సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు 'అమ్మ' సమాధి వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద గల జయలలిత సమాధి వద్ద సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం 'అమ్మ'కు ఘన నివాళి అర్పించారు. వీరితో పాటు తమిళనాడు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జయకు నివాళులు అర్పించారు. అమ్మతో తమ అనుబంధాన్ని, రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుని పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. పళని, పన్నీర్ నేతృత్వంలో మెరీనా బీచ్ నుంచి జయ అభిమానులు, పార్టీ శ్రేణులు శాంతియుత ర్యాలీ చేపట్టాయి.
గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. చెన్నై మెరీనాబీ చ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే 6వ తేదీన జయకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment