తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనకు తానే బాధ్యుడనని లొంగిపోయాడో వ్యక్తి. పేలుళ్లు జరిగిన కన్వెన్షన్ సెంటర్‌లో తానే బాంబును అమర్చినట్లు పేర్కొన్నాడు. తానే ఆ బాంబులను కన్వెన్షన్ సెంటర్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కేరళ, కలమస్సేరిలోని ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు.
ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్‌లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి బాంబును అమర్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ పేలుళ్ల వెనుక అతడి హస్తం ఉందా లేదా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.
కేరళ ADGP (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ మాట్లాడుతూ.. "పేలుళ్లకు సంబంధించి త్రిసూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్‌లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి లొంగిపోయాడు. అదే ప్రాంతానికి చెందినవాడుగా ఆయన పేర్కొన్నాడు. మేము ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము." అని చెప్పారు.
It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB
— ANI (@ANI) October 29, 2023
కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు.
ఎన్‌ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది.
ఇదీ చదవండి: కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..!
Comments
Please login to add a commentAdd a comment