సాక్షి, ఏలూరు జిల్లా: మండపల్లి మండలం కానుకొల్లులో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి సడన్‌గా ఇటుక లోడుతో వెళుతున్న లారీ దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(16), పల్లవి దుర్గ(18) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment