ్ధాలుగా వెయిన్‌స్టీన్‌ మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడని 70 మందికి పైగా మహిళలు ఇప్పటికే బాహాటంగా వెల్లడించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ లో తొలుత వెయిన్‌స్టీన్‌ నిర్వాకం వెలుగుచూసిన తర్వాత మీ టూ క్యాంపెయిన్‌ పేరిట వందలాదిగా మహిళలు సినీ, వాణిజ్య, అధికార, వినోద రంగాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement