జైపూర్: రాజస్తాన్ పెళ్లి వేడుకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివాహ విందు కోసం వంటలు తయారు చేస్తుండగా.. రెండు గ్యాస్ సిలిండర్‌లలో గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించింది. దీంతో ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, సుమారు 60 మంది దాక గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుంగ్రా గ్రామంలో చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి పెళ్లి జరుగుతున్న ఇంటిలోని ఓ భాగం కుప్పకూలింది. ఇది చాలా తీవ్ర స్థాయిలో చోటు చేసుకున్న పేలుడుగా అధికారులు పేర్కొన్నారు. గాయపడిన 50 మందిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నాట్లు వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. అలాగే రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ఈ రోజు సాయంత్రం ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment