కోనమసివానిపాలెం
సాక్షి, లక్కవరపుకోట(విజయనగరం): ఆ గ్రామం పేరు కోనమసివానిపాలెం. అది రెండు పంచాయితీల పరిధిలో ఉంది. అంతేనా... మండలాలు కూడా వేర్వేరే. ఇద్దరు అన్నదమ్ములుంటే ఇద్దరూ వేర్వేరు మండలానికి చెందుతున్నారు. నలభై ఏళ్లుగా ఈ సమస్య అక్కడివారిని వేధిస్తోంది. గ్రామంలో సుమారు 2500 జనాభా, 5వందల ఇళ్లు ఉన్నాయి. 1976–77 సంవత్సరంలో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయితీని ఏర్పాటు చేశారు.
గ్రామంలో కొంత భాగం లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెంగానూ, మరికొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో మసివానిపాలెంగానూ కలిపారు. అదే అక్కడ సమస్యలకు కారణమవుతోంది. గ్రామం ఒక్కటే అయినా ప్రజలను రెండు పంచాయతీలుగా, రెండు మండలాలుగా విడగొట్టడంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో తెలియక సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో వారు ఏ పంచాయతీ తరఫు న ఓటు వేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, రెండు ప్రాధమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు. రెండు పంచాయతీ భవనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment