sucide bomb attack
-
Sucide Bomb Attack In Pakistan: తొమ్మిది మంది పోలీసులు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరగడంతో సుమారు తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి అనే నగరంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ మోటర్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు. దీంతో సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకుని సహయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఐతే బలూచిస్తాన్ పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడి చేస్తుందంటూ బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం. (చదవండి: 30 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసు మిస్టరీ..క్లోజ్ చేస్తుండగా ఊహించని ట్విస్ట్!) -
భారత్‌పై రివైంజ్ కోసమే ఆత్మాహుతి దాడి ప్లాన్
భారత్‌లో కీలక నేతపై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ప్లాన్ చేస్తున్నట్లు రష్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రష్యా బలగాల అదుపులో ఉన్న ఐఎస్ ఉగ్రవాది తామెందుకు ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశామో ఒక వీడియోలో వివరించాడు. ప్రవక్తను అవమానించినందుకు గానూ ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు భారతదేశ పాలక వర్గాలకు చెందిన ప్రతినిధుల్లో ఒకరిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలిపాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తిగా రష్యా పేర్కొంది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు టర్కీలో ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అతన్ని ఐఎస్ నాయకులలో ఒకరు ఆత్మాహుతి బాంబర్‌గా నియమించారని, ఇస్తాంబుల్‌లోని వ్యక్తిగత సమావేశాల్లో అతన్ని రిమోట్‌గా ప్రాసెస్ చేస్తారని తెలిపింది. ఈ మేరకు ఆ ఉగ్రవాదిని రష్యాలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) నిషేధించిన ఐఎస్ ఉగ్రవాది సభ్యుడిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్!) -
తీవ్ర మానసిక క్షోభతోనే మహంత్ గిరి ఆత్మహత్య
న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖాడా పరిషత్ దివంగత అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు అతని మాజీ శిష్యుల బెదిరింపులు, వేధింపులే కారణమని సీబీఐ పేర్కొంది. మాజీ శిష్యులైన ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, అతని కొడుకు సందీప్ తివారీల చేతిలో అవమానాలను భరించలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని సీబీఐ తన చార్జిషీటులో తెలిపింది. ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నప్పటికీ వీడియోను బహిర్గతం చేస్తానంటూ ఆనంద్ గిరి తనను బెదిరించినట్లు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు మహంత్ నరేంద్ర గిరి ఆరోపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో తమకు లభ్యమైందని సీబీఐ తెలిపింది. అలహాబాద్‌లోని బడే హనుమాన్ మందిర్ పూజారి ఆనంద్ గిరి, ఆధ్యప్రసాద్ తివారీ, సందీప్ తివారీలు మహంత్ బలన్మరణం కేసులో ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్రలో నిందితులుగా పేర్కొంటూ ఈ నెల 20వ తేదీన కోర్టుకు సీబీఐ చార్జిషీటు సమర్పించిందని అధికారులు వెల్లడించారు. అలహాబాద్‌లోని బాఘంబరీ మఠంలోని తన గదిలో సెప్టెంబర్ 20వ తేదీన మహంత్ గిరి ఉరికి వేలాడుతుండగా గమనించి శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
కూరగాయల మార్కెట్ వద్ద భారీ పేలుడు
-
కూరగాయల మార్కెట్ వద్ద భారీ పేలుడు
- 11 మంది దుర్మరణం, 35 మందికి తీవ్రగాయాలు - బాగ్దాద్‌లో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలో మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. అక్కడి ప్రధాన కూరగాయ మార్కెట్‌పై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం 11 మంది దుర్మరణం చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రతాదళం అధికారి చెప్పిన వివరాల ప్రకారం.. సదర్ నగరంలోని జమీలా మార్కెట్ ప్రధాన గేటు వద్ద ఈ సంఘటన జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన కారును నడుపుకుంటూ ఉగ్రవాది.. మార్కెట్‌లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై, కారు ఆపాల్సిందిగా హెచ్చరించాడు. ఎంతకీ వినకపోవడంతో కారుకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. అంతలోనే కారులో ఉన్న ఉగ్రవాది తననుతాను పేల్చేసుకున్నాడు. భారీ శబ్ధం, దుమ్ము ఎగిసిపడటంతో కొద్ది నిమిషాలపాటు అక్కడ అల్లకల్లోల పరిస్థితి తలెత్తింది. పేలుడు ధాటికి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. షియాలు అధికంగా నివసించే సదర్ ప్రాంతంలో కొత్త సంవత్సరంలో చోటుచేసుకున్న రెండో దాడి ఇది. జనవరి 2న ఇదే పట్టణంలో ఐసిస్ జరిపిన పేలుళ్లలో 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నేటి ఘటనకు బాధ్యతవహిస్తున్నట్లు ఎవ్వరూ ప్రకటించనప్పటికీ, ఇది ముమ్మాటికి సున్నీ తీవ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.