bomb blast
-
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
5 రోజుల్లో 125 విమానాలకు బాంబు బెదిరింపులు
-
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
హౌతీలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అల్హొదైదా పోర్టుతో పాటు పలు చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.పోర్టులోని చమురు నిల్వలకు మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. శుక్రవారం తమ రాజధాని టెల్ అవీవ్‌పై హౌతీల డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్,హమాస్ యుద్ధం మొదలయ్యాక హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. యెమెన్‌లో హౌతీలకు చాలా పట్టున్న నగరం అల్హొదైదా. ఇక్కడి ప్రజలకు పోర్టు జీవనాడి లాంటిది. ఇంత కీలకమైన పోర్టు, పవర్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు.. 2021నాటి పేలుళ్లతో లింక్
ఢిల్లీ: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన 2021నాటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2021లో అదే ప్రదేశంలో ఐఈడీ పేలుళ్లకు ప్రస్తుత దాడికి పోలికలు ఉన్నాయని సమాచారం. పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఇండియా గేట్ వైపు ఆటో రిక్షాను తీసుకెళ్తున్నట్లు పసిగట్టారు. చివరికి జామియా ప్రాంతంలో అనుమానితులను గుర్తించారు. 2021లో ఇదే ప్రదేశంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ కేసులోనూ నిందితులు జామియా వైపే వెళ్లారు. వారికోసం ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ రెండు పేలుళ్లలోనూ ఘటనాస్థలంలో టైప్ చేసిన అక్షరాలతో కూడిన లేఖ లభ్యమైంది. రెండు కేసుల్లోనూ ఆటోనే ఉపయోగించారు. జామియా వైపే వెళ్లారు. రెండు పేలుళ్ల ఘటనలకు పోలికలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ సహా ఇతర భారత ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. పేలుడు నేపథ్యంలో ఇండియాలో ఉన్న తమ దేశస్తులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద డిసెంబర్ 26న బాంబు పేలుడు సంభవించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆక్షేపిస్తూ ఓ లేఖ కూడా ఘటనాస్థలంలో లభ్యమైంది. బాంబు పేలుడు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కానీ ఎంబసీపై దాడిగానే ఇజ్రాయెల్ అధికారులు పరిగణించారు. ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
దీపావళి విషాదం: యూపీలో పేలిన బాంబు.. ఒకరి మృతి!
దీపావళి రోజున ఉత్తరప్రదేశ్(యూపీ)లోని కాన్పూర్ దేహత్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్ధంతో బాంబు పేలడంతో రసూలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని కొంతమంది 20 అడుగుల మేర గాలిలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీపావళి రోజు సాయంత్రం రసూలాబాద్ నుంచి కాన్పూర్ నగర్ వెళ్లే రోడ్డులో పలువురు పటాకులు, మిఠాయిలు కొంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి సుఫియాన్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. గాయపడివారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని కాన్పూర్‌కు తరలించారు. సాధారణ పటాకుల వల్ల పేలుడు సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో కూలిన సొరంగం: ప్రమాదంలో 40 మంది కూలీలు? -
కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు
తిరువనంతపురం: కేరళ బాంబు పేలుళ్ల ఘటనకు తానే బాధ్యుడనని లొంగిపోయాడో వ్యక్తి. పేలుళ్లు జరిగిన కన్వెన్షన్ సెంటర్లో తానే బాంబును అమర్చినట్లు పేర్కొన్నాడు. తానే ఆ బాంబులను కన్వెన్షన్ సెంటర్లోకి తీసుకెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కేరళ, కలమస్సేరిలోని ప్రార్థనా సమావేశంలో జరిగిన పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. ప్రార్థనలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి బాంబును అమర్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ పేలుళ్ల వెనుక అతడి హస్తం ఉందా లేదా? అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళ ADGP (లా అండ్ ఆర్డర్) అజిత్ కుమార్ మాట్లాడుతూ.. "పేలుళ్లకు సంబంధించి త్రిసూర్ రూరల్‌లోని కొడకరా పోలీస్ స్టేషన్లో డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి లొంగిపోయాడు. అదే ప్రాంతానికి చెందినవాడుగా ఆయన పేర్కొన్నాడు. మేము ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నాము." అని చెప్పారు. It's a very unfortunate incident. We are collecting details regarding the incident. All top officials are there in Ernakulam. DGP is moving to the spot. We are taking it very seriously. I have spoken to DGP. We need to get more details after the investigation: Kerala CM Pinarayi… https://t.co/4utwtmR9Sl pic.twitter.com/GHwfwieRLB — ANI (@ANI) October 29, 2023 కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఒకేరోజు మూడు సార్లు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లల్లో ఒకరు మృతిచెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రేయర్ మీట్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రార్థన సమయంలో అందరూ కళ్లు మూసుకొని ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 9:47 సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 2,000 మందితో ప్రార్థనలు జరుగినట్లు స్థానికులు తెలిపారు. ఎన్ఐఏ యాంటీ టెర్రర్ ఏజెన్సీ కేసును విచారిస్తోంది. జాతీయ భద్రతా దళం బృందం కూడా కేరళకు రానుంది. ఈ పేలుళ్లకు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రదాడి అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో హమాస్ నాయకుడు పాల్గొనడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పేలుడు సంభవించింది. ఇదీ చదవండి: కేరళ బాంబు పేలుళ్ల ఘటనలో విస్తుపోయే నిజాలు..! -
గృహంలో బాంబు పేలుడు.. భారీగా ఎగిసిన మంటలు.. వీడియో వైరల్..
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. పిట్స్‌బర్గ్‌లో బాంబు పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. పిట్స్‌బర్గ్‌లో పగటిపూటనే బాంబు పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరిగింది. అదే సమయంలో పేలుడుకు పక్కనే ఉన్న నలుగురు యువకులు ఓ చిన్నారి మంటల్లో కాలి మృతి చెందారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ఇంటి శిథిలాలు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ఇంటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. Four Adults And A Child Have Passed Following A House Explosion In Pennsylvania. Three People From Surrounding Homes Were Rushed To Hospitals, One Of Which Is Currently In Critical Condition. 😳🤯 pic.twitter.com/LYyw5QZDDD — 🚘BrutalCams🎥 (@BrutalCams) August 15, 2023 పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన -
రాజకీయ పార్టీ ర్యాలీలో భారీ పేలుడు.. 40 మంది మృతి..
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బజూర్లో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 40 మంది మృతి చెందారు. 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (జేయూఐ-ఎఫ్) రాజకీయ పార్టీ ర్యాలీలో ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. Powerful explosion at a political rally left several people dead in Khyber Pakhtunkhwa #Pakistan #BREAKING #BreakingNews #Pakistanblast pic.twitter.com/A7nD8Vaym1 — Eliteworld (@eliteworldwaves) July 30, 2023 ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లోని బజూర్లో జేయూఐఎఫ్ రాజకీయ పార్టీ మీటింగ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఇందులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. పేలుడును జేయూఐఎఫ్ నాయకుడు హఫీజ్ హమ్దుల్లా ఖండించాడు. మానవత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నాడు. పేలుళ్లపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: రష్యాపై డ్రోన్ల దాడికి పాల్పడ్డ ఉక్రెయిన్.. మాస్కో విమానాశ్రయం మూసివేత -
స్వర్ణ దేవాలయం సమీపంలో మరో పేలుడు.. స్థానికుల భయభ్రాంతులు..
చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం సమీపంలో మరో పేలుడు ఘటన జరిగింది. సోమవారం ఉదయం 6:30 గంటల సమయంలో హెరిటేజ్ స్ట్రీట్‌లో భారీ శబ్దంతో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు. శనివారం రాత్రి కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఒకే ప్రాంతంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో స్థానికులు హడలిపోతున్నారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించారు. Punjab | Bomb Squad and FSL team at the spot after a suspected bomb explosion was reported near Golden Temple in Amritsar https://t.co/EBubbzqAFU pic.twitter.com/yx0dROANqw — ANI (@ANI) May 8, 2023 ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇది ఐఈడీ పేలుడు కాదని స్పష్టతనిచ్చారు. తక్కువ తీవ్రతగల పేలడు అని పేర్కొన్నారు. అయితే పేలుళ్లకు గల కారణాలు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని మాత్రం తెలిపారు. శనివారం జరిగిన ఘటనలో పేలుడు పదార్థాలతో పాటు మెటల్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు. రెస్టారెంట్‌లోని చిమ్నీలో ఈ పేలుడు జరిగింది. ఈ ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలు గాయపడ్డారు. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం
సెంట్రల్ మాలీలో విషాద ఘటన జరిగింది. పేలుడు పరికరాన్ని బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భారీ పేలుడు ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. జిహాదీల హింసకు నిలయమైన మోప్టీ ప్రాంతంలో ఈ ఘోర పేలుడు ఘటన జరిగింది. జీహాదీలకు కేరాఫ్ అడ్రగ్ అయిన ఈ ప్రాంతంలో తరచూ రక్తపాతం జరుగుతోంది. హింసాత్మక ఘటనలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది మాలీని విడిచిపెట్టారు. చదవండి: బాప్రే!...ఆమె కంటిలో ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్‌లు... -
స్కూల్‌పై బాంబు పేలుడు.. భయంతో విద్యార్థులు, టీచర్ల పరుగులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ టీటాగఢ్లో ఓ పాఠశాలపై బాంబు పేలడం కలకలం రేపింది. విద్యార్థులు, టీటర్లంతా స్కూల్లో ఉన్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం 1:00గంటలకు ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు శబ్దం వినగానే సిబ్బంది, స్టూడెంట్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక్కరు కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్యాడ్ నిపుణులతో తనిఖీలు చేయించారు. అయితే స్కూల్ భవనంపైకప్పుపై ఈ బాంబు ఎలా పేలి ఉంటుందనే విషయంపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ బాంబును భవనంపైనే ఎవరైనా కావాలని పెట్టారా? లేక బయటి నుంచి స్కూల్ పైకి విసిరారా? అనే విషయం తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు పేలుడు జరిగినప్పుడు విద్యార్థులంతా స్కూల్ లోపలే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ భవనంపై కాకుండా పాఠశాల లోపల పేలుడు జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటనపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. క్రూడ్ బాంబులు, అక్రమ ఆయుధాల పరిశ్రమలే బెంగాల్లో పుట్టుకొస్తున్నాయని కమలం పార్టీ తృణమూల్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ఎలాంటి అవకాశన్నైనా వదులుకోదని టీఎంసీ దీటుగా బదులిచ్చింది. చదవండి: ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా -
క్రికెట్ గ్రౌండ్లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..!
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం బాంబు దాడితో మరోసారి ఉలిక్కి పడింది. అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా శుక్రవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ష్పగీజా క్రికెట్ లీగ్‌లో భాగంగా పామిర్ జల్మీ, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ మధ్య సందర్భంగా ఈ ఘటన జరిగింది. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానుల మధ్య ఈ పేలుడు సంభవించింది. కాగా ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో ప్రేక్షకులు భయాందోళనలతో పరిగెత్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటనలో చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. అదే విదంగా ఇరు జట్ల ఆటగాళ్లను బంకర్లోకి సురక్షితంగా అధికారులు తరలించారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పడు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా స్టేడియంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనను కాబూల్ పోలీసు ప్రధాన కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. కాగా గత కొద్దిరోజులుగా కాబూల్‌లో వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. చదవండి: Ind W Vs Aus W: గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి #NEWS. A blast reported inside a cricket stadium among the audience. — Anees Ur Rehman (@JournalistAnees) July 29, 2022 -
జమ్మూలో పేలుడు... ఒకరు మృతి
జమ్ము: ఉదమ్‌పూర్ నగర కోర్టు కాంప్లెక్సుకు దగ్గరోని స్లాథియా చౌక్ వద్ద బుధవారం జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మరణించగా, 14మంది గాయపడ్డారు. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. పేలుడు చాలా శక్తివంతమైనదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారని, వారు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. పేలుడుపై విచారణ జరుపుతున్నామన్నారు. (చదవండి: రాజీవ్ హత్య కేసు దోషికి బెయిల్) -
పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు: ఇద్దరు మృతి
Punjab Ludhiana Court Blast: పంజాబ్‌లో లూథియానాలోని కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. భవనంలో రెండో అంతస్తులోని బాత్రూమ్లో పేలుడు సంభవించిందని అధికారులు అన్నారు. పైగా పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నడమే కాక సమీపంలోని అద్దాలు కూడా పగిలిపోయాయి అని చెప్పారు. అయితే పేలుడు సంభవించిన సమయంలో జిల్లా కోర్టు పనిచేస్తోందని చెప్పారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. (చదవండి: హ్యాట్సాఫ్!..కుక్కని భలే రక్షించాడు) అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన బాంబు డేటా సెంటర్‌కు చెందిన బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ మేరకు పేలుడు ఎలా సంభవించిందో విచారించడానికి చండీగఢ్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం లూథియానా జిల్లా కోర్టుకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పంజాబ్ పోలీసులను ఈ ఘటన గురించి సత్వరమే విచారణ చేపట్టాలని ట్విట్టర్లో కోరారు. అంతేకాదు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు చన్నీ మాట్లాడుతూ..."ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పంజాబ్ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు!
వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం.. అంతులేని అవినీతి, కుమ్మక్కు రాజకీయాల ఫలితంగా నిర్మించిన ఏడాదికే ఓ ఆనకట్టకు అవినీతి కంతలు పడ్డాయి. దీనికితోడు భారీ వర్షాలకు నీటి ఉద్ధృతి పెరగడంతో డ్యాం కూలిపోయే పరిస్థితి నెలకొంది. చేసేది లేక అధికారులు ఆనకట్టనే పేల్చివేశారు. అలా.. రూ.25 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. సాక్షి, చెన్నై(తమిళనాడు): భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్ట ఏడాదిలోపే బలహీన పడిపోయింది. పొంచి ఉన్న ముంపుముప్పు నుంచి గ్రామాలను కాపాడేందుకు దక్షిణ పెన్నానదిపై రూ.25.35 కోట్లతో నిర్మించిన ఆనకట్టను ఆది, సోమవారాల్లో బాంబులతో అధికారులే పేల్చి.. కూల్చేవేశారు. వివరాలు.. విళుపురం జిల్లా దళవానూరు గ్రామం, కడలూరు జిల్లా ఎనదిరిమంగళూరు గ్రామాలకు మధ్య ప్రవహించే దక్షిణ పెన్నానదిపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం రూ.25.35 కోట్లతో ఆనకట్ట నిర్మించింది. వ్యవసాయ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ఆనకట్టను గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన ప్రారంభించి వినియోగంలోకి తెచ్చారు. అయితే ప్రారంభించిన నాలుగు నెలలకే.. అంటే ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఆనకట్ట క్రస్ట్‌గేట్లకు దన్నుగా ఇరువైపులా అమర్చిన గోడ పాక్షికంగా తెగిపోయింది. ఫలితంగా నీరు బయటకు ప్రవహించడం ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో బాధ్యులుగా భావిస్తూ ప్రజాపనులశాఖలోని ఆరుగురిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ మార్పుతో.. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు చోటు చేసుకోగా రూ.15 కోట్లతో ఆనకట్టను మరమ్మతు చేయాలని ప్రజాపనులశాఖ అంచనాలు సిద్ధం చేసింది. ఈలోగా భారీ వర్షాలు, వరద ప్రవాహం మొదలవడంతో మరమ్మతు పనులను ప్రారంభించలేక పోయారు. ఇదిలా ఉండగా, విళుపురం జిల్లాలో గత కొన్నిరోజులు కుండపోత వర్షాల వల్ల దక్షిణ పెన్నానదిలో వరద ప్రవాహం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఆనకట్ట పూర్తిగా నిండిపోయి వరదనీరు రెండువైపుల ఒడ్డును తాకడం మొదలైంది. ఇన్‌ఫ్లో అంతకంతకూ పెరిగింది. ఆనకట్టలోని మూడు క్రస్ట్ గేట్లు బలహీన దశకు చేరుకుని ఏ క్షణమైన బద్దలయ్యే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ఆనకట్టలోకి నీటి ప్రవాహాన్ని ఇసుకబస్తాలు వేసి నిలువరించేందుకు ఈనెల 10వ తేదీన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇన్‌ఫ్లో, ప్రవాహ ఒత్తిడిని తట్టుకోలేక ఆనకట్ట ఎడమవైపు తెగిపోగా ఉధృతంగా ప్రవహించిన నీటిలో స్థానికంగా సాగు చేసిన చెరకు పంట కొట్టుకుపోయింది. పైగా 11వ తేదీన అనకట్ట ప్రహరీగోడ బీటలు వారింది. దీంతో విళుపురం జిల్లా కలెక్టర్ మోహన్, ఎస్పీ శ్రీనాథ ఇతర ఉన్నతాధికారులు ఆదివారం ఉదయం ఆనకట్టను పరిశీలించారు. ఈ సమయంలో సాతనూరు ఆనకట్ట నుంచి సెకనుకు 3,500 ఘనపుటడుగుల నీటిని దక్షిణ పెన్నానదిలోకి విడుదల చేసినట్లు సమాచారం అందింది. ఈ ప్రవాహం వల్ల పెన్నానది ఒడ్డు మరింతగా దెబ్బతిని పరిసర గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తే పెనుముప్పు తప్పదని అధికారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ కారణంగా దెబ్బతిన్న మూడు క్రస్ట్ గేట్లను, దానికి సమీపంలోని ఆనకట్ట ప్రాంతాన్ని 50 అడుగుల మేర బాంబులతో పేల్చి తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటిసారి తూచ్.. మూడు క్రస్ట్ గేట్లను, తీరంలోని కాంక్రీట్ గోడను వంద జిలెటిన్ స్టిక్స్, వంద తూటాలను 20 చోట్ల అమర్చి ఆదివారం సాయంత్రం 5.50 గంటలకు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పేల్చేశారు. పేలుళ్ల ధాటికి ఆనకట్ట శిథిలాలు వంద మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. అయినా ఆశించిన స్థాయిలో ఆనకట్టను తొలగించలేక పోగా, అక్కడక్కడా పగుళ్లు చోటుచేసుకుని మరింత ప్రమాదకరంగా తయారైంది. దక్షిణ పెన్నానదిలో ప్రవాహ ఉధృతి పెరిగినట్లయితే ఆనకట్ట పూర్తిగా కొట్టుకుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఏర్పడింది. దీంతో సోమవారం మరోసారి బాంబులు పెట్టి పూర్తిస్థాయిలో పేల్చివేసినట్లు ప్రజాపనులశాఖ అధికారులు వెల్లడించారు. -
రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్ శిబిరంపై బాంబు దాడి
బాగ్దాద్: ఐసిస్ ఉగ్రదాడులు రెచ్చిపోయారు. తమ ఆట కట్టించేందుకు పని చేస్తున్న పోలీసులను మట్టుబెట్టారు. పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పోలీసులు కన్నుమూశారు. దీంతో ఇరాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ దేశంలోని కిర్కుక్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోని అల్ రషద్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్టుపై ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలకు చెందిన 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారని ఆ దేశ భద్రత అధికారి వెల్లడించారు. వారి దాడుల నేపథ్యంలో ఆ దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి -
మూగజీవాల మృత్యుఘోష ..
సాక్షి, అనంతపురం(గుత్తి): మండల పరిధిలోని ఊటకల్లు వద్ద కురుబ రాజు మామిడి తోటలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మామిడి తోటలోని ఓ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో 22 కేఫ్‌లు (పేలుడు పదార్థాలు) ఉంచారు. టమాట పండ్ల మాదిరి ఉండటంతో అటువైపు వెళ్లిన రైతు నారాయణరెడ్డికి చెందిన ఆవు తినడానికి ప్రయత్నించింది. దీంతో ఒక కేఫ్ పెద్ద శబ్దంతో పేలింది. ఆవు తల భాగం ఛిద్రమైంది. గ్రామస్తులు వెంటనే గుత్తి సీఐ రాముకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎస్ఐ సుధాకర్ యాదవ్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేలని 21 కేఫ్‌లను గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సాధారణంగా కేఫ్‌ను అడవి పందులను చంపడానికి వినియోగిస్తారని చెప్పారు. అయితే అడవ పందులను చంపడానికైతేఅక్కడక్కడా ఒకటి చొప్పున మాత్రమే ఉంచుతారు. ఒకేచోట 22 ఎందుకు ఉంచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రొళ్లపాడు, గుడిసెల గ్రామాలకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో ఊటకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా పేలుడు పదార్థాలు ఉంచారోనని భయపడుతున్నారు. గ్రామంలో ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కేఫ్ పేలితే సుమారు కిలో మీటరు దూరం వరకు శబ్ధం వినిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. మూగజీవాల మృత్యుఘోష అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామాంజులపల్లి బస్‌షెల్టర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు ఎద్దులు మృతి చెందాయి. మరో ఏడు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి గురైన మూగజీవాలు విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి చెన్నైకు ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ లారీ తెల్లవారుజామున రామాంజులపల్లి బస్‌షెల్టర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులో తూగాడు. దీంతో లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ను వేగంగా ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులోని 12 ఎద్దులలో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. మిగిలిన ఏడు కొమ్ములు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. అవి విలవిలలాడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. లారీలోనే మృతి చెందిన ఎద్దులను జేసీబీ సాయంతో తొలగించారు. లారీ వేగంగా ఢీ కొనడంతో బస్‌షెల్టర్ సైతం దెబ్బతింది. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి గుర్నాథరెడ్డి గోపాలమిత్రలను సంఘటనా స్థలానికి పంపి గాయపడిన పశువులకు చికిత్స చేయించారు. అనంతరం వాటిని చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
దర్బంగా కేసు :నిందితులను మరోసారి కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ
-
Bomb Blast : ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్నది వీళ్లే ?
న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 29న ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కీలక ఆధారాలు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సంపాదించింది. పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల ఫుటేజీని రిలీజ్ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయిల్ ఎంబసీ ముందు అనుమానస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. జనవరి 29న 2021 జనవరి 29తో ఇజ్రాయిల్, ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అలజడి సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఇజ్రాయిల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అయితే గట్టి భద్రత ఉండటంతో వాళ్ల ప్లాన్ అనుకున్నట్టుగా ఫలించలేదు. జనవరి 29న ఇజ్రాయిల్ ఎంబసీ పక్కన ఉన్న జిందాల్ హౌజ్ ఎదుట ఉన్న పూల కుండీలో పేలుడు పదార్థాలు ఉంచారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో పేలుడు జరిగినా పెద్దగా నష్టం చోటు చేసుకోలేదు. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నారనే అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. చదవండి : అయోధ్యలో ‘భూ’కంపం -
ఘోరం.. జంట పేలుళ్లలో 17 మంది మృతి
కాబుల్: అత్యంత సురక్షితమైన ప్రావిన్సులలో ఒకటైన బామియాన్ నగరంలో నిన్న (మంగళవారం) జరిగిన రెండు పేలుళ్లలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బామియన్‌లోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు సంభవించాయని స్థానిక వార్త సంస్థ టోలో న్యూస్ తెలిపింది. అయితే ఈ పేలుళ్లకు పాల్పడిందెవరో ఇప్పటికి వరకు ప్రకటించలేదు. బామియాన్‌కు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడ పేలుళ్లు జరగటం ఇదే తొలిసారి. జంట పేలుళ్లలో 17మంది మృతి చెందగా, 50మంది గాయపడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వెల్లడించారు. ఇటీవల జరిగిన దాడుల్లో 50మంది మృతి చెందిన విషయం విదితమే. -
సీఎం ఇంటికి బెదిరింపు కాల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపునకు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 4.45 గంటలకు చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్దిసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ నిపుణులు సీఎం పళనిస్వామి ఇంట్లో గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా బాంబు లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా తాంబరం సమీపంలోని సేలయూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని ఆటో డ్రైవర్ వినోద్‌కుమార్‌గా గుర్తించారు. తాగిన మత్తులో భార్యతో గొడవపడి పొరపాటున ఫోన్ చేశానని అతడు పేర్కొన్నాడు. అయితే గతంలోనూ ఇదే విధంగా ఫోన్ చేయగా వార్నింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే వినోద్ భార్య దివ్య కూడా ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు వివరించారు. (అందరూ దొంగలే.! ) -
బాంబు పేలుడు : ఆర్మీ మేజర్ మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మరోసారి బాంబు పేలుడు అలజడి రేపింది. శనివారం జరిగిన పెట్రోల్ బాంబు పేలుడులో ఐదుగురు రక్షణ సిబ్బందితో పాటు ఓ ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇరాన్‌కు 14 కిలో మీటర్ల దూరంలో గల సరిహద్దులో రోడ్డు పక్కకు ఆగి ఉన్న కారు ద్వారా పెట్రోల్ బాంబు దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. ఇది బలుచిస్తాన్ మిలిటెంట్ల దాడిగా పాక్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. రక్షణ సిబ్బంది దుర్మరణం పట్ల ఆ దేశ ఆర్మీ విచారం వ్యక్తం చేసింది. (భారత్‌పై పాక్ తీవ్ర వ్యాఖ్యలు) -
ఆఫ్ఘనిస్తాన్ కాబూల్‌లో భారీ బాంబు పేలుళ్లు
-
తమిళనాడులో బాంబు పేలుడు, ఇద్దరు మృతి
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు చొరబడ్డ సమాచారంతో తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని మానామది ఆలయం వద్ద ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఆలయ కొలనులో పూడికతీత పనుల్లో ఈ పేలుడు సంభవించింది. అయితే ఆదివారం కావడంతో ఆ పనులకు విరామం ఇచ్చారు. గ్రామానికి చెందిన సూర్య అనే యువకుడితో పాటు అతడి స్నేహితులు ఆ కొలనుకు వెళ్లారు. అక్కడ ఓ బాక్స్ లభించడంతో దానిని ఆలయం వద్దకు తీసుకొచ్చారు. దానిని తెరిచేందుకు మిత్రులు ఐదుగురు తీవ్రంగానే ప్రయత్నించారు. ఈ సమయంలో పెద్ద శబ్దంతో ఆ బాక్స్ పేలడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ సూర్యతో పాటు మరో వ్యక్తి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ పేలుడు దాటికి ఆలయం వద్ద గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న చెంగల్పట్టు, మహాబలిపురం డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు రంగంలోకి దిగాయి. ఆ బాక్సు ఎక్కడి నుంచి వచ్చింది. దానిని ఆలయం కొలను వద్దకు తీసుకొచ్చి పడేసింది ఎవరు అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో కాంచీపురం పరిసరాల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. కాగా చొరబడ్డ తీవ్రవాదులు కోయంబత్తూరులో తిష్టవేసి ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం రావడంతో అక్కడ జల్లెడ పట్టి ఉన్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి పంపుతున్నారు. ఇందులో ముగ్గురి వద్ద మాత్రం కొన్ని గంటల పాటు విచారణ సాగినా, చివరకు వారిని వదలి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆదివా రం క్రైస్తవులు ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలి రావడం ఆనవాయితీ. దీంతో ముష్కరులు ఏదేని కుట్రలు చేసి ఉన్నారా అన్న ఉత్కంఠ, ఆందోళన తప్పలేదు. రంగంలోకి కమాండో బలగాలు... శ్రీలంకలో క్రైస్తవ ఆలయాన్ని టార్గెట్ చేసి పేలుళ్లు సాగిన దృష్ట్యా, అక్కడి నుంచి వచ్చిన తీవ్రవాదులు ఇక్కడి ఆలయాల్ని గురి పెట్టారా అన్న ఆందోళన తప్పలేదు. దీంతో కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లోని చర్చిలను వేకువజాము నుంచి పోలీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కమాండో బలగాలను సైతం రంగంలోకి దించారు. అణువణువు తనిఖీలు చేశారు. బాంబ్ స్క్వాడ్ల తనిఖీలతో పాటు ఆయా ఆలయాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అందర్నీ తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు సాగిన ప్రార్థనలు సాగడంతో అప్పటి వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా, డేగ కళ్ల నిఘాతో వ్యవహరించారు. కోయంబత్తూరు– తిరుప్పూర్ మార్గంలో అయితే, తనిఖీలు మరీ ముమ్మరం చేయడంతో వాహనచోదకులకు తంటాలు తప్పలేదు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన చర్చిలే కాదు, ఇతర ఆలయాల వద్ద సైతం తనిఖీలు సాగాయి. ప్రత్యేక భద్రతను కల్పించారు. తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా, చొరబడ్డ తీవ్రవాదుల జాడ కానరాని దృష్ట్యా, జల్లెడ పట్టే విషయంలో ఏ మాత్రం పోలీసులు తగ్గడం లేదు. అలాగే, కేరళలో పట్టుబడ్డ అబ్దుల్ వద్ద విచారణ జరిపేందుకు కోయంబత్తూరు నుంచి ప్రత్యేక బృందం బయలుదేరి వెళ్లింది. అతగాడి సాయంతోనే ఆరుగురు తీవ్రవాదులు కోయంబత్తూరులోకి ప్రవేశించి ఉండడం గమనార్హం. తుపాకీతో యువతి.. రామనాథపురంలోనూ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. తమకు అందిన సమాచారం మేరకు ఉచ్చిపులి గ్రామంలోని వినాయక ఆలయం వీధిలో ఓ ఇంటిపై పోలీసులు గురి పెట్టారు. ఆ ఇంట్లో తనిఖీలు జరపగా ఓ తుపాకీ బయటపడింది. ఆ ఇంట్లో వల్లి అనే మహిళ మాత్రమే ఉంటున్నది. విచారణలో ఆమె టైలరింగ్ చేస్తుండడమే కాకుండా, ఆమె భర్త ఓ కేసులో పుళల్ జైల్లో ఉన్నట్టు తేలింది. దీంతో వల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఉలిక్కిపడిన చిత్తూరు
చిత్తూరు రూరల్ మండలంలోని చెర్లోపల్లెలో ఆదివారం నాటు బాంబు పేలడం కలకలం రేపుతోంది. అసలు బాంబుల సంస్కృతికి చిత్తూరుకు సంబంధం లేకపోవడమే ఇందుకు కారణం. కేవలం రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన నాటుబాంబు తయారీ చిత్తూరుకు పాకడం ఇక్కడ నిఘా విభాగాల పనితీరును ప్రశ్నిస్తోంది. సాక్షి, చిత్తూరు : చిత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో ఆదివారం నాటుబాంబు పేలి సుధాకర్(35) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ మల్లికార్జున, డీఎస్పీ రామాంజనేయులు, తహసీల్దార్ చంద్రశేఖర్, తాలూకా సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి గల కారణాలపై ఆరా తీశారు. సంఘటన స్థలంలో బాంబుకు చుట్టే తాళ్లు లభ్యం కావడంతో నాటుబాంబు ద్వారానే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాలు ఎన్నో.. మృతి చెందిన సుధాకర్ తండ్రి కుమారస్వామి చిత్తూరు నగరంలోని బజారువీధిలో నాటు మందులు, ఆయుర్వేదిక్ మందులు అమ్మేవాడు. కొన్నేళ్ల కిందట ఆయన మరణించాడు. దీంతో కొంతకాలం సుధాకర్ షాపును నిర్వహిస్తూ వచ్చాడు. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఆరేళ్ల కిందట షాపును అమ్మకానికి పెట్టాడు. భార్య గుణసుందరి డ్వాక్రా గ్రూపులో రుణం తీసుకుని ఇంట్లోనే చిల్లరదుకాణం, బట్టలు షాపు పెట్టి కుటుంబానికి కొంత సాయపడుతూ వచ్చింది. అయినా ఆర్థిక కష్టాలు తొలగకపోవడంతో నాటుబాంబు తయారు చేసి క్వారీ, బండరాళ్లు కొట్టేందుకు సరఫరా చేసే పనిని ఇటీవల ప్రారంభినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాంబు పేలి మృతి చెంది ఉంటాడని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. దీంతో అధికారులు, పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. శోకసంద్రంలో.. ఓ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో గ్రామస్తులు, బంధువులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు దేవుడా.. మాకెందుకు ఈ శిక్ష అంటూ రోదించడం చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ, క్వారీలు బాగా పేరొందాయి. ఇక్కడి కొండల్లోంచి వచ్చే గ్రానైట్, క్వారీలకు పేలుడు పదార్థాలు తప్పనిసరి. అయితే ఇవి నిర్ణీత మొత్తంలో పోలీసుల అనుమతితో మాత్రమే తీసుకురావాలి. కొండల్ని పగులగొట్టేటప్పుడు జిలెటిన్ స్టిక్స్ రూపంలో వాటిని పేల్చి వేరు చేస్తుంటారు. ఇలాంటి తరుణంలో చెర్లోపల్లెలోని ఓ ఇంట్లో నాటుబాంబు పేలి వ్యక్తి మృత్యువాత పడటం సంచలనంగా మారింది. నాటుబాంబులు సీమలోని కర్నూలు, అనంతపురం, కడప ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలకే పరిమితం. కానీ చిత్తూరులో జరిగిన పేలుడు ఘటనలో నాటుబాంబులతో పాటు జిలెటిన్ స్టిక్స్ తయారీకి ఉపయోగించే పెల్లెట్స్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బడుగులే సమిధలు.. క్వారీ పరిశ్రమల్లో పేలుడు పదార్థాలు ఉపయోగించడం తప్పనిసరి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు క్వారీ యజమానులు బాంబుల తయారీ కోసం పలు గ్రామాల్లో పేదలను ఎంచుకుంటున్నారు. వీరు క్వారీల నిర్వాహకులు ఇచ్చే అడ్వాన్సులతో నకిలీ జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తయారుచేసి ఇస్తున్నారు. చిత్తూరులో జరిగిన పేలుడు వెనుక తమిళనాడులోని గుడియాత్తం, పరదరామి ప్రాంతాల నుంచి నల్లమందు, ఇతర పేలుడు పదార్థాలు తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో నగరి, పెనుమూరు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో క్వారీలను చేజిక్కించుకున్న టీడీపీ నేతలు అనధికారికంగా బడుగు బలహీన వర్గాలకు డబ్బు ఆశ చూపించి నల్లమందు, ఇతర పేలుడు పదార్థాలను తీసుకొచ్చి రహస్యంగా క్వారీలను పేల్చడానికి నాటు బాంబులు తయారు చేసేవారు. కొన్నిసార్లు ఈ పేలుళ్ల ధాటికి మహిళలకు గర్భస్రావాలవడం, పేదల ఇళ్లు ధ్వంసం కావడం లాంటి ఘటనలు గంగాధరనెల్లూరు, నగరి ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నిఘా అవసరం.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చేయాలనే సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే క్వారీలపై పోలీసుల నిఘా ఉండాల్సిందే. అసలు కొండల్ని పేల్చడానికి ఎక్కడి నుంచి జిలెటిన్ స్టిక్స్ తీసుకొస్తున్నారు..? ఎంత మొత్తం తెస్తున్నారు..? వీటిని ఎక్కడ నిల్వ ఉంచుతున్నారు..? కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారా..? అనే కోణంలో పోలీసులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. -
టీఎంసీ కార్యకర్త ఇంటిపై బాంబు దాడి
కోల్‌కతా : ఓ టీఎంసీ కార్యకర్త ఇంటిపై జరిగిన బాంబు దాడి ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ముషీరాబాద్ డోమ్‌కోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్, టీఎంసీ కార్యకర్తల మధ్య గొడవ జరగుతుండటం గమనార్హం. ఈ ఘటనలో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను సోహెల్ రాణా(19), ఖైరుద్దీన్ షేక్(55)గా గుర్తించారు. ఈ సంఘటనపై క్షతగాత్రుల కుటుంబ సభ్యులు స్పందించారు. WB:TMC workers Khairuddin Sheikh&Sohel Rana died after bomb was hurled at their house last night in Murshidabad.Milan Sheikh,Khairuddin's son says,"We were sleeping,suddenly our house was bombed.They shot my father.Few days back my uncle was also killed. Congress is behind this." pic.twitter.com/w1yw4zfKfM — ANI (@ANI) June 15, 2019 ‘ఈ దాడి వెనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మేము ఇంట్లో నిద్రపోతున్నాం. ఉన్నట్టుండి మా ఇంట్లో బాంబు పేలింది. వారు మా నాన్నను తుపాకీతో కాల్చారు’ అంటున్నాడు ఖైరుద్దీన్ షేక్ కుమారుడు. అంతేకాక కొన్ని రోజుల కిత్రం తన అంకుల్‌ను కూడా చంపేశారని తెలిపాడు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. -
కశ్మీర్లో ముగ్గురు మిలిటెంట్లు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మహ్మద్ మిలిటెంట్లు హతమయ్యారు. ఆ వెంటనే సంఘటనా స్థలంలో మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లారూ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం అందడంతో ఆదివారం భద్రతా బలగాలు అక్కడ తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ ముగిశాక భద్రతాదళాలు పాక్షికంగా అక్కడి నుంచి వెనుదిరగ్గా, పౌరులు సంఘటనాస్థలంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ మిలిటెంట్లు పెట్టిన బాంబులు పేలడంతో ఏడుగురు మృత్యువాతపడగా, పలువురు గాయాలపాలయ్యారని అధికారులు చెప్పారు. అనంతరం, భద్రతా బలగాలు, స్థానిక యువకుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులు బలప్రయోగానికి దిగడంతో పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. మరోవైపు, రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు పాకిస్తాన్ చొరబాటుదారులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు కూడా మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. -
గన్ తయారు చేసి..ఛాతిపై పెట్టుకుని..
టెక్కలి రూరల్ శ్రీకాకుళం : బీఎస్‌జేఆర్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తిరునగరి కృష్ణ దేశభక్తికి సంబంధించిన పాటకు డ్యాన్స్ చేసేందుకు తను సొంతంగా ఒక తుపాకీని తయారు చేసుకుని సిద్ధమయ్యాడు. అయితే తను డ్యాన్స్ మొదలు పెట్టేముందు తను తాయారు చేసుకున్న తుపాకీలో బాంబ్ పెట్టి తన ఛాతిపై గన్ మోపి పేల్చబోయాడు. ప్రమాదవశాత్తు బాంబ్ తన ఛాతిపై కుడివైపునకు జారి పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కృష్ణకు తీవ్రగాయాలు అవ్వడంతో హుటాహుటీన విద్యార్థులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మహరాజ్ సిటీ స్కాన్ తీసి గుండెకు దగ్గరగా కుడివైపు గాయం కావడంతో పరిస్థితి విషమంగా మారే ప్రమాదం ఉందని తెలుపుతూ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కాగా, గాయపడిన విద్యార్థిది నందిగాం మండలంలోని రౌతుపురం గ్రామం. -
ఆత్మాహుతి దాడుల్లో 27 మంది మృతి
లాగోస్ : నైజీరియాలోని ముబి పట్టణంలో రెండు ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 27 మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదటి ఆత్మాహుతి మసీదు లోపల జరిగిందని, మరో దాడి అదే మసీదుకు సమీపంలో బట్టల మార్కెట్ బయట జరిగిందని అడమావా రాష్ట్ర సమాచార కమిషనర్ అహ్మద్ సాజో పేర్కొన్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని స్థానిక అధికారి వెల్లడించారు. -
మోదీ ప్రారంభించాలనుకున్నారు.. అంతలోనే పేలుడు
కాఠ్మాండ్: నేపాల్‌లో భారత్ చేపట్టిన జలవిద్యుత్ కేంద్రం అరుణ్-3 కార్యాలయం వద్ద ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. కొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందనగా ఈ సంఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియ రాలేదని, దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. కాగా మే11న ప్రధాని మోదీ అధికారిక పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉంది. కాఠ్మాండ్కు సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని తుమ్లింగ్టర్ ప్రాంతంలో 900 మెగావాట్ల సామర్థ్యంతో అరుణ్-3 జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. 2020లో ఈ ప్రాజెక్టు వినియోగంలోకి రావాల్సి ఉంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగింది. పేలుడు కారణంగా కార్యాలయం కాంపౌడ్ వాల్ దెబ్బతిన్టటు చీఫ్ డిస్ట్రిక్ట్ అధికారి శివరాజ్ జోషి తెలిపారు. నేపాల్‌లోని భారతీయ ఆస్తులపై పేలుడు జరగడం నెల రోజుల్లో ఇది రెండోసారి. ఈనెల 17న బిరాట్నగర్లోని భారత రాయబార కార్యాలయం ఫీల్డ్ ఆఫీస్ సమీపంలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. నేపాల్‌లో భారత్ చేపట్టే అరుణ్-3 జలవిద్యుత్ కేంద్రంపై ఇరు దేశాలు 2014 నవంబర్ 25న సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశీ జలవిద్యుదుత్పత్తి రంగంలోకి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయని నేపాల్ భావించింది. -
నిగ్గు తేలని నిజం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ళ కేసులో అయిదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం దర్యాప్తు సంస్థల నిర్వాకానికి తాజా నిద ర్శనం. 2007 మే 18వ తేదీ మధ్యాహ్నం ప్రార్థన సమయంలో హైదరాబాద్ పాత బస్తీలోని మక్కామసీదులో సెల్‌ఫోన్ ద్వారా బాంబులు పేల్చడం వల్ల తొమ్మిది మంది దుర్మరణం చెందిన ఘటన పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాంబు పేలుళ్ళ తర్వాత మసీదు వెలుపల కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్ళు రువ్విన కారణంగా పోలీసులు జరిపిన కాల్పులలో అయిదుగురు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు ఇంతకాలం న్యాయం కోసం వేచి చూసి తీర్పు వివరాలు తెలు సుకొని నిరాశ చెందారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు క్రమంలో సుమారు రెండు వందలమంది అనుమా నితులను ప్రశ్నించారు. వారిలో అత్యధికులు ముస్లింలు. ప్రథమంగా బిలాల్ అనే ఉగ్రవాదిని పేలుళ్ళకు సూత్రధారిగా అనుమానించారు. పాకిస్తాన్లో స్థావరం కలిగిన ఉగ్రవాద సంస్థ హర్కత్–ఉల్–జిహాద్–ఇ–ఇస్లామీ (హెచ్యూజేఐ)లో బిలాల్ సభ్యుడని దర్యాప్తు అధికారులు భావించారు. కానీ అనుమానాన్ని ధ్రువీక రించడానికి తగిన ఆధారాలు లభించలేదు. న్యాయస్థానం బిలాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అనంతరం దర్యాప్తు చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అద నపు సమాచారం అందింది. 2006–07లో మక్కామసీదుతో పాటు మరో మూడు ప్రాంతాలలో సెల్‌ఫోన్ ద్వారా జరిపిన పేలుళ్ళు సంభవించాయి. మహారాష్ట్రలోని మాలేగాంలో 2006లో పేలుళ్ళు జరిగాయి. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లోనూ, అజ్మీర్ దర్గాలోనూ 2007లో అదే ఫక్కీలో బాంబులు పేలాయి. ఈ ఘాతుకాల వెనుక ఒకే సంస్థ ఉన్నదనే అభిప్రాయానికి వచ్చిన సీబీఐ ఆ దిశగా దర్యాప్తు కొనసాగించింది. ‘అభినవ్ భారత్’ అనే హిందూ తీవ్రవాద సంస్థ ఈ నేరం చేసినట్టు గుర్తించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దేవేందర్‌సింగ్, వ్యాపారి లోకేశ్ శర్మ, ఆయన గురువు సునీల్ జోషీలు మక్కామసీదు కాల్పుల వెనుక ఉన్నారని నిర్ధారించింది. ‘అభినవ్ భారత్’ మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూత్వవాదులు ఇండోర్ కేంద్రంగా నడుపుతున్న సంస్థ అని సీబీఐ అభిప్రాయం. దర్యాప్తు అధికారులు ప్రశ్నించే అవకాశం లేకుండానే అనూహ్యమైన పరిస్థితులలో సునీల్ జోషీని మధ్యప్రదేశ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సీబీఐ మొత్తం 68 మంది సాక్షులను విచారించగా వారిలో 54 మంది ఎదురు తిరిగారు. ఈ దశలో నాలుగు పేలుళ్ళ కేసుల దర్యాప్తు బాధ్య తను సీబీఐ నుంచి ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ–జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించారు. ఈ సంస్థ చేసిన దర్యాప్తులో అసీమానంద అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త, గుజరాత్ ఆశ్రమ నివాసి ప్రధాన నిందితుడని తేలింది. ఆయనతో పాటు మరి పదిమందిపై అభియోగాలు చేశారు. 2017 మార్చిలో దేవేందర్ గుప్తాను అజ్మీర్ దర్గా పేలుళ్ళ కేసులో దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో అసీమానందను నిర్దోషిగా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. కానీ మక్కామసీదు కేసులో మాత్రం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అయిదుగురిని మాత్రమే విచారించి మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. వారిపైన ఎన్ఐఏ చేసిన అభియోగా లను నిరూపించేందుకు తగిన ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేకపోయిం దని భావించిన 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె. దేవేందర్‌రెడ్డి అయిదు గురినీ నిర్దోషులుగా ప్రకటించారు. నిందితుడైన దేవేందర్ గుప్తా సిమ్ కొన్నట్టు కానీ, మరో నిందితుడు రాజేందర్ చౌదరి బాంబు పేల్చినట్టు కానీ రుజువులు లేవని జడ్జి నిర్ణయించారు. ఇంతటి కీలకమైన కేసులో తీర్పు చెప్పిన వెంటనే రాజీనామా లేఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్‌కు పంపించి జడ్జి రవీందర్‌రెడ్డి సంచలనం కలిగించారు. రాజీనామాకు దారితీసిన కారణాలపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జడ్జిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ సారథ్యంలోనైనా దర్యాప్తు వేగం, సామర్థ్యం పెంచి దోషులను పట్టు కొని, తగిన ఆధారాలు సేకరించి, శిక్ష పడేవిధంగా ప్రాసిక్యూషన్ వాదించి ఉంటే దర్యాప్తు సంస్థ మోపిన అభియోగాలు నిజమని నిర్ధారణ జరిగేది. సీబీఐ కానీ ఎన్ఐఏ కానీ నిందితులపైన పెట్టిన కేసులలో వీగిపోయినవే అత్యధికం. ఎన్ఐఏ డైరెక్టర్‌గా శరద్ కుమార్ సేవలను పొడిగించడం ఒక వివాదాస్పదమైన అంశం. అసీమానం దకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టులో అప్పీలు చేయాలని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఎన్ఐఏ అధికారులు కేంద్ర కార్యాలయానికి సిఫార్సు చేసినప్పటికే ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళ కేసులో అసీమానందకు బెయిల్ మంజూరైనప్పుడు కూడా ఎన్ఐఏ పైకోర్టులో అప్పీలు చేయలేదు. ఈ కేసులో ఇంద్రేశ్ కుమార్, ప్రజ్ఞాఠాకూర్ వంటి చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులకు మిన హాయింపు మంజూరు చేశారు. అసీమానంద స్వయంగా మక్కామసీదు పేలుళ్ళను ఎట్లా జరిపారో వివరంగా న్యాయస్థానంలోనూ, మీడియా ఇంటర్వ్యూలలోనూ చెప్పారు. నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా అసీమానందను నిర్దోషిగా కోర్టు నిర్ణయించడం విశేషం. 2010 డిసెంబర్ 8న అసీమానంద కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట నేరం అంగీకరించారు. ‘నాకు మరణదండన విధించే అవకాశం ఉన్నదని నాకు తెలుసు. అయినా సరే నేరం అంగీకరిస్తూ ప్రకటన చేయదలిచాను’ అంటూ మాట్లాడారు. పోలీసు కస్టడీలో తీసుకున్న నేరాంగీకార వాంగ్మూలం చెల్లనేరదని జడ్జి రవీందర్‌రెడ్డి నిర్ణయించారు. ఈ కేసులో తీర్పుపైన బీజేపీ ఆనందం వెలిబుచ్చింది. కర్ణాటక ఎన్నికల ముందు ఇటువంటి తీర్పు రావడం రాజకీయంగా బీజేపీకి సాను కూలమైన పరిణామం. దేశంలో దర్యాప్తు సంస్థలు ఏ స్థాయిలో ఉన్నా ఏ పేరుమీద ఉన్నా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితులు లేవనే వాస్తవాన్ని చాలాకాలం క్రితమే ప్రజలు అర్థం చేసుకున్నారు. న్యాయ వ్యవస్థ సైతం అంత నిజాయితీగా, నిర్భయంగా విధ్యుక్తధర్మం నెరవేర్చడం లేదనడానికి హైదరాబాద్‌లో ఒకే ఒక నెలలో అవినీతి ఆరో పణలపైన ముగ్గురు జడ్జీలు అరెస్టు కావడం నిదర్శనం. పదకొండు సంవత్సరాల పాటు దర్యాప్తూ, విచారణా జరిగినప్పటికీ మక్కామసీదులో ఆనాడు పేలుళ్ళు జరిపిన వ్యక్తులు ఎవ్వరనే శేషప్రశ్న జాతిని వెక్కిరిస్తూనే, వేధిస్తూనే ఉంటుంది. -
సరిగ్గా ఇదే రోజు.. ముంబై ఉలిక్కిపడింది
సాక్షి, ముంబై : సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో బాంబుల మోత మోగింది. ఒకటి కాదు రెందు కాదు వరుసగా 12 బాంబు పేలుళ్లతో ముంబై వణికిపోయింది. అన్యం పుణ్యం ఎరుగని 257 మందిని బలితీసుకుంటూ.. 700 మందికి పైగా గాయపర్చిన ఆ మారణహోమానికి నేటితో పాతికేళ్లు నిండాయి. 1993 మార్చి 12న ముంబై నగరంలో ముష్కర మూకలు నరమేధం సృష్టించాయి. దీనికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మూల కారకుడని పోలీసులు నిర్ధారించారు. బాబ్రీ మసీదు కుల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్డీఎక్స్ను ఉపయోగించిన దాడి ఇదే. అయితే ఈ దాడులకు సంబంధించి టాడా కోర్టు 2007లో తొలి దశ విచారణ చేపట్టింది. అబూసలెం, ముస్తాఫా, కరిముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ మర్చంట్, అబ్దుల్ ఖయ్యుంలను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ తర్వాత అబ్దుల్ ఖయ్యుంను నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. మళ్లీ 2012లో కేసు విచారించి ప్రధాన నిందితుడు యాకుబ్ మెమెన్‌కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2015 జులై 30న యాకుబ్‌ను ఉరితీశారు. బ్లాస్టింగ్స్ జరిగిన ప్రదేశాలు మహిమ్ మార్గంలోని మత్స్యకారుల కాలనీ జవేరి బజార్ ప్లాజా సినిమా సెంచరీ బజార్ కథా బజార్ హోటల్ సీ రాక్ సహార్ విమానాశ్రయం (ప్రస్తుత ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం) ఎయిర్ ఇండియా భవనం హోటల్ జుహు సెంటౌర్ వర్లి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం పాస్ పోర్ట్ కార్యాలయం మసీదు-మండవి కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచ్ -
పెళ్లి గిఫ్ట్ ప్యాక్‌లో బాంబు!
భువనేశ్వర్: వివాహం సందర్భంగా వచ్చిన ఓ కానుక.. వరుడు, అతని నాయనమ్మ ప్రాణాలు బలిగొన్నాయి. ఈ ఘటనలో నవవధువుకు తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 21న వివాహ విందు సమయంలో నవదంపతులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ కానుక వచ్చింది. ఇంటికొచ్చాక దీన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తుండగానే అందులోని బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ తీవ్రతకు అక్కడే ఉన్న వరుడి నాయనమ్మ ఘటనాస్థలంలోనే చనిపోగా.. వధువు, వరుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రూర్కేలా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం వరుడు కన్నుమూయగా.. వధువు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. వివరాలు, సాక్ష్యాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
మెటార్‌సైకిల్ బాంబు పేలి ముగ్గురు మృతి
బ్యాంకాక్: మోటార్ సైకిల్ బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో 19మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న తిరుగుబాటుదారుల ప్రాంతమైన యాలా పట్టణంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డౌన్‌టౌన్‌లోని పంది మాంసం అమ్మే ఓ దుకాణం ముందు మోటార్ సైకిల్‌ను పార్కు చేసి ఉంచారని, అందులోని బాంబులు పేలడంతో ముగ్గురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందట ఇలాంటి సంఘటనే మొదటగా మెజారిటీ ముస్లింలు నివసించే ప్రాంతంలో జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
పేలుళ్ల కలకలం!
కొత్తూరు : కొత్తూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం పేలుళ్ల కలకలం రేగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో పరిసర ప్రజలతో పాటు విధుల్లో ఉన్న పోలీసులు పరుగులు తీశారు. దీంతో ఏం జరిగిందో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పేలుళ్లతో దట్టమైన పొగలు కమ్మేయడం ఏం జరిగిందో తెలియక అందరూ భయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే...పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో పలు కేసులకు సంబంధించిన బాణాసంచా నిల్వలు పోలీసులు దాచిపెట్టారు. నిల్వలు బయటకు తీయకుండా ఇటీవల క్వార్టర్స్ భవనాలను తొలగించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో గోడ శిథిలాలు చెదరడంతో బాణాసంచా ఒక్కసారి పేలినట్టు ఎస్ఐ విజయకుమార్ చెప్పారు. స్టేషన్ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్నందున భారీ శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. స్టేషన్ పరిసరాల్లో ఏం జరిగిందో తెలియక పరుగులు తీసిన స్థానికులు తరువాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు వందలాదిగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా పేలిన శబ్దం బాణాసంచా కంటే ఎక్కువ వచ్చినట్టు స్థానికులు తెలిపారు. జేసీబీతో శిథిల పోలీసు క్వార్టర్స్‌ను తొలగించినపుడు పేలని సామగ్రి వర్షాలు కురుస్తున్న సమయంలో పేలడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏదిఏమైనా పేలుళ్ల వల్ల ఎటువంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ఇంఫాల్‌లో బాంబుపేలుడు, ఇద్దరికి గాయాలు
ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలిన ఘటనలో రెండేళ్ల పాప, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. రాజ్‌భవన్‌కు సమీపంలో స్టేట్ మ్యూజియం వద్ద ఈ బాంబుపేలుడు సంభవించినట్టు అధికారులు చెప్పారు. అక్కడ పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని మణిపూర్ వ్యాప్తంగా పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను పటిష్టంచేశారు. -
పాపాయపాలెంలో..బాంబు పేలుళ్లు
♦ పాడుబడిన గృహంలో దాచిన వైనం... ♦ గుంటూరులో ఉంటున్న గృహ యజమాని ♦ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు బెల్లంకొండ : పాడుపడిన ఇంట్లో దాచిపెట్టిన నాటుబాంబులు పేలిన సంఘటన బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దిగ రామిరెడ్డి గృహంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు దాచి పెట్టగా అవి ఎండలకు పేలాయి. రామిరెడ్డి ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి గుంటూరులో నివాసం ఉంటున్నారని సీఐ తెలిపారు. సంఘటన జరిగిన గృహంలో ప్రస్తుతం ఎవరూ నివాసం ఉండటంలేదని, ఐదు నుంచి ఆరు బాంబులు పేలాయని, పలు మారణాయుధాలు కూడా అక్కడ ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇంతకీ ఈ బాంబులు ఎవరివి...? గ్రామంలో గత సంవత్సరం నుంచి వర్గవిభేదాలతో గొడవలు, కొట్లాటలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం బాంబు పేలుళ్లు సంచలనం కలిగించాయి. మద్దిగ రామిరెడ్డి గత ఏడాది హత్యకు గురైన సింగరెడ్డి వెంకటరామిరెడ్డి సమీప బంధువు కావడంతో ఆ బాంబులు తెలుగుదేశం పార్టీ వారివేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆరోపిస్తున్నారు. తాము హత్యకేసులో వాయిదాకు వెళ్లి తిరిగి వస్తుండగా తమపై బాంబులు విసిరారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తెలుగుదేశం పార్టీకి చెందిన వారి వద్ద ఇంకా బాంబులు ఉన్నాయని తాము ఎన్నోసార్లు పోలీసులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపించారు. కాగా వారు మాత్రం ఇది వైఎస్సార్సీపీ కార్యకర్తల పనేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దేశం అరాచకాలకు మళ్లీ కాళ్లు ! సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. కొందరిని మట్టుబెట్టగా, మరికొందరిని త్రీవంగా గాయపరిచి గ్రామాల్లో భయాం దోళన సృష్టించిన సంఘటనలు నేటికీ కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఐదు నెలలుగా జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని భావిస్తున్న తరుణంలో, ఇద్దరు ఎస్పీలు బదిలీ కావడం టీడీపీ అరాచకాలకు మళ్లీ కాళ్లు వచ్చినట్టయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్ని దాడులు చేసినా కనీసం కేసులు నమోదుకు సైతం పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. జిల్లాలో నిత్యం చోటుచేసుకుంటున్న టీడీపీ అరాచక పర్వంలో కొన్ని సంఘటనలు... బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో జనవరి 22న కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనంపై బాంబులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. గ్రామ నడిబొడ్డున అంతా చూస్తుండగానే అధికార పార్టీకి చెందిన నాయకులు బాంబులు విసురుతూ భయాందోళన సృష్టించారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం, మిగతావారిని బైండోవర్ చేయడం గమనార్హం. ఈ సంఘటన మరుకవముందే గురువారం అదే గ్రామంలోని టీడీపీ నాయకుడి ఇంటిలో ఉంచిన రెండు బాంబులు పేలడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా బాంబుల సంస్కృతికి దూరంగా ఉన్నప్పటికీ పాపాయపాలెం గ్రామంలో రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగినా పోలీసులు చోద్యం చూస్తూనే ఉన్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంగ్రామంలో సర్పంచ్, మాజీ సర్పంచ్‌తోపాటు మరో నలుగురిపై కారం చల్లి రాడ్డులు, గడ్డపలుగులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామస్తుల సహాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోకుండా పంపి వేశారని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేర్చగా, గురువారం మధ్యాహ్నం వరకు ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు ఎవరూ రాకపోవడంతో డయల్ 100కు ఫోన్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఓ కానిస్టేబుల్ వచ్చి ఫిర్యాదు స్వీకరించినట్లు తెలిసింది. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. తలలు పగిలి నెత్తురోడుతున్న స్థితిలో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు కూడా పోలీసులు ముందుకు రావడం లేదంటే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నరసరావుపేట పట్టణంలోని జీసీవీ చానల్ కార్యాలయంపై కొద్ది రోజుల కిందట అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత అనుచరులు దాడులు చేసి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే కేబుల్ వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా, ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనించదగ్గ విషయం. ఇలా జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు అంతులేకుండా పోతోంది. -
మందుపాతరకు ఏడుగురు పోలీసుల బలి
బీహార్‌లో మావోయిస్టుల ఘాతుకం ఔరంగాబాద్/పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. ఔరంగాబాద్ జిల్లాలోని చంద్రాగఢ్ మోరె (సర్కిల్) సమీపంలో తాండ్వా-నబీనగర్ రోడ్డుపై మంగళవారం సాయంత్రం పోలీసు జీపును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో తాండ్వా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి అజయ్ కుమార్ సహా ఏడుగురు పోలీసులు మృతిచెందారు. నబీనగర్లోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సమావేశానికి హాజరై పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఈ దాడికి తెగబడినట్లు అదనపు డీజీపీ (హెడ్‌క్వార్టర్స్) రవీంద్ర కుమార్ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్పెషల్ ఆక్సిలరీ పోలీసు విభాగానికి చెందిన వారితోపాటు జీపు డ్రైవర్ అయిన హోంగార్డు కూడా ఉన్నట్లు చెప్పారు. పేలుడు అనంతరం ఘటనాస్థలి వద్ద పోలీసులకు చెందిన ఐదు రైఫిళ్లు కనిపించాయన్నారు. మావోయిస్టుల దాడి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్.కె. భరద్వాజ్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. జార్ఖండ్‌లోని పాలము జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఔరంగాబాద్ జిల్లా మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డగా ఉంటోంది. 21 మంది మావోయిస్టుల ఆస్తులు అటాచ్ దేశంలోనే తొలిసారిగా బీహార్‌లో 21 మంది మావోయిస్టులకు చెందిన స్థిరచరాస్తులను నితీశ్ సర్కారు మంగళవారం అటాచ్ చేసింది. ఇందుకు సంబంధించి అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు 39 కేసులు సిద్ధం చేయగా ప్రభుత్వం 21 కేసుల్లో అటాచ్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్‌జీ భార్యకు చెందిన రూ. 25 లక్షల విలువైన స్థలం కూడా ఈ జాబితాలో ఉంది. -
ఉగ్రవాది 'యాసిన్ భత్కల్'ను ఉరితీయాలి
బాంబుపేలుళ్లతో ఎందరికో ప్రత్యక్ష నరకం చూపించిన ఉగ్రవాది యాసిన్ భత్కల్. అతడు పోలీసులకు పట్టుబడ్డాడనగానే ఆనాటి బాధితుల్లో ఎంతో ఆనందం. తీవ్రవాదిని టీవీల్లో చూపిస్తుంటే అతడిని అక్కడికక్కడే ఉరితీయించాలన్న ఆక్రోషం... ఆవేదన. తాము అనుభవిస్తున్న క్షోభకు అంతకంతకు ఆ తీవ్రవాది కూడా అనుభవించాలని, మరో ఘటనకు పాల్పడాలనే ఆలోచనే మరొకరికి రాకుండా అతడిని శిక్షించాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న రాత్రి హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లలో జిల్లాకు చెందిన పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఎందరో క్షతగాత్రులయ్యారు. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. ఆ సంఘటన తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. క్షతగాత్రులు ఇంకా కోలుకోలేదు. యాసిన్ భత్కల్ అరెస్టు సందర్భంగా ఆనాటి బాధితులను ‘న్యూస్‌లైన్’ పలకరించింది. భత్కల్ను బతకనీయొద్దని, అతడిని వెంటనే ఉరి తీసి చంపాలని వారు డిమాండ్ చేశారు. నరకం సూపియ్యాలి నా కొడుకు తిరుపతిని చంపిన భత్కల్‌కు చావులో నరకం చూపించాలి. ఒక్కరోజులోనే వాన్ని సంపొద్దు. మా బిడ్డను అన్యాయంగా సంపేసిండు. వాన్ని సంపుతుంటే ప్రతీ కన్నతల్లి కడుపుకోత అర్థం కావాలె. ఆ రాక్షసుడు ఎంతమంది ఉసురుపోసుకున్నడో. బాంబుపేలుళ్ల చనిపోయినోళ్లను టీవీలల్ల ఎట్ల సూపిచ్చిండ్లో భత్కల్ నరకం అనుభవించేది కూడా టీవీలల్ల సూపియ్యాలె. టీవీలల్ల వాన్ని సూత్తంటే కోపం ఆగుతలేదు. కడుపు రగుల్తంది. అన్యాయంగా మా బిడ్డను, వాడి దోస్తు రవిని పొట్టన బెట్టుకున్నడు. ఆనాటి ఘటన తల్సుకుంటేనే గుండె పగుల్తది. సావంటే ఎట్లుంటదో నరకం వానికి చూపియ్యాలె. అప్పుడే బాంబుదాడిలో సనిపోయినోళ్ల ఆత్మకు శాంతి. - గుంట తిరుపతి తల్లిదండ్రులు భీమయ్య-రాజమ్మ, పరుశరామ్నగర్, గోదావరిఖని వణుకు పుట్టించాలి మా తమ్ముడి ప్రాణాలు బలితీసుక్ను యాసిన్ భత్కల్ చావు అతి భయంకరంగా ఉండాలె. ఇంకొకరు దేశంపై దాడి చేయాలనే ఆలోచన రావడానికే వణుకు పుట్టించాలె. భత్కల్ను పట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆ క్రూరుడి నుంచి పోలీసులు మరింత సమాచారం రాబట్టాలె. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లలాంటివి మళ్ల జరగకుంట ముందుగానే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసుకోవాలె. టీవీలల్ల భత్కల్ను సూపిత్తంటే ఇంట్లో అమ్మా నాన్న అన్నం తింటలేరు. కోపంతో రగిలిపోతున్నరు. తమ్ముడు చావు ఇంట్లో అందరినీ కుదిపేసింది. - తిరుపతి సోదరుడు మల్లేశ్ భత్కల్ను ఉరిదియ్యాలె నా బిడ్డ అమృత రవిని వాడు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నడు. వాన్ని(యాసిన్ భత్కల్)ను ఉరితీసి చంపాలి. నాకు ఏ చిన్న కట్టం వచ్చినా దగ్గరుండి సూసుకునేటోడు. కొడుకు సచ్చిపోయినప్పటి నుంచి కంటి నిండా నిద్ర కూడా పడుతలేదు. అలాంటి కొడుకే లేని జీవితం ఎందుకనిపిత్తంది. చిన్నప్పుడే వాని తండ్రి సచ్చిపోతే అన్నీ నేనే అయిన. ఓ సారి నాకు దెబ్బ తగిలి బొక్కలిరిగితే నాకు ఎంతో సేవ చేసిండు. నేను మళ్ల మంచిగ నడిసేదాక నన్ను ఇడిసిపెట్టి పోలె. అట్లాంటోన్ని ఎట్ల మర్సిపోవాలె. ఉద్యోగం సంపాదించుకుంట అని చదువుకునేటందుకు హైదరాబాద్ పోయిండు. నా కొడుకు ఏం అన్యాయం చేసిండని వాడు పొట్టనబెట్టుకుండు. నా కొడుకును సంపినోన్ని ఈ భూమ్మీద ఉంచద్దు. నాకు పెద్ద దిక్కు లేకుండా చేసినోన్ని బతకనీయొద్దు. - రవి తల్లి లక్ష్మి, బేగంపేట్, - న్యూస్‌లైన్, సెంటిన రీకాలనీ (యైటింక్లయిన్‌కాలనీ) ఆ రోజు మర్చిపోలేకపోతున్నా.. ఆ రోజును మర్చిపోలేకపోతున్నా. ఆ రోజు నా పుట్టినరోజు. ఇంజినీరింగ్ చదువుతున్న నేను వేడుకలు జరుపుకుందామని ట్యుటోరియల్ నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా బాంబు పేలింది. నా కాళ్లు, చేతులు, కళ్లకు బలమైన గాయాలయ్యాయి. ఇప్పటికి కూడా కోలుకోలేకవైద్యం చేయించుకుంటున్నా. నా ఆస్పత్రి ఖర్చుల కోసం మా నాన్న మల్లారెడ్డి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఏడుపస్తంది. ఇప్పటికే రూ.లక్షకుపైగా ఖర్చయినయ్. గాయపడ్డవారికి ప్రభుత్వం సాయం చేస్తానంది. నాకు ఇప్పటిదాకా ఏ సాయం అందలె. గాయాలతో నా చదువు కూడా చక్కగా సాగడం లేదు. క్లాసులకు పోతున్నా. ఇప్పటికి కూడా కుడిచేయిలో నొప్పి తీవ్రం గా వస్తంది. రెటీనా దెబ్బతిని చూపు మందగించింది. ఎంపీ పొన్నం, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నన్ను పరామర్శించారు. వారి పరామర్శ కంటే భత్కల్ను ఉరితీస్తే ఎక్కువ సంతోష పడు త. భత్కల్ను పట్టుకున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతో మం దిని బలిగొన్న ఇలాంటి క్రూరులను కఠినంగా శిక్షించాలి. మరోసారి ఇలాంటి పనిచేయొద్దని భయపెట్టేలా ఈ శిక్షలుండాలె. - పత్తి మానస, ఇంజినీరింగ్ విద్యార్థి, రాజపల్లి, - న్యూస్‌లైన్, హుజూరాబాద్ రూరల్