హత్య కేసులో దంపతుల లొంగుబాటు | Culprits surrenders to police in adilabad District | Sakshi
Sakshi News home page

హత్య కేసులో దంపతుల లొంగుబాటు

Published Fri, Aug 14 2015 3:31 PM | Last Updated on Sat, Aug 11 2018 9:10 PM

Culprits surrenders to police in adilabad District

ఆదిలాబాద్ : ఓ యువకుడ్ని గొంతు కోసి దారుణంగా హతమార్చిన దంపతులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల 7న కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలో శ్రీనివాస్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమిరె రమేష్, అతని భార్య విమల కలసి ఈ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. 

అయితే వారు ఆజ్ఞాతంలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ విషయం తెలిసిన సదరు దంపతులు శుక్రవారం స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రమేష్ భార్య విమలను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తుండడంతో అతడ్ని హత్య చేసినట్టు వారు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement