విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌ | Gas Cylinder Exploded In Vizianagaram District | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్‌ సిలిండర్‌

Published Sun, Nov 19 2023 8:38 AM | Last Updated on Sun, Nov 19 2023 8:53 AM

Gas Cylinder Exploded In Vizianagaram District - Sakshi

సాక్షి, విజయనగరం: లక్కవరపు కోట గవరవీధిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉదయం టీ కాచుకునే సమయంలో ఘటన జరిగింది.

విద్యుత్‌ షాక్‌తో ఎలక్ట్రీషియన్‌ మృతి
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం ఏపీటోరియా (అరబిందో) పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ఎలక్ట్రీషియన్‌ మహంతి బాలకృష్ణ(34) విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానిక కార్మికులు, సీఐటీయూ నాయకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటోరియా పరిశ్రమలోని కాంట్రాక్టర్‌ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ శనివారం ఉదయం 9 గంటలకు జనరల్‌ షిఫ్ట్‌కు వెళ్లాడు.

ఫెన్సిలిన్‌ ఫ్లాంట్‌ ప్రొడెక్షన్‌ బ్లాక్‌–1లో బ్లూవేర్‌ రూంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు, యాజమాన్యం సహకారంతో పరిశ్రమ అంబులెన్స్‌లో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపంచనామా నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస.
చదవండి: వివాహేతర సంబంధం..‘నిత్యా, నా భర్తను వదిలేయ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement