షాంఘై: చైనాలోని ప్రముఖ నగరం షాంఘైలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక సూపర్ మార్కెట్‌లో ఒక వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆ ముగ్గురు హతమయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ వివరాలను షాంఘై పోలీసులు మీడియాకు తెలిపారు.
చైనా 75వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో షాంఘై నగరంలో ఈ దాడి చోటుచేసుకుంది. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల లిన్ అనే వ్యక్తి ఈ దాడులకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడని పట్టుకున్నారు. కాగా సూపర్‌మార్కెట్‌లో కత్తి పట్టుకుని తిరుగుతున్న లిన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.
దాడికి పాల్పడిన లిన్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా చైనాలో బహిరంగ ప్రదేశాల్లో కత్తితో దాడులు జరుగుతున్న ఘటనలు అధికమయ్యాయి. గత మే నెలలో చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కత్తి దాడికి గురైన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఇది కూడా చదవండి: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
Comments
Please login to add a commentAdd a comment