గృహంలో బాంబు పేలుడు.. భారీగా ఎగిసిన మంటలు.. వీడియో వైరల్.. | House Exploded In US That Killed 5 And Injured 3 | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు.. భారీగా ఎగిసిన మంటలు.. భీతికొల్పుతున్న దృశ్యాలు..

Published Tue, Aug 15 2023 7:34 PM | Last Updated on Tue, Aug 15 2023 9:18 PM

House Exploded In US That Killed 5 And Injured 3 - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో దారుణం జరిగింది. పిట్స్‌బర్గ్‌లో బాంబు పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి.

పిట్స్‌బర్గ్‌లో పగటిపూటనే బాంబు పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరిగింది. అదే సమయంలో పేలుడుకు పక్కనే ఉన్న నలుగురు యువకులు ఓ చిన్నారి మంటల్లో కాలి మృతి చెందారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ఇంటి శిథిలాలు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ఇంటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 

పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.   

ఇదీ చదవండి: రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement