పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరగడంతో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు.
దీంతో సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్‌లు, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఐతే బలూచిస్తాన్ పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందంటూ బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం.
(చదవండి: 30 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసు మిస్టరీ..క్లోజ్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment