Surrenders
-
కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనకు తానే బాధ్యుడనని లొంగిపోయాడో వ్యక్తి. పేలుళ్లు జరిగిన కన్వెన్షన్ సెంటర్లో తానే బాంబును అమర్చినట్లు పేర్కొన్నాడు. తానే ఆ బాంబులను కన్వెన్షన్ సెంటర్లోకి తీసుకెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కేరళ, కలమస్సేరిలోని ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి బాంబును అమర్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ పేలుళ్ల వెనుక అతడి హస్తం ఉందా లేదా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళ ADGP (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ మాట్లాడుతూ.. "పేలుళ్లకు సంబంధించి త్రిసూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి లొంగిపోయాడు. అదే ప్రాంతానికి చెందినవాడుగా ఆయన పేర్కొన్నాడు. మేము ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము." అని చెప్పారు. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. ఇదీ చదవండి: కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..! -
అమానవీయ ఘటన.. కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసిన మహిళ
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి హేయమైన చర్య ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసింది తల్లి పుట్ట విజయ లక్ష్మి. సదరు మహిళకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, భర్త మరణించగా మేనత్త కొడుకు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ సతీష్ బెదిరించడంతో వేరే పెళ్లి వద్దని, తన ఇద్దరు కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తకు అప్పగించింది. 17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి మృతి చెందాడు. భార్య భర్తల మధ్య విభేదాలతో వ్యవహారం బయటపడింది. విషయం తెలిసిన బంధువులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు సతీష్, విజయలక్ష్మిలను అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్: టీవీ సీరియల్ నటి అదృశ్యం -
Russia-Ukraine war: లొంగిపోతే ప్రాణభిక్ష
మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌లోని కీలక రేవు నగరం మారియుపోల్‌పై రష్యా సైన్యం దాదాపుగా పట్టు బిగించింది. అక్కడ మిగిలిఉన్న కొద్దిపాటి ఉక్రెయిన్ సైనికులు మధ్యాహ్నంలోగా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ ఆదివారం హెచ్చరించారు. లొంగిపోతే ప్రాణాలకు గ్యారంటీ ఇస్తామన్నారు. అంటే ఆయుధాలు వీడి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పరోక్షంగా సూచించారు. అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉక్రెయిన్ సైనికులంతా లొంగిపోవాలన్నారు. ఉక్రెయిన్‌కు రష్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంకా తమకు ఎదురు తిరగాలని చూస్తే చావు తప్పదని ఉక్రెయిన్ సైన్యానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ అల్టిమేటం జారీ చేశారు. మిగిలింది స్టీల్ ఫ్యాక్టరీనే మారియూపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటే రష్యాకు అది అతిపెద్ద విజయం అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై రష్యా మొదటి నుంచే కన్నేసింది. ఈ నగరాన్ని జేజిక్కించుకుంటే క్రిమియాకు రష్యా నుంచి భూమార్గం ఏర్పడుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్లో పాగా వేయడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 11 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒక్కటే ఉక్రెయిన్ దళాల ఆధీనంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో 2,500 మంది ఉక్రెయిన్ జవాన్లు ఉన్నట్లు సమాచారం. రష్యా నియంత్రణలోకి వచ్చిన మారియుపోల్‌లో ఇప్పటివరకు 21,000 మంది మృతిచెందినట్లు అంచనా. ఈ నగరంలో గతంలో 4.50 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కేవలం లక్ష మంది ఉన్నారు. యుద్ధం ప్రారంభమయ్యాక చాలామంది వలసబాట పట్టారు. ఖర్కీవ్‌లో ఐదుగురు బలి ఉక్రెయిన్ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టడమే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు ఉధృతం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బ్రొవరీ ఆయుధాగారాన్ని నేలమట్టం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ఆదివారం చెప్పారు. క్షిపణులతో దాడి చేశామని తెలిపారు. అలాగే సీవీరోడోంటెస్క్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేశామన్నారు. అలాగే కొన్ని ఆయుధ డిపోలపైనా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. డోన్బాస్ సమీపంలోని జొలోట్ పట్టణంపై రష్యా దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో ఆదివారం రష్యా బాంబు దాడుల్లో ఐదుగురు పౌరులు మరణించారు, 13 మంది గాయపడ్డారు. లొంగిపోయే ఉద్దేశం లేదు: ఉక్రెయిన్ ప్రధాని రష్యా హెచ్చరికలను ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షమీహల్ కొట్టిపారేశారు. ఈ యుద్ధంలో ఆఖరిఘట్టం దాకా పోరాడుతామని స్పస్టంచేశారు. విజయం సాధించేదాకా తమ పోరాటం ఆగదన్నారు. సాధ్యమైనంత వరకు దౌత్య మార్గాల ద్వారానే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేతప్ప రష్యాకు లొంగిపోయే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నారు. మారియుపోల్ నగరం తమకు రక్షణ కవచంగా ఉపయోగపడుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా మాల్యార్ చెప్పారు. మతిలేని యుద్ధాన్ని ఆపండి: పోప్ ఫ్రాన్సిస్ ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న బీభత్సకాండపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తంచేశారు. మతిలేని యుద్ధాన్ని వెంటనే ఆపాలని రష్యాకు సూచించారు. ఈస్టర్ సండే సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ సందేశమిచ్చారు. శాంతికి చొరవచూపాలని రష్యాకు హితవు పలికారు. దయచేసి యుద్ధంలో ఎవరూ భాగస్వాములు కావొద్దని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ► నల్లసముద్రంలోని తమ రేవుల్లోకి రష్యా నౌకల ప్రవేశాన్ని బల్గేరియా నిషేధించింది. ► తమకు 50 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుని ఆర్థిక సలహాదారు జీ7 దేశాలను కోరారు. చర్చలకు విఘాతం: జెలెన్స్కీ మారియుపోల్‌ను గుప్పిటపెట్టే ప్రయ త్నాలు చర్చలకు విఘాతం కలిగిస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అక్కడి పౌరులను సైన్యం పొట్టనపెట్టుకుంటోందని మండిపడ్డారు. అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు. రష్యా అణుదాడులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు. -
పాక్ తాలిబన్లతోనూ ఇమ్రాన్ రాజీ!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భద్రతాబలగాలు, పౌరులే లక్ష్యంగా గడిచిన 14 ఏళ్లుగా దాడులకు పాల్పడుతున్న పాకిస్తానీ తాలిబన్ ఉగ్ర సంస్థతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ ప్రభుత్వం, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం సహకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్ చౌదరి వెల్లడించారు. టీటీపీ ప్రతినిధి మొహమ్మద్ ఖురాసానీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నెల రోజుల్లో రెండు వర్గాల ప్రతినిధులతో ఏర్పడిన కమిటీ చర్చలు కొనసాగిస్తుందని ఆయన వివరించారు. గత నెలలో పాక్ ప్రభుత్వం, టీటీపీ మధ్య మొదలైన చర్చల నేపథ్యంలో తాజాగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ చర్చల్లో పురోగతి కనిపిస్తే కాల్పుల విరమణ కూడా కొనసాగనుందని ఫవాద్ చెప్పారు. చర్చల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, అఫ్గాన్ తాలిబన్ అనుబంధ సంస్థే టీటీపీ. పాకిస్తానీ ఉగ్రవాదులతో 2007లో ఏర్పాటైన ఈ సంస్థ జరిపిన వందలాది దాడుల్లో వేలాదిగా ప్రజలు చనిపోయారు. కాగా, ఉగ్ర సంస్థగా పాక్ అధికారికంగా గుర్తించిన తెహ్రిక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్పీ)పై ఉన్న నిషేధాన్ని ఇమ్రాన్ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. -
లొంగిపోయిన జాకబ్ జుమా
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా తాజాగా అధికారుల ఎదుట లొంగిపోయారు. అరెస్టు చేయడానికి న్యాయస్థానం విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని నిమిషాల ముందు లొంగుబాటు ప్రక్రియ ముగిసింది. ఆయన 2009 నుంచి 2019 వరకూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేశారు. పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాకబ్ జుమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందడంతో కేసులు నమోదయ్యాయి. విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని దక్షిణాఫ్రికా రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశించగా, ఆయన అందుకు నిరాకరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద జుమాకు న్యాయమూర్తి 15 నెలల జైలు శిక్ష విధించారు. బుధవారం అర్ధరాత్రి లోగా లొంగిపోవాలని ఆదేశించారు. లేకపోతే అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. దీంతో చేసేదిలేక జాకబ్ జుమా లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత పోలీసు అధికారులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని జుమా ఆరోపించారు. జుమాకు జైలు శిక్ష విధిస్తూ రాజ్యాంగ న్యాయస్థానం ఇచ్చిన తీర్పునుసవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. అయితే, హైకోర్టులో జుమాకు ఉశపమనం దక్కే అవకాశాలు తక్కువేనని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘శరవణ’ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో ఉన్న కారణంగా జైలుకు వెళ్లేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ‘శరవణ భవన్’ హోటళ్ల యజమాని పి.రాజగోపాల్ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని సెషన్‌కోర్టులో లొంగిపోయారు. దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘శరవణ భవన్’ హోటళ్లను స్థాపించిన రాజగోపాల్ ఓ హత్య కేసులో దోషి. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్ జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు. 2001లో ఓ జ్యోతిష్యుడి మాటను నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పనిచేస్తున్న శాంతకుమార్ అనే ఉద్యోగి భార్యను మూడో పెళ్లి చేసుకునేందుకు శాంతకుమార్‌ను అంతమొందించాడు. ఈ కేసులో 2004లో కింది కోర్టు ఆయనతోపాటు మరో 8 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, వారంతా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు 2009లో శిక్షను పదేళ్ల నుంచి యావజ్జీవానికి పెంచింది. మద్రాసు హైకోర్టు వేసిన శిక్షను ఇటీవలే సుప్రీంకోర్టు సమర్థించింది. -
పోలీసులకు లొంగిపోయిన సినీ దిగ్గజం
న్యూయార్క్ : ఎందరో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత, సినీ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్ న్యూయార్క్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం అధికారుల ఎదుట లొంగిపోయారు. ఉదయాన్నే స్టేసన్‌కు వచ్చిన వెయిన్‌స్టీన్ తెల్ల షర్ట్, డార్క్ డెనిమ్ జీన్స్ ధరించి, చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉన్నారని అధికారులు చెప్పారు. పాత్రికేయులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వెయిన్‌స్టీన్ స్పందన కోసం వేచిచూశారు. పోలీసు అధికారులు ఆయనకు ఎస్కార్ట్‌గా నిలిచారు. వెయిన్‌స్టీన్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. కాగా, హాలీవుడ్ సెలబ్రిటీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని వెయిన్‌స్టీన్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దశాబ్ధాలుగా వెయిన్‌స్టీన్ మహిళలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడ్డాడని 70 మందికి పైగా మహిళలు ఇప్పటికే బాహాటంగా వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ లో తొలుత వెయిన్‌స్టీన్ నిర్వాకం వెలుగుచూసిన తర్వాత మీ టూ క్యాంపెయిన్ పేరిట వందలాదిగా మహిళలు సినీ, వాణిజ్య, అధికార, వినోద రంగాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. -
వివాహేతర సంబంధం.. భార్యపై భర్త దాడి
సాక్షి, పెద్దపల్లి: భార్య వేరొకరితో సంబంధం కలిగి ఉండటాన్ని సహించలేని ఓ భర్త ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కాలనీలో జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య స్వరూప వేరొకరితో సంబంధం కలిగి ఉండగా కళ్ళారా చూశాడు. ఇది తట్టుకోలేక ఆగ్రహంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శ్రీనివాస్ పోలీసులకు లొంగిపోయాడు. -
ఎట్టకేలకు లొంగిపోయిన చోటు
- 170 మంది అనుచరులు, భారీగా ఆయుధాలతో సైన్యానికి లొంగిపోయిన మాఫియా ముఠా నాయకుడు రాజన్ పూర్: ఏక్షణం ఏం జరుగుతుందో అన్నట్లు 15 రోజులపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుల్లో కొందరిని చంపి, మరి కొందరిని బందీలుగా తీసుకుని ఏకంగా ఆర్మీకే సవాలు విసిరిన మాఫియా గ్యాంగ్ లీడర్ గులామ్ రసూల్ అలియాస్ చోటు తన 170 మంది సాయుధ అనుచరులతో బుధవారం ఎట్టకేలకు సైన్యానికి లొంగిపోయాడు. పంజాబ్(పాకిస్థాన్)లోని సింధూ నది నడిమధ్యన ఉన్నలంక గ్రామం (రాజన్ పూర్) ను చోటు గ్యాంగ్ రెండు వారాల కిందట స్వాధీనం చేసుకోవడం ఆ ప్రాంతం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత నియోజకవర్గం కావటంతో ఆర్మీ సాధ్యమైనంత మేరలో రక్తపాతాన్ని నివారించాలనుకుంది. ఆ క్రమంలో చోటు గ్యాంగ్ తో నిరంతరం చర్చలు జరిపే ప్రయత్నం చేసింది. ఒకానొకదశలో తనతోపాటు భార్యాపిల్లలు, కొందరు అనుచరులు దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లుచేయాలన్నచోటు డిమాండ్ కు సైన్యం అంగీకరించింది కూడా. చివరికి చోటు లొంగుబాటుతో అతని గ్యాంగ్ నిర్బంధించిన 24 మంది పోలీసులు కూడా విముక్తులయ్యారు. దీంతో పోలీసుల కుటుంబాల్లో ఆనందం నెలకొంది. లొంగిపోయిన చోటూ గ్యాంగ్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొదట పోలీసులు, తర్వాత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ పూర్తయినట్లు, చోటు గ్యాంగ్ లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులైతే ప్రకటించారుగానీ ఆర్మీ అధికారులు మాత్రం నోరుమెదపకపోవడం గమనార్హం. పోలీసుల ప్రకటన వెనకున్న మతలబును గమనిస్తే మరిన్ని విస్తుగొలిపే విషయాలు తెలుస్తాయి. ఎవరీ చోటు? సింధూ పరివాహక ప్రాంతమైన రాజన్ పూర్ లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గులామ్ రసూల్ అలియాస్ చోటు మొదట్లో ఓ ఆకతాయి కుర్రాడు. ఆ ప్రాంతంలో జరిగే దొంగతనాలు, మాఫియా ముఠాల సంచారం పోలీసులక చేరవేస్తూ జేబులు నింపుకునేవాడు. క్రమంగా అతడు పోలీసులకు కీలకమైన ఇన్ ఫార్మర్ గా మారాడు. పోలీసుల పనితీరు, నేరాలకు సంబంధించిన సమగ్రసచారంపై పట్టుచిక్కిన తర్వాత సొంతగా గ్యాంగ్ ను ఏర్పాటుచేసి దోపిడీలు మొదలుపెట్టాడు. కొల్లగొట్టిన సొమ్ములో కొంత రాజన్ పూర్ పరిసరగ్రామాల్లోని పేదలకు పంచిపెట్టేవాడు. (సైన్యానికి సవాళ్లు విసురుతూ సింధు నది లంకగ్రామంలో చోటుగ్యాంగ్ 15 రోజులు ఉండగలిగిందంటే ప్రజలు అతనికి ఎంతగా సహకరిస్తారో అర్థం చేసుకోవచ్చు) కాలక్రమంలో చోటూ గ్యాంగ్ దోపిడీలతోపాటు అక్రమాయుధాల వ్యాపారంలోకి ప్రవేశించింది. పోలీసులకు కూడా తమ పాత కొరియర్ పై సాఫ్ట్ కార్నర్ ఉండేది. అయితే ఉగ్రవాదులు, మాఫియా గ్యాంగులపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పోలీసులు చోటుగ్యాంగ్ ను పట్టుకునేందు ఓ ఆపరేషన్ ప్రారంభించారు. లంక గ్రామంలోపలే చోటును బందీగా పట్టుకోవాలని అన్నివైపుల నుంచి దాడిచేశారు. కానీ చోటు దెబ్బముందు పోలీసుల ఎత్తులు చిత్తయ్యాయి. ఏడుగురు పోలీసులను చంపిన చోటుగ్యాంగ్ మరో 24 మందిని బందీలుగా పట్టుకుంది. ఇది జరిగిన 10 రోజుల తర్వాత ఆర్మీ రంగంలోకి దిగింది. చివరికి చోటు లొంగిపోయాడు. -
మావోయిస్టు శబరి దళ సభ్యుడి లొంగుబాటు
కాకినాడ : మావోయిస్టు శబరి దళం ఏరియా కమిటీ సభ్యుడు మడివి దేవయ్య (24) అలియాస్ వినోద్ అలియూస్ దేవా లొంగిపోయినట్టు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఎటపాక మండలం విస్సాపురం గ్రామానికి చెందిన దేవయ్య గొత్తికోయ సామాజికవర్గానికి చెందిన గిరిజనుడు. మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితుడై 2008లో శబరి దళంలో చేరాడు. 2009లో మంగీదళం(ఆదిలాబాద్) సభ్యుడిగా పనిచేశాడు. 2010లో చర్ల దళానికి బదిలీ అయి కొద్దికాలం అనంతరం తిరిగి 2012లో శబరి దళంలోకి వచ్చి ఏరియా కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. చింతూరు, ఎటపాక పోలీస్స్టేషన్లలో అతడిపై ఏడు కేసులు నమోదయ్యూయి. ఐదు హత్యల ఘటనల్లో పాత్ర ఉండడమే కాక మొబైల్ టవర్ కాల్చివేయడం, చెట్లు నరికి రోడ్డుపై పడవేయడం, సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి వంటి ఘటనల్లో పాల్గొన్నాడు. లొంగిపోయిన దేవయ్యకు ప్రభుత్వపరంగా ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. -
మావోయిస్ట్ అగ్రనేత లొంగుబాటు
-
హత్య కేసులో దంపతుల లొంగుబాటు
ఆదిలాబాద్ : ఓ యువకుడ్ని గొంతు కోసి దారుణంగా హతమార్చిన దంపతులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల 7న కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలో శ్రీనివాస్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమిరె రమేష్, అతని భార్య విమల కలసి ఈ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. అయితే వారు ఆజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ విషయం తెలిసిన సదరు దంపతులు శుక్రవారం స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రమేష్ భార్య విమలను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తుండడంతో అతడ్ని హత్య చేసినట్టు వారు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. -
ఎదురు దెబ్బలు
పెరిగిపోయిన మావోయిస్టుల లొంగుబాట్లు 240 మంది మిలీషియా సభ్యుల సరెండర్ 2005-2015 మధ్య పది ఎన్కౌంటర్లు: 30 మంది మృతి ఉద్యమంపై తీవ్ర ప్రభావం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు తమదే పైచేయిగా వ్యవహరించిన దళసభ్యులు పోలీసుల దాడుల్లో ఒక్కరొక్కరుగా మరణిస్తుండగా..ఈస్టు డివిజన్లో మావోయిస్టులకు వెన్నుదన్నుగా ఉండే మిలీషియా సభ్యులు ఐదేళ్లలో 240 మంది లొంగిపోయారు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పెద్ద నేతలు పోలీసులకు చిక్కడం, లేదా లొంగిపోవడం కూడా ఉద్యమంపై తీవ్రప్రభావం చూపుతోంది. కొయ్యూరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావో యిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఐదేళ్లుగా దళసభ్యులతోపాటు మిలీషియా సభ్యు లు లొంగిపోతున్నారు. గాలికొండ దళ సభ్యుడు పంగి భాస్కరరావు అలియాస్ సూర్యాన్ని(22) జిల్లా పోలీ సులు మంగళవారం అరెస్ట్ చేశారు. గాలికొండ దళం ఆర్మడ్ అండ్ హార్డ్‌కోర్ మిలీ షియా సభ్యులు పదకొండు మంది ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న కలిమెల దళం సభ్యురాలు కొర్ర శాంతి అలియాస్ రత్నం(22)కూడా పోలీసులకు లొంగిపోయింది. ఏవోబీలో కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం అలియాస్ నాగరాజు శిమిలిగుడ వద్ద ఏడాది క్రితం దొరికిపోయి జైలులో ఉన్నారు. ఏవోబీలో ‘ఆపరేషన్ ఆల్ అవుట్’ పేరిట ఇరువైపుల నుంచి ఏపీ, ఒడిశా బలగాల కూంబింగ్‌తో ఫలితాలు వస్తున్నాయి. 2005 నుంచి 2015 మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో సుమారు 30 మంది దళసభ్యులు మరణించారు. 2007లో జీకేవీధి మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వక్కాపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్న,అతని భార్య మరణించారు ఈస్టు డివిజన్లో చోటుచేసుకుంటున్న ఎన్కౌంటర్లలో ఎక్కువ మంది మావోయిస్టులే మరణిస్తున్నారు. గునుకురాయి వద్ద 2006,2008 లలోజరిగిన జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. 2007లో కొయ్యూరు మండలం కన్నవరంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయారు. అనంతరం అమ్మిడేలు సంఘటనలో ఇద్దరు మరణించారు. అప్పట్లో మావోయిస్టు నేత బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ తప్పించుకున్నట్టుగా పోలీసులు భావించారు. అనంతరం 2009లో గొల్లువలస ఎన్కౌంటర్లో ఇద్దరు మరణించారు. 2010లో చెరువూరు సంఘటనలో నలుగురు మరణించారు. ఇందులో గుంటూరు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చెందిన యువతి కూడా మరణించింది. 2013 జూలైలో కొయ్యూరు మండలం కిండంగి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మల్కన్‌గిరి జిల్లాలో కలిమెల దళానికి చెందిన సహాయ కమాండర్ రంబోత అలియాస్ లక్ష్మి చనిపోయారు. 2014లో వీరవరం ఘటనలో గిరిజనుల చేతిలోనే గాలికొండ ఏరియా కమిటీకి చెందిన శరత్‌తో పాటు మరో మిలీషియా సభ్యులు మరణించారు. దశాబ్ద కాలంలో మావోయిస్టులు 30 మంది వరకు చనిపోయారు. 2005లో పుట్టకోట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత కైలాసం మరణించారు. ఇప్పుడు ఈస్టు డివిజన్ కార్యదర్శికి అతని పేరు పెట్టారు. -
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి