చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపునకు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 4.45 గంటలకు చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్దిసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ నిపుణులు సీఎం పళనిస్వామి ఇంట్లో గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా బాంబు లేదని నిర్ధారణ అయ్యింది.
దీంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా తాంబరం సమీపంలోని సేలయూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని ఆటో డ్రైవర్ వినోద్‌కుమార్‌గా గుర్తించారు. తాగిన మత్తులో భార్యతో గొడవపడి పొరపాటున ఫోన్ చేశానని అతడు పేర్కొన్నాడు. అయితే గతంలోనూ ఇదే విధంగా ఫోన్ చేయగా వార్నింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే వినోద్ భార్య దివ్య కూడా ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు వివరించారు. (అందరూ దొంగలే.! )
Comments
Please login to add a commentAdd a comment