
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి హేయమైన చర్య ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం కన్న కూతుళ్లనే రెండో భర్త పరం చేసింది తల్లి పుట్ట విజయ లక్ష్మి.
సదరు మహిళకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, భర్త మరణించగా మేనత్త కొడుకు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తనకు పిల్లలు కావాలని, లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానంటూ సతీష్ బెదిరించడంతో వేరే పెళ్లి వద్దని, తన ఇద్దరు కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తకు అప్పగించింది.
17 ఏళ్ల పెద్ద కుమార్తె 2017లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కుమార్తెనూ భర్తకు అప్పగించింది. ఆమెకు ఏడాది క్రితం మగశిశువు పుట్టి మృతి చెందాడు. భార్య భర్తల మధ్య విభేదాలతో వ్యవహారం బయటపడింది. విషయం తెలిసిన బంధువులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు సతీష్, విజయలక్ష్మిలను అదుపులోకి తీసుకుని పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment