Gas cylinder exploded
-
విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయనగరం: లక్కవరపు కోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉదయం టీ కాచుకునే సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి రణస్థలం: మండలంలోని పైడిభీమవరం ఏపీటోరియా (అరబిందో) పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ఎలక్ట్రీషియన్ మహంతి బాలకృష్ణ(34) విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానిక కార్మికులు, సీఐటీయూ నాయకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటోరియా పరిశ్రమలోని కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ శనివారం ఉదయం 9 గంటలకు జనరల్ షిఫ్ట్‌కు వెళ్లాడు. ఫెన్సిలిన్ ఫ్లాంట్ ప్రొడెక్షన్ బ్లాక్–1లో బ్లూవేర్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు, యాజమాన్యం సహకారంతో పరిశ్రమ అంబులెన్స్‌లో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపంచనామా నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస. చదవండి: వివాహేతర సంబంధం..‘నిత్యా, నా భర్తను వదిలేయ్’ -
పెళ్లింట విషాదం.. గ్యాస్ బండ పేలి ఐదుగురి మృతి
జైపూర్: రాజస్తాన్ పెళ్లి వేడుకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివాహ విందు కోసం వంటలు తయారు చేస్తుండగా.. రెండు గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ లీక్ అయ్యి పేలుడు సంభవించింది. దీంతో ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, సుమారు 60 మంది దాక గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుంగ్రా గ్రామంలో చోటుచేసుకుంది. పేలుడు ధాటికి పెళ్లి జరుగుతున్న ఇంటిలోని ఓ భాగం కుప్పకూలింది. ఇది చాలా తీవ్ర స్థాయిలో చోటు చేసుకున్న పేలుడుగా అధికారులు పేర్కొన్నారు. గాయపడిన 50 మందిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నాట్లు వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు గుప్తా తెలిపారు. అలాగే రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ఈ రోజు సాయంత్రం ఆస్పత్రిలో గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: కన్న తల్లే కర్కశంగా..చిన్నారులపై పెట్రోల్ పోసి..) -
కుప్పంలో పేలుడు.. ఇద్దరు మృతి
సాక్షి, కుప్పం(చిత్తూరు): చిత్తూరు జిల్లా కుప్పం మండల తంబీగానిపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన.. పలువురి కుటుంబాల్లో విషాదన్ని నింపింది. ఆదివారం ఉదయం తంబీగానిపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు ఆక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబీగానిపల్లిలోని ఓ వెల్డింగ్ షాప్‌లో ఓ వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యయి. పేలుడు సంభవించగానే స్థానికులు భయంతో పరుగుల తీశారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో చాలా రోజులు వెల్డింగ్ షాప్ తీయకపోవడం, ఈ క్రమంలోనే అక్కడ ఉన్న గ్యాస్ లీకవ్వడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లాక్డౌన్ తర్వాత పలు దుకాణాలు తెరిచేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
సినీనటుడు నరేష్ ఇంట్లో పేలిన గ్యాస్ సిలెండర్!
హిందూపురం: సినీనటుడు నరేష్ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలింది. మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం నుంచి నరేష్ భార్య రమ్య, అత్త, మరదలు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఇంట్లోని 5 కిలోల గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో నరేష్ భార్య, అత్త మేడపైన గదిలో ఉన్నారు.