Palaniswami
-
అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం
అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టే దిశగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఎస్పీ వేలుమణిని అస్త్రంగా చేసుకుని పళణి స్వామికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా అన్నాడీఎంకే నుంచి త్వరలో ఓ ఏక్నాథ్ షిండే వస్తారని, మహారాష్ట్ర తరహా రాజకీయం తమిళనాడులో చూడబోతున్నామనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. సాక్షి, చైన్నె: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. రాయబారానికి, సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేస్తూ, ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బీజేపీ అధిష్టానం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యూహాలకు సైతం పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిచ్చు ప్రయత్నాలు అన్నాడీఎంకే సీనియర్లలో ఎస్పీ వేలుమణి కీలక నేత. ఆయనపై అనేక కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులను అస్త్రంగా చేసుకుని ఆయన్ని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎస్పీ వేలుమణి ద్వారా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జోరందుకుంది. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి ఓ ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర సీఎం) అన్న ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేను ఏవిధంగా ఏక్నాథ్ షిండే కూల దోశాడో..అదే తరహాలో పళణిస్వామికి ఎస్పీ వేలుమణి చుక్కలు చూపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో ఎస్పీ వేలుమణి స్పందించారు. తాను అప్పుడు.. ఇప్పుడు..ఎల్లప్పుడూ అన్నాడీఎంకేకు విశ్వాస పాత్రుడినే అని స్పష్టం చేశారు. తాను సైకిల్ యాత్ర చేసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ తన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా అన్నామలైను ప్రకటించాలని బీజేపీ ఒత్తిడి తీసుకు రావడంతోనే కూటమి నుంచి తాము బయటకు వచ్చామని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కరుప్పన్నన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వారి బలం ఏమిటో లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేస్తాయని మరో సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. నేడు అమిత్ షాతో అన్నామలై అన్నాడీఎంకే కటీఫ్ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్నామలై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. దూకుడు మీదున్న అన్నామలై అమిత్ షా ముందు కొత్త ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమైనట్లు చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అమిత్‌షాను ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడే తమిళనాడులో బీజేపీ బలం ఏమిటో తెలుస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తుకు కార్యాచరణ సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ నివేదికను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పళణి కొత్త ప్రయత్నాలు బీజేపీతో ఇక దోస్తీ లేదని తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొత్త కూటమి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. బలమైన కూటమి దిశగా తమతో కలిసి రావాలని పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలకు ఆహ్వానం పలికేవిధంగా రాయబార ప్రయత్నాలు మొదలెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మూడు పార్టీలతోపాటు కొన్ని చిన్న పార్టీలను తన వైపునకు తిప్పుకునే దిశగా ప్రయత్నాలను జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న కొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునే ప్రయత్నంలో పళణిస్వామి ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. -
పళనికి ప్రత్యేక అనుమతి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి కే పళనిస్వామికి కేంద్ర విమానయాన శాఖ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఆయన తన కారులో నేరుగా విమానం వద్దకు వెళ్లే అవకాశం కల్పించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి గతంలో సీఎంగా ఉన్నప్పుడు వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ మేరకు రన్ వేకు సమీపంలో ఆగి ఉండే విమానం వద్దకు ఆయన వాహనానికి అనుమతి ఉండేది. పదవి కోల్పోవడంతో సాధారణ ప్రయాణికుడిలా ఆయన బోర్డింగ్ వ్యవహారాలు ముగించుకుని ఆయా విమాన సంస్థల బస్సులో విమానం వద్దకు ప్రయాణించాల్సి ఉంది. ఇటీవల ఈ ప్రయాణ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో పళనిస్వామికి భద్రత కల్పించాల్సిన అవశ్యం విమాన యాన శాఖకు ఏర్పడింది. మదురైలో బస్సు ప్రయాణం సమయంలో ఆయనకు వ్యతిరేకంగా రాజేశ్వరన్ అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పళని భద్రతా సిబ్బంది అడ్డుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో పళనిస్వామికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ప్రధాన ప్రతి పక్ష నేత హోదాలో నేరుగా విమానం వద్దకు కారులో వెళ్లేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డు ట్యాక్స్‌కు వ్యతిరేకత.. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్‌ను పెంచేందుకు కసరత్తులు చేపట్టిన విషయం తెలిసిందే. ఐదు శాతం మేరకు పన్ను వడ్డనకు సిద్ధమవుతున్నారు. దీనిని వ్యతిరేకంగా పళనిస్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మంగళవారం ప్రకటన చేశారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఆస్తి, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలను వడ్డించినట్టు ధ్వజమెత్తారు. ప్రస్తుతం రోడ్డు ట్యాక్స్ పెంపుతో సామన్యుడి సొంత వాహన కలను చెదరగొట్టే ప్రయత్నంలో ఉన్నారని ఽఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని దోచుకోవడం లక్ష్యంగా డీఎంకే పాలకులు ముందుకెళ్తున్నారని, తక్షణం ఈ ప్రయత్నం వీడాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు తమ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క భారం ప్రజల నెత్తిన వేయలేదని, ఈ డీఎంకే పాలకులు రెండేళ్లల్లో ప్రజల జేబులు చిల్లు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
జమిలీ ఎన్నికలు తథ్యం..
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడికే పళణి స్వామి సేలం పర్యటన ఆదివారం రోడ్‌షోను తలపించింది. దారి పొడవునా ఆయనకు అభిమానులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సైతం ఎన్నికలు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ దీనికి సిద్ధంగా ఉండాలని కేడర్‌కు ఈ సందర్భంగా పళణి స్వామి సూచించారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు రోజుల క్రితం ఎడపాడి కె. పళణిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ హోదాలో ప్రపథమంగా ఆదివారం చైన్నె నుంచి సొంత జిల్లా సేలంకు ఆయన బయలుదేరారు. మొదట గ్రీన్ వేస్ రోడ్డులోని ఆయన ఇంటి వద్ద నుంచే అన్నాడీఎంకే వర్గాల హడావుడి మొదలైంది. వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తర్వాత సేలానికి పళణిస్వామి రోడ్డు మార్గంలో బయలు దేరారు. ఆలందూరులోని ఎంజీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన పర్యటన రోడ్ షోను తలపించే విధంగా జరిగింది. మార్గం మధ్యలో తాంబరం, చెంగల్పట్టు, మదురాంతకం, దిండివనం, విల్లుపురం, అంటూ ప్రతి చోటా ఆయన కాన్వాయ్ ఆగింది. పార్టీ కేడర్ ఈ మేరకు పళణిస్వామికి బ్రహ్మరథం పట్టేవిధంగా ఆహ్వానం పలికారు. దారి పొడవున కేడర్‌ను పలకరిస్తూ వెళ్లడంతో సేలం చేరేలోపు రాత్రి ఏడు దాటింది. సేలంలోనూ ఆయనకు ఘన స్వాగతం లభించింది. జమిలీ ఎన్నికలు తథ్యం.. దారి పొడవున తనకు బహ్మ్రరథం పట్టిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పళణి స్వామి ప్రసంగాలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ఈసారి 40 స్థానాలు అన్నాడీఎంకే కూటమి చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీకి ఎన్నికలు వస్తే అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని, ఇందులో మరో ఆలోచన లేదని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం తనకు శుభాకాంక్షలు, ఆహ్వానం తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ పళణి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మజయలిత మార్గంలోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, ఈనెల 7వ తేదీన అన్నాడీఎంకే కార్యదర్శులు, జిల్లాల కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పళణి స్వామి తెలిపారు. అలాగే, సోమవారం మదురైలో పర్యటించాలని నిర్ణయించారు. దేవర్ సామాజిక వర్గాన్ని ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఉంటుందని భావిస్తున్నారు. -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
సాక్షి, ఢిల్లీ: అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవలే అన్నాడీఎంకే సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయిన సంగతి తెలిసిందే. పళనిస్వామి ఎన్నిక సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. మద్రాస్ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో అన్నాడీఎంకే తాతాల్కిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగేందుకు ఈపీఎస్‌కు లైన్ క్లియర్ అయింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వం అమలులోకి వచ్చింది. పళనిస్వామి, పన్నీరు సెల్వం ఉమ్మడిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. అయితే గత ఏడాది జూలైలో నిర్వహించిన సమావేశంలో ద్వంద్వ నాయకత్వ విధానాన్ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ రద్దు చేసింది. పార్టీ తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఈ నిర్ణయాన్ని పన్నీరు సెల్వం హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
Tamil Nadu: ‘పళని’ దూకుడుకు కళ్లెం..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి దూకుడుకు సుప్రీంకోర్టు శుక్రవారం కళ్లెం వేసింది. ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ దసరా సెలవుల అనంతరం కొనసాగించేందుకు నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాలు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తొలుత అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాన్ని పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అలాగే జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మరో తీర్పు రావడంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు స్వీకరించారు. ఈ హోదాతో పార్టీపై పట్టు సాధించే పనిలో పడ్డారు. సమావేశాలు, సభలు అంటూ విస్తృతంగా దూకుడు పెంచారు. త్వరలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ సర్వసభ్య సమావేశం సభ్యులతో ముందుగానే తనకు మద్దతు తెలిపే విధంగా సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలను సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 11న జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ వేశారు. నిబంధనలు ఉల్లంఘించారని వాదనలు పన్నీరుసెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా నేతృత్వంలోని బెంచ్ ముందుకు శుక్రవారం వచ్చింది. దసరా సెలవుల అనంతరం ఈ పిటిషన్‌ను విచారించేందుకు తొలుత న్యాయమూర్తి నిర్ణయించినా, పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు ఉంచారు. అన్నాడీఎంకేలో నిబంధనలకు అనుగుణంగా పన్నీరుసెల్వం నడుచుకున్నా, పళని స్వామి తరపున వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టారని వివరించారు. పార్టీ పరంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే, పన్నీరును పార్టీ నుంచి బయటకు పంపించినట్లు ప్రకటించి, వ్యక్తిగతంగా పళని స్వామి నిర్ణయాలు తీసుకుని, పార్టీ నిబంధనలను తుంగలో తొక్కినట్టు వివరించారు. సర్వసభ్య సమావేశాన్ని ఆగమేఘాలపై నిర్వహించారని, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. పళనిస్వామి అన్నాడీఎంకే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేయాలని కోరారు. అరగంట పాటుగా వాదనలు సాగాయి. పళని శిబిరానికి షాక్ పళనిస్వామి తరఫు న్యాయవాదులు సైతం కోర్టు ముందు వాదనలు ఉంచినా చివరకు ఈ కేసుతో పాటు అన్నాడీఎంకే వ్యవహారాలకు సంబంధించిన అన్ని కేసులను ఒకే గొడుగు కిందకు తెచ్చి దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి నిర్ణయించారు. అదే సమయంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి ఎన్నికలు నిర్వహించేందుకు వీలు లేదని పేర్కొంటూ స్టే విధించారు. దసరా సెలవుల అనంతరం విచారణ కొనసాగింపు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో పళని స్వామి శిబిరానికి షాక్ తప్పలేదు. దసరా సెలవుల అనంతరం జరిగే విచారణ, వెలువడే ఉత్తర్వుల మేరకు ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. పళని స్వామి మద్దతు నేత, ఎంపీ సీవీ షన్ముగం కోర్టు ఆవరణలో మీడియా మాట్లాడారు. తాము ప్రధాన కార్యదర్శి ఎన్నికకు ఇంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, అయితే కోర్టుకు పన్నీరు తరఫున తప్పుడు సమాచారం ఇచ్చి స్టే పొందారని పేర్కొన్నారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, ఆ మేరకు వెలువడే ఉత్తర్వుల ఆధారంగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు తనకు అనుకూలంగా రావడంతో ఇదే అదనుగా పార్టీ కేడర్‌ను తన వైపుకు తిప్పుకునే విధంగా దక్షిణ తమిళనాడులో పర్యటనలకు పన్నీరు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం గమనార్హం. -
తమిళనాట ట్విస్టులు.. పళనిస్వామి, పన్నీరు సెల్వానికి షాకిచ్చిన మోదీ!
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే వారి జాబితాలో మాత్రమే అన్నాడీఎంకే నేతలు పన్నీరు, పళని స్వామికి అనుమతి దక్కింది. కానీ, రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ లభించలేదని సమాచారం. కాగా, అన్నాడీఎంకే అంతర్గత పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా వీరి మధ్య విబేధాలకు శుభం కార్డు పడే అవకాశం ఉంది.. అనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా మోదీని కలిసేందుకు అపాయిమెంట్ కోరినట్లు కూడా తెలిసింది. అయితే, ఈ ఇద్దరికీ మోదీతో ప్రత్యేక భేటీకి అనుమతి దక్కలేదు. చెన్నై విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే కార్యక్రమానికి మాత్రం ఈ ఇద్దరికి అధికారులు అనుమతిచ్చారు. ఢిల్లీ వెళ్లినా ప్రధానితో భేటీ కాలేకపోయిన నేపథ్యంలో చెన్నైలోనైనా అవకాశం వస్తుందని ఎదురు చూసిన పళని స్వామికి ఇది పెద్ద షాకే అని భావిస్తున్నారు. అదే సమయంలో మోదీ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించిన పన్నీరుకూ ఇది భంగపాటే. ఒకరిపై ఒకరు.. అన్నాడీఎంకే కార్యాలయం ధ్వంసం విషయంపై పన్నీరు సెల్వంను ఇరకాటంలో పెట్టేందుకు పళని స్వామి శిబిరం దూకుడు పెంచింది. ఈ కార్యాలయంలో రికార్డులు, కీలక వస్తువులు మాయమైనట్లు ఇప్పటికే ఆ శిబిరం వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ పళని మద్దతు ఎంపీ సీవీ షణ్ముగం డీజీపీ శైలేంద్ర బాబును కలవడం గమనార్హం. అదే సమయంలో వీరి ఎత్తులకు పైఎత్తు వేయడానికి పన్నీరు సిద్ధమయ్యారు. తన కుమారుడు రవీంద్రనాథ్ను అన్నాడీఎంకే ఎంపీగా పరిగణించకూడదని పళనిస్వామి శిబిరం పార్లమెంట్ స్పీకర్‌కు లేఖ రాయడాన్ని పన్నీరు పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో పళని స్వామి వెంట ఉన్న 63 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే సభ్యులుగా పరిగణించకూడదని పేర్కొంటూ, వారిపై వేటుకు పన్నీరు సెల్వం వ్యూహ రచన చేస్తున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ అప్పావును కలిసి ఇందుకు లేఖ సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక, అన్నాడీఎంకే కార్యాలయం తలుపులను కాలితో తన్ని పగలకొట్టిన వారి తొక్కి నలిపేద్దామని మద్దతు దారుల కు బుధవారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి పిలుపు నివ్వడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
హస్తినలో పళనిస్వామికి చేదు అనుభవం.. ఇలా జరిగిందేంటి?
సాక్షి, చెన్నై: ఢిల్లీ వెళ్లిన అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దక్కనట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం ఆయన చెన్నైకు తిరిగి వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో పన్నీరు సెల్వం ఓ అడుగు ముందుకు వేసి, 14 జిల్లాలకు అన్నాడీఎంకే కార్యదర్శులను నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు నేతలు ఎత్తుకు పైఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఒకర్ని మరొకరు అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ.. ఇప్పటికే పలు ప్రకటనలు విడుదల చేశారు.ఈ పరిస్థితుల్లో పళనిస్వామికి ఢిల్లీ నుంచి ఆహా్వనం రావడంతో ఇక, పన్నీరు సెల్వంకు కేంద్రం అండదండాలు కరువైనట్లే అన్న చర్చజోరందుకుంది. తిరుగు పయనం రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మును పళనిస్వామి బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి కూడా పళని స్వామి హాజరయ్యారు. ఇక ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు పళని స్వామి బృందం ప్రయత్నాలు చేసింది. అయితే, అపాయింట్మెంట్ లభించకపోవడంతో వారంతా తిరిగి చెన్నైకు వచ్చేశారు. అదే సమయంలో పళని స్వామి వ్యవహరించిన తీరుపై కేంద్రం గుర్రుగా ఉన్నట్టు, అందుకే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వనట్లు పన్నీరు సెల్వం శిబిరం చెబుతుండడం గమనార్హం. ఇక ఈనెల 28వ తేదీ చెస్ ఒలంపియాడ్ నిమ్తితం చెన్నైకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడీఎంకేలో విభేదాలకు ముగింపు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరూ ఒకేసారిగా తనను కలవాలనే ఆదేశాలు ఢిల్లీ నుంచి పన్నీరు, పళనికి వేర్వేరుగా వచ్చినట్లు సమాచారం. కొత్త కార్యదర్శులను నియమించిన పన్నీరు తన మద్దతుదారులు 14 మందిని అన్నాడీఎంకే కార్యదర్శులుగా నియమిస్తూ పన్నీరు సెల్వం ఆదివారం ప్రకటన చేశారు. చెన్నై పరిధిలోని నాలుగు జిల్లాలకు, కోయంబత్తూరు, రామనాథపురం తదితర జిల్లాలకు కార్యదర్శులను నియమించారు. ఇందులో ఎంపీ ధర్మర్ను రామనాథపురం జిల్లా కార్యదర్శి, కోవై సెల్వరాజ్‌ను కోవై నగర కార్యదర్శిగా నియమించారు. ఇదిలా ఉండగా పన్నీరు సెల్వంపై పళని వర్గం నేత, ఎంపీ సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై చెన్నై పోలీసులు కేసు నమోదుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయంలో వస్తువులు మాయమైనట్లుగా సీవీ షన్ముగం ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ నిపుణులతో ఆదివారం చెన్నై పోలీసులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు -
హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని ఎడపాడికి అప్పగించాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య గత కొంతకాలంగా నువ్వా..నేనా అంటూ సాగుతున్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పన్నీర్ దూకుడుకు పగ్గాలు వేశారు. ఇక ఆ తరువాత పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచవర్గంలోని కొందరిపై బహిష్కరణ వేటు కూడా పడింది. ఎడపాడిని కట్టడిచేసేందుకు అదేరోజున పన్నీర్, ఆయన అనుచరవర్గం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగింది. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి మద్దతుదారులు పన్నీర్ వర్గంతో తలపడ్డారు. పలువురు గాయపడటం, పోలీసుల లాఠీచార్జీతో పార్టీ కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసింది. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎడపాడికి అప్పగింత–ఆనందోత్సాహాలు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం..అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని బుధవారం తీర్పు చెప్పింది. అయితే పార్టీ కార్యకర్తలు నెలరోజులపాటూ కార్యాలయానికి రాకూడదని షరతు విధించింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎడపాడి వర్గీయులకు ఆనందం మిన్నంటింది. అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకత్వంలో వందలాది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు చెన్నై అడయార్ గ్రీన్‌వేస్ రోడ్డులో విజయోత్సాహంతో చిందులు వేశారు. ఎంజీఆర్, జయలలిత, ఎడపాడి చిత్రపటాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్‌కు చేరుకుని ఎడపాడిని అభినందనలతో ముంచెత్తారు. ఇక కోర్టు తీర్పుతో పన్నీర్ మద్దతుదారులు డీలా పడిపోయారు. ఇది కూడా చదవండి: యూపీ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా -
మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను
ఇన్నాళ్లూ పార్టీపై పట్టుకోసం పోరాడిన ఈపీఎస్, ఓపీఎస్ మధ్య తాజాగా మరో కొత్త వివాదం మొదలైంది. అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతాల నిర్వహణ బాధ్యత నాదంటే.. నాదంటూ వారిద్దరూ లేఖల యుద్ధానికి దిగారు. పరిస్థితి ముదిరితే ఖాతాలను స్తంభింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలపై తనదే పెత్తనమని ఎడపాడి పళనిస్వామి, కాదు..కాదు కోశాధికారిగా తానే అధికారిక వ్యక్తినని పన్నీర్‌సెల్వం కొత్తగా మరో కుమ్ములాట మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సమస్య సద్దుమణిగే వరకు ఇద్దరికి అవకాశం లేకుండా సీలువేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఖాతాల్లోని రూ.300 కోట్లు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. చదవండి: అవసరమా! ఆ సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా? అంతకంతకూ ముదురుతున్న వివాదాలు అంతఃకలహాలతో అన్నాడీఎంకే అట్టుడికి పోతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి పళనిస్వామి ఎంపిక, పన్నీర్‌సెల్వం శాశ్వత బహిష్కరణ జరిగిపోయింది. కోశాధికారి పదవి నుంచి ఓపీఎస్‌ను తప్పించినట్లు బ్యాంకు అధికారులకు ఈపీఎస్ ఓ లేఖ పంపారు. అయితే తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరిపేందుకు వీలులేదని, హద్దుమీరితో తగిన చర్యలు తప్పవని పన్నీరు సెల్వం మరో లేఖలో హెచ్చరించారు. ఇక కోశాధికారిగా దిండుగల్లు శ్రీనివాసన్‌ను నియమించాం, ఆయన అనుమతి లేకుండా లావాదేవీలు జరుపరాదని కరూరు వైశ్య బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఈపీఎస్ మంగళవారం మరో లేఖ రాశా రు. ఈరెండు బ్యాంకుల్లో అన్నాడీఎంకేకు సుమారు రూ.300 కోట్లు ఉండటంతో ఈపీఎస్, ఓపీఎస్లు తహతహలాడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక బ్యాంకు అధికారులు తలలుపట్టుకున్నారు. రూ.300 కోట్లు పక్కదారి పట్టకుండా పార్టీ బ్యాంకు ఖాతాలకు తాత్కాలికంగా సీలు వేయడమే మేలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సీఈసీకి పోటాపోటీ పిటిషన్లు ఈనెల 11న సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలపై ఈపీఎస్, ఓపీఎస్ ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) కార్యాలయంలో పోటాపోటీగా పిటిషన్లు వేశారు. ఇటీవలి సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, ఆమోదయోగ్యం కాని ఆ పిటి షన్లపై స్టే విధించాలని సీఈసీకి సమర్పించిన పిటిషన్లో ఓపీఎస్ పేర్కొన్నారు. బైలా ప్రకారమే పార్టీ వ్యవహారాల్లో సవరణలు చేశామని ఎడపాడి పేర్కొంటూ సీఈసీకి ఆధారాలు సమర్పించారు. మలి అడుగు ఎలా..? ఆశించినట్లుగానే ఎడపాడి పళనిస్వామికి ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. పన్నీర్‌సెల్వంను బహిష్కరించడం కూడా జరిగిపోయింది. అయితే పార్టీపై పూర్తిస్థాయి పట్టుసాధించడం కోసం చేపట్టాల్సిన చర్యలపై చట్ట నిపుణులతో ఈపీఎస్ మంగళవారం సమాలోచనలు జరిపారు. పన్నీర్‌సెల్వం బహిష్కరణకు గురైనందున ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి వెంటనే చేజారిపోతుందా..? అని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అంశాలు ఇక అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద సోమ వారం అరాచకాలకు పాల్పడిన, కార్యాలయంలోకి జొరబడిన 400 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీ రామ చంద్రన్, జయలలిత విగ్రహాలకు రోజూ పూలమాలలు వేయడం ఎంతోకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అయితే పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో వారి విగ్రహాల్లో ఎండిపోయిన రోజాపూల మాలలను చూసి పారీ్టశ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకేలోని రెండువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేయడంతో ఎడపాడి తన ఇంటిని తాత్కాలిక కార్యాలయంగా మార్చారు. ఆఫీసుకు వేసిన సీలును తొలగించేలా ఆదేశించాలని కోరుతూ ఎడపాడి మద్ద తుదారు తరపున న్యాయవాది విజయ్ నారాయణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. -
బహిష్కరణ వేటుపై కోర్టుకు ఓపీఎస్!.. ఈపీఎస్ సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే బహిష్కరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. కోటిన్నర క్యాడర్ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని వ్యాఖ్యానించారు. తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఓపీఎస్‌కు షాకిస్తూ పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో ప్రెసిడియమ్ చైర్మన్ తమిళ్మహాన్ హ్సుస్సేన్ అధ్యక్షతన వనగారమ్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఇంటీరియమ్ జనరల్ సెక్రెటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటూ.. అలాగే పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటించింది అన్నాడీఎంకే. డీఎంకేతో కుమ్మక్కయ్యాడు అన్నాడీంకే జనరల్ సెక్రెటరీ(ఇంటీరియమ్) హోదాలో ఈ పళనిస్వామి.. పన్నీర్‌సెల్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అధికార పక్షం డీఎంకేలో పన్నీర్‌సెల్వం కుమ్మక్కు అయ్యాడంటూ సంచలన ఆరోపణలే చేశారు ఓపీఎస్. ఓపీఎస్ హింసాకాండకు పాల్పడ్డాడు. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పోలీస్ భద్రత కల్పించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేంటి?. .. పార్టీకి ఒక్కరే నేత ఉండాలని సీనియర్లు చెప్పిన సూచనను సైతం ఓపీఎస్ పెడచెవినపెట్టాడు. నేను మీలో ఒక్కడినే(పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి..). ఈ పార్టీనే నా జీవితం. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. పని చేశా. ఇద్దరి నాయకత్వంలో పని తీరు ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ ఒక దుష్టశక్తితో పోల్చారు. డీఎంకే ప్రభుత్వం అంటే.. కమీషన్లు, అవినీతికి కేరాఫ్. అలాంటి పార్టీ ప్రభుత్వంపై ఓపీఎస్ కొడుకు ఓపీ రవీంద్రన్ లోక్ సభ సభ్యుడిగా ఉండి మరీ.. ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అలాగే ఓపీఎస్ ఒక్కడే పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించొద్దంటూ వాదించాడు.. కోర్టుకెక్కాడు అంటూ పళని స్వామి విమర్శలు గుప్పించారు. -
రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్ హైకోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. సీఎంపై డీఎంకే నేత సూళూరు ఎ. రాజేంద్రన్ పరువు నష్టం దావా వేయడంతో కోర్టు స్పందించింది. ప్రతిపక్షాల నేతలు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే చాలు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చటుక్కున కోర్టుల్లో పరువునష్టం దావాలు వేయడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నం అన్నట్టుగా సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత రాజేంద్రన్ దావా వేయడం చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో కోయంబత్తూరు వేదికగా సీఎం పళనిస్వామి రాజేంద్రన్‌ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైలులో ఓ యువతిపై లైంగిక దాడి యత్నం చేశాడని ఆరోపించారు. దీనిని రాజేంద్రన్ తీవ్రంగా పరిగణించారు. తాను చేయని నేరాన్ని, తనపై వేస్తూ, పరువుకు భంగం కల్గించే రీతిలో సీఎం వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దావా వేశారు. నోటీసులు.. ఇటీవల తాను రైలులో పయనిస్తున్న సమయంలో అత్యవసరంగా మూత్ర విసర్జన నిమిత్తం పై బెర్త్ నుంచి కింది బెర్త్‌కు దిగాల్సి వచ్చిందని, ఆ సమయంలో కింద ఉన్న యువతిపై జారిపడ్డానని ఆ దావాలో వివరించారు. తనకు మధుమేహం ఉందని, అందుకే మూత్ర విసర్జన కోసం అత్యవసరంగా పరుగులు తీశానని, అయితే, తానేదో అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా భావించిన ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పరిస్థితిని ఆ యువతికి వివరించినానంతరం ఆమె శాంతించారని గుర్తు చేశారు. అయితే హఠాత్తుగా తనపై పదిహేను రోజుల అనంతరం పోలీసులు కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో కోర్టు సైతం తనకు క్లీన్చిట్ ఇచ్చినట్టు వివరించారు. అయితే, ఎన్నికల సమయంలో తానేదో రైలులో లైంగిక దాడి యత్నం చేసినట్టుగా సీఎం ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన పరువుకు భంగం కల్గించే రీతిలో ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోటి నష్టపరిహారం కోరుతూ సీఎం పళనిస్వామికి దావా ద్వారా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి పార్థిబన్ నేతృత్వంలోని బెంచ్ ముందు గురువారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం సీఎం పళనిస్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో మంత్రి ఎస్పీ వేలుమణిపై కూడా రాజేంద్రన్ దావా వేశారు. చదవండి: ‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’ -
సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు
చెన్నై: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అన్నాడు రాజా. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పళనిస్వామి. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని.. పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం -
కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం
సాక్షి, చెన్నై : తండ్రి వారసత్వంతో స్టాలిన్‌లా రాజకీయాల్లోకి రాలేదని, ఒక్కో మెట్టు ఎక్కి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. సోమవారం ధర్మపురి జిల్లాలో పళనిస్వామి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. హోసూరులో అన్నాడీఎంకే అభ్యర్థి జ్యోతి బాలకృష్ణారెడ్డికి మద్దతు నిర్వహించిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ అమ్మ పథకాలు అమలవ్వాలంటే రెండాకులను గెలిపించుకోవాలని కోరారు. స్టాలిన్ సమర్థుడు కాదనే విషయం కరుణానిధికి కూడా తెలుసని, అందుకే ఆయన చేతికి అధికారం ఇవ్వకుండా చివరి క్షణం వరకు తన వద్దే ఉంచుకున్నారన్నారు. స్టాలిన్‌ను తండ్రే నమ్మనప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అనంతరం పాలక్కోడులో మంత్రి అన్బళగన్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థి రాకేష్‌కుమార్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఏపీఎస్ తప్పని సెగ తిరువణ్ణామలై పర్యటన ముగించుకుని ధర్మపురి వెళుతున్న ముఖ్యమంత్రి పళనిస్వామికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చెన్నై – సేలం గ్రీన్ వే వ్యవహారంలో పళని స్వామి వైఖరికి నిరసనగా రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి! అడ్డదారిలో సీఎం కాలేదు.. -
ఉద్యోగం ఇవ్వకుంటే జయ సమాధిని పేల్చేస్తా.!
సాక్షి, చెన్నై: తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వని పక్షంలో మెరీనాతీరంలోని జయలలిత సమాధిని పెట్రోబాంబులతో పేల్చేస్తానని ఏకంగా ఓ యువకుడి డీజీపీ కార్యాలయానికి వచ్చి మరీ హెచ్చరికలు ఇచ్చాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని మానసిక వైద్య నిపుణుల వద్దకు పంపించారు. కొరుక్కుపేట భారతీరాజా హౌసింగ్ బోర్డుకు చెందిన మణిగండన్ బుధవారం మెరీనా తీరంలోని డీజీపీ కార్యాలయానికి వచ్చాడు. అక్కడి ఫిర్యాదుల విభాగం వద్దకు వెళ్లి ఓ విజ్ఞప్తిని అధికారులకు అందజేశాడు. దీనిని చదివిన అధికారులు హడలెత్తారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని లేనిపక్షంలో జయలలిత సమాధిని నాటుబాంబులతో పేల్చేస్తానని యువకుడు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అతడ్ని అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. అయితే, అతడి చర్యలు మానసిక రోగి తరహాలో ఉండడంతో మెరీనా పోలీసులకు అప్పగించారు. వారు సమగ్ర విచారణ తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురైనట్టు తేలింది. దీంతో అతడ్ని మానసిక వైద్యుల వద్దకు పంపించారు. సీఎం ఇంటికి బాంబు బూచి.. చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డు, సేలంలోని సీఎం నివాసాల్ని బాంబులతో పేల్చి వేస్తున్నట్టు వచ్చిన బెదిరింపు కాల్ మంగళవారం రాత్రి అధికారుల్ని పరుగులు తీయించింది. ఆయన ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. భద్రతను పెంచారు. వేలూరు ప్రచార పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ వైపు ఓ కారులో తుపాకీ, నాటు బాంబులు బయటపడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగానే వ్యవహరించారు. సోదాల తర్వాత ఇది కేవలం బెదిరింపు కాల్‌గా తేలింది. కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన సెల్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైం వర్గాలు తిరుప్పూర్‌కు చెందిన ఓ యువకుడ్ని బుధవారం అరెస్టు చేసి విచారిస్తున్నారు. (చదవండి: కిలాడీ దంపతులు: బండారం బట్టబయలు..) అరుదైన దృశ్యం.. ఒకేసారి మూడు పులులు -
శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై పార్టీ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలుశిక్షను పూర్తిచేసుకుని ఈనెల 27న బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలవుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా జైలు వర్గాల నుంచి ఉత్తరం అందినట్లు శశికళ తరఫు న్యాయవాది మంగళవారం ప్రకటించారు. శశికళపై ఎడపాడి, పన్నీర్‌సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే బహిష్కరణ వేటువేసింది. జైలు నుంచి శశికళ బయటకు రాగానే అన్నాడీఎంకేపై ప్రతీకారణ ధోరణికి పాల్పడగలదని అంచనా వేస్తున్నారు. పారీ్టలో చేర్చుకోవడం ద్వారా సామరస్యంగా ముందుకెళ్లే అవకాశాలూ లేకపోలేదని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను మంగళవారం ఢిల్లీలో కలిసిన అనంతరం సీఎం ఎడపాడి మీడియాతో మాట్లాడారు. శశికళ జైలు నుంచి విడుదల పారీ్టపై ఎలాంటి ప్రభావం చూపదు. శశికళ పారీ్టలో చేరే అవకాశాలు వందశాతం లేవు. శశికళను చేర్చుకోరాదని పారీ్టలో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాంమని సీఎం అన్నారు. శశికళ జైలు నుంచి విడుదలకాగానే అన్నాడీఎంకేను స్వాదీనం చేసుకుంటారని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించారు. 22న క్యాబినెట్ సమావేశం : ముఖ్యమంత్రి పళనిస్వామి ఈనెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. చెన్నై సచివాలయంలో జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి తప్పనిసరిగా మంత్రులంతా హాజరుకావాలని మంగళవారం ఆయన ఆదేశాలు జారీచేసారు. చెన్నై మెరీనాబీచ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న జయలలిత స్మారక మండపాన్ని ఈనెల 27న ప్రారంభిస్తున్నట్లు మంగళవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రధాని మోదీ ఈ మండపాన్ని ఆవిష్కరిస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది. -
24న తిరుమలకు రాష్ట్రపతి
సాక్షి, తిరుమల: ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. తిరుచానూరు, తిరుమల ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకనున్నారు. (చదవండి: అశ్లీల వీడియో వివాదం: ఎస్వీబీసీ ఉద్యోగి తొలగింపు) తిరుమలకు చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి.. శ్రీవారి దర్శనార్థం తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి తిరుమలకు చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ఆయన సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రేపు(మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. (చదవండి: తిరుమలలో కుండపోత వర్షం) -
అన్నాడీఎంకేలో సామరస్యత
దీర్ఘకాలం రాజకీయరంగాన్ని ప్రభావితం చేసిన దిగ్గజ నాయకులు కనుమరుగైతే... ఆ వెలితిని పూడ్చేవారు కనుచూపు మేరలో కనబడకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తమిళనాడు చాన్నాళ్లుగా నిరూపిస్తూనే వుంది. రాష్ట్ర రాజకీయాల సంగతలావుంచితే పాలకపక్షంగా వున్న అన్నా డీఎంకేలో ఒకరకమైన అనిశ్చితి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఆ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి, రెండో వర్గానికి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీరుసెల్వం నేతృత్వంవహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసివున్న తరుణంలో ఈ అని శ్చితికి ముగింపు పలకాలని ఇరు వర్గాలూ ఒక అంగీకారానికొచ్చాయి. బుధవారం కుదిరిన అవగా హన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుత సీఎం పళనిస్వామే మళ్లీ సీఎం అవు తారు. అలాగే పన్నీరుసెల్వం ఆధ్వర్యంలో పార్టీ సారథ్యబాధ్యతలను చూడటానికి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కోసం పన్నీరుసెల్వం కొంతకాలంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వమూ, పార్టీ తన చెప్పుచేతల్లో వుండాలన్నది పళనిస్వామి నిశ్చితాభిప్రాయం. ఈసారి తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలని, అది కుదరకపోతే పార్టీ పగ్గాలైనా అప్పగించాలని పన్నీరుసెల్వం కోరుకుంటున్నారు. ఈ విషయంలో వచ్చిన విభేదాలు తీవ్రమై సమస్యలు మొదలయ్యాయి. ఎన్నిక లకు ఇంకా ఆరేడు నెలల వ్యవధి వున్న తరుణంలో ఇద్దరు నేతలూ రాజీపడి ఒక అంగీకారానికి రావడం ఆ పార్టీ శ్రేయస్సుకు మంచిదే. (చదవండి: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని) ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీకి పెద్ద దిక్కుగా వుంటూ వచ్చిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో చనిపోయాక ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్వితీయ శ్రేణి నాయకుడో, నాయకురాలో లేకపోవడంతో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. జయ ఆప్తురాలిగా వున్న వి.కె. శశికళ ఆమె బాటలోనే పన్నీరు సెల్వంను మరోసారి ఆ పదవిలో కూర్చోబెట్టారు. కానీ మరో రెండు నెలలకు తానే సీఎం కావాలనుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక అదంతా బెడిసికొట్టి పదవి రావడం మాట అటుంచి ఆమెకు అవినీతి కేసులో శిక్షపడింది. ఈలోగా పన్నీరుసెల్వం తన మద్దతుదార్లతో వేరే కుంపటి పెట్టుకున్నారు. చివరకు శశికళ పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. అయితే చాలా త్వరగానే పళనిస్వామి సైతం ఆమె నుంచి దూరం జరిగారు. బీజేపీ నాయకగణం మధ్య వర్తిత్వం ఫలితంగా అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమై అప్పటినుంచీ బండి లాగిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక్క ఎంజీఆర్ హయాంలో తప్ప ఎప్పుడూ ఒకే పార్టీ వరసగా మూడోసారి అధికారంలోకొచ్చిన దాఖలా లేదు. అలా చూస్తే అన్నాడీఎంకే కోటా అయిపోయినట్టే. ఆ పార్టీ అధికారంలో కొనసాగడం వరసగా ఇది రెండోసారి. ఇప్పుడు నేతలిద్దరి రాజీ ఫలితంగా ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలొచ్చి మూడోసారి సైతం అధికారంలోకొచ్చి చరిత్రను తిరగరాస్తుందా అన్నది ఇంకా చూడాల్సివుంది. పై స్థాయిలో ఇద్దరి మధ్యా ఏర్పడ్డ సఖ్యత ప్రభావం కింది స్థాయి కేడర్ వరకూ వెళ్తే... పాలన సైతం జనరంజకంగా సాగితే అది అసాధ్యం కాకపోవచ్చు. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పక్షానికి ఎప్పుడూ కొంత వెసులుబాటు వుంటుంది. ఏయే అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వుందో తెలుసుకుని, వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడానికి... కొత్త విధానాలతో, పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి పాలకపక్షానికే అవకాశం వుంటుంది. పాలనకు సంబంధించి ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేకపోయినా గతంలోవలే కేంద్రంతో పోరాడి దేన్నయినా సాధించే తత్వం ప్రస్తుత పాలకుల్లో కొరవడిందన్న భావన ఏర్పడింది. నీట్ విషయంలో రాష్ట్రం గట్టిగా పోరాడితే బాగుండేదన్న అభిప్రాయం వుంది. నిరుడు చెన్నైలో ఏర్పడిన మంచినీటి కొరత కనీవినీ ఎరుగనిది. దానిపై చివరకు హాలీవుడ్ నటుడు లియనార్డో డి కాప్రియో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు అంతటా నిరుడు జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళన దక్షిణాదిలోనే అతి పెద్దది. సహజంగానే ఈ అంశంపై పాలక అన్నాడీఎంకే మాట్లాడలేకపోయింది. అన్నా డీఎంకే సమష్టిగా పోరాడటం ఒక ఎత్తయితే... విపక్షమైన డీఎంకే రూపంలో ఎదురయ్యే సవాలును ఎదుర్కొనడం మరో ఎత్తు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఏర్పాటుచేసి 39 స్థానాలకూ 38 సాధించుకుంది. పొరు గునున్న పాండిచ్చేరిలోని ఒకే ఒక స్థానం సైతం కూటమికొచ్చింది. అసెంబ్లీలోని 22 స్థానాలకు అంతక్రితం జరిగిన ఉప ఎన్నికల్లో 9 చోట్ల అన్నాడీఎంకే నెగ్గింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తుడిచి పెట్టుకుపోతుందని, తగిన మెజారిటీ లేక పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని భావించిన డీఎంకేకు ఇది షాక్. దాన్నుంచి త్వరలోనే కోలుకుని లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ తన సత్తా చాట గలి గారు. అయితే నిరుడు అక్టోబర్‌లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పళనిస్వామి పరువు నిలుపుకున్నారు. సినీ నటుడు కమలహాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడా నెగ్గకపోయినా తనకంటూ వోటు బ్యాంకు వుందని నిరూ పించుకుంది. మరో నటుడు రజనీకాంత్ పార్టీ ఇంకా కళ్లు తెరవలేదు. తమ పార్టీ అసెంబ్లీలోని 234 స్థానాలకూ పోటీ చేస్తుందని మాత్రం ప్రకటించారు. కాగా, శశికళ జైలుశిక్ష పూర్తిచేసుకుని డిసెం బర్లో రాబోతున్నారు. ఆమె ఎత్తుగడలేమిటో చూడాల్సివుంది. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీ అయినా అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఏదో ఒకదానితో చెలిమి చేయడం తప్పనిసరి. ఇప్పుడు పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య ఏర్పడిన సామరస్యం ఫలితమేమిటో... కొత్త పార్టీల రాకతో డీఎంకేకు కలిగే లాభనష్టాలేమిటో, జాతీయ పార్టీల భవితవ్యమేమిటో రాగల అసెంబ్లీ ఎన్నికలు తేలుస్తాయి. -
అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని
సాక్షి, చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలో ఇద్దరు అగ్రనాయకులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్య పోరుకి తెరపడింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామినే తిరిగి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పార్టీ ఖరారు చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారం చేపట్టడానికి ఇరువురు అగ్ర నేతలు కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సా హాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు పార్టీ ప్రధాన కార్యాల యంలో స్వయంగా పన్నీర్ సెల్వం నేతల హర్షధ్వానాల మధ్య సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరుని ప్రకటించారు. ‘‘నా ప్రియ సోదరుడు పళనిస్వామిని ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2021 ఎన్నికల్లో ఆయన విజేతగా నిలుస్తారు’’అని పళనిస్వామి అన్నా రు. ఆ తర్వాత 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పట్నుంచో పన్నీర్ సెల్వం ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటుకు పట్టుబడుతూ ఉంటే, పళనిస్వామి దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థిత్వంపైనా ఇరువురు నేతల మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. సెప్టెంబర్ 28న పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో ఇద్దరూ సీఎం పదవి తనకి కావాలంటే, తనకంటూ తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు పైనా కూడా ఇద్దరి మ«ధ్య మాటా మాటా పెరిగింది. అప్పట్నుంచి పన్నీర్ సెల్వం ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ వచ్చారు. కొందరు నాయకుల చొరవతో మళ్లీ ఇద్దరూ రాజీకి రావడంతో సంక్షోభం ముగిసింది. వచ్చే ఏప్రిల్, మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పన్నీర్‌ను మించిపోయేలా జయలలిత మృతి తర్వాత సీఎం అయ్యే అవకాశం తొలుత పన్నీర్ సెల్వంకే వచ్చింది. అయితే కొన్నాళ్లకే ఆయన శశికళపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. కానీ సరిపడినంత ఎమ్మెల్యేల బలం లేక పదవిని కోల్పోయారు. అదే సమయంలో శశికళకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడడంతో ఆమెకు అత్యంత విధేయుడిగా పేరు పడిన పళనిస్వామిని శశికళ సీఎంని చేశారు. ఆమె జైలుకి వెళ్లిన అనంతరం పన్నీర్‌తో చేతులు కలిపిన పళనిస్వామి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ని పార్టీ నుంచి గెంటేశారు. క్రమక్రమంగా ఆయన తనకున్న రాజకీయ చాతుర్యంతో పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. జయలలిత మరణానంతరం పార్టీ, ప్రభుత్వంలో శశికళ తర్వాత అంతటి పట్టు సాధించిన వారు పళని. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కి పోటీ ఇవ్వగలిగిన నాయకుడు ఏఐఏడీఎంకేలో పళనిస్వామి తప్ప మరొకరు లేరన్న అభిప్రాయం ఉంది. -
ధోనీ రిటైర్మెంట్ : సీఎం స్పందన
చెన్నై : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఆదివారం ధోనీని ఉద్ధేశిస్తూ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘‘ 331 అంతర్జాతీయ మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహించటంతో పాటు కెప్టెన్ కూల్‌గా దేశానికి మూడు ఛాంపియన్‌షిప్‌లు గెలిపించినందుకు ఎంఎస్ ధోనీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అతడి విజయాలు, కీర్తి ప్రతీ భారతీయుడికి చిరస్మరణీయం’’ అని పేర్కొన్నారు. ( ఆ సిక్సర్‌ను ఎలా మర్చిపోగలను? ) #MSDhoni's name will be etched in history for leading the Indian cricket team in 331 international matches and for being the only #captaincool to win 3 championships for the nation. His laurel and fame will be cherished by every Indian. pic.twitter.com/KBDJwoRt5V — Edappadi K Palaniswami (@CMOTamilNadu) August 16, 2020 -
ఎన్ఈపీ 2020: తమిళనాడు కీలక నిర్ణయం
చెన్నై: కేంద్రం ఇటీవల ప్రకటించిన నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లోని మూడు భాషల విధానం తమను వేదనకు గురిచేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. మూడు భాషల విధానాన్ని పునఃసమీక్షించాలని, దీని అమలుపై రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు. 1965లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందీని అధికార భాషగా గుర్తించినపుడు తమిళనాడు విద్యార్థులు చేసిన ఉద్యమాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయంతో తాము ఏకీభవించలేమని, ద్విభాషా(తమిళ్, ఇంగ్లీష్)ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సైతం ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.(పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు) అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలిత, సీఎన్ అన్నాదురై రాష్ట్రాలపై హిందీయేతర భాషా రాష్ట్రాలపై ఆ భాషను బలవంతంగా రుద్దవద్దని తీసుకున్న నిర్ణయాల గురించి పునరుద్ఘాటించారు. కాగా తాము ఏ రాష్ట్రంపై, ఏ భాషను రుద్దే ప్రయత్నం చేయడం లేదని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్ చేసిన మరుసటి రోజే పళనిస్వామి తన ప్రభుత్వం తమ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.ఇక విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఎన్ఈపీ–2020కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. (జాతీయ విద్యావిధానంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు) ఇందులో భాగంగా ప్రి స్కూలు నుంచి సెకండరీ స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ పాఠశాల విద్యను సార్వత్రికంగా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అంతేగాక కనీసం 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధన మాధ్యమంగా ఉంచాలని.. 8వ తరగతి నుంచి ఆపై వరకూ దీనిని కొనసాగించవచ్చని సూచించింది. మూడు భాషల(హిందీ, ఇంగ్లిష్, ప్రాచుర్యం పొందిన ఇతర భాష(దక్షిణాది భాష) విధానంలో భాగంగా పాఠశాలలోని అన్ని స్థాయిల్లో విద్యార్థులు సంస్కృతాన్ని ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై తమిళనాడు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రజలపై హిందీ, సంస్కృత భాషలు రుద్దేందుకు కేంద్ర సర్కారు చేస్తున్న ప్రయత్నమిదని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇతర పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సైతం జట్టుకట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. తాజా సంస్కరణలు మనుస్మృతికి మెరుగులు దిద్ధినట్లు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఇక తమిళనాడులో మాతృభాషపై మక్కువ, హిందీ భాషపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో హిందీ భాషను అధికార భాషగా గుర్తించే ప్రయత్నాలు చేయగా.. ఈ దక్షిణాది రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ కేంద్ర, హిందీయేతర రాష్ట్రాల మధ్య అనుసంధానానికై ఇంగ్లీష్ భాష వారధిగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
సీఎం ఇంటికి బెదిరింపు కాల్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపునకు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం 4.45 గంటలకు చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టానని మరికొద్దిసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ నిపుణులు సీఎం పళనిస్వామి ఇంట్లో గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేయగా బాంబు లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు మొబైల్ సిగ్నల్ ఆధారంగా తాంబరం సమీపంలోని సేలయూర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని ఆటో డ్రైవర్ వినోద్‌కుమార్‌గా గుర్తించారు. తాగిన మత్తులో భార్యతో గొడవపడి పొరపాటున ఫోన్ చేశానని అతడు పేర్కొన్నాడు. అయితే గతంలోనూ ఇదే విధంగా ఫోన్ చేయగా వార్నింగ్ ఇచ్చి పోలీసులు పంపించేశారు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందటే వినోద్ భార్య దివ్య కూడా ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు వివరించారు. (అందరూ దొంగలే.! ) -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
చెన్నై : తమిళనాడు థర్మల్ ప్లాంట్‌లో బుధవారం సంభవించిన పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పగాయాలైన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని తెలిపారు. ఇది వరకే సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పకుండా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (ఈ సారి లాల్బగ్చా గణేశుడి ఉత్సవాలు లేవు ) Anguished to learn about the loss of lives due to a blast at Neyveli power plant boiler in Tamil Nadu. Have spoken to @CMOTamilNadu and assured all possible help.@CISFHQrs is already on the spot to assist the relief work. Praying for the earliest recovery of those injured. — Amit Shah (@AmitShah) July 1, 2020 భారీ పేలుడు ఘటనలో ఆరుగురు చనిపోగా, 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కడలూరులోని నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ( ఎన్ఎల్సీ ) థర్మల్ పవర్ స్టేషన్-2లోని ఐదవ యూనిట్ వద్ద బాయిలర్ పేలి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా 17 మందికి తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అభినవ్ తెలిపారు. క్షతగాత్రులను చెన్నైలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఎన్ఎల్సి దగ్గరున్న అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని లేదంటే పరిస్థితి ఇంకా భయానకంగా మారేదని అధికారులు పేర్కొన్నారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. మే నెలలోనూ ఇదే విధమైన పేలుడు సంభవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. Tamil Nadu: Explosion at a boiler in stage -2 of the Neyveli lignite plant. 17 injured persons taken to NLC lignite hospital. Visuals from the spot. More details awaited. https://t.co/jtaOudE9P0 pic.twitter.com/FWKYNsePVO — ANI (@ANI) July 1, 2020 -
తమిళనాడులో లాక్డౌన్..జూలై 31 వరకు
చెన్నై : దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. దీంతో లాక్డౌన్ 6.0 విధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టవ్యాప్తంగా జూలై 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో పూజా కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఇక గ్రేటర్ చెన్నై పరిధిలోని చెన్నై, కాంచిపురం, చెంగల్పట్టు, తిరువళ్లువార్ ప్రాంతాల్లో ఇది వరకే అమల్లో ఉన్న లాక్డౌన్ జూలై 5న ముగియనుంది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవని సీఎం స్పష్టం చేశారు. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కోవిడ్ నిర్ధారణ ) ఇప్పటికే మహారాష్ట్రతో పాటు జార్ఖండ్, అసోం తదితర రాష్ట్రాలు జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తుందిని మరో రెండు,మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత 24 గంటల్లోనే రాష్ర్ట వ్యాప్తంగా 3,949 కొత్త కేసులు నమోదుకాగా 62 మంది చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,224కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (ముందుగా వైద్య సిబ్బందికి టీకా! ) -
రికవరీ రేటు మా రాష్ట్రంలో ఎక్కువ: సీఎం
చెన్నై : భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అయితే తమ రాష్ట్రంలో రికవరీ రేటు మాత్రం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం ప్రకటించారు. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. కాగా, తమిళనాడులో జూన్ 15 నాటికి 46,504 కోవిడ్ కేసులు నమోదుకాగా 25,344 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,678 యాక్టివ్ కేసులుండగా 479 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. (‘కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నాం’) రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 54.49 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లోనే 10,667 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో లాక్డౌన్ విధించారు. జూన్ 19 నుంచి 30 వరకు తాజా లాక్డౌన్ కొనసాగనుంది. (నడిచి వచ్చిన కార్మికుల వెతలు) -
చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకమండప నిర్మాణ పనులను ఈ ఏడాది జూలై నెలాఖరులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదేశించారు. ఈ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించిన చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున అందమైన సమాధి నిర్మాణం జరిగింది. ఆ తరువాత ఎంజీఆర్ సమాధి పేరొందిన పర్యాటక క్షేత్రంగా మారింది. ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత అన్నాడీఎంకేకు విజయవంతంగా సారధ్యం వహించిన జయలలిత పార్దివదేహాన్ని సైతం చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ ప్రదేశంలో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ఎడపాడి ప్రభుత్వం నాడే ప్రకటించింది. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే నిర్మాణంలో అమ్మ స్మారక మండపం సముద్ర తీరాల్లో సమాధుల నిర్మాణంపై పర్యావరణ నిషేధం ఉన్నట్లు కొందరు వివాదాలు లేవనెత్తినా వాటిని అధగమించి రూ.5.08 కోట్ల అంచనాతో పనులు కొనసాగుతున్నాయి. జయ సమాధి డిజైన్‌ను చెన్నై ఐఐటీ రూపకల్పన చేయగా మధ్యప్రదేశాన్ని కాంక్రీట్‌తో పినిక్స్ పక్షి ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. అత్యంత క్లిష్టమైన నిర్మాణం కావడంతో ప్రజాపనులశాఖ అధికారులు పదేపదే పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో కొంత జాప్యం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. లాక్డౌన్ రోజుల్లో సైతం ప్రత్యేక అనుమతి పొంది నిరవధికంగా పనులను సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా స్మారకమండప నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ముఖ్యమంత్రి ఎడపాడి రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయో వాకబు చేశారు. పనుల ప్రగతిని ఫొటోల ద్వారా సీఎంకు చూపించారు. చారిత్రాత్మక నిర్మాణంగా చరిత్రలో నిలవబోతున్న జయ స్మారక మండపం విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. హడావిడికి తావివ్వకుండా నాణ్యత పాటించాలని సూచించారు. ఈ ఏడాది జూలై మాసాంతానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. చదవండి: టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి -
ఎవరి పదవులు పోతాయో.. ఎవరిని వరిస్తాయో..?
అన్నాడీఎంకే పార్టీలో మూడేళ్ల తర్వాత కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ సంకేతాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు, పళని ఇవ్వడంతో నేతల్లో కలవరం నెలకొంది. మార్పు అనివార్యం అని స్వయంగా పళని, పన్నీరు ప్రకటించారు. ఈ నెల 24న అమ్మ జయంతి రోజున ఆయా ప్రాంతాల్లో నేతలు సేవా కార్యక్రమాలు చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేను రక్షించుకునేందుకు సీఎం పళనిస్వామి తీవ్రంగానే ప్రయత్నించారు. బయటకు వెళ్లిన పన్నీరుసెల్వంను మళ్లీ పార్టీలోకి రప్పించారు. అధికారంలో, పార్టీలో ఇద్దరు సమం అన్నట్టుగా సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడిగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పన్నీరు సెల్వం ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాలన మూడేళ్లు విజయవంతం కావడంతో నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన పళనిస్వామి ఇక మార్పులు చేర్పులపై దృష్టి పెట్టడం అన్నాడీఎంకే నేతల్లో కలవరం రేపుతున్నాయి. చదవండి: ‘బ్రదర్ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు' మార్పులు చేర్పుల దిశగా.. తొలుత పన్నీరు రూపంలో ఆ తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. అయినా అందరినీ కలుపుకుని వెళ్లడంతో చాలా మంది మళ్లీ మాతృగూటికి వస్తున్నారు. ప్రజల్లో తనకు చరిష్మా ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పళనిస్వామి చాటుకున్నారు. అదే ఊపుతో పురపాలక, కార్పొరేషన్లు, పట్టణ పంచాయతీలు, వాయిదా పడ్డ తొమ్మిది జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం లక్ష్యంగా దూకుడు పెంచారు. ఈ పరిస్థితుల్లో నాలుగు రోజుల పాటుగా జిల్లాల వారీగా పార్టీ వర్గాలతో పన్నీరు, పళని భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అనేక జిల్లాల కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై జిల్లాల నుంచి వచ్చిన నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పళని, పన్నీరు మార్పు అనివార్యం అని ప్రకటించడం గమనార్హం. చదవండి: శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం ప్రకటనతో కలవరం.. మంగళవారం పన్నీరు, పళని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో నాలుగైదు రోజుల పాటుగా సాగిన జిల్లాల నేతల సమావేశం గురించి వివరించారు. ఇందులో అనేక అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. బలోపేతం, రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రతిజ్ఞ చేద్దామని, అంకిత భావంతో, ఐక్యతతో పనిచేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన సూచనలు, సలహా పాటించే దిశగా ప్రతి ఒక్కరూ హామీలు ఇచ్చారని పేర్కొంటూ, అదే సమయంలో తమ దృష్టికి తెచ్చిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మార్పులు చేర్పుల దిశగా ముందుకు సాగబోతున్నామన్నారు. ఎంజీఆర్, అమ్మ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. కాగా అనేక మంది మంత్రులు, జిల్లా నేతలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎవరి పదవులు ఊడుతాయో? ఎవరికి పదవులు వరిస్తాయో? అన్న చర్చ అన్నాడీఎంకేలో జరుగుతోంది. సేవల్లో.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నిర్ణయించింది. హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని కేడర్‌కు పిలుపునిచ్చింది. అలాగే జయంతి రోజున రాయపేటలోని పార్టీ కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. -
వారికి కూడా శివాజీ గణేశన్‌కు పట్టిన గతే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెర నటులుగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయ అజ్ఞానులని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదని ఎద్దేవా చేశారు. సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే నిర్వాహకులతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో మంగళవారం సమావేశమై పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అనంతరం ఆయన పత్రికాప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఇటీవలి ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ఎడపాడి ప్రశ్నించారు. ‘కమల్ పెద్ద నాయకుడే కదా, గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. పాపం ఆయనకు వయస్సు దాటిపోయి వృద్ధాప్య దశలోకి చేరుకోవడంతో సినిమా అవకాశాలు రాక రాజకీయ ప్రవేశం చేశారు. సినిమాలు విజయం సాధించక పోవడంతో కనీసం తమ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం స్థాపించాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చు. అది తప్పుకాదు. అయితే ఇతరులను దూషించడం తప్పు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు. నేను 1974లో అన్నాడీఎంకేలో చేరి పార్టీ కోసం 45 ఏళ్లపాటు పాటుపడ్డాను. ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకెళ్లాను. ప్రజాభిమానంతో సీఎం దశకు చేరుకున్నాను. రజనీ, కమల్ వెండితెర నటులు, రాజకీయం తెలియదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల సంఖ్య కూడా తెలియదు. ప్రజల సమస్యలపై అవగాహన లేదు. శివాజీగణేశన్ సొంతపార్టీ పెట్టి ఎన్నికల సమయంలో ఏమైనారో అందరికీ తెలుసు’ అంటూ రజనీకాంత్, కమల్ హాసన్‌లపై విమర్శలు గుప్పించారు. కాళ్లపై పడి ఎవరైనా సీఎం అవుతారు.. శివాజీ గణేశన్ రాజకీయ జీవితంపై సీఎం పళనిసామి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమాన సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతరులు కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి.. ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది. పళనిసామికి అధికారం మాత్రమే ఉందని.. పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకోరని.. అదే శివాజీ గణేశన్ మాత్రం తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంది. ఒకప్పడు తమ అభిమాన నటుడి ప్రచారంతో అన్నాడీఎంకే గెలుపొందిన విషయాన్ని సీఎం మరిచిపోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కమల్, రజనీ అభిమానులు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. -
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష లేనట్లేనా..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలకు క్షమాభిక్ష లేనట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హంతకుల విడుదలను నిరాకరిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మౌఖికంగా చెప్పినట్లు శుక్రవారం ప్రచారం జరగడంతో చర్చనీయాంశం అయింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21న చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఎన్నికల ప్రచారం సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో హతమయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి నళిని, మురుగన్, శాంతన్, పేరరివాళన్, రవిచంద్రన్, రాబర్ట్‌పయాస్, జయకుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్‌లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నలుగురికి యావజ్జీవ శిక్షపడింది. ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీలు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే క్షమాభిక్ష అంశంపై అనేక ఏళ్లు నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యాన్ని కారణంగా చూపి ఆ ముగ్గురి ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం ఏడుగురు ఖైదీలు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు పాతికేళ్లకుపైగా శిక్షను అనుభవించడంతో వారిని విడుదల చేయాలని 2014, 2016లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో తీర్మానం చేశారు. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది. భారత రాజ్యాంగం 161 సెక్షన్ కింద వారి విడుదలపై తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. ఈ పరిణామం తరువాత ఏడుగురు ఖైదీల విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ కోరింది. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు సైతం మద్దతు పలికాయి. పోరాటాలు కూడా చేశాయి. చట్టనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఏడుగురిని విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి గత ఏడాది ఏప్రిల్‌లో మరోసారి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపారు. అయితే తీర్మానాలు రాజ్‌భవన్‌కు చేరుకున్నా గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుమారు ఐదేళ్లుగా ఈ వ్యవహారం రాజ్‌భవన్‌లో నానుతుండగా, ఏడుగురు ఖైదీల విడుదల చేయరాదని గవర్నర్ నిర్ణయించినట్లుగా రాజ్‌భవన్ వర్గాల ద్వారా అనధికార సమాచారం శుక్రవారం బయటకు వచ్చింది. చట్టనిపుణులతో గవర్నర్ చర్చించిన తరువాతనే గవర్నర్ ఈ నిర్ణయానికి వచ్చారని, గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సైతం గవర్నర్ తోసిపుచ్చారని వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఎలాంటి సమాచారం రాలేదు. ముఖ్యమంత్రి ఎడపాడికి గవర్నర్ మౌఖికంగా ఈ విషయాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖైదీల విడుదల విషయంలో గవర్నర్ బన్వరిలాల్ నిర్ణయం ఏమిటో అధికారికంగా ప్రకటించాలని పీఎంకే నేత డాక్టర్ రాందాస్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాజీవ్ హంతకుల్లో ఒకరైన రవిచంద్రన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
పళని స్వామిని కలిసిన టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల : తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ విధి విధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్ లో సీఎం పళని స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి వారి మధ్య చర్చ జరిగింది. భక్తులకు మరింత సులువుగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు సీఎం పలు సూచనలు చేశారు. వసతులను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు చర్చించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి తీర్ధప్రసాదాలను సీఎం పళని స్వామికి అందజేసి శాలువాతో సత్కరించారు. -
స్పీకర్ల అధికారాలు తేల్చాలి
తమిళనాడులో టీటీవీ దినకరన్ శిబిరంలోకి వెళ్లిన18మంది అన్నా డీఎంకే శాసనసభ్యులపై అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ అనర్హత వేటు వేయడం సరైందేనని మద్రాస్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్ర రాజకీయాలకు ఓ కుదుపు. తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఆ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై నాలుగు నెలలక్రితం ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం రెండు భిన్నమైన తీర్పులివ్వడంతో ఈ కేసు మూడో న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణన్ దగ్గరకెళ్లింది. స్పీకర్ చర్య సరైనదేనని ఆ ఇద్దరు సభ్యుల్లో ఒకరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరాబెనర్జీ ఇచ్చిన తీర్పుతో తాజాగా జస్టిస్ సత్యనారాయణన్ ఏకీభవించడంతో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పలేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి ఈ తీర్పు తాత్కాలికంగా ఊరట కలిగించింది. దానికితోడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని శుక్రవారం నిర్ణయించడం కూడా ఒకరకంగా ఆయ నకు అనుకూల పరిణామమే. అందుకు భిన్నంగా వారు అనర్హతకు సిద్ధపడి ఉప ఎన్నికలవైపే మొగ్గు చూపితే పళనిస్వామి ఇబ్బందుల్లో పడేవారు. అనర్హులైన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిం చిన 18 స్థానాలతోపాటు డీఎంకే అగ్రనేత కరుణానిధి, అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఏకే బోస్‌ల మరణాలతో ఖాళీ అయిన మరో రెండు సీట్లకు ఉప ఎన్నికలొస్తే అవి ఆయనకు అగ్నిపరీక్షగా మారేవి. ఆయనా, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంల సత్తా ఏమిటో తేలిపోయేది. అన్నాడీఎంకే విజయం సాధించలేకపోతే వారి శిబిరం ఖాళీ అయి, ప్రభుత్వం కుప్పకూలేది. నిరుడు అన్నాడీ ఎంకేలోని పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు విలీనమయ్యాక జయలలిత సన్నిహితురాలు శశికళనూ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే పార్టీలోని 19మంది ఎమ్మెల్యేలు దినకరన్‌తోనే ఉండిపోయారు. వారు నిరుడు సెప్టెంబర్‌లో అప్పటి గవర్నర్ విద్యాసాగరరావును కలిసి పళని ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారిలో ఒకరు వెనక్కి తగ్గారు. మిగిలినవారిపై స్పీకర్ ధన్పాల్ అనర్హత వేటు వేశారు. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో డీఎంకేకు 88, ఆ పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్‌కి 8, ఐయూ ఎంఎల్‌కు ఒక స్థానం ఉన్నాయి. అయితే తమిళనాడు రాజకీయ దృశ్యం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరి ప్రభుత్వాలున్నా అవి దూకుడుగా వ్యవహరించేవి. కేంద్రంలో ఎవరున్నా కావలసినవి సాధించుకునేవి. పళని సర్కారు అందుకు భిన్నం. పేరుకు ప్రభుత్వం ఉన్నా ఏ విష యంలోనూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నదన్న అభిప్రాయం కలగదు. ‘తల లేని మొండెం’ తరహాలోనే వ్యవహరిస్తోంది. అది బీజేపీ పెద్దల ఆదేశాలతో నడుస్తున్నదని విపక్షాలు తరచు విమర్శిస్తుంటాయి. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతోనే నెగ్గినా ఆయన పార్టీ అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు జనంలో ఏమేరకు ఆదరణ ఉందో ఇంకా తెలియదు. ఆ విషయంలో ఆయనకే స్పష్టత లేదు. కను కనే అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కనబడు తోంది. ఆయన పార్టీకి కార్యకర్తల బలం లేదు. ఈ స్థితిలో ఉప ఎన్నికలకు సిద్ధపడి, పరాజయం పాలైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఆయన శిబిరంలో ఎవరూ మిగలరు. కానీ విపక్ష డీఎంకేకు ఇకపై తాము మాత్రమే ప్రధాన ప్రత్యర్థులమని దినకరన్ తరచు చెబుతుంటారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కార్యకర్తలతో పటిష్టంగా ఉన్నవి రెండే రెండు పార్టీలు–డీఎంకే, అన్నాడీఎంకే. అధి కారంలో ఉంది గనుక అన్నాడీఎంకేకు కార్యకర్తల బలం ఇంకా దండిగానే ఉంది. సినీ నటుడు కమల్‌హాసన్ పేరుకు పార్టీ ప్రారంభించినా అదింకా అడుగులేయడం ప్రారంభించలేదు. మరో నటుడు రజనీకాంత్ పార్టీ ఇంకా పురుడు పోసుకోలేదు. పళని ప్రభుత్వాన్ని నడిపించేది బీజేపీ యేనని అందరూ అనుకుంటున్నా ఆ పార్టీ అందుకు తగ్గట్టు చురుగ్గా పనిచేస్తున్న దాఖలాలు లేవు. బీజేపీ కర్ణాటకలో అట్టడుగు స్థాయి వరకూ పార్టీ శ్రేణుల్ని పటిష్టపరుచుకుని అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటగలిగింది. కేరళలో సైతం రాజకీయంగా పనికొచ్చే ఏ అంశాన్నీ వదలకుండా పనిచేస్తోంది. కానీ తమిళనాడులో ఇందుకు భిన్నం. ప్రధాన నాయకులు హెచ్. రాజా, తమిళసై సౌందర్రాజన్లిద్దరూ తాము చేసే కార్యక్రమాల కన్నా, తరచు చేసే అపసవ్య వ్యాఖ్యల ద్వారా వార్తల్లోకెక్కుతూ ఉంటారు. నోరుజారి ఏదో వివాదంలో చిక్కుకుని ఇబ్బందుల్లో పడతారు. డీఎంకే మాత్రం అన్నివిధాలా పటిష్టంగా ఉంది. అయినా రజనీకాంత్‌ను అది తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన్ను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగించడం... సొంత పార్టీ ఏర్పాటుకే రజనీ మొగ్గు చూపితే ఆయనపై బీజేపీ ముద్రేసి ప్రభావం తగ్గించే ప్రయత్నం చేయడం డీఎంకే వ్యూహం. అయితే ఒక్క తమిళనాడు ఉదంతంపైన మాత్రమేకాక మొత్తంగా స్పీకర్లకున్న అధికారాలను సుప్రీంకోర్టు సమీక్షించడం తక్షణావసరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ స్థానం ఉన్నతమైనది. ఆ స్థానంలో ఉన్నవారు తటస్థంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని రాజ్యాంగం భావిస్తుండగా, ఆచరణలో అదంతా తలకిందులవుతోంది. పాలక పక్షాల కనుసన్నల్లో మెలగుతూ నిర్ణయాలు తీసుకోవడం లేదా నిర్ణయరాహిత్యంతో గడిపేయడం స్పీకర్లకు అల వాటైపోయింది. తాము అన్నిటికీ అతీతులమని, తమ జోలికెవరూ రాలేరని వారు భావిస్తున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల అప్పీల్ విచారణ సందర్భంగానైనా చట్టసభల హక్కులు, స్పీకర్ల అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం వెలువరిస్తే ప్రస్తుత అరాచక ధోరణికి అడ్డుకట్ట పడుతుంది. -
ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్షననుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలనకు పంపినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఖండించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన ఈనెల 9వ తేదీన సమావేశమైన మంత్రివర్గం.. ఏడుగురు రాజీవ్ హంతకుల విడుదలకు సిఫారసు చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు కూడా పంపింది. అయితే, గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు ఈనెల 14న మాత్రమే తమకు అందాయని, నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. -
రాజీవ్ హంతకుల్ని విడుదల చేయండి
సాక్షి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాల్సిందిగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆదివారం చెన్నైలో ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. కాంగ్రెస్ మినహా తమిళనాడులోని మిగిలిన పార్టీలన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ హత్య దోషులను విడుదల చేసేందుకు విముఖంగా ఉండటం తెలిసిందే. రాజీవ్ హత్య కేసులో మురుగన్, శాంతన్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయాస్, నళిని, రవిచంద్రన్‌లు గత 27 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాజ్యాంగంలోని 161వ అధికరణం ప్రకారం వీరిని విడుదల చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. 2014లో జయలలిత సీఎం ఉండగానే దోషులను విడుదల చేయాలని నిర్ణయించినా కేంద్రం అప్పట్లో సుప్రీంను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు కూడా గవర్నర్‌కే వదిలేసింది. మరి ఇప్పుడు గవర్నర్ కేంద్రాన్ని కాదని దోషులను విడుదల చేస్తారా అని ప్రశ్నించగా, ఇది రాష్ట్ర ప్రభుత్వ, ప్రజల నిర్ణయమనీ, గవర్నర్ అందుకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. -
‘13 మంది రక్తం తాగిన పళనిస్వామి ప్రభుత్వం’
సాక్షి, చెన్నై: పళనిస్వామి ప్రభుత్వం రక్తం రుచి మరిగిందని డీఎంకే నాయకురాలు కనిమొళి మండిపడ్డారు. తూత్తుకుడి (ట్యూటికోరిన్)లో వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడానికి స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు మంగళవారం నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. వారికి సంతాపం ప్రకటిస్తూ కనిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం తూత్తుకుడిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీఎంకేతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న కనిమొళితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. స్టెరిలైట్ పరిశ్రమ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఎదురు తిరిగిన అమాయకులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 13 మందిని పొలీసుల తూటాలు బలితీసుకుంటే ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో వారు మృతి చెందారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని కనిమొళి మండిపడ్డారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉంది.. తూత్తుకుడిలో ప్రజా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మురళీ రాంబ తెలిపారు. పరిస్థితిలో అదుపులోనే ఉందనీ.. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పట్టణంలో సరిపడా బలగాలను మోహరించామని అన్నారు. కాగా, ప్రజల ఆందోళనల నేపథ్యంలో పర్యావరణ హితం కోరి స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను నిలిపి వేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ‘ప్రభుత్వం స్టెరిలైట్ పరిశ్రమపై తీసుకునే చర్యలపై ఒక స్పష్టత వచ్చింది. పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది’అని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి తెలిపారు. టీఎన్పీసీబీ అనుమతులను రెన్యువల్ చేయకుండానే పరిశ్రమను నడపాలని చూస్తున్నారని కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. -
విడతల వారీగా మద్య నిషేధం.. స్పందించిన స్టార్ హీరో
సాక్షి, చెన్నై: మద్య నిషేధం అంటేనే చాలు ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఎందుకంటే మద్యం అమ్మకాల వల్ల ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం చూకూరుతుందని, వాటి విషయంలో నేతలు ఆచితూచి అడుగేస్తుంటారు. కానీ, తమిళనాడు ప్రభుత్వం మద్య నిషేధానికి కట్టుబడి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విడతల వారీగా మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశలో భాగంగా ఈనెల 24న రాష్ట్ర వ్యాప్తంగా 500 మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని స్టార్ హీరో విశాల్ స్వాగతించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు గతంలో అన్ని పార్టీలు మద్యనిషేధం అంటూ హామీలిచ్చేశాయి. కానీ, మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప తగ్గలేదు. డీఎంకె, ఏఐఏడీఎంకే, పీఎంకే పార్టీలు ఎన్నికలనగానే మద్య నిషేధానికి మ్యానిఫెస్టోలో ప్రాధాన్యతనిచ్చేవి. అమలుకు మాత్రం ఆ హామీ నోచుకోక పోయేది. చివరికి పళనిస్వామి హయాంలో మద్య నిషేధానికి శ్రీకారం చుట్టడంతో హర్షం వ్యక్తమవుతోంది. -
నన్ను బెదిరిస్తున్నారు
సాక్షి, చెన్నై: తనను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఐటీ, సీబీఐ దాడుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ బెదిరింపులకు తాను భయ పడనని, త్వరలో అమ్మ జయలలిత ఆశించిన పాలన తమిళనాట రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తనకు అఖండ మెజారిటీ ఇవ్వడాన్ని రాష్ట్రంలోని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తనకు మద్దతుగా ప్రజానీకం, అన్నాడీఎంకే కేడర్, నేతలు కదులుతున్నారని తెలిపారు. తనను చూసి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దినకరన్ వర్గీయులపై మరో వేటు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపునకు కృషి చేసి పార్టీ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వేలూరు, విరుదునగర్, తూత్తుకూడి జిల్లాలకు చెందిన 9 మంది నేతలను అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి మంగళవారం బహిష్కరించారు. మరోవైపు దినకరన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే లక్ష్యంతో నేడు అన్నాడీఎంకే సమావేశం జరగనుంది. -
46 మంది అన్నాడీఎంకే నేతలపై వేటు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దినకరన్‌కు మద్దతుగా నిలిచారనే ఆరోపణల కారణంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సహా 46 మంది పార్టీ జిల్లా కార్యదర్శులపై సీఎం ఎడపాటి పళనిస్వామి గురువారం బహిష్కరణ వేటు వేశారు. వారందరినీ పార్టీ పదవులు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వేటు పడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ సామితో పాటు మదురై, విల్లుపురం, ధర్మపురి, తిరుచ్చిరాపల్లి, పెరంబులూరు జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు. కాగా, జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ జయలలిత స్నేహితురాలు శశికళకు సమన్లు జారీ చేసినట్లు ఈ నెల 22న కమిషన్ కార్యాలయం వెల్లడించింది. శశికళ బెంగళూరు జైల్లో ఉన్నందున లిఖితపూర్వకంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం నమోదు చేసుకుంటామని, తప్పనిసరైన పక్షంలో నేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. కాగా, జయ చికిత్సపై ఆధారాలు అందజేయాల్సిందిగా ఈనెల 22వ తేదీన ఈ మెయిల్ ద్వారా కమిషన్ నుంచి వచ్చిన సమన్లను జైలు అధికారులు శశికళ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మెయిల్ ద్వారా వచ్చిన సమన్లను ఆమె నిరాకరించినట్లు, నేరుగా వచ్చి సమన్లు అందజేస్తేనే స్వీకరిస్తానని ఆమె వివరణ ఇచ్చినట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ మెయిల్ ద్వారా శశికళకు సమన్లు పంపలేదని విచారణ కమిషన్ వివరణ ఇచ్చింది. -
ఇంతకీ గుండు గీయించుకుంటారా..?
ఆర్కేనగర్లో గెలుపుతో దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. గొంతు నొప్పితో బాధ పడుతున్నా, తన వ్యూహాలకు పదును పెట్టడం లక్ష్యంగా సోమవారం మద్దతు దారులతో ఆయన మంతనాల్లో మునిగారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల్ని తన వైపునకు తిప్పుకునేందుకు పథకం రచించారు. దీన్ని అమలుచేయడానికి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ రంగంలోకి దిగనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఈపీఎస్, ఓపీఎస్ వైపు ఉన్న తన స్లీపర్ సెల్స్ ద్వారా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాలం వేయడానికి దినకరన్ వ్యూహ రచన చేసినట్టు సమాచారం. తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తదితర డెల్టా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తమ వైపునకు తిప్పుకునే బాధ్యతల్ని చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకరన్ తన భూజాన వేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వ్యూహాలకు పదును పెట్టే విధంగా దూకుడు పెంచేందుకు సిద్ధమైన దినకరన్ సోమవారం కూడా తన మద్దతు నేతలతో బిజీగా గడిపారు. సూలూరు ఎమ్మెల్యే కనకరాజ్ తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండడంతో ఆయన ద్వారా మరి కొందరు ఎమ్మెల్యేల్ని తిప్పుకోవడంతో పాటు జిల్లాల కార్యదర్శుల్ని గురిపెట్టి మద్దతుదారులతో సంప్రదింపుల్లో మునిగి ఉండడం గమనార్హం. ఓవైపు గొంతు నొప్పి ఉన్నా, మరోవైపు ఏ మాత్రం తగ్గకుండా విజయోత్సాహంతో రెట్టింపు దూకుడుతో ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నాడీఎంకే కేడర్‌లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇక, దినకరన్‌కు సాయంగా కుటుంబానికి చెందిన కృష్ణప్రియ, జయానంద్ సైతం ఇక, చురుగ్గా దూసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. స్వరం పెంచిన మద్దతు దారులు ఆర్కే నగర్ గెలుపుతో ఈపీఎస్, ఓపీఎస్‌లకు వ్యతిరేకంగా దినకరన్ మద్దతుదారులు స్వరాన్ని పెంచుతున్నారు. మీడియాతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మాట్లాడుతూ, ఆర్కేనగర్ ఎన్నికల్లో తామేదో మాయ చేశామని ఈపీఎస్, ఓపీఎస్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సహాకారాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓటర్లకు తలా రూ.ఆరు వేలు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించబోమని వ్యాఖ్యానించడం శోచనీయమని, వాస్తవానికి చెప్పాలంటే, ఇకనైనా ఈపీఎస్, ఓపీఎస్‌తో పాటు అక్కడున్న మంత్రులు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. దినకరన్ గెలిస్తే గుండు గీయించుకుంటానని ఓ మాజీ మంత్రి సవాల్ చేశారని, ఇంతకీ గుండు గీయించుకుంటారా..? అని వలర్మతిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. అమ్మ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లు, ప్రస్తుతం చిన్న పిల్లల చేష్టలతో నిందల్ని తమ మీద మోపే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం వాళ్లకు లేదని స్పష్టంచేశారు. ఓపీఎస్ ఒకప్పుడు దినకరన్, తన ముందుకు చేతులు కట్టుకుని నిలబడ్డ కార్యకర్త అని, ఇప్పుడు తమ మీదే నిందలు వేసే స్థాయికి చేరాడని మండిపడ్డారు. స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయని, ఇక రోజుకో ఎపిసోడ్ అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయని ఆయన ముగించడం గమనార్హం. ఇక, దినకరన్ మద్దతు మహిళా నాయకురాలు, నటి సీఆర్ సరస్వతి అయితే, ఆర్కేనగర్లో ఓటుకు తాము ఒక్క నోటు కూడా ఖర్చు పెట్టలేదని, వచ్చిన మెజారిటీ అంతా ప్రజాదరణే అని వ్యాఖ్యానిస్తున్నారు. అభినందనలు.. విమర్శలు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్న దినకరన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడు విశాల్, శరత్‌కుమార్ వంటి వారే కాదు, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు పలు పార్టీలు అభినందిస్తున్నాయి. అలాగే, ఆరుగురు మంత్రులు, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. అదే సమయంలో ఈ గెలుపును వ్యతిరేకించే విధంగా, విమర్శలు గుప్పించే రీతిలో స్పందించే వాళ్లూ ఉన్నారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై ముందంజలో ఉన్నారు. అసలు ఇది కూడా ఒక గెలుపేనా అని ఆమె మండిపడుతున్నారు. అలాగే, డీఎండీకే అధినేత విజయకాంత్ అయితే, గెలిచారు.. అంతే.. అంటూ ముందుకు సాగారు. శుభాకాంక్షలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, వాటితో సంబంధం లేదన్నట్టుగా దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. తన లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్‌ల వద్ద ఉన్న పార్టీ, రెండాకుల చిహ్నం కైవశం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తవైపునకు తిప్పుకునేందుకు కసరత్తుల్లో ఉన్నారు. నమ్మకంతో ఓటు వేశారు : దినకరన్ తన మీద నమ్మకంతో ఆర్కేనగర్ ఓటర్లు ఓటు వేశారేగానీ, తాయిలాలకో, నోట్ల మీదున్న ఆశతో మాత్రం కాదు అని దినకరన్ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తనకు ఫ్రెషర్ కుక్కర్ చిహ్నం వచ్చినప్పుడే అందరికీ ఫ్రెషర్ తెప్తిసానని చెప్పినట్టు గుర్తుచేశారు. అనేకమంది డిపాజిట్లు సైతం గల్లంతు కాబోతున్నాయని తాను ముందే చెప్పినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందే తాను అక్కడి ఓటర్లతో ఏ విధంగా మమేకం అయ్యానో అన్నది గుర్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి ఓటర్లు తమ మీద అపార నమ్మకాన్ని కల్గి ఉన్నారని, అందుకే తనకు పట్టం కట్టారని తెలిపారు. అంతేగానీ, తానేదో నోట్లు, తాయిలాలు వెదజల్లినట్టుగా ఆరోపించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను కాదు, అన్నాడీఎంకే పాలకులు రూ.120 కోట్లను నియోజకవర్గంలో చల్లారని, ఒక్కో ఓటుకు రూ.ఆరు వేలు ఇచ్చారని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డీఎంకేతో తానేదో కుమ్మకైన్నట్టు చెబుతున్నారని, డీఎంకే ఎంత పెద్ద పార్టీ అని, ఆ పార్టీ ఓట్లు తనకు ఎవరైనా వేయమని ఆదేశిస్తారా..? అని ప్రశ్నించారు. -
'అమ్మ'కు ఘన నివాళి
-
జనసంద్రంగా మారిన మెరీనా బీచ్
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు 'అమ్మ' సమాధి వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద గల జయలలిత సమాధి వద్ద సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం 'అమ్మ'కు ఘన నివాళి అర్పించారు. వీరితో పాటు తమిళనాడు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జయకు నివాళులు అర్పించారు. అమ్మతో తమ అనుబంధాన్ని, రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుని పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. పళని, పన్నీర్ నేతృత్వంలో మెరీనా బీచ్ నుంచి జయ అభిమానులు, పార్టీ శ్రేణులు శాంతియుత ర్యాలీ చేపట్టాయి. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. చెన్నై మెరీనాబీ చ్లో ఎంజీఆర్ సమాధి పక్కనే 6వ తేదీన జయకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. -
'సారీ.. నేను రాలేను.. పన్నీర్ వస్తారు'
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీస్వామి చెప్పారు. తన బదులు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వస్తారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తన తండ్రి విగ్రహ ప్రారంభానికి రాకుండా తనను అవమానించారని నటుడు ప్రభు ఇటీవల రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కే రాజుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం నేరుగా ప్రభుకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. తాను రాలేకపోవడానికి కారణాలు వివరించారు. 'గణేశన్ మెమోరియల్‌ను స్వయంగా ప్రారంభించాలని నాకు ఆశగా ఉంది. అయినప్పటికీ ముందుకు ఖరారు అయిన కొన్ని కార్యక్రమాల కారణంగా నేను ఆరోజు అందుబాటులో ఉండటం లేదు. అందుకే, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రారంభోత్సవానికి వస్తారు' అని పళనీ స్వామి చెప్పారు. అక్టోబర్ 1 శివాజీ గణేశన్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. గతంలో ఆయన విగ్రహం చెన్నైలోని కామరాజర్ సాలయ్ వద్ద ఉండేది. అయితే, ప్రజల సౌకర్యం రీత్యా వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో తిరిగి రూ.2.80కోట్ల వ్యయంతో ఆద్యార్ ప్రాంతంలో పూర్తిగా ద్రవిడియన్ పద్థతిలో నిర్మించారు. -
రెండాకులు మావే!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మాదేనని, మరికొద్ది రోజుల్లో ఆ చిహ్నం మళ్లీ చేతికి రానున్నట్టు సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్ మద్దతు నేతలు ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలను శుక్రవారం ఢిల్లీలో సీఈసీకి నివేదిక రూపంలో అందజేశారు. త్వరగా చిహ్నాన్ని కేటాయించాలని విన్నవించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక సమయంలో రెండాకుల చిహ్నం కోసం అన్నాడీఎంకేలో గ్రూపులుగా ఉన్న ఈపీఎస్, ఓపీఎస్‌ల శిబిరాల మధ్య తీవ్ర సమరం సాగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండాకుల చిహ్నం సీజ్ చేశారు. రెండాకులు పోయి, ఆ ఎన్నికలు ఆగడంతో తదుపరి పార్టీని, చిహ్నాన్ని చేజిక్కించుకునేందుకు ఓపీఎస్, ఈపీఎస్ తీవ్ర కుస్తీలు పట్టారు. వేర్వేరుగా ఎన్నిక యంత్రాంగానికి ప్రమాణ పత్రాల రూపంలో సమర్పించారు. ఈ వ్యవహారం విచారణలో ఉన్న సమయంలో ఈపీఎస్, ఓపీఎస్ ఏకమయ్యారు. దీంతో ఇద్దరు కలిసి చిహ్నం, పార్టీని చిన్నమ్మ శశికళ అండ్ బృందం నుంచి రక్షించుకునే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చి, అందులో చిన్నమ్మను సాగనంపుతూ తీర్మానాలు చేశారు. అన్నాడీఎంకే తమదేనని, చిహ్నం తమకే దక్కాలన్న కాంక్షతో తీర్మానాలు ఇటీవల చేశారు. వీటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించే పనిలో ఈపీఎస్, ఓపీఎస్ మద్దతు నేతలు నిమగ్నమయ్యారు. ఇది వరకు ఓ మారు ఢిల్లీ వెళ్లినా, వీరికన్నా ముందుగా తమతో సంప్రదింపులు జరపకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ సీఈసీకి లేఖ సమర్పించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈపీఎస్ తరఫున మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్బీ ఉదయకుమార్, ఓపీఎస్ తరఫున మాజీ మంత్రి మునుస్వామి, ఎంపీ మైత్రేయన్, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ ఢిల్లీ వెళ్లారు. రెండాకులు మావే : అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, హాజరైన సభ్యుల వివరాలు, తీర్మానాలు తదితర అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఢిల్లీలో ఈ నేతలు సమర్పించారు. ముక్తకంఠంతో, ఏకాభిప్రాయంతో సర్వ సభ్య సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు అన్నాడీఎంకే తమదేనని, రెండాకుల చిహ్నం తమకే దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ, అన్ని వివరాలను సీఈసీ ముందు ఉంచామని వివరించారు. సర్వ సభ్య సమావేశాలకు హాజరైన వారందరి వివరాలు, రాని వారు తమకు సమర్పించిన లేఖలు తదితర అంశాలను సైతం సీఈసీ ముందు ఉంచామని పేర్కొన్నారు. మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే చిహ్నం రెండాకులు 100 శాతం తమదేనని, త్వరలో ఆ చిహ్నం తమకు మళ్లీ దక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా తమను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. చిహ్నం తమ చేతికి రాగానే, అన్నాడీఎంకే బలం ఏమిటో , సత్తా ఏమిటో మరోమారు చాటుతామన్నారు. పార్టీలో కనీసం సభ్యుడు కూడా కాని దినకరన్ ఎలా అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి పిలుపునిస్తున్నాడో చూస్తామని, ఆయన దూకుడుకు కల్లెం వేస్తామని హెచ్చరించారు. -
పళని రాజీనామా చేయాల్సిందేః దినకరన్
సాక్షి,చెన్నయ్: తమిళనాడు సీఎం పళనిస్వామి పదవి నుంచి వైదొలగి నూతన శాసనసభా పక్ష నేత ఎంపికకు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని పార్టీ వేటుకు గురైన టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు. సీఎం ముందుగా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించాలని, తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని కోరారు. పళనిస్వామికి సీఎం పదవి, క్యాబినెట్‌ను చిన్నమ్మే (శశికళ) ప్రసాదించారని, అందుకే తాము పళనిని సీఎం పదవికి రాజీనామా చేసి వేరొకరికి అప్పగించాలని కోరుతున్నామన్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను పళనిస్వామికి పంపుతానని, అయితే వారు విశ్వాస పరీక్ష సందర్భంగా పళనికి ఓటు వేయకపోతే దానికి తాను బాధ్యత వహించనని దినకరన్ స్పష్టం చేశారు. గత నెలలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఏకమైన క్రమంలో దినకరన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వంపై వేటు వేయాలని కోరుతూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. -
ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన!
వెంటనే బలపరీక్ష నిర్వహించాలి గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వండి రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్ష సభ్యులు న్యూఢిల్లీ: తమిళ రాజకీయ ప్రకంపనలు ఢిల్లీకి చేరాయి. సీఎం పళనిస్వామికి మెజారిటీ లేదని, తమిళనాడు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి.. బలపరీక్షను నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. రాష్ట్రపతిని కలిసినవారిలో డీఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళని సర్కారు మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. సీఎం పళని వర్గానికి మెజారిటీ లేకపోయినా.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఆయన వైఖరి ఉందని ప్రతిపక్ష సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి.. బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్రపతిని కోరారు. అనంతరం సీపీఎం నేత ఏచూరి, సీపీఐ నేత రాజా, డీఎంకే నేత స్టాలిన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వైఖరికి లేఖే కారణమా? దినకరన్ వర్గం పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ.. గవర్నర్ విద్యాసాగర్‌రావు చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అందించిన లేఖలో పొరపాట్లు ఉన్నాయని, అందువల్లే తాము చర్య తీసుకోవడం లేదని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. తాము అన్నాడీఎంకే ఎమ్మెల్యేలమే అయినప్పటికీ, పళనిస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం లేదని, బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వం తిరుగుబాటు చేస్తే.. అది పార్టీ అంతర్గత విషయం అవుతుందని, అప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకొని గవర్నర్‌కు తెలియజేయవచ్చునని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తమకు మెజారిటీ లేదన్న విపక్షాల వాదనను అన్నాడీఎంకే తోసిపుచ్చుతోంది. పళనికి పూర్తిస్థాయిలో సంఖ్యాబలముందని చెప్తోంది. -
ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన!
-
రొంబ సస్పెన్స్ !
-
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
-
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
ఆ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నారు వారి డిమాండ్ మేరకు బలపరీక్ష నిర్వహించలేం ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన గవర్నర్ విద్యాసాగర్‌రావు సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపలను రేపుతూనే ఉంది. దాదాపు 20మందికిపైగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతలు గురువారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ కోరారు. అయితే, ప్రతిపక్షాల విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని, కాబట్టి రెబల్స్ డిమాండ్ మేరకు తాను నడుచుకోలేనని ఆయన షాక్ ఇచ్చారు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారని ప్రతిపక్ష వీసీకే పార్టీ నేత తిరుమవలవాన్ తెలిపారు. ప్రస్తుతం దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు రిసార్ట్‌లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్‌రావు అసెంబ్లీని సమావేశపరిచి.. బలపరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారా అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పట్లో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా బలపరీక్ష ఉండబోదనే సంకేతాలు తాజాగా గవర్నర్ ఇచ్చినట్టయిందని, ఇది దినకరన్ వర్గానికి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
దూకుడు పెంచిన దినకరన్
చెన్నై: ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి బహిష్కరణకు గురైన ఏఐఏడీఎంకే (అమ్మ) వర్గం నేత టీటీవీ దినకరన్ దూకుడు మరింత పెంచారు. పార్టీని సోమవారం పునర్వ్యవస్థీకరించారు. ఇందులోభాగంగా సీనియర్ నేతలతోపాటు మంత్రులను సైతం పార్టీ పదవులనుంచి తప్పించారు. ఈ జాబితాలో సీనియర్ మంత్రులు పి.తంగమణి, ఎస్పీ వేలుమణిలున్నారు. నమ్మక్కల్, కోయంబతూర్ జిల్లా శాఖ కార్యదర్శుల పదవుల్లో ఉన్న వీరిని తొలగించారు. తిరుచిరాపల్లి నగర శాఖ కార్యదర్శి నటరాజన్‌ను సైతంఆ పదవి నుంచి తప్పించారు. ఇంకా తిరుచిరాపల్లి శాఖ కార్యదర్శి రతినవేల్ను సైతం తొలగించారు. ఇతర జిల్లాల శాఖలను సైతం పునర్వ్యవస్థీకరిస్తామని, పార్టీ అధినేత్రి శశికళ ఆమోదంతోనే ఇదంతా చేశానని ప్రకటించారు. ఎప్పుడో సాగనంపాం కదా: పళనిస్వామి ఉప ప్రధాన కార్యదర్శి పదవినుంచి దినకరన్‌ను ఈ నెల పదో తేదీనే తొలగించామని, అందువల్ల ఆయన చేపట్టే మార్పులుచేర్పులు చెల్లబోవని ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన ఏఐఏడీఎంకే సమావేశం తేల్చిచెప్పింది. జయలలిత హయాంలో జరిగిన నియామకాలను తొలగించే అధికారం ఆయనకు ఎంతమాత్రం లేదంటూ ఓ తీర్మానం చేశారు. పళనిస్వామి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తదితరులు హాజరయ్యారు. -
అవిశ్వాసం తీర్మానం కోసం గవర్నర్ చెంతకు
సాక్షి, చెన్నై: దినకరన్ వర్గం తిరుగుబాటుతో మైనారిటీలో పడిన పళనిస్వామి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతిపక్ష డీఎంకే ప్రయత్నిస్తోంది. పళని సర్కారు వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు ఆదివారం గవర్నర్ సీ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన స్టాలిన్ వెంట డీఎంకే నేతలతోపాటు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల నేతలు ఉన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా స్టాలిన్ గవర్నర్‌ను కోరారు. శశికళ వర్గంలో ఇప్పటికీ 21మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరారు. మరింతమంది అన్నాడీంఎకే ఎమ్మెల్యేలు తమ గూటికి చేరుకునే అవకాశముందని దినకరన్ వర్గం చెప్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా బలపరీక్ష జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? పళనిస్వామికి ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ధనపాల్ వేటు వేస్తారా? పళనిస్వామి-పన్నీర్ సెల్వం ద్వయం బలపరీక్ష గట్టెక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
ముందు పళని బలం తేలాల్సిందే!
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ సీ విద్యాసాగర్ రావును ప్రతిపక్ష నేత స్టాలిన్ కోరారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసిన డీఎంకే అధినేత తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచాలని విజ్నప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మైనార్టీలో ఉందని తెలిపిన స్టాలిన్ పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ్డారంటూ 19మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైన విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా పళని ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని వివరించారు. గతంలో సభలో బలనిరూపణ సందర్భంగా వ్యతిరేకంగా ఓటేసిన పన్నీర్ సెల్వం అండ్ గ్రూప్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధన్పాల్ ఇప్పుడు పార్టీ విప్ ఆదేశాలతో దినకరన్ వర్గానికి నోటీసులు పంపటం ఆశ్చర్యంగా ఉందని స్టాలిన్ తెలిపారు. -
మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ సర్కార్‌ను కూల్చితీరుతామన్న టీటీవీ దినకరన్ వర్గం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న దినకరన్ శిబిరం... వారిని జారిపోకుండా చూసుకునే క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యేలను మరో రిసార్ట్స్‌కు తరలించింది. ఎమ్మెల్యేలను వేరే రిసార్ట్స్‌కు తరలిస్తున్నామని, విండ్‌ఫ్లవర్ రిసార్ట్ కేవలం రెండురోజులకే బుక్ చేశామని దినకరన్ సహచరుడు, ఏఐఏడీఎంకే నేత టీటీ సెల్వం తెలిపారు. ఇవాళ దినకరన్‌తో సమావేశమై భవిష్యత వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శశికళను పార్టీ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను దినకరన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. పార్టీలో గ్రూపుల విలీనంతో తాము విభేదించకపోయినా చిన్మమ్మను దూరం పెట్టడం సరికాదని దినకరన్ మండిపడుతున్నారు. -
పళనీ.. బలపరీక్షకు సిద్ధపడు..!
చెన్నై: అధికార అన్నాడీఎంకేలోని శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. అసెంబ్లీ వేదికగా పళనిస్వామి బలపరీక్షకు సిద్ధపడాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఈ విషయమై లేఖ రాశారు. రాష్ట్రంలో అసాధారణ రాజ్యాంగ సంక్షోభం నెలకొన్నదని, ఈ నేపథ్యంలో ఎంతమాత్రం జాప్యం చేయకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిందిగా సీఎంకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా డీఎంకేతో స్వరం కలిపింది. వెంటనే అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలంటూ గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కేఆర్ రామస్వామి లేఖ రాశారు. శశికళ వర్గం ఎమ్మెల్యేలు 19మంది తిరుగుబాటు చేయడంతో పళని సర్కారు విశ్వాసపరీక్షలో ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్, డీఎంకేలు భావిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో మరోసారి క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. శశికళ వర్గం వ్యూహాత్మకంగా తన 19మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని విండ్‌ఫ్లవర్ రిసార్ట్‌కు తరలించింది. కాగా, ఈ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే కార్యకర్తలు రిసార్ట్ ఎదురుగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
ఈ చెలిమి గెలుస్తుందా?
తమిళనాట ఆర్నెల్లనాడు మొదలై ఎడతెగకుండా సాగుతున్న అసంబద్ధ రాజకీయ నాటకానికి ఎట్టకేలకు తెరపడింది. అన్నా డీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గాలు రెండూ సోమవారం విలీనమ య్యాయి. పార్టీ పగ్గాలను పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ సారథ్యాన్ని పళనిస్వామి చేపట్టాలని ఇరుపక్షాలూ ఒప్పందానికొచ్చాయి. పన్నీర్‌సెల్వానికి పార్టీ పగ్గాలు మాత్రమే కాదు... అదనంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయనకు కీల కమైన ఆర్ధిక శాఖతోపాటు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ప్లానింగ్, శాసనసభా వ్యవహారాలు వంటి అరడజనుకు పైగా శాఖలు కేటాయించారు. అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణించాక ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పన్నీర్ సెల్వం రెండు నెలల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఆ పదవిని వదులుకుని తానే స్వయంగా శశికళను ప్రతిపాదించి ఆమె ఏకగ్రీవ ఎన్నికకు దోహదపడ్డారు. మరికొన్ని రోజులకే తిరుగుబాటు చేశారు. అమ్మ జయలలిత ఆత్మ ఆదేశించడం పర్యవసానంగానే ఇదంతా చేస్తున్నానని ప్రకటించి కలకలం సృష్టించారు. మళ్లీ ఆ పదవిని పొందడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈలోగా శశికళ జైలుపాలు కావడంతో ఆమె వర్గం తరఫున పళనిస్వామి తెరపైకి వచ్చారు. తన శిబిరంలోని ఎమ్మెల్యేలను చెదరగొట్టడానికీ, బలహీనపర్చడానికీ ఎవరెన్ని ఎత్తుగడలు పన్నినా పళనిస్వామి నిబ్బరంగా ఎదుర్కొని చివరకు విశ్వాస పరీక్షలో విజయం సాధిం చారు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు అందరికీ అర్ధమయ్యాయి. అధికార కుమ్ములాటలుండే ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఎత్తులు, పైయెత్తులు సర్వసాధార ణమే. కానీ ఆ తర్వాతే చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం... ఆ వీరాభిమానం రాజకీయ రంగానికి కూడా బదిలీ కావడం అక్కడ కనబడే ధోరణి. రాష్ట్రంలో మొదటినుంచీ ద్రవిడ ఉద్యమం బలంగా ఉండటం వల్ల ఈ ధోరణికి మరింత ఊపు వచ్చింది. జయలలిత మరణానంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఈ విలక్షణతకు కూడా భిన్నమైనవి. నిన్నమొన్నటి వరకూ పన్నీర్, పళని వర్గాలు కత్తులు నూరుకున్నాయి. అవినీతి పరురాలైన శశికళ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని పళనిపై పన్నీర్ నిప్పులు చెరిగితే...అందుకు దీటుగా ఆ వర్గం స్పందించింది. అమ్మ వారసులం మేమే నంటూ ఇరు పక్షాలూ వీధికెక్కాయి. అయితే ఉన్నట్టుండి అవి రెండూ స్వరం తగ్గించాయి. అమ్మ కలలు నెరవేర్చడం కోసం కలిసి పనిచేస్తామని సంకేతాలివ్వడం ప్రారంభించాయి. ఫిబ్రవరిలో జరిగిన విశ్వాస పరీక్షలో కేవలం 11 ఓట్లు మాత్రమే సంపాదించిన పన్నీర్ సెల్వాన్ని 122మంది ఎమ్మెల్యేల బలం ఉన్న సీఎం పళని స్వామి కలిసుందాం... రమ్మని అభ్యర్ధించడం, ఆయన షరతులు విధిస్తూ పోవడం, మొదట బెట్టు చేసినట్టు కనబడిన పళని ఒక్కో మెట్టే దిగుతూ దాదాపుగా అన్ని డిమాండ్లకూ అంగీకారం తెలపడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. శశికళ జైలు పాలయ్యాక తన బంధువు టీటీవీ దినకరన్‌ను విశ్వాసపాత్రునిగా ఎంచుకుని ఆయనకు పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవి కట్టబెట్టారు. అది పళనికి ఆగ్రహం కలిగించి ఉండొచ్చుగానీ... అందుకు బలహీనుడిగా మిగిలిన పన్నీర్ సెల్వంతో చేతులు కలపడం వల్ల ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. దినకరన్ శిబి రంలో 28మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష డీఎంకే సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వారికి దినకరన్ వర్గం మద్దతుగా నిలిస్తే ప్రభుత్వం కుప్ప కూలుతుంది. అయినా ఆయన పన్నీర్‌ను ప్రాధేయపడ్డారు తప్ప దినకరన్‌తో ఏదో రకమైన సర్దుబాటుకు సిద్ధపడదామనుకోలేదు. ఏమైతేనేం ఇప్పుడు పళని, పన్నీరు వర్గాలు కలిసిపోయాయి. పన్నీర్‌సెల్వం డిమాండు మేరకు జయలలిత మరణంపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న మరో కీలక డిమాండు మాత్రం పెండింగ్‌లో పడింది. అందుకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం తప్పనిసరని చెబుతున్నారు. ఆ ప్రక్రియ సజావుగా పూర్తి కావడం పళనిస్వామికి పెద్ద సవాలే. తమిళనాట జరుగుతున్న పరిణామాల్లో తమ ప్రమేయం లేదని బీజేపీ నాయకత్వం చెబుతోంది. అయితే అలాంటి బలమైన శక్తేదో లేకుండానే ఆ రాష్ట్రంలో ఈ మాదిరి పరిణామాలు చోటుచేసుకుంటాయంటే ఎవరూ నమ్మ జాలరు. నిజానికి కొన్ని రోజుల క్రితం బిహార్‌లో జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యకరమైనవే. అక్కడ అధికార పక్షమైన జేడీ(యూ)...తన కూటమిలోని భాగస్వామి ఆర్జేడీని బయటకు నెట్టి కొత్త భాగస్వామి బీజేపీని తెచ్చుకుంది. తమిళనాడులో ఇప్పుడు ఏర్పడ్డ కొత్త చెలిమి పర్యవసానంగా అంతా సర్దు కుంటుందని, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించడానికి లేదు. పన్నీర్ సెల్వం మొన్న ఫిబ్రవరిలో అమ్మ పేరు చెప్పి ప్రత్యర్ధి వర్గంపై విరుచుకు పడినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన కమల్‌హాసన్ తదితర సినీ నటులు ఇప్పుడు తాజా విలీనాన్ని హేళన చేస్తున్నారు. తమిళ ప్రజల నెత్తిన టోపీ పెడు తున్నారంటూ కమల్ వ్యాఖ్యానించారు. డీఎంకే పెట్టబోయే అవిశ్వాస తీర్మానం సంగతలా ఉంచి తమిళ ప్రజలు ఈ వింత పరిణామాలను ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. అన్నాడీఎంకేలో గౌండర్, తీవర్ రెండూ బలమైన కులాలు. జయలలిత బలమైన నాయకురాలు గనుక ఈ రెండు కులాలకు తగినంత ప్రాధాన్యమిచ్చి పార్టీ వెనక దృఢంగా ఉండేలా చూసుకోగలిగారు. ఆ స్థాయిలో పళని, పన్నీర్లు పార్టీని పటిష్టంగా నడపగలరా అన్నది సందేహమే. పళనిస్వామి గౌండర్ అయితే పన్నీర్ తీవర్ కులస్తుడు. రాజకీయ సుస్థిరత లేనప్పుడు పాలన కుంటుబడుతుంది. ఫలి తంగా ప్రజలు ఇబ్బంది పడతారు. తమిళనాడులో గత ఆర్నెల్ల పరిణామాలు దీన్నే రుజువు చేశాయి. ఇప్పుడు కుదిరిన సఖ్యత ఎంతవరకూ దాన్ని మెరుగుపరచ గలదో చూడాలి. -
పళని స్వామి రాయని డైరీ
మాధవ్ శింగరాజు కలిసే చేతుల్ని కురిసే చినుకులు అడ్డుకుంటాయా? రా.. మిత్రమా.. ముందు చేతులు కలుపుకుని, ఆ తర్వాత ఆలింగనంతో ఒక్కటై పోదాం. పొయెట్రీ రాస్తున్నాను! ఊపిరి సలపడం లేదు. పన్నీర్‌సెల్వం పట్టు బిగించాడు. ఇష్టం లేని ఆలింగనం కూడా ఇంత గాఢంగా ఉంటుందా?! వదిలెయ్ మిత్రమా! దయచేసి వదిలెయ్. చేతులు, ఛాతీలు కలిసింది చాలు. కలిసేందుకు ఇక మన మధ్య కాస్తయినా చోటు మిగల్లేదు. పొయెట్రీని చాలా బలంగా రాస్తున్నాను. పన్నీర్‌సెల్వం వదలడం లేదు. గట్టిగా అతడిని వదిలించుకుని.. ఒక్క ఉలికిపాటుతో నిద్ర లేచాను! మురుగా.. ఇది నిజం కాదు! నేను నా ఇంట్లోనే ఉన్నాను. పన్నీర్‌సెల్వం కూడా తన ఇంట్లో ఉండి ఉంటాడు. సమయానికి నిన్న వర్షం కురిసి ఒక బలమైన ఆలింగనం తప్పిపోయింది. ‘వర్షం పడుతోంది ఇప్పుడు కాదు’ అని పన్నీర్‌సెల్వంని తప్పించుకుని వచ్చేశాను. పన్నీర్‌సెల్వం కూడా నన్ను ఇలాగే తప్పించుకుని వెళ్లిపోయాడట.. ‘వర్షం పడుతోంది ఇప్పుడు కాదు’ అని! ఇద్దరం ఒకేమాట చెప్పకుండా ఉండాల్సింది. మోదీకి డౌట్ వచ్చినట్లుంది! పన్నీర్‌సెల్వంని హత్తుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను హత్తుకోవడం çపన్నీర్సెల్వంకీ ఇష్టం లేదు. కానీ.. ఇష్టం లేని ఆలింగనం లోంచే ఒక ఇష్టమైన బంధం ఏర్పడుతుందని నాకూ, పన్నీర్‌సెల్వంకి నచ్చజెప్పమని ఢిల్లీ నుంచి డిప్యూటీ స్పీకర్ తంబిదొరైకి చెప్పి పంపించారు మోదీ! ‘‘మోదీజీకి ఆలింగనాలంటే ఇష్టమని నీకూ తెలుసు కదా పళని స్వామీ. ఎందుకు మొండికేస్తావ్? దేశ ప్రధాని ఒక కోరిక కోరినప్పుడు దానిని తీర్చడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ ధర్మం కాదా?! ఆయనేమీ తనని ఆలింగనం చేసుకొమ్మని అడగడం లేదే. ప న్నీర్సెల్వంని హత్తుకోమని అంటున్నాడు. అంతే కదా’’ అన్నారు తంబిదొరై. ‘అంతే కదా’ అని తంబిదొరై చాలా తేలిగ్గా అనేయడం నా మనసును తీవ్రంగా గాయపరిచింది. పన్నీర్ సెల్వం లాంటి వాణ్ణి మనసా వాచా కర్మణా హత్తుకోవడం.. ‘అంతే కదా’ అవుతుందా! ‘‘అలవాటైతే కష్టం కూడా ఇష్టంగా అనిపిస్తుంది పళని స్వామీ. ఇప్పుడు పన్నీర్‌సెల్వంని హత్తుకోవడం అలవాటైతే.. రేపు మోదీజీని హత్తుకోవడం నీకు, పన్నీర్‌సెల్వంకి కూడా ఈజీ అవుతుంది. ఆలోచించు’’ అని వెళ్లిపోయారు తంబిదొరై. పన్నీర్‌సెల్వంకి కూడా సేమ్ ఇవే మాటలు చెప్పడానికి ఆయన వెళ్లి ఉంటారు. ఇంతకీ నేను పొయెట్రీ రాస్తున్నట్లు కల ఎందుకొచ్చినట్లు? దిండు పక్కన ఎప్పటిదో కరుణానిధి కవితల పుస్తకం! రాత్రి చదువుతూ చదువుతూ నిద్రపోయినట్లున్నాను. తమిళనాడు రాజకీయాల్లో నేను కరుణానిధి, పన్నీర్‌సెల్వం ఎమ్జీఆర్ అవబోతున్నామా? -
ఒకట్రెండు రోజుల్లో గుడ్ న్యూస్: పన్నీర్
సాక్షి, చెన్నై : ఏఐడీఎంకే గ్రూపుల విలీన ప్ర్రకియ సాఫీగా సాగుతుందని ఒకట్రెండు రోజుల్లో తమిళనాడు ప్రజలు, పార్టీ శ్రేణులు సంతోషించేలా మంచి నిర్ణయం వెలువడుతుందని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జయలలిత మెమోరియల్ వద్ద విలీనంపై ప్రకటన వెలువడుతుందని భావించగా, చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి పదవి నుంచి పళనిస్వామి వైదొలగాలని పన్నీర్ సెల్వం శిబిరంలోని కొందరు నేతలు కోరడంతో విలీన ప్రక్రియకు గండిపడింది. అయితే ఏఐఏడీఎంకేలో ఎలాంటి విభేదాలు లేవని, విలీనంపై త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని పన్నీర్ సెల్వం శనివారమిక్కడ స్పష్టం చేశారు. జయలలిత మరణంపై సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేపట్టాలని పన్నీర్ సెల్వం గ్రూపు డిమాండ్ చేస్తుండటం, అవినీతి కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని పట్టుపట్టడం కూడా విలీన ప్ర్రకియలో జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు. శశికళ స్ధానంలో ఆ పదవిని పన్నీర్‌సెల్వంకు కట్టబెట్టాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో వేర్వేరుగా జరిపిన భేటీల అనంతరం విలీన ప్రక్రియ ఊపందుకుంది. బీజేపీకి మద్దతిచ్చే షరతుతో ఇరు గ్రూపుల విలీనానికి కమలనాధులు చొరవ చూపారు. -
జయలలిత మరణంపై న్యాయ విచారణ
►అమ్మ మరణంపై జ్యుడీషియల్ విచారణ.. ►శశికళ, దినకరన్‌కు పళనిస్వామి చెక్.. ►త్వరలో ఒకటికానున్న ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే పొయెస్ గార్డెన్స్‌లోని జయ నివాసమైన వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పళనిస్వామి తెలిపారు. ఆ కమిటీ విచారణ జరిపి త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా జయలలిత మరణం అనుమానాస్పదమేనని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్కాక ముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘అమ్మ’ మృతిపై అనుమానం ఉందని, దీని గురించి న్యాయ విచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా డిమాండ్ చేశారు. కాగా అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళినిస్వామి తాజా నిర్ణయంతో శశికళ, దినకరన్‌కు చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు అన్నాడీఎంకేలో రెండు వర్గాల విలీనానికి పన్నీర్ సెల్వం పెట్టిన డిమాండ్లను పళినిస్వామి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇటీవలే దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించారు కూడా. తాజా సంకేతాలతో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు త్వరలో ఒకటి కానున్నాయి. ఇక జయ మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని పన్నీర్ సెల్వం స్వాగతించారు. కాగా జయలలితకు సరైన చికిత్స అందినట్లు సీఎం పళనిస్వామి ఇప్పటివరకూ చెప్పారని, అకస్మాత్తుగా విచారణకు ఎందుకు ఆదేశించారని డీఎంకే ప్రశ్నించింది. కాగా జయలలిత గత ఏడాది సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత గురి అయ్యారు. సుమారు 70 రోజులకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా మృతి చెందారు. -
జయలలిత మరణంపై జ్యుడీషియల్ విచారణ
-
'మేం తలచుకుంటే సీఎం పదవి ఊడుతుంది'
చెన్నై: అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న తనపై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేయడంపై దినకరన్ స్పందించారు. గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తనను తొలగించే అథికారం పళని స్వామికి లేదని మండిపడ్డారు. ఒకవేళ పదవి తనను నుంచి తొలగించాలనుకుంటే ఆ అధికారం ఒక్క శశికళకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్న పళనిస్వామికి శశికళ భిక్ష వల్లే ఆభాగ్యం కలిగిందని ఎద్దేవా చేశారు. తన బృందం ఎన్నికల కమీషన్ దగ్గరికి వెళ్తే పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి ఊడుతుందన్నారు. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన పళనిస్వామి ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు. ఇంకా చదవండి: శశికళ, దినకరన్‌కు షాక్! -
కలుస్తున్నారు.. డిప్యూటీ సీఎంగా పన్నీర్!
సాక్షి, చెన్నై : తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీ స్వామిని(ఈపీఎస్) తిరిగి అదే బాధ్యతల్లో కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వాన్ని(ఓపీఎస్) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టే విషయంలో ఇరు వర్గాలు అంగీకరించినట్లు కీలక వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఇక త్వరలోనే కలిసిపోనున్నాయని తెలుస్తోంది. పన్నీర్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు ప్రభుత్వంలో ప్రాధాన్యమున్న ఆర్థికశాఖ, పౌరసరఫరాలశాఖలు కట్టబెట్టనున్నారట. అలాగే, పన్నీర్ వర్గానికి చెందిన సెమ్మాలై, మాఫక్షయి పాండ్యరాజన్‌ను కూడా కేబినెట్లోకి తీసుకొని ఆరోగ్యశాఖగానీ, పరిశ్రమలకు సంబంధించిన శాఖలుగానీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే, మంత్రి డీ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15కంటే ముందే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు కలిసిపోనున్నాయని చెప్పారు. నిజంగానే ఓపీఎస్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు ఇస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు మాత్రం మౌనం వహించారు. ఇప్పటికే, దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ఆమె అక్క కొడుకు దినకరన్‌కు అధికార అన్నాడీఎంకే షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దినకరన్‌పై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేసింది. అన్నాడీఎంకే డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేలో కీలక పునరేకీకరణకు మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు. -
శశికళ, దినకరన్‌కు షాక్!
-
శశికళ, దినకరన్‌కు షాక్!
చెన్నై: దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ఆమె అక్క కొడుకు దినకరన్‌కు అధికార అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దినకరన్‌పై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేసింది. అన్నాడీఎంకే డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేలో కీలక పునరేకీకరణకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వారసుడిగా తెరపైకి వచ్చిన దినకరన్ ఎన్నికల గుర్తు కేసులో అరెస్టవ్వడంతో అధికార అన్నాడీఎంకేలో సమీకరణలు మారిపోయాయి. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో మరో కీలక వర్గంగా మారిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్)తో చేతులు కలిపి.. పార్టీని పటిష్ట పరుచుకోవడం, తన అధికారాన్ని సుస్థిరపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే, పళనిస్వామితో చేతులు కలుపాలంటే శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి తొలగించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల విలీనానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన దినకరన్ మళ్లీ అలజడి రేపారు. అన్నాడీఎంకే పార్టీ శశికళదేనని, ఆమె స్థానంలో తానే పార్టీ అధినేతనంటూ ప్రకటనలు ఇచ్చారు. ఆయనకు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటానని దినకరన్ చేసిన ప్రకటనలు ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ క్రమంలోనే దినకరన్‌పై వేటు వేస్తూ ఈపీఎస్ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల విలీనానికి మార్గం సుగమం అయినట్టు భావిస్తున్నారు. -
సీఎం, మంత్రులకు హైకోర్టు నోటీసులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు సెంగొట్టయ్యన్, సెల్లూరు రాజా, దిండుగల్లు శ్రీనివాసన్, కామరాజ్‌లను మధురై హైకోర్టు బెంచ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ సూచనలు, సలహాలు, ఆదేశాలను అనుసరించి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తున్న సీఎం, మంత్రులు పదవులకు అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై మధురై హైకోర్టు శాఖ గురువారం ఆ ఐదుగురికి నోటీసులు జారీచేసింది. దోషిగా బెంగళూరు జైలులో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్న శశికళ నుంచి ఆదేశాలు పొందడం తీవ్ర అభ్యంతరమని పేర్కొంటూ విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే నేత ఆనళగన్ ఈ ఏడాది మార్చిలో మధురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకే (అమ్మ) అధికార ప్రతినిధి గౌరీశంకర్ ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశికళ ఆలోచనల ప్రకారం ప్రభుత్వం నడుస్తోందని ప్రకటించినట్లు పిటిషన్ పేర్కొన్నారు. అంతేగాక సదరు నలుగురు మంత్రులు బెంగళూరు కు వెళ్లి శశికళ ను కలిసి వచ్చారని ఆయన చెప్పారు. ఈ చర్యలను సీఎం పళనిస్వామి ఖండించనందున ఆయనను సైతం అనర్హుడిగా ప్రకటించాలని ఆనళగన్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వివరణ కోరుతూ సీఎం, నలుగురు మంత్రులకు గురువారం నోటీసులు పంపింది. -
సీఎంకి మోదీ అభయం!
► అన్నాడీఎంకే ఇరు శిబిరాల్లో ఆనందం ► ఇక, చర్చల కసరత్తు ► త్వరలో ఒకే వేదిక మీదకు ► పన్నీరుకు అధ్యక్ష పదవి ► సీఎంగా పళని కొనసాగింపు ►ప్రధానితో సీఎం భేటీ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఆనందంలో మునిగి ఉన్నాయి. మోదీ ఆదేశానుసారం ఇక, చర్చలతో ఒకే వేదిక మీదకు ఇరు శిబిరాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరును నియమించి, సీఎంగా పళనిస్వామి కొనసాగింపునకు తగ్గ ప్రణాళిక సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలోని పళని, పన్నీరు వర్గాలు విలీనమై ముందుకు సాగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజీ కుదిర్చినట్టు సమాచారం. అన్నాడీఎంకే రాజకీయం ఢిల్లీ చేరిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతో పాటుగా పలువురు ఢిల్లీ పెద్దలతో ఈ బృందం భేటీ సాగించి ఆనందంగా చెన్నైలో అడుగు పెట్టింది. ఇక, మంగళవారం ఉదయం సీఎంతో సీఎం భేటీ సాగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అర గంటకు పైగా సాగిన భేటీ అనంతరం ఉత్సాహంగానే సీఎం బయటకు రావడం గమనార్హం. తదుపరి తన ఎంపీలతో కలసి ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో భేటీ కావడం, తమ మద్దతు ప్రకటించడం చోటుచేసుకున్నాయి. త్వరలో విలీనం? ప్రధాని నరేంద్ర మోదీ అటు పన్నీరు సెల్వంకు, ఇటు పళని స్వామికి తన అభయాన్ని ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలకు ముగింపు పలికి, ఇరు శిబిరాలు ఒకే వేదికగా పనిచేయడానికి తగ్గ సూచనను ప్రధాని ఇచ్చినట్టు సమాచారం. మోదీ సూచన మేరకు ఇరు శిబిరాలు త్వరలో ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చర్చల ద్వారా ఇరు శిబిరాలు ఏకం అయ్యేందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకునే పనిలో పడటం గమనార్హం. పన్నీరు శిబిరం చెన్నై చేరుకోగానే, అన్ని మంచే జరుగుతుందన్నట్టుగా స్పందించడం ఆలోచించాల్సిందే. ఇక, పళని శిబిరం తమిళనాడుకు అనుకూలంగా పీఎం అన్నీ.. మంచి నిర్ణయాలను తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ దృష్ట్యా, మోదీ మార్గదర్శకంలో ఇరు శిబిరాలు ఏకమయ్యే రీతిలో, అన్నాడీఎంకే ఒకే వేదికగా సాగే విధంగా మార్గదర్శక కమిటీ ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరు సెల్వం వ్యవహరించడం, సీఎంగా పళని స్వామి కొనసాగే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం, కేంద్ర పథకాలను తమిళనాట విస్తృతం పరిచే విధంగా తగ్గ సూచనల్ని మోదీ ఇచ్చినట్టు సమాచారం. ఇక, తమిళనాట నీట్ మినహాయింపునకు ఈ సారికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా పళని విజ్ఞప్తికి పరిశీలిస్తామన్న హామీని ప్రధాని ఇవ్వడం గమనార్హం. సీఎంతో అయ్యాకన్ను ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేస్తున్న తమిళ రైతులు సీఎం పళని స్వామితో భేటీ అయ్యారు. జంతర్ మంతర్ వేదికగా రైతుల పోరాటం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ రైతులు తమిళనాడు భవన్ వద్ద ఉదయాన్నే బైఠాయించారు. దీంతో ఆ ఉద్యమ నేత అయ్యాకన్నును లోనికి పిలించి సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. రైతు సమస్యలపై కేంద్రం పెద్దలతో సంప్రదింపులు జరపాలని అయ్యాకన్ను విజ్ఞప్తి చేసినా, సీఎం పళని అందుకు తగ్గ ప్రయత్నాలు చేసిన దాఖలాలు శూన్యం. -
చంద్రబాబుకు పళనిస్వామి లేఖ
అమరావతి: అనుమతుల్లేకుంగా చెక్ డ్యామ్‌ల నిర్మిస్తున్నారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం వద్ద నిర్మిస్తున్న చెక్‌డ్యాముతో తమిళనాడుకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో పేర్కొన్నారు. కుసా నది, ఉపనదులపై అనుమతుల్లేకుండా చెక్ డ్యామ్ నిర్మిస్తున్నాంటూ ఆరోపణలు గుప్పించారు. -
పళని, పన్నీరు మధ్య రాజీ కుదిరిందా?
చెన్నై: అన్నా డీఎంకేలో రెండు వర్గాల మధ్య విలీన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయా? తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిరిందా? ఈ రెండు గ్రూపులు త్వరలో విలీనం కానున్నాయా? అంటే అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్ అయ్యే వరకు ఆగాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. పళని స్వామి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేలా, పన్నీరు సెల్వానికి పార్టీ పగ్గాలు అప్పగించేలా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా దినకరన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఇరు వర్గాల మధ్య అధికారికంగా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. పార్టీ గుర్తు 'రెండాకులు' కో్సం ఈసీకి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా దినకరన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లను బహిష్కరించడంతో పాటు జయలలిత మృతిపై విచారణకు అంగీకరిస్తేనే విలీన చర్చలు జరుపుతామని సోమవారం వరకు పన్నీరు సెల్వం వర్గీయులు చెప్పారు. అలాగే పన్నీరుకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తాజాగా పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని, పళని సీఎంగా కొనసాగుతారని, దినకరన్ అరెస్ట్ అయిన తర్వాత రెండు వర్గాలు విలీనమవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వెనక్కు తగ్గని పన్నీరు.. వెనుక ఎవరున్నారు?
-
వెనక్కు తగ్గని పన్నీరు.. వెనుక ఎవరున్నారు?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముందు ఉంచిన డిమాండ్ల విషయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వెనక్కు తగ్గడం లేదు. అన్నా డీఎంకే రెండు గ్రూపులు విలీనం కావాలంటే పార్టీ నుంచి శశికళను, దినకరన్‌ను బహిష్కరించాల్సిందేనని, జయలలిత మృతిపై విచారణ చేయించాలని పన్నీరు వర్గం మరోసారి స్పష్టం చేసింది. అప్పటి వరకు చర్చల ప్రసక్తేలేదని చెప్పింది. దీంతో అన్నాడీఎంకే రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. మరోవైపు శశికళకు అనుకూలమైన సీఎం పళనిస్వామి వర్గం భిన్నస్వరాలు వినిపిస్తోంది. సోమవారం పన్నీరు సెల్వం వర్గంలో ఉన్న ఎంపీ మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ.. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించి మన్నార్గుడి మాఫియా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. జయలలిత మరణం తదనంతర పరిణామాల్లో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. శశికళ సారథ్యంలో ఏఐఏడీఎంకే (అమ్మ), పన్నీరు సెల్వం వర్గం ఏఐఏడీఎంకే పురచ్చి తలైవి అమ్మ పేర్లతో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. రెండు వర్గాలు విలీనం కావాలంటే పైరెండు డిమాండ్లతో పాటు ముఖ్యమంత్రి పదవిని పన్నీరుకు ఇవ్వాలనే మరో డిమాండ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ పదవి, మంత్రుల పదవులపైనా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. సీఎం పళనిస్వామి వర్గంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీరు సెల్వం వైపు కేవలం 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో పన్నీరు వర్గం వ్యతిరేకించినా పళనిస్వామి నెగ్గారు. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పన్నీరు వర్గం విలీనం చర్చల పేరుతో పళనిస్వామికి డిమాండ్లు పెడుతూ చుక్కలు చూపిస్తోంది. పన్నీరు డిమాండ్లను అంగీకరించేందుకు పళని వర్గం విముఖత చూపుతోంది. అమ్మ మరణంపై తమకు ఎలాంటి సందేహం లేదని, అలాంటపుడు విచారణ ఎందుకని వాదిస్తోంది. అంతేగాక సీఎంగా పన్నీరు ఉన్నప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నీరు వర్గీయులు సీఎం పళనిస్వామికి హెచ్చరికలు చేసేలా మాట్లాడుతుండటంతో వారి వెనుక ఎవరున్నారన్నది తమిళ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీనే పన్నీరుకు మద్దతు ఇస్తూ నడిపిస్తోందని దినకరన్ చెప్పినట్టుగా పళని వర్గీయులు చెబుతున్నారు. పళని స్వామి వెంట ఉంటే దినకరన్ విషయంలో మాదిరిగా తమను అవినీతి కేసుల్లో ఇరికిస్తారని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా, ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా ఆయన్ను విచారిస్తున్నారు. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని బీజేపీ చెబుతోంది. -
‘ఆ వీడియో ఫుటేజీ స్టాలిన్‌కు ఇవ్వండి’
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు చురకలంటించింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనీస్వామి బలపరీక్షకు సంబంధించిన వీడియో ఫుటేజీ కాపీని ప్రతిపక్ష నేత డీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి డీఎంకే స్టాలిన్‌కు ఇవ్వాలని స్పష్టం చేసింది. తిరిగి ఈ కేసును మార్చి 24విచారణ చేస్తామని తెలిపింది. తమిళనాడుకు పలు నాటకీయ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రిగా పళనీస్వామిని అన్నాడీఎంకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన బలపరీక్ష సమయంలో సభలో డీఎంకే లేదు. సీక్రెట్ బ్యాలెట్‌తో బలపరీక్ష నిర్వహించాలని డీఎంకే డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మార్షల్స్‌ను పెట్టి వారిని బయటకు బలవంతంగా పంపించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దీనిపై అభ్యంతరం చెప్పిన స్టాలిన్ విపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని, దానిని తాము అంగీకరించబోమని, దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ తమకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఇచ్చేందుకు నిరాకరించడంతో కోర్టుకు వెళ్లారు. బలపరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఆ ఫుటేజీ తమకు ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వాన్ని చెన్నై కోర్టు ఆదేశించింది. -
ఢిల్లీలో పళని వర్సెస్ పన్నీరు
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఇరు వర్గాలు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. అన్నా డీఎంకే ఎంపీల బృందంతో కలసి సీఎం పళనిస్వామి.. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను కూడా పళనిస్వామి బృందం కలవనుంది. మాజీ సీఎం పన్నీరు సెల్వం కూడా తన మద్దతుదారులైన ఎంపీలతో కలసి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పన్నీరు సెల్వం వర్గం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది. ఈ మేరకు వారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని పన్నీరు సెల్వం వర్గం కోరనుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. స్పీకర్ అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించారని, పళనిస్వామి బలపరీక్ష చెల్లదని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, పన్నీరు సెల్వం, ఇతర పార్టీల నాయకులు ఆరోపించారు. స్టాలిన్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్‌కు ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ సహా ఇతర నేతలను కలిశారు. తాజాగా పన్నీరు సెల్వం వర్గం ఇదే విషయంపై ఫిర్యాదు చేయనుంది. కాగా సీఎం పళనిస్వామి వర్గీయులు తమిళనాడుకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. -
జైలుపక్షి చేతిలో కీలుబొమ్మ సీఎం అయ్యారు
చెన్నై: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరొందిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళను జైలుపక్షిగా సంబోధిస్తూ.. ఆమె చేతిలో కీలుబొమ్మగా పళనిస్వామిని అభివర్ణించారు. తమిళులు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా అంగీకరించడాన్ని తప్పుపడుతూ, ఇది అవమానకరమని అన్నారు. కట్జూ తమిళులను ఉద్దేశిస్తూ రాసిన బహిరంగ లేఖను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 'జైలుపక్షికి కీలుబొమ్మ తమిళనాడు సీఎం అయ్యారు. మీరు ఈ విషయంలో ఏం చేయలేకపోయారు. మీరు మహావీరులైన చోళులు, పాండ్యుల సంతతికి చెందినవారు. తిరువళ్లువర్, ఇళంగో, కంబార్, అండాల్, సుబ్రహ్మణ్య భారతి వారసులు. మీ పూర్వీకులు మిమ్మల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. నేను తమిళుడని చెప్పేందుకు గర్వంగా భావిస్తాను. ఇప్పుడు ఈ ముఖంతో ఎలా చెప్పగలను? ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగడం తమిళులకు కళంకం. ఆయన పదవిలో ఉంటే నేను తమిళుడిగా ఉండలేను. అవమానంతో, అగౌరవంతో బతకరాదు. దీనికంటే చావడం మేలు' అని కట్జూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
జయ మృతిపై సీఎం పళని కామెంట్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామి స్పందించారు. చెన్నైలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత మృతి విషయంలో ఎలాంటి వివాదాలు, రహస్యాలు లేవని.. కొంతమంది వ్యక్తులు ఈ విషయంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబర్ 5న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయ కన్నుమూసిన విషయం విదితమే. కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఐదు రోజుల్లోగా పరిహారం అందిస్తామని పళనిస్వామి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎంగా తన బలపరీక్ష సమయంలో అంతా రాజ్యాంగబద్ధంగానే జరిగిందని, చట్ట ప్రకారమే సభ సజావుగా సాగిందని పళనిస్వామి చెప్పారు. శశికళకు జైలుశిక్ష ఖరారు కాగానే ఆమె విధేయుడు పళనిస్వామిని అన్నాడీఎంకే పక్షనేతగా ఎన్నుకోవడం అనంతరం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పళని సహా మంత్రివర్గంతో ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. సభలో విశ్వాసపరీక్షలోనూ పళనిస్వామి 122 ఓట్లతో నెగ్గారు. ఆయనకు వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటేశారు. అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం మద్ధతుదారులతో పాటు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె.స్టాలిన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్ష అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పన్నీర్ సెల్వం, స్టాలిన్ ఇదివరకే గవర్నర్ విద్యాసాగర్ రావును వేర్వేరుగా కలసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో సహా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మరోవైపు పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కోర్టు తీర్పుపైనే డీఎంకే, అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. -
పళనిస్వామి ఐదు సంతకాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి పరిపాలనలో తన ముద్ర వేసేందుకు శ్రీకారం చుట్టారు. అనూహ్యంగా సీఎం పదవిలోకి వచ్చి ఉద్రిక్త పరిస్థితుల నడుమ అసెంబ్లీలో బలం నిరూపించుకున్న ఆయన పాలనపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఫైళ్లపై సోమవారం ఆయన సంతకాలు చేశారు. 'అమ్మ' ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆమె బాటలోనే తాను పయనిస్తున్నానని పళనిస్వామి చెప్పారు. ఐదు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిపారు. కరువు ప్రాంత రైతుల కోసం నిధులు విడుదల చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే ప్రజలందరికీ పరిశుద్ధ తాగునీరు పంపిణీ చేస్తామన్నారు. సీఎం సంతకాలు చేసిన ఫైళ్లు.. 1. నిరుద్యోగులకు భృతి రెట్టింపు 2. ప్రసూతి సాయం రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంపు 3. ఉద్యోగాలు చేసే లక్ష మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు 4. రూ. 85 కోట్లతో మత్స్యకారులకు 5 వేల గృహాల నిర్మాణం 5. మరో 500 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత -
తమిళనాడు సర్కార్‌పై కమల్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు రాజకీయ పరిణామాలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తుల కూటమికి నేటి తమిళ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నాడీఎంకే తాత్కాళిక చీఫ్ వీకే శశికళ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ క్రిమినల్ కూటమంతా ఒక చోట చేరిందని మండిపడ్డారు. శశికళ వర్గం నుంచి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఎన్నికవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఊహించినట్లుగా జరగలేదని అన్నారు. ‘నిజమేమిటో కోర్టు పదేపదే తేల్చి చెప్పింది. శశికళే కాదు.. చనిపోయిన జయలలిత కూడా అక్రమాస్తుల కేసులో దోషి అని స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీని ఫ్లోర్‌ను శుభ్రం చేయాల్సి ఉంది. ప్రజల వద్దకు ఎన్నికలు తీసుకెళ్లండి. వారి మనసులో ఏముందో చెప్తారు. నేను చాలా కోపస్తుడిని. నేను రాజకీయాలకు సరిపోను. కోపంతో ఉండే వ్యక్తులు రాజకీయాలకు అవసరం లేదు. రాజకీయ నాయకులంటే గొప్ప సమతౌల్యం పాటించేవారిగా ఉండాలి. ఇప్పుడు నేను చాలా కోపంతో ఉన్నాను. నాలాగా చాలామంది ప్రజలు కోపంతో ఉన్నారు’ అని కమల్ చెప్పారు. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వార్తలకై చదవండి.. జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
పళనికే పీఠం
► సీఎంగా రైతు బిడ్డ ► చిన్నమ్మ సేనల్లో సంబరాలు ► బెల్లం మండి నుంచి సీఎంగా.. ► నా కొడుకు ప్రజలు మెచ్చే పాలన అందిస్తాడు ► సీఎం పళనిస్వామి తల్లి ఆనందం బలపరీక్షలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడపాడి కే పళనిస్వామికే సీఎం పీఠాన్ని అప్పగించారు. రైతు బిడ్డగా, బెల్లం మండితో బతుకు జీవన పయనంలో అడుగు పెట్టిన పళనిస్వామి సీఎంగా అవతరించడంతో స్వగ్రామం ఎడపాడిలో సంబరాలు అంబరాన్ని తాకాయి. చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. తన కొడుకు ప్రజలు మెచ్చే పాలనను అందిస్తాడని పళనిస్వామి తల్లి తవసాయమ్మాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడుకు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా, బల నిరూపణలో మెజారిటీ నిరూపించుకున్న పళనిస్వామి జీవిత ఇతివృత్తాంతంలోకి వెళ్తే.. సాక్షి, చెన్నై : సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని నెడుంకుళం గ్రామం శిలువం పాళయంకు చెందిన కరుప్ప గౌండర్, తవ సాయమ్మాల్ దంపతుల చిన్న కుమారుడు పళనిస్వామి(63). చదువు మీద మక్కువ ఎక్కువే. ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాలుగు కిలో మీటర్లు రోజు నడక పయనం సాగించారు. ఇక, ఉన్నత చదువుగా ఈరోడ్‌లోని ఓ కళాశాలలో బీఎస్సీ(పూర్తి కాలేదు) చేశారు. గౌండర్ సామాజిక వర్గానికి చెందిన పళనిస్వామి తన తండ్రి చూపిన మార్గంలో వ్యవసాయంతో పాటు బెల్లం మండితో జీవన పయనాన్ని సాగిం చారు. దాయాదుల సమరాన్ని ఎదుర్కొనేందుకు తీవ్రంగానే ప్రయత్నించి, నెత్తిన కేసుల మోత వేసుకున్నారు. ఆధారాల కరువుతో ఆ కేసుల నుంచి బయట పడ్డారు. భార్య రాధా, కుమారుడు మిథున్‌లతో కలిసి ఓ వైపు బెల్లం మండిని ముందుకు తీసుకెళ్తూ, మరో వైపు నాగలి పట్టి పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు. తన పొలం పక్కనే అప్పటి మంత్రి ఈరోడ్ ముత్తు స్వామి పొలం ఉండడంతో ఆయన అడుగు జాడల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తొలుత శిలువం పాళయం గ్రామ పార్టీ కార్యదర్శి అయ్యారు. 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నెడుంకుప్పం పంచాయతీ యూనియన్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సెంగోట్టయన్ మద్దతుదారుడిగా : ఎంజీయార్ మరణంతో ఆ పార్టీలోచోటు చేసుకున్న పరిణామాలు పళని స్వామికి రాజకీయంగా బలాన్ని పెంచాయి. ఈరోడ్, సేలం, నామక్కల్ జిల్లాల్లో అన్నాడీఎంకేకు కీలక నేతగా ఉన్న సెంగోట్టయన్ తీవ్ర మద్దతు దారుడిగా అమ్మ జయలలిత శిబిరంలో చేరారు. సెంగోట్టయన్ వెన్నంటి నడిచారు. జయలలిత నమ్మిన బంటుల్లో ఒకరిగా రాష్ట్ర రాజకీయాలపై సెంగోట్టయన్ దృష్టి పెట్టగా, ఆయన మద్దతు సేలం జిల్లా రాజకీయాల్లో పళనిస్వామి చక్రం తిప్పారు. ఈ సమయంలో అమ్మ సెంగోట్టయన్‌ను దూరం పెట్టడం పళని స్వామికి మరింతగా కలిసి వచ్చింది. సెంగోట్టయన్ స్థానాన్ని భర్తీ చేసే రీతిలో అప్పట్లో చిన్నమ్మ శశికళ పావులు కదిపారన్న ప్రచారం ఉంది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. చిన్నమ్మకు విధేయుడిగా ఉంటూ వచ్చిన పళని స్వామిని ప్రస్తుతం సీఎం పదవి వరించడం గమనార్హం. సంబరాల్లో చిన్నమ్మ సేన : బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో చిన్నమ్మ సేనల్లో ఆనందం తాండవం చేసింది. ఎక్కడికక్కడ బాణసంచా పేల్చుతూ , స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. పుదియ పురట్చి తలైవీ( నవ విప్లవ నాయకీ) చిన్నమ్మ , త్యాగ తలైవీ( త్యాగ నాయకీ) చిన్నమ్మ వర్ధిల్లాలన్న నినాదాన్ని మార్మోగించారు. చిన్నమ్మ శపథం నెరవేరిందన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, రోడ్ల మీద ఆనంద తాండవం చేశారు. పళని స్వామి స్వగ్రామం ఎడపాడిలో అయితే, ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ తమిళనాడులోని (కొంగు మండలం) ధర్మపురి, కృష్ణగిరి, సేలం, నామక్కల్, తిరుప్పూర్, ఈరోడ్, కోయంబత్తూరుల్లో అయితే, చిన్నమ్మ వర్గీయుల్లో ఆనందం రెట్టింపు అయింది. కొంగు మండలానికి చెందిన రైతు బిడ్డ సీఎం కావడంతో తమ ప్రాంతాలకు మహర్ధశ పట్టినట్టే అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సుపరి పాలన : తన కొడుగు బల పరీక్షలో నెగ్గడంతో పళని స్వామి తల్లి తవసాయమ్మాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఎంజీఆర్, జయలలిత చూసిన మార్గంలో ప్రజలకు మంచి పాలనను అందిస్తాడన్నారు. కష్టపడి పైకి వచ్చాడని, కష్టం అంటే ఏమిటో తెలిసిన వాడు కాబట్టి, ప్రజలు మెచ్చే విధంగా మంచి పనులు తప్పకుండా చేస్తాడని తెలిపారు. పళని పయనంలో కొన్ని ఘట్టాలు: ♦ 1989లో కోడిపుంజు చిహ్నంతో ఎడపాడి నుంచి గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ♦ 1991లో అన్నాడిఎంకే రెండాకుల చిహ్నంతో అదే నియోజకవర్గం నుంచి మరో సారి గెలుపు. ♦ 1992 –1996 వరకు ఆవిన్ సంస్థ అధ్యక్షుడు. ♦ 1996 ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ♦ 1998 లోక్ సభ ఎన్నికల్లో తిరుచ్చంగోడు నుంచి తొలి సారిగా పార్లమెంట్‌కు ఎన్నిక ♦ 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఓటమి ♦ 1999–2004 వరకు తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ♦ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నుంచి ఓటమి ♦ 2011లో అసెంబ్లీ ఎడపాడి నుంచి గెలుపు. తొలి సారిగా రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి పదవి. ఒకే నియోజకవర్గం నుంచి గెలుస్తూ రావడంతో కే పళని స్వామి కాస్త ఎడపాడి కే పళని స్వామి అయ్యారు. ♦ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు. ప్రజా పనులు, రహదారులు, చిన్న హార్బర్ల శాఖ కేటాయింపు ♦ 2017 ఫిబ్రవరి 14 అన్నాడిఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నిక ♦ 2017 ఫిబ్రవరి 16 తమిళనాడు 13వ సీఎంగా ప్రమాణ స్వీకారం. ♦ 2017 ఫిబ్రవరి 18 బల పరీక్షలో విజయ కేతనంతో సీఎం పీఠం పదిలం. -
శపథం చేసిన శశికళ పంతం నెగ్గింది
-
ఓడినా బుసలు కొడుతున్న పన్నీర్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటి బలపరీక్షతో పూర్తిగా తెరపడింది. సీఎం కుర్చీ కోసం జరిగిన పోరులో అమ్మ జయలలిత వీర విధేయుడు, మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం ఎడపాటి పళనిస్వామి విజయం సాధించగా.. పన్నీర్ మాత్రం కుర్చీ పోరులో ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. నేడు సభలో జరిగిన బలపరీక్ష అప్రజాస్వామికమని, న్యాయబద్ధం కాదన్నారు. డీఎంకే ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించివేశారని, సభ జరిగేతీరు ఇలాగేనా అని ప్రశ్నించారు. ఆపై జరిగిన ఓటింగ్ ద్వారా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అమ్మ జయలలితకు ద్రోహం చేశారని విమర్శించారు. అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా సభలో నిర్ణయం వెలువడిందని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. తనకు మద్ధతుగా ఓటేసిన 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అమ్మకు, ఆమె ఆశయాలకు విధేయులని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గి 13వ సీఎంగా తన పీఠాన్ని ఖరారు చేసుకున్న పళనిస్వామి మాత్రం ఇది ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. బలపరీక్షలో నెగ్గిన పళనిస్వామి, మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో కలిసి అమ్మ సమాధి వద్దకు వెళ్లి మరోసారి నివాళులర్పించారు. అమ్మ సమాధి వద్ద సీఎం పళనిస్వామి కన్నీరు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ జయ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే పన్నీర్ వర్గీయులు ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. తన విజయాన్ని.. అమ్మకు నిజమైన మద్ధతుదారులు, అభిమానుల విజయంగా అభివర్ణించారు. ఆయన మద్ధతుదారులు, పార్టీ కార్యకర్తలు 'అమ్మ గెలించింది' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
సీక్రెట్ ఓటింగ్ జరిగి ఉంటే..!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్ష ఓటింగ్ తీరుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి 122 ఓట్లతో నెగ్గిన విషయం తెలిసిందే. సభలో సీక్రెట్ ఓటింగ్ జరిపి ఉంటే కచ్చితంగా మేమే గెలిచేవాళ్లమని పన్నీర్ సెల్వం వర్గీయుడు కె.పాండ్యరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే విశ్వాసపరీక్షను వ్యతిరేకిస్తూ పన్నీర్ వర్గీయులు కొందరు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో ఆరుగురు పన్నీర్ మద్ధతుదారులు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు. స్పీకర్ ధన్ పాల్ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించక పోవడం వల్లనే పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గారని పన్నీర్ మద్ధతుదారులు అభిప్రాయపడుతున్నారు. అన్నాడీఎంకే తిరుగుబాబు ఎమ్మెల్యేలు నటరాజ్, సెమ్మలై, ఆరుకుట్టి, మనోహర్, మాణిక్యం, శరవణన్ విశ్వాసపరీక్షలో పళనికి వ్యతిరేకంగా ఓటేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు విపక్షం లేకుండానే ఓటింగ్ నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ డీఎంకే నేతలు, కాంగ్రెస్ నేతలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తంగా 133 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనగా పళనిస్వామికి అనుకూలంగా 122 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు, 9 మంది సభను వాకౌట్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై కథనాలు శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్! విశ్వాస పరీక్షలో నెగ్గిన పళనిస్వామి స్పీకర్ కు లిటిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా? నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి: స్పీకర్ -
శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. మొత్తంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనగా, పళనికి అనూకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో పళని విజయం నల్లేరుపై నడకగా మారింది. రిసార్ట్ రాజకీయాలు నెగ్గాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది రోజుల కిందటి వరకూ ఎవరికీ తెలియని కువతూర్కు సమీపంలోని గోల్డెడ్ బే రిసార్టులో చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అక్కడ నిర్బంధించారని కథనాలు వచ్చాయి. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఎక్కడ లాగేసుకుంటారోనని శశికళ చేసిన ప్రయత్నం నేడు ఫలించింది. అయితే ఆ ప్రయోజనాన్ని మాత్రం పళనిస్వామి పొందనున్నారు. సుప్రీంకోర్టు శశికళను దోషీగా తీర్పివ్వడంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయి అక్కడే మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఆశలు గల్లంతు కాగా.. అమ్మ జయలలితకు, తనకు విధేయుడైన పళనిస్వామిని గోల్డెన్ బే రిసార్ట్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్ధతు ఇవ్వకుండా చేయడంలోనూ శశికళ పన్నిన గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపు వ్యూహం సక్సెస్ అయింది. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు తనకే మద్ధతు ఇవ్వాలని కోరుతూ రిసార్టులో శశికళ చేసిన ప్రసంగాలు వారిని ఐకమత్యంగా ఉంచాయనడంలో సందేహమే అక్కర్లేదు. గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలుసుకోవడం.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉందని వివరించడం.. ఆపై పళనితో గవర్నర్ ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. నేడు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో శశికళ క్యాంపులోని రిసార్ట్ ఎమ్మెల్యేల ఓటింగే పళనిస్వామి సీఎం పీఠాన్ని అందించింది. పన్నీర్ క్యాంపులోని ఆరుగురు ఎమ్మెల్యేలు సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు వారం రోజులపాటు గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 122 మంది ఆయనకు మద్ధతు తెలుపుతూ ఓటేయడంతో మెజార్టీ సాధించి చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామి.. జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వంపై మరోసారి విజయం సాధించారు. -
స్పీకర్ కు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా..?
చెన్నై: విశ్వాసపరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో నేటి ఉదయం నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ మద్ధతుదారులు సభ సజావుగా సాగకుండా యత్నిస్తుండటంతో సభను స్పీకర్ ధన్ పాల్ పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్ కు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాస్తవంగా అసెంబ్లీలో నేడు పళనిస్వామి ప్రభుత్వానికి అజెండా అంటూ ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వానికి మద్ధతు ఉందని పళనిస్వామి సభలో నిరూపించుకుంటే.. దానిపై సభాపతి గవర్నర్ విద్యాసాగర్ రావుకు నివేదిక అందించాల్సి ఉంటుందని సురేష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధాకరమన్నారు. విశ్వాసపరీక్ష రహస్య ఓటింగ్ ప్రకారమే జరిపించాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవన్నారు. సభలోకి పోలీసులు ఎలా వస్తారంటూ డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.. కానీ మార్షల్స్ వచ్చినా, నేతలు వచ్చినా, ఇతర ఏ సిబ్బంది వచ్చినా సభాపతి ఆదేశాల మేరకు ఇలా జరుగుతుందన్నారు. సభ సజావుగా సాగకుండా, ఇబ్బందులకు గురిచేస్తూ.. తీవ్ర ఆటంకం కలిగించిన నేపథ్యంలో సభాపతి మార్షల్స్ కు కొన్ని ఆదేశాలు జారీచేస్తారు. సభాపతి ఆదేశాల మేరకు ఆయా ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు లాక్కెళ్తారని చెప్పారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగ పరంగా విశ్వాస పరీక్ష లేదా బలనిరూపణలో నెగ్గాల్సి ఉంటుందని, అప్పటినుంచీ పూర్తిస్థాయి ప్రభుత్వం కార్యరూపం దాల్చినట్లని వివరించారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో అలాగే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
గోల్డెన్ బే రిసార్ట్ మూసివేత
చెన్న: గోల్డెన్ బే రిసార్ట్.. పది రోజుల క్రితం వరకు దీని గురించి చాలామంది తెలియదు. చెన్నైకు దాదాపు 80 కిలో మీటర్ల దూరంలో కువతూర్కు సమీపంలో ఈ రిసార్ట్ ఉంటుంది. శశికళపై పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక అన్నా డీఎంకేలో సంక్షోభం ఏర్పడటం, ఆ తర్వాత శశికళ వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పది రోజుల పాటు ఇక్కడ ఉంచాక గోల్డెన్ బే రిసార్ట్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. రోజూ వార్తల్లో నిలిచింది. పది రోజులగా అక్కడ మీడియా ప్రతినిధులు మకాం వేశారు. పోలీసులను భారీగా మోహరించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎమ్మెల్యేలను విచారించి, వారి వాంగ్మూలం తీసుకున్నారు. ఎట్టకేలకు శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలను భారీ భద్రత మధ్య తీసుకెళ్లడంతో రిసార్ట్ ఖాళీ అయ్యింది. కాసేపటి తర్వాత గోల్డెన్ బే రిసార్ట్‌ను మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. రిసార్ట్‌కు మరమ్మత్తులు చేయించాలని, దీని కారణంగా మూసివేస్తున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఈ రిసార్ట్‌లో ఉన్నప్పుడు వారిని కలిసేందుకు శశికళతో పాటు సీఎం పళనిస్వామి కూడా వెళ్లారు. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు?