O Panneerselvam
-
‘గుర్తు’పెట్టుకోండి.. పన్నీర్‌సెల్వంకు ‘పనస’
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వంకు ఎన్నికల అధికారులు 'పనస కాయ' గుర్తును కేటాయించారు. రామనాథపురంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన లాటరీ ద్వారా గుర్తును కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్‌సెల్వం.. తిరువాడనైలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పనసకాయతో ఫోజులిచ్చి గుర్తు కేటాయింపును అధికారికంగా ప్రకటించారు. రామనాథపురంలో అదే పేరుతో ఉన్న మరో నలుగురు అభ్యర్థులతో ఈ మాజీ సీఎం తలపడనున్నారు. పన్నీర్‌సెల్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఏఐఏడీఎంకే జెండాను, లెటర్‌హెడ్‌ను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. -
బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్‌తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను విస్మయానికి గురి చేశాయి. బన్రూటి రామచంద్రన్ తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. ఎంజీయార్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన జయలలిత రాకతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2005లో సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. విజయకాంత్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారనంలో అతిశయోక్తి లేదు. చివరకు ఆ పార్టీలో సాగిన కుట్ర పూరిత రాజకీయాలను చూసి బయటకు వచ్చేశారు. అదే సమయంలో బన్రూటి సేవలను పార్టీకి ఉపయోగించుకునేందుకు గతంలో సీఎం జయలలిత నిర్ణయించారు. ఆయన్ని అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైన పదవి అప్పగించారు. ఊడిన నిర్వాహక కార్యదర్శి పదవి జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో ఉన్నా, రాజకీయంగా పూర్తిస్థాయిలో బన్రూటి ముందుకు సాగలేదు. ఇటీవల కాలంలో అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన్ని తీవ్రంగా కలిచి వేశాయి. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలను ఓ సమావేశంలో బన్రూటి వ్యతిరేకించారు. అదే సమయంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు మద్దతుగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో ఈ ఇద్దరు నేతలు బంతాట ఆడే పరిస్థితి నెలకొంది. పన్నీరుకు మద్దతుగా వ్యవహరిస్తున్న బన్రూటి రామచంద్రన్‌ను పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి మంగళవారం తప్పించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పళణి స్వామి ప్రకటన చేశారు. వెంటనే స్పందించిన పన్నీరు సెల్వం తన శిబిరం తరపున అన్నాడీఎంకేకు రాజకీయ సలహదారుడిగా బన్రూటిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను అయోమయానికి గురి చేశాయి. అయితే, ఓ సీనియర్ నేతతో ఇలాగేనా వ్యవహరించడం అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పళణిస్వామి నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఈ నెల 30వ తేదీన విచారణకు రానుంది. -
కీలక మలుపు తిరిగిన రాజీనామా వ్యవహారం.. పళనికి కొత్త చిక్కులు
సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపికయ్యేందుకు ముందుగా ఆ పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవికి ఆయన చేసిన రాజీనామా కొత్త సమస్యగా మారింది. ఈ రాజీనామాపై సీఈసీ విచారణకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఈ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ పన్నీరు సెల్వం సీఈసీకి లేఖ రాసినట్లు శనివారం వెలుగు చూసింది. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళని స్వామి శిబిరాల మధ్య వివాదం ఆసక్తికరంగా మారుతోంది. సర్వసభ్య సమావేశం చెల్లదని రెండు రోజుల క్రితం హైకోర్టు ప్రకటించడంతో పళనిస్వామికి పెద్దషాక్ తగిలింది. దీంతో పన్నీరు సెల్వం వ్యూహాలకు పదును పెట్టారు. ఓ వైపు కలిసి పనిచేద్దామని పిలుపునిస్తూనే.. మరోవైపు పళని స్వామికి ఎలాగైనా చెక్ పెట్టాలనే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా సీఈసీకి గత నెల పళనిస్వామి రాసిన లేఖ ప్రస్తుతం పన్నీరుకు అస్త్రంగా మారింది. ఆమోదించండి.. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గత నెల పళనిస్వామి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సమయంలో తన చేతిలో ఉన్న అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో– కన్వీనర్ పదవిని ఆయన రాజీనామా చేశారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు(సీఈసీ) లేఖ ద్వారా పంపించారు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం ఎస్ఈసీ విచారించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు తీర్పుతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి దూరం కావడంతో డీలా పడిన పళనికి, ఈ రాజీనామా లేఖ కొత్త చిక్కులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్ కో– కన్వీనర్‌గా వైద్యలింగం పళనిస్వామి రాజీనామా నేపథ్యంలో ఆ పదవిని తన సన్నిహితుడు, ఎమ్మెల్యే వైద్యలింగంకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ హోదాలో పన్నీరుసెల్వం కేటాయించారు. కోర్టు తీర్పుతో ప్రస్తుతం పార్టీకి పెద్ద దిక్కుగా సమన్వయ కమిటీ మారడంతో పళనికి ఒక దాని తర్వాత మరొకటి చొప్పున సమస్యలు ఎదురు కాబోతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు కారణం, పళని స్వామి పంపించిన రాజీనామా లేఖను ఆమోదించాలని సీఈసీకి పన్నీరు సెల్వం లేఖ ద్వారా కోరడమే. ఒకవేళ సీఈసీ పళని రాజీనామాను ఆమోదించిన పక్షంలో, ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి లేకుండా పోయినట్టే. ఇక పార్టీ కో– కన్వీనర్‌గా వైద్యలింగం కొనసాగే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామా లు పళని శిబిరంలో కలవరం రేపుతున్నాయి. మంతనాల్లో పన్నీరు.. హైకోర్టు తీర్పుతో పార్టీ వ్యవహారాలు తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడు పెంచారు. జిల్లా కార్యదర్శులతో సమావేశాలు విస్తృతం చేశారు. శనివారం తన నివాసంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో పళని స్వామి ఒంటరిగా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, ఈ దృష్ట్యా, మరింత దూకుడుగా ముందుకు సాగి, కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలకు పన్నీరు శిబిరం పదును పెట్టినట్లు తెలుస్తోంది. -
పన్నీర్ సెల్వానికి భారీ షాక్.. పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం
సాక్షి, చెన్నై: ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని వనగరంలో సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో జయలలిత మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేశారు. పార్టీకి ఎకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్) ఎన్నికయ్యారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతులోకి చేరాయి. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. #UPDATE | AIADMK passes a resolution to remove O Paneerselvam from party's primary membership at E Palaniswami-led General Council meeting in Vanagaram, Tamil Nadu pic.twitter.com/vigbNP32df — ANI (@ANI) July 11, 2022 ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించాలని ఎమ్మెల్యే నాథం విశ్వనాథన్ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. పన్నీర్ సెల్వాన్ని పార్టీ ముఖ్య పదవులు, సభ్యత్వం నుంచి తొలగిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ తీర్మానించింది. ఓపీఎస్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఓపీఎస్ మద్దతుదారులపైనా బహిష్కరణ వేటు పడింది. పదవులు, సభ్యత్వం నుంచి ఓపీఎస్ మద్దతురాలను తొలగిస్తూ తీర్మానించింది. ఓపీఎస్‌తోపాటు వైతిలింగం, జేసీడీ ప్రభాకర్, పీహెచ్ మనోజ్ పాండియన్ కూడా బహిష్కరణకు గురయ్యారు. చదవండి: అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి ఏకైక పార్టీ అన్నాడీఎంకేనే పార్టీలో ఒకే నాయకత్వాన్ని తీసుకురావాలని జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని అన్నాడీఎంకే నేత పళనిస్వామి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్న ఏకైక పార్టీ అన్నాడీఎంకే అని పేర్కొన్నారు. తన చిత్తశుద్ధితో కూడిన పనులను చూసి దివంగత సీఎం జయలలిత రహదారులు & పీడబ్ల్యూడీ వంటి శాఖలను ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రిగా ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఆ పథకాలనే ప్రస్తుతం సీఎం స్టాలిన్ తమ పార్టీ స్టిక్కర్లను అతికించి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కాగా ఓపీఎస్‌గా ప్రసిద్ధి చెందిన పన్నీర్ సెల్వం మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆగస్టు 21, 2017 నుంచి అన్నాడీఎంకే సమన్వయకుడిగానూ వ్యవహరిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలితను ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలిగా కోర్టు రెండుసార్లు నిర్థారించడంతో పన్నీర్‌సెల్వం తమిళనాడు 7వ ముఖ్యమంత్రిగా(వ్యక్తుల పరంగా) సేవలందించారు. జయలలితకు బదులుగా సీఏం పీఠాన్ని ఆయన రెండుసార్లు అధిరోహించారు. జయలలిత మరణానంతరం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2 నెలలు గడిచిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. -
అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువరికి గాయలవ్వగా.. వాహనాలు ధ్వసం అయ్యాయి. పళనిస్వామి నేతృత్వంలోని జనరల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వెలుపల పన్నీర్ సెల్వం మద్దతుదారులు నిరసన తెలిపారు. — ANI Digital (@ani_digital) July 11, 2022 పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పళనిస్వామి ఫోటోపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ సెల్వం( ఓపీఎస్) వర్గం స్వాధీనం చేసుకుంది. తన వర్గం నేతలతో ఓపీఎస్ సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. దీంతో అన్నాడీఎంకే ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ విధించారు. చదవండి: అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ #WATCH | Chennai, TN | Some people injured in the clash that broke out between supporters of E Palaniswami and O Paneerselvam, on the sidelines of party's general council meeting being led by Palaniswami pic.twitter.com/oSruojJUVo — ANI (@ANI) July 11, 2022 #WATCH | O Paneerselvam supporters slap slippers at E Palaniswami's photo as they protest AIADMK's General Council meeting in Vanagaram, Chennai pic.twitter.com/1bLqtnT7To — ANI (@ANI) July 11, 2022 -
తమిళ రాజకీయాల్లో కలకలం; పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరుతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలో ఆధిపత్యం కోసం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) పోటీ పడటంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలని పళనిస్వామి పట్టుబడుతుండగా.. అలాంటిదేమి కుదరదంటూ పన్నీర్‌సెల్వం అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటాచలపతి ప్యాలెస్‌లో గురువారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ రసాభాసగా ముగిసింది. సమావేశం ముగియడానికి కొద్దిసేపు ముందు పళనిస్వామి వర్గీయులు పన్నీర్‌సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కారు టైర్లలో గాలి తీసేయడంతో మరో వాహనంలో ఓపీఎస్ వెళ్లిపోయారు. ‘సింగిల్ లీడర్షిప్’కు అనుకూలంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు. అయితే కోర్టు తీర్పు కారణంగా దీనిపై ఎటువంటి తీర్మానం చేయలేకపోయారు. 23 తీర్మానాలు తిరస్కరణ ఓపీఎస్ ఆమోదించిన 23 తీర్మానాలను తిరస్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 23 తీర్మానాలను జనరల్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించారని, పార్టీ పగ్గాలు ఒక్కరి చేతిలోనే ఉండాలని వారంతా కోరుకుంటున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ మునుస్వామి తెలిపారు. జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మాజీ మంత్రి జయకుమార్ చెప్పారు. ‘సింగిల్ లీడర్షిప్’ తీర్మానాన్ని తర్వాతి సమావేశంలో ఆమోదింపజేసుకుంటామన్నారు. నాటకీయ పరిణామాలు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరగకుండా చూడాలని పన్నీర్ సెల్వం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఓపీఎస్ మరోసారి కోర్టు తలుపులు తట్టింది. దీనిపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మిగతా అంశాలపై చర్చపై జరగాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ‘సింగిల్ లీడర్షిప్’పై తీర్మానాన్ని ఆమోదించడానికి వీలు లేకుండా పోయింది. దీనంతటికీ కారణమైన పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు కోపంతో రగిలిపోతున్నారు. (క్లిక్: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?) -
అన్నాడీఎంకే పార్టీలో పోస్టర్ల కలకలం
చెన్నై : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రానున్న సార్వత్రిక ఎన్నికల అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలిసిన కొన్ని పోస్టర్లు అధికార పార్టీలో కలకలాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ మంత్రులు.. సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇళ్ల వద్దకు క్యూలు కట్టారు. అనంతరం శనివారం సాయంత్రం పళనిస్వామి, పన్నీరు సెల్వాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలు, పొత్తులు కార్యకర్తల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకునే జరుగుతాయన్నారు. ( తడబడి నిలబడిన.. ఈపీఎస్ – ఓపీఎస్! ) వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకుండా కార్యకర్తలందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళనాడులో 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో డీఎమ్‌కే పార్టీ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను సైతం రంగంలోకి దింపింది. -
పన్నీరు సెల్వం సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీరు సెల్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత సోదరుడిపైనే వేటు వేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి తన సోదరుడు ఒ రాజాను బహిష్కరించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా స్థానిక పాల సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. క్రమశిక్షణ ఉల్లఘించినందుకు రాజాను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించామని.. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేశామని వెల్లడించారు. ఆయనతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. థేని జిల్లాలోని పెరియకులం పంచాయతీ సర్పంచ్‌గా గతంలో రాజా పనిచేశారు. పన్నీరు సెల్వంకు ఇష్టం లేకపోయినా ఇటీవల జరిగిన మధురైలోని ఆవిన్ పాల సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరోవైపు తనను కాదని కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారని పన్నీరు సెల్వంపై రాజా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
‘కావేరి’ కోసం ముఖ్యమంత్రి దీక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: కర్ణాటక, తమిళనాడులకు కావేరీ నదీజలాల పంపిణీ కోసం కావేరి మేనేజ్మెంట్ బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేయాలంటూ అన్నాడీఎంకే మంగళవారం తమిళనాడులో రిలే నిరాహారదీక్షలు చేపట్టింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మంత్రులు చెన్నైలోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయని కేంద్రం వైఖరిని నిరసిస్తూ డీఎంకే, కాంగ్రెస్ తదితర పార్టీలు, రైతు, ప్రజా, యువజన, విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాయి. వాణిజ్య సంఘాల పిలుపుతో 30,000 ఫార్మసీ దుకాణాలతోపాటు అన్ని రకాల అంగళ్లు మూతపడ్డాయి. కాగా, కేంద్ర ప్రభుత్వ అడుగులకు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే మడుగులు ఒత్తుతోందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. చెన్నైలో డీఎంకే చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. దీక్షల పేరుతో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కపటనాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ‘కావేరి’ పిటిషన్లపై 9న విచారణ: సుప్రీం న్యూఢిల్లీ: కావేరి నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పష్టత కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్‌ను కోర్టు ఈ నెల 9న విచారించనుంది. కావేరి బోర్డును ఏర్పాటు చేయడంపై సంబంధిత రాష్ట్రాల వాదనలను కేంద్రం తరఫు న్యాయవాది కోర్టు ముందుంచారు. ఈ నెల 9న తమిళనాడు పిటిషన్‌తోపాటే కేంద్రం పిటిషన్‌నూ విచారిస్తామని కోర్టు చెప్పింది. -
జనసంద్రంగా మారిన మెరీనా బీచ్
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానులు, పలువురు ప్రముఖులు 'అమ్మ' సమాధి వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద గల జయలలిత సమాధి వద్ద సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం 'అమ్మ'కు ఘన నివాళి అర్పించారు. వీరితో పాటు తమిళనాడు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జయకు నివాళులు అర్పించారు. అమ్మతో తమ అనుబంధాన్ని, రాష్ట్రానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుని పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. పళని, పన్నీర్ నేతృత్వంలో మెరీనా బీచ్ నుంచి జయ అభిమానులు, పార్టీ శ్రేణులు శాంతియుత ర్యాలీ చేపట్టాయి. గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన స్వల్ప అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. 5వ తేదీన సాయంత్రం అమ్మ కన్నుమూశారని ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. చెన్నై మెరీనాబీ చ్లో ఎంజీఆర్ సమాధి పక్కనే 6వ తేదీన జయకు అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. -
పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఓ పన్నీర్ సెల్వంకు అదనపు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయనకు ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలు, ఎన్నికలు, పాస్పోర్ట్స్ శాఖలు అదనంగా అప్పగించారు. ఇంతకుముందు ఈ శాఖలను డి. జయకుమార్ నిర్వహించారు. ఆయనకు మత్స్యశాఖ, సిబ్బంది మరియు పరిపాలన సంస్కరణల శాఖ కేటాయించారు. తన వర్గాన్ని అధికారిక అన్నాడీఎంకేలో సోమవారం పన్నీర్ సెల్వం విలీనం చేశారు. దీంతో ఆయనతో పాటు కే పాండియన్‌కు మంత్రి పదవులు దక్కాయి. నిన్న సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు ఆర్థిక, గృహ, గ్రామీణ గృహ నిర్మాణం, మురికివాడల నిర్మూలన, పట్టణాభివృద్ధి, చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ శాఖలను కేటాయించారు. పాండియన్ తమిళనాడు అధికార భాష, సంస్కృతి సంప్రదాయాల శాఖలను దక్కించుకున్నారు. -
పంతం నెగ్గించుకున్న పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళ భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా కె. పాండ్యరాజన్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పన్నీర్ సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేతులు కలిపారు. అయితే పన్నీర్ వర్గానికి మూడు మంత్రి పదవులు ఇస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రభుత్వం, పార్టీలో పదవులు అందుకోవడం ద్వారా పన్నీర్ సెల్వం పంతం నెగ్గినట్టైంది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదు. పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం చెప్పారు. చిన్నమ్మ భవితవ్యంపై పార్టీ ఎటువంటి వైఖరి అవలంభిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం!
-
మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం!
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మోదీ-పళని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో మోదీ సర్కారుకు పళనిస్వామి మద్దతునివ్వవచ్చునని భావిస్తున్నారు. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మోదీని కలిసిన అనంతరం పళనిస్వామి మీడియాతో తెలిపారు. జయలలిత తర్వాత అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోగా.. అందులో అతిపెద్ద వర్గానికి పళని నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని మరో ప్రత్యర్థి వర్గం ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతునివ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి వర్గం కూడా బీజేపీకి మద్దతునిస్తే.. రాష్ట్రపతి ఎన్నికలను సునాయసంగా గట్టెక్కవచ్చునని కమలనాథులు భావిస్తున్నారు. వచ్చే జూలైలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్డీయేకు 51శాతం ఎలక్టోరల్ కాలేజీ మద్దతు అవసరముంది. ప్రస్తుతం బీజేపీకి 48.5శాతం ఎలక్టోరల్ ఓట్ల మద్దతు ఉండగా, అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతు సంపూర్ణ మెజారిటీ సాధించాలని బీజేపీ కోరుకుంటోంది. -
తొలి విజయం సాధించాం: పన్నీర్ సెల్వం
-
తొలి విజయం సాధించాం: పన్నీర్ సెల్వం
చెన్నై: ధర్మయుద్ధంలో మొదటి విజయం సాధించామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం(ఓపీస్) ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబ సభ్యులను వెళ్లగొట్టడాన్ని తొలి విజయంగా ఆయన వర్ణించారు. కుటుంబ పాలనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింసూచబోమని పునరుద్ఘాటించారు. తన మద్దతుదారులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చివరకు న్యాయం గెలిచిందన్నారు. అన్నాడీఎంకే విలీనమవుతామని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. పార్టీ ఒక్కటిగా ఉండాలన్న లక్షలాది కార్యకర్తల అభీష్టం నెరవేందుకు రెండు వర్గాలు చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు. అమ్మ’ ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశిస్తే విలీనమవడానికి సిద్ధమని ప్రకటించారు. 11 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, సీనియర్ నాయకులతో అంతకుముందు పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై మంతనాలు సాగించారు. -
శశికళపై తిరుగుబాటు.. వేటుకు రంగం సిద్ధం?
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం మారుతున్న సమీకరణాలతో ఊహకందనంత వేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు అన్నాడీఎంకేపై శశికళ వర్గానికి తిరుగులేని ఆధిపత్యం. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుపాలైనా.. కటకటాల నుంచి ఆమె మంత్రాంగం నడిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. శశికళ పేరు ఎత్తితేనే అధికార అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. సీనియర్ మంత్రులు ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారని సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళకు ఉద్వాసన పలికేందుకు వేగంగా పావులు కదుతుపున్నట్టు తెలుస్తోంది. తాజాగా తెరపైకి వచ్చిన అన్నాడీఎంకే, పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని తాజాగా ప్రచారం జోరందుకుంది. ఒకప్పుడు శశికళకు వీరవిధేయుడిగా ఉన్న సీఎం ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్) తాజాగా ఓపీఎస్‌తో చేతులు కలిపేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు సీనియర్ మంత్రులు, ఓపీఎస్ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు చేతులు కలిపి.. మన్నార్గుడి మాఫియాను పూర్తిగా అన్నాడీఎంకే నుంచి బయటకు తరిమేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాల పునరేకీకరణ వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళను తప్పుకోవాలని ఆ పార్టీ స్పష్టం చేసినట్టు సమాచారం. శశికళ తప్పుకోకుంటే తాము పదవికి రాజీనామా చేస్తామని ఇప్పటికే సీనియర్ మంత్రులు అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు శశికళ కొడుకు, ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న దినకరన్ కూడా అరెస్టయ్యే అవకాశముందని తెలుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి దినకరన్ మధ్యవర్తి సుఖేష్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినకరన్‌ను కూడా అరెస్టు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ క్రైబ్రాంచ్ పోలీసులు చెన్నై చేరుకొని.. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శశికళను కలువకుండానే దినకరన్ వెనుదిరిగారు. మరోవైపు ఇన్నాళ్లు తన గుప్పిట్లో ఉన్న అన్నాడీఎంకేలో తనకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేస్తుండటంతో శశికళ తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పూర్తిగా చిన్నమ్మ అదుపు దాటిపోయిందని సన్నిహితవర్గాలు ఆమెకు చేరవేసినట్టు సమాచారం. -
ఆశల పల్లకిలో పన్నీరు సెల్వం!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు త్వరలో తన శిబిరంలోకి వచ్చి తీరుతారన్న ఆశల పల్లకిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఉన్నారు. శశికళ కుటుంబ జోక్యం కారణంగానే అన్నాడీఎంకేలో చీలిక అనివార్యం అయిందని సమర్థించుకున్నారు. అమ్మ మరణంలో మిస్టరీపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు తాను కట్టుబడే ఉన్నట్టు చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టించి బయటకు వచ్చిన నేత పన్నీరుసెల్వం. అధి కారం దూరమైనా, పార్టీని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోవడం లక్ష్యంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో పార్టీవర్గాల దృష్టిని తన వైపు తిప్పుకుని బలాన్ని చాటుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారబిజీలో ఉన్న మాజీ సీఎం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ శిబిరం నేత ఓ.పన్నీరుసెల్వం మీడియాకు ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ మేరకు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఆశాభావాల్ని, ధీమా వ్యక్తం చేస్తూ, తాను గతంలో చేసిన వాఖ్యలకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. 122 మంది వస్తారు అసెంబ్లీ వేదికగా బలపరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను బెదిరించి, బలవంతంగా బంధించి మద్దతు కూడగట్టుకున్నారని ఆరోపించారు. మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఏ మేరకు వ్యతిరేకిస్తున్నారో అన్న విషయం ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాల నాటికి తేలుతుందన్నారు. ఎన్నికల అనంతరం ఆ శిబిరంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు తన వైపునకు వస్తారన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదికగా అన్నాడీఎంకే మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తాత్కాలికమేనని జోస్యం చెప్పారు. ఆ కుటుంబ జోక్యంతో చీలిక దివంగత సీఎం ఎంజీఆర్ ఎన్నడూ పార్టీలో తన కుటుంబీకుల జోక్యానికి అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. అమ్మ జయలలిత కూడా అదే తరహాలో ముందుకు సాగారని వ్యాఖ్యానించారు. కుటుంబ రాజకీయాలకు అమ్మ వ్యతిరేకం అని, అమ్మ మరణంతో శశికళ కుటుంబం జోక్యం పెరగడంతోనే చీలిక అనివార్యం అయిందని చెప్పారు. ఆ కుటుంబ జోక్యాన్ని ఎన్నడూ అమ్మ అనుమతించలేదని, అమ్మ లేని దృష్ట్యా, ఇష్టారాజ్యంగా ఆ కుటుంబం వ్యవహరిస్తూ పార్టీ, ప్రభుత్వం, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. ఆ కుటుంబ జోక్యం లేకుండా ఉండి ఉంటే, అందరం ఒకే వేదికగా కలిసి ఉండే వాళ్లమని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాన్ని సాగనంపి, మళ్లీ అందరూ ఒకే వేదికగా ముందుకు సాగే సమయం తప్పకుండా వస్తుందన్న నమ్మకం తనలో ఉందన్నారు. ఇందుకు ప్రజలు అండగా నిలబడాలని, ప్రజా మద్దతుతో అన్నాడీఎంకే వైభవాన్ని చాటుతామని, కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని మళ్లీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కట్టుబడే ఉన్నా అమ్మ మరణంలో అనుమానాలు తేలాలంటే విచారణ కమిషన్‌ను నియమించాల్సిందేనని పన్నీరుసెల్వం డిమాండ్ చేశారు. తాను ఇందుకు కట్టుబడే ఉన్నట్టు స్పష్టంచేశారు. అమ్మను ఆసుపత్రిలో చేర్చినప్పుడు అధికారులు కొందరు ఆమెతో భేటీ అయ్యారని వివరించారు. కావేరి జలాల సమస్యపై సాగిన ఈ భేటికి తాను వెళ్లలేదని చెప్పారు. ఆ సమావేశానికి వెళ్లిన అధికారులతో తాను మాట్లాడటం జరిగిందన్నారు. అమ్మ స్వయంగా కావేరి నివేదిక విషయంగా పలు మార్పులు చేర్పులు, సూచనలు ఇచ్చినట్టు స్పష్టం చేశారని పేర్కొన్నారు. అయితే, ఆ మరుసటి రోజే అమ్మ అపస్మారక స్థితిలో ఉన్నట్టు ప్రకటించడంతోనే అనుమానాలు కలిగాయని చెప్పారు. అందుకే అనుమానాల నివృత్తి లక్ష్యంగా విచారణ కమిషన్‌కు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. -
అనారోగ్యంతోనే జయ మృతి
► నివేదిక సమర్పించిన ఎయిమ్స్ ► తమిళనాడు ప్రభుత్వం వెల్లడి సాక్షిప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత అనారోగ్య కారణాలతోనే చనిపోయారని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధా రమైనవంది. జయకు జరిగిన చికిత్స వివరాలను బహిరంగంగా వెల్లడించ కూడదనే నిబంధన ఉన్నా అనవసర వదంతులకు తావివ్వకూడదనే కారణంతో ప్రకటన విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ మీడియాకు చెప్పారు. జయ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ నెల 8న నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జయకు చికిత్సలో భాగస్వామ్యులైన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు తమిళనాడు ప్రభుత్వానికి సోమవారం నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ‘గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి జయలలిత శ్వాసకోశ ఇబ్బందితో స్పృహ కోల్పోయిన స్థితిలో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించినపుడు డీహైడ్రేషన్, జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నట్లు తేలింది. ఆమెను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని ప్రారంభిం చాం. డిసెంబరు 3న జయను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులను అభినందించారు. అయితే 4న ఆమె తీవ్ర గుండెపోటుకు గురికాగా ఎక్మో చికిత్స అందజేశాం. అయినా దుర దృష్టవశాత్తూ 5వ తేదీ రాత్రి 11.30 గంట లకు జయ తుదిశ్వాస విడిచారు’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. -
జయ వైద్య నివేదికల వెల్లడి!
-
షాకింగ్ నిజాలు వెల్లడించిన పన్నీర్ సెల్వం!
చెన్నై: జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతూ.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం తాజాగా మరికొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించిన వైద్యులు తనతో కొన్ని షాకింగ్ నిజాలను వెల్లడించారని చెప్పారు. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు, ఆమె కుటుంభసభ్యులకు తాను వ్యతిరేకంగా ఉన్నానని నిర్దారించుకున్న తర్వాతే వైద్యులు తనను కలిసి విలువైన సమాచారాన్ని వెల్లడించారని మీడియాతో మాట్లాడుతూ పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్న కొన్ని రోజులకే జయలలిత మృతిచెందారని ఇందుకు కారకురాలు శశికళేనని పన్నీర్ ఆరోపించారు. జయ మృతిపై ఎలాంటి దర్యాప్తు చర్యలు చేపట్టకపోతే మార్చి 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హెచ్చరించారు. 'అపోలో ఆస్పత్రిలో జయలలితకు చికిత్స చేసిన వైద్యులు నాతో పలుమార్లు మాట్లాడారు. అమ్మకు మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తీసుకెళ్లాలని అప్పట్లో నేను సూచించాను. అయితే తమకు అందుకు కొందరు అనుమతి ఇవ్వలేదని డాక్టర్లు నాకు చెప్పారు. విదేశాలకు అమ్మను తీసుకెళ్లకుండా కుట్రతో శశికళ అడ్డుకున్నారని' పన్నీర్ సెల్వం వివరించారు. ఒకవేళ శశికళ సీఎం అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్దామని అన్నాడీఎంకే నేతలు తనతో చర్చించారని.. పరిస్థితుల ప్రభావంతో ఇప్పుడు అదే నేతలు రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. శశికళ పదే పదే అందరికీ అడ్డుచెప్పడంతోనే జయలలితకు మెరుగైన చికిత్స ఇప్పించ లేకపోయామని వైద్యులు వెల్లడించిన తర్వాత ఇక ఆలస్యం చేయవద్దని దర్యాప్తు జరిపించాలని పన్నీర్ వర్గీయులు అంటున్నారు. జయలలితను ఆమె నివాసం పోయెస్ గార్డెన్ లో కిందకి తోసేశారని, ఆపై వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించినందునే ఆమె మృతి చెందారని, ఇందుకు శశికళే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు'
బెంగళూరు : తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదంటూ స్పష్టీకరించిన వెంకయ్యనాయుడు మరోసారి ఆ విషయంపై స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ అధినేతగా తన బాధ్యతలను నిష్ఫక్షపాతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి విషయాలు ఆయన్ని ప్రభావితం చేయడం లేదన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని, అక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉన్న ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ నేతలే ఓ సరియైన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. తమిళ సంక్షోభాన్ని త్వరగా ముగించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఓ వైపు నుంచి ఆయనపై ఒత్తిడి నెలకొంటోంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పటికే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై స్పందించిన వెంకయ్యనాయుడు ఎలాంటి పక్షపాతం లేకుండా గవర్నర్ వ్యవహరిస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. పన్నీర్‌సెల్వం రాజీనామా చేయడానికి బీజేపీ కారణం కాదని స్పష్టీకరించారు. బీజేపీ తమిళ అసెంబ్లీలో ఓ సభ్యురాలు కాదని, తమకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఎలాంటి అవకాశమూ లేదన్నారు. బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్లో వెంకయ్యనాయుడు ఆదివారం పాల్గొన్నారు.. -
'ఎంజీఆర్ బాటలో పన్నీర్ సెల్వం'
-
'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరును రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక పోవటం ప్రలోభాల కిందకే వస్తుందన్నారు. తమిళనాడు సీఎంగా ఎవరికి అవకాశమివ్వాలన్న అంశంలో గవర్నర్ ఇంకా నాన్చడం సరికాదని హితవు పలికారు. రేపటికల్లా గవర్నర్ విద్యాసాగర్ రావు దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఆర్టికల్ 32 కింద రిట్ దాఖలు చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. న్యాయపోరాటం చేసి అయినా తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జాప్యం చేయడం ప్రలోభాల కిందకే వస్తుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. వారం రోజుల కిందట పన్నీర్ సెల్వం రాజీనామా అనంతరం.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతే పదివి వదిలేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శశికళను పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్ధతు ఆమెకు ఉన్న తరుణంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలంటూ ఇటీవల ఆయన సూచించారు. మరోవైపు పన్నీర్ సెల్వానికి రోజురోజుకు మద్ధతు పెరిగిపోవడం శశికళ వర్గంలో గుబులు రేపుతోంది. The TN Guv must decide CM issue by tomorrow otherwise a WP under Art 32 of the Constitution can be filed charging abetment of horse trading — Subramanian Swamy (@Swamy39) 12 February 2017 -
'ఎంజీఆర్ బాటలో పన్నీర్ సెల్వం'
చెన్నై: రోజురోజుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మద్ధతు పెరిగిపోతుండగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కష్టాలు రెట్టింపవుతున్నాయి. పన్నీర్ వర్గంలో అన్నాడీఎంకే మాజీ ఎంపీ, సీనియర్ నేత రామరాజన్ చేరిపోయారు. నేటి ఉదయం చెన్నైలో పన్నీర్ సెల్వాన్ని తన మద్ధతుదారులతో ఆయన కలుసుకుని మద్ధతు ప్రకటించారు. 'అమ్మ' జయలలిత వీర విధేయుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే తమ పార్టీ నేత అని తెలిపారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ బాటలో పన్నీర్ నడుచుకుంటున్నారని కొనియాడారు. ఎంజీఆర్ వారసత్వాన్ని జయ అందిపుచ్చుకున్నట్లుగా, జయ అనంతరం ఆమె రాజకీయ వారసత్వాన్ని పన్నీర్ సెల్వం కొనసాగించాలని నటుడు, మాజీ ఎంపీ రామరాజన్ ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం అన్నాడీఎంకే ఎంపీలు బి. సెంగొట్టువన్, జె. జెయసింగ్ చిన్నమ్మ శశికళను కాదని పన్నీర్ సెల్వాన్ని నేరుగా కలిసి తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. క్యాంపు రాజకీయాలు నడిపినా శశికళపై పార్టీ నేతల్లో విశ్వాసం అంతగా లేదని స్పష్టమవుతోంది. దాంతో శనివారం సాయంత్రం గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలతో శశికళ భేటీలోనూ ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 20 మంది ఎమ్మెల్యేలు తాము పన్నీర్ కే మద్ధతు ఇస్తామని చెప్పగా.. శశికళకు చెందిన మన్నార్ గుడి వర్గం సీఎం అభ్యర్థిగా ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ను ప్రతిపాదిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తమిళ రాజకీయాలపై మరిన్ని కథనాలు శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు త్వరలో అధికారంలోకి డీఎంకే! తెరపైకి కొత్త సీఎం.. శశి వర్గం ట్విస్ట్! శశికళకు మరో ఎదురుదెబ్బ -
శశికళపై కోర్టుల్లో పిటిషన్ల పరంపర
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి పీఠం ఎక్కేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న శశికళపై పిటిషన్ల పరంపర కొనసాగుతోంది. శశికళ మద్దతుదారులు నిర్బంధించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు విముక్తి కలిగించేలా ఆదేశాలి వ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో, ఆస్తుల కేసులో తీర్పు వెలువడే వరకు ప్రమా ణ స్వీకారంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్లు దాఖల య్యాయి. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించిన నేపథ్యంలో.. కున్నమ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రన్ కనపడడం లేదని, ఆయన జాడ కనిపెట్టి, న్యాయస్థానంలో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఇలవరసన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాది కె.బాలు, సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామి గురువారం వేర్వేరుగా హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు హాజరై అన్నాడీఎంకేకు చెందిన 130 ఎమ్మెల్యేలను విడిపించి, కోర్టులో హాజరు పర్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ... ఎమ్మె ల్యేలు కిడ్నాప్‌నకు గురికాలేదని, ఇంటివద్దనే సురక్షితంగా ఉన్నారని వాదించారు. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు స్పందిస్తూ... ఎమ్మె ల్యేల కిడ్నాప్ అంశంపై పిటిషన్ దాఖలు చేస్తేనే విచారణ చేపట్టగలమని అన్నారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టులో మరో పిటిషన్ శశికళ సీఎంగా బాధ్యతలు చేపట్టకుండా నిషేధం విధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన చట్ట పంచాయిత్తు ఇయక్కం తరఫున సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశాడు. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకూ సీఎంగా శశికళ బాధ్యతలు స్వీకరించకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశాడు. -
శశికళ కాదు కుట్రకళ
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ధ్వజం నాపై అసత్య ప్రచారం చేస్తే ఆమె బండారం బయటపెడతా పన్నీర్‌సెల్వం గూటికి చేరిన పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు శశికళ కపట నాటకం ఆడుతున్నారని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం ధ్వజమెత్తారు. తనపై అసత్య ప్రచారం చేస్తే శశికళ బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఆమె శశికళ కాదు కుట్రకళ అని మండిపడ్డారు. ఆయన గురు వారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీకి తాను ద్రోహం చేశానం టూ విమర్శిస్తున్నారని, ద్రోహి ఎవరో ప్రజల కు, పార్టీ శ్రేణులకు బాగా తెలుసని అన్నారు. పార్టీ ద్రోహులను గతంలో జయలలితే గుర్తిం చారని చెప్పారు. పార్టీ, ప్రభుత్వ పదవులు కోరుకోనంటూ జయలలిత వద్ద లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరిన శశికళ అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబ ట్టారు. పోయెస్ గార్డెన్లో తన బంధువులకు స్థానం కల్పించడం ద్వారా జయకు శశికళ ద్రోహం చేశారని పన్నీర్ విమర్శించారు. స్మారక మందిరంగా వేద నిలయం పోయెస్‌గార్డెన్‌లో జయలలిత నివసించిన వేద నిలయంను స్మారక మందిరంగా మార్చనున్న ట్లు పన్నీర్‌సెల్వం తెలిపారు. ‘అమ్మ’ వినియో గించిన కారు, అన్నిరకాల వస్తు సామగ్రిని స్మారక మందిరం ఆస్తులుగా పరిగణించ నున్నట్లు చెప్పారు. ‘అమ్మ’ నివసించిన ఇల్లు తమ దృష్టిలో దేవాలయమని పేర్కొన్నారు. శశికళది రౌడీల కూటమి.. శశికళకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ముద్ర పడిన అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధు సూదనన్ గురువారం మధ్యాహ్నం పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకున్నారు. ప్రధాన కార్య దర్శిగా, సీఎంగా బాధ్యతలు చేపట్టాలని శశి కళపై ఒత్తిడి తెచ్చిన ప్రముఖ నేతల్లో ఒకరైన మధుసూదనన్ తాజాగా పన్నీర్‌సెల్వం గూటికి చేరారు. మదుసూధనన్ రాగానే పన్నీర్‌సెల్వం ఎదురేగి స్వాగతం పలికారు. ఆయన రాకతో తమ బలం మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదనన్ మీడి యాతో మాట్లాడారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే ఒక కుటుంబం చేతిలోకి వెళ్లకూ డదనే ఉద్దేశంతో పన్నీర్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘శశికళది రౌడీల కూటమి. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పార్టీ వెళ్లడం నాకిష్టం లేదు. దివంగత సీఎం జయలలిత విశ్వాసాన్ని పొందిన వ్యక్తి పన్నీర్. జయ మర ణం విషయంలో నాకు అనుమానాలున్నాయి. శశికళను సీఎంగా చూసేందుకు ప్రజలు అంగీ కరించడం లేదు. అన్నాడీఎంకేను కాపాడు కోవాలి. పార్టీ శ్రేణులంతా పన్నీర్‌కు మద్దతు గా నిలవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. పన్నీర్ ఇంటికి మద్దతుదారుల క్యూ అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించి ధీమాగా ఉన్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం ఇంటికి గురువారం పెద్ద సంఖ్యలో మద్దతుదారులు తరలివ చ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పన్నీర్‌ను కలిసేందుకు వస్తు న్నారు. వారందరి పేర్లు, ఫోన్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేసుకునేం దుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పన్నీర్‌సెల్వం వెంట ఉన్న ట్లు తెలుస్తోంది. శశికళపై అసంతృప్తితో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
పాత్రధారులెవరు? సూత్రధారులెవరు?
(సాక్షి సెంట్రల్ డెస్క్) తమిళనాట రాజకీయం నాటకీయ మలుపులతో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పురచ్చి తలైవి జయలలిత మరణంతోనే అన్నాడీఎంకే, తమిళనాడు సర్కారు పెనుసంక్షోభంలో కూరుకుపోతాయన్న విషయం స్పష్టమైంది. అయితే.. ‘అమ్మ’మరణానంతరం ఆమె నమ్మినబంటు పన్నీర్ సెల్వం ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టడం హడావుడిగానే అయినా సజావుగా సాగడంతో అప్పటికి సమస్య లేకపోయింది. అయితే రెండు నెలలు తిరిగేసరికే పరిస్థితులు మారిపోయాయి. ‘అమ్మ’కు నమ్మినబంటు పన్నీర్ సెల్వం.. జయలలిత నెచ్చెలి శశికళల మధ్య ఆధిపత్య పోరాటంతో ఒక్కసారిగా సంక్షోభం బద్దలైంది. ఓ పన్నీర్ సెల్వం: రాజే బంటు.. బంటే రాజు! రాజకీయాలను ఉత్కంఠభరిత మలుపు తిప్పిన ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ‘అమ్మ’కు నమ్మినబంటు. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన పన్నీర్.. అన్నాడీఎం కేలో ఆది నుంచీ ఉన్నారు. 1996–2001 మధ్య పెరియ కులం మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. కోర్టు ఉత్తర్వుల కారణంగా జయలలిత సీఎం పదవిలో కొనసాగలేని పరిస్థితుల్లో ఆమె పన్నీర్నే ఆ పదవిలో కూర్చోబెట్టేవారు. అలా 2001లో మొదటి సారి ఆరు నెలలు, 2014లో రెండోసారి ఎనిమిది నెలలు సీఎం అయ్యారు. పన్నీర్ సీఎంగా పనిచేసిన ప్రతిసారీ.. ‘అమ్మ’చేతిలో కీలుబొమ్మగానే పనిచేశారనే అభి ప్రాయం ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రాగా.. డిసెంబర్లో జయలలిత మరణంతో పన్నీర్ సెల్వం మూడోసారి సీఎం అయ్యా రు. అయితే.. ఈసారి రెండు నెలలకే ‘చిన్నమ్మ’శశికళ కోసం రాజీనామా చేశారు. కానీ.. రెండో రోజే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నా కానీ.. వెన్నెముక లేని నాయకుడంటూ ఇంతకాలం ఎద్దేవాకు గురైన పన్నీర్.. అకస్మాత్తుగా చిన్నమ్మపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించారు. శశికళ: ‘అమ్మ’కావాలనుకునే చిన్నమ్మ! ఫంక్షన్లకు వీడియోలు చిత్రీకరించే శశికళకు.. నాడు అన్నాడీ ఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలితతో కలిగిన పరి చయం అనతికాలంలోనే ఆమెకు అత్యంత సన్నిహితురా లిని చేసింది. ఆమె అక్కకొడుకును జయలలిత దత్తత తీసుకుని రికార్డులకెక్కే రీతిలో పెళ్లి కూడా చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ కూడా జైలుకెళ్లారు. అయితే.. శశికళ, ఆమె భర్త, బంధువులు తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ జయ 2011లో వారిని బహిష్కరించారు. శశికళ రాతపూర్వ కంగా క్షమాపణ చెప్పడంతో జయ మళ్లీ 3 నెలలకే ఆమెను పొయస్గార్డెన్ లోకి ఆహ్వానించారు. శశికళ.. జయ జీవించి ఉన్నపుడే పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తిగా.. జయ తర్వాత ‘చిన్నమ్మ’గా స్థానం పొందారు. గత ఏడాది ఎన్నికల్లో శశికళ తనకు నమ్మకస్తులైన వారికి ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నారని.. ఎన్నడూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని ఆమెకు ఇప్పుడు కలసివచ్చే అంశం ఇదేనని భావిస్తున్నారు. జయలలిత: అమ్మ వారసత్వం ఎవరిది? తమిళనాట సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. విప్లవనాయకిగా తిరుగులేని అధినేతగా ఎదిగారు జయల లిత.. అనూహ్యంగా గత డిసెంబర్లో చనిపోవడంతో ఆమె రాజకీయ వారసత్వం ఎవరిదనే ప్రశ్నలు మొదలయ్యాయి. జయ మరణించిన రెండు నెలలకే.. ఆమెకు అత్యంత నమ్మకస్తులైన ఇద్దరి మధ్యనే వైరం రాజుకుంది. పన్నీర్‌సెల్వం.. చిన్నమ్మపై తిరుగుబాటు చేసే ముందు జయ సమాధి వద్ద కొద్దిసేపు మౌనదీక్ష చేశారు. అమ్మ ఆత్మ తనను నడిపిస్తోందని ప్రకటించారు. అమ్మ అభీష్టానికి పన్నీర్ ద్రోహం చేశారని శశికళ ఆరోపించారు. నటరాజన్: చిన్నమ్మ భర్త మళ్లీ వచ్చాడు శశికళ భర్త నటరాజన్ తన పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ఆగ్రహంతో జయలలిత 1996లోనే పొయెస్ గార్డెన్ నుంచి బహిష్కరించారు. దీంతో శశికళ కూడా ఆయనతో సంబంధాలు తెంపేసుకున్నారు. మరోవైపు.. నటరాజన్ పవర్ బ్రోకర్‌గా ఖ్యాతిని ఆర్జించడమే కాదు, ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు పెంచుకున్నారు. అయితే.. జయలలిత మరణానంతరం ఆమె మృతదేహం వద్ద శశికళతో పాటు ఆమె భర్త నటరాజన్ ఇతర బంధువులు కూడా వచ్చి చేరడం విశేషం. ఆయన త్వరలోనే తెరపైకి వస్తారన్నది పరిశీలకుల అంచనా. దీపా జయకుమార్: రంగంలోకి రక్తసంబంధం అధికార పీఠం కోసం పన్నీర్‌సెల్వం–శశికళ మధ్య పోరు మొదలవగానే.. జయలలిత మేనకోడలు దీపా జయకు మార్ కూడా రంగంలోకి దిగారు. నిజానికి.. జయలలిత చనిపోయే వరకూ ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. జయ మరణించిన తర్వాత.. ఆస్పత్రిలో జయలలితను కలవకుండా తనను అడ్డుకున్నారని ఆరోపించి పతాక శీర్షికలకు ఎక్కారు. తాజాగా.. శశికళపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. తన మేనత్త జయంతి రోజైన ఫిబ్రవరి 24న కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. దీపా జయకుమార్ తనతో చేరితే స్వాగతిస్తానని పన్నీర్ సెల్వం ప్రకటించారు. గవర్నర్: ముంబై టు చెన్నై వయా ఢిల్లీ తమిళనాడు పరిణామాల్లో గత నాలుగు రోజులుగా అందరి కళ్లూ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుపైనే నిలిచాయి. గత ఆదివారం పన్నీర్‌సెల్వం రాజీనామా చేయడంతో గవర్నర్ అర్థంతరంగా ఢిల్లీ వెళ్లారు. శశికళ మంగళవారం సీఎంగా ప్రమాణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోగా.. సోమవారమే చెన్నై వస్తారనుకున్న గవర్నర్.. ఢిల్లీలో ‘కేంద్ర నాయకత్వాన్ని’కలసి నేరుగా ముంబై వెళ్లిపోయారు. ఇది పలు ఊహాగానాలకు ఊతమిచ్చింది. గురువారం చెన్నైలో తొలుత పన్నీర్‌సెల్వంతో, తర్వాత శశికళతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేస్తారు? పన్నీర్ బలనిరూపణకు అవకాశం ఇస్తారా? శశికళను సీఎం పగ్గాలు చేపట్టడానికి ఆహ్వానిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సుబ్రమణ్యంస్వామి: అంతుచిక్కని ఆంతర్యం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యంస్వామి.. జయలలిత, శశికళలపై 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టారు. ఆ కేసు కారణంగానే 2014లో జయలలిత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు శశికళ భవితవ్యాన్ని కూడా అదే కేసు ప్రశ్నార్థకం చేస్తోంది. అయినప్పటికీ.. శశికళకు సుబ్రమణ్యంస్వామి మద్దతుగా నిలుస్తున్నారు. డీఎంకే: వేచిచూస్తున్న విపక్షం తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రస్తుత హైడ్రామాలో ప్రేక్షక పాత్ర పోషిస్తూ వేచిచూస్తున్నట్లు కనిపిస్తున్నా.. తన మాటలతో నాటకాన్ని రసవత్తరం చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. తొలుత శశికళ సీఎం పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించారు. తర్వాత పన్నీర్‌సెల్వంకు అంశాలవారీ మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతలోనే.. తమిళ ప్రజలు పన్నీర్కో, శశికళకో ఓటు వేయలేదన్నారు. డీఎంకేతో పన్నీర్‌సెల్వం చేతులు కలిపారని శశికళ ఆరోపించారు. ఏదేమైనా అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం డీఎంకేకు కలసి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ: హైడ్రామా వెనుక సూత్రధారి? తమిళనాట రాజకీయ మలుపుల వెనుక కేంద్రం పాత్ర ఉందన్న వాదనలూ బలంగానే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని తనకు అనుకూలంగా వాడుకుంటోందని చెప్తున్నారు. అసలు పన్నీర్‌సెల్వం ‘తిరుగుబాటు’వెనుక కారణమిదేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ‘సిఫారసు’మేరకు తమిళనాడు శాసనసభను సుçషుప్తచేతనావస్థలో ఉంచటమో, రద్దు చేయడమో చేసి.. రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న అంశాలపై ఇప్పుడు వాడీవేడిగా చర్చ జరుగుతోంది. -
దీపా అడుగు
పన్నీరు పిలుపునకు స్పందించేనా? మద్దతుదారులతో సమాలోచన నిశితంగా పరిశీలన సాక్షి, చెన్నై: మేనత్త జయలలితకు తానే వారసురాలి నంటూ రాజకీయల్లో రాణించేందుకు తీవ్రంగా కసరత్తుల్లో ఉన్న దీపా అడుగులు ఇక, ఎలా ఉండనున్నాయో అన్న చర్చ బయలు దేరింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం పిలుపురనకు ఆమె స్పందించేనా అన్న ఎదురు చూపులు బయలు దేరాయి.అమ్మ జయలలిత మరణం తదుపరి నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతియ శ్రేణి కేడర్ చూపు దీపా మీద మరలిన విషయం తెలిసిందే. జయలలితమేన కోడలు దీపా నాయకత్వంలో పనిచేసే దిశగా ఆ కేడర్ అడుగులు సాగుతున్నాయి. దీపా పేరవై గొడుగు నీడన బలోపేతం లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. అచ్చం అమ్మ జయలలితను గుర్తుకు తెచ్చే రీతిలో దీపా అడుగులు ముందుకు సాగుతున్నాయి. దీపా పార్టీ పెట్టేనా అన్నంతగా ఇన్నాళ్లు చర్చ సాగుతున్న సమయంలో తాజాగా, అన్నాడిఎంకేలో నెలకొన్న పరిస్థితులు దీపా అడుగులు ఎలా ఉంటుందోనన్న చర్చ బయలు దేరింది. అమ్మ ఆశయ సాధన లక్ష్యంగా కలిసి పనిచేద్దామంటూ దీపాకు అపధర్మ సీఎం పన్నీరు సెల్వం ఆహ్వానం పలకడంతో ఇక, ఆమె అడుగులు ఎటో అన్న ప్రశ్న బయలు దేరింది. పన్నీరు పిలుపుకు స్పందించేనా లేదా, తన దైన శైలిలోనే ముందుకు సాగేనా అన్న ఎదురు చూపులు బయలు దేరాయి. పన్నీరు ఆహ్వానం, అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలను దీపాతో పాటుగా ఆ పేరవై వర్గాలు నిశితంగా పరిశీంచే పనిలో పడ్డాయి. పేరవై వర్గాలతో దీపా సమాలోచన సైతం సాగిస్తున్నట్టు సమాచారం. పన్నీరు సెల్వం వేయబోయే తదుపరి అడుగుల మేరకు స్పందించాలన్నట్టుగా దీపా నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవిషయగా పేరవై వర్గాలను కదిలించగా, పన్నీరు ఆహ్వానం మేరకు ఇప్పట్లో స్పందించే అవకాశాలు ఉండబోదని సమాధానం ఇస్తున్నారు. ఇక, ఏకంగా దీపాను కదిలించగా, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, వేచి చూద్దం అని మీడియా ప్రశ్నలకు దాట వేత ధోరణి ప్రదర్శించారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మలర్వన్ మరో అడుగు ముందుకు వేసి దీపా నాయకత్వంలో అన్నాడీఎంకే వర్గాలకు మంచి రోజులు రాబోతున్నాయని స్పందించడం విశేషం. అలాగే, అన్నాడిఎంకే రెండాకుల చిహ్నం దీపా చేతికి రావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పన్నీర్‌కు ఇవ్వబోయే పదవి ఇదే!
రేపే సీఎంగా శశికళ ప్రమాణం చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ మంగళవారం తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. మద్రాస్ వర్సిటీ సెంటినరీ హాల్లో ఆమె ఉదయం 8.45 గంటలకు ప్రమాణం స్వీకరించనున్నారు. దీంతో తమిళనాడుకు మూడో మహిళా ముఖ్యమంత్రిగా శశికళ నిలువనున్నారు. శశికళ కోసం మరోసారి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన పన్నీర్ సెల్వానికి సముచిత పదవిని ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నారని, శశికళ కేబినెట్లో పన్నీర్ సెల్వానికి కీలక ఫోర్టుపోలియో దక్కే అవకాశముందని వినిపిస్తోంది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు తీర్పు గండం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళా నటరాజన్ కూడా సహ నిందితురాలు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఈ కేసులో తీర్పు మరో వారం రోజుల్లో వెలువడబోతోంది. ప్రత్యేక కోర్టు ఈ కేసులో జయలలిత, శశికళలను దోషులుగా నిర్ధారించగా, కర్ణాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టేసి.. ఇద్దరినీ నిర్దోషులుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాంతో కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసులోనే మరోవారంలో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. -
సెల్వం: కీలుబొమ్మా? త్యాగశీలా?
చాయ్‌వాలా నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ. పన్నీర్ సెల్వం అధికార వైభవం.. వరుసగా మూడోసారి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. రెండుసార్లు జయలలిత కోసం పదవిని త్యాగం చేసిన సెల్వం.. మూడోసారి శశికళ కోసమూ అదే చేశారు. ’కీలుబొమ్మ ముఖ్యమంత్రి’గా తనకున్న ముద్రను చరిత్రార్థం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు సెల్వం ఆదివారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఆయన రాజీనామాను గవర్నర్ తాజాగా ఆమోదించారు. 65 ఏళ్ల సెల్వం గురించి తెలిసినవారికి ఇది ఆశ్చర్యం కలిగించేదో.. షాక్ కలిగించేదో కాదు. ఆయన వీరవిధేయతకు, వినయానికి మారుపేరుగా ముద్రపడ్డారు. 2001లో సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి పదవి చేపట్టకుండా జయలలితను అడ్డుకున్నప్పుడు తొలిసారి సెల్వాన్ని ఈ పదవి వరించింది. ఆరు నెలల తర్వాత ఎలాంటి రగడ చేయకుండా అమ్మకు పువ్వుల్లో పెట్టి మళ్లీ పదవిని అప్పగించారు సెల్వం. ఆ తర్వాత 2014లో అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా కోర్టు తేల్చడంతో మరోసారి సెల్వం సీఎం అయ్యారు. ఇది కూడా కేవలం ఏడు నెలల మురిపేమే అయింది. ఈసారి రెండు నెలలే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. అయితే, ఈ కాలంలో సొంతంగా ముఖ్యమంత్రిగా తనకంటూ ఓ ముద్ర వేసుకునేందుకు సెల్వం ప్రయత్నించారు. వెనుకుండి మార్గనిర్దేశం చేసేందుకు జయలలిత లేకపోవడం కూడా ఆయన స్వతంత్రంగా వ్యవహరించడానికి కారణమైంది. జయలలిత ఉన్నప్పుడు ఆమె ప్రతి ఫైలు పరిశీలించాకే సెల్వం సంతకం పెట్టేవారు. కానీ ఈసారి జయలలిత సన్నిహితురాలైన షీలా బాలాకృష్ణన్ వంటివారి సలహాలతో సీఎంగా సెల్వం స్వతంత్రంగానే వ్యవహరించారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ మద్దతు ఉండటం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండగా నిలబడటంతో సెల్వం ఈసారి ముఖ్యమంత్రి పదవిలో సుదీర్ఘకాలం కొనసాగవచ్చునని, వెన్నెముక కలిగిన నేతగా తనను తాను నిరూపించుకోవచ్చునని భావించారు. కానీ చిన్నమ్మ శశికళ ఎత్తుల ముందు ఆయన నిలబడలేక.. రెండు నెలలకే చేతులేత్తెశారు సెల్వం. ప్రత్యర్థులను సవాల్ చేయగల రాజకీయ చాతుర్యం లేకపోవడం, పవర్ సెంటర్‌గా ఎదుగలేకపోవడం ఈసారి సెల్వం రాజీనామాకు దారితీశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రెండు నెలలకాలంలో సెల్వం ప్రతిపక్షాల ప్రశంసలు సైతం పొందగలిగారు. అసెంబ్లీ సమావేశాలను సజావుగా నిర్వహించారు. ఎప్పటిలాగా ఈసారి డీఎంకే సభ్యులు వాకౌట్లు చేయలేదు. సభలో దుమారం రేపలేదు. 'ఆయనకు బీజేపీ వ్యూహాత్మక మద్దతు ఉంది. అన్నాడీఎంకే శ్రేణుల మద్దతుతోపాటు ప్రజాభిప్రాయం కూడా సెల్వానికి అనుకూలంగా ఉంది. అయినా ఆయన శశికళను ఢీకొట్టే సాహసం చేయకూడదని నిర్ణయించుకున్నారు' అని అన్నాడీఎంకే నేత ఒకరు తెలిపారు. -
చెన్నైకి రెండు టీఎంసీల నీళ్లివ్వండి
సాక్షి, అమరావతి: వేసవిలో రానున్న నీటి ఎద్దడిని పరిగణనలోకి తీసుకుని చైన్నైకు రెండు టీఎంసీల నీటిని సరఫరా చేయాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అక్కడి వివరాలతో కూడిన విజ్ఞాపనాపత్రాన్ని రాష్ట్ర సీఎం చంద్రబాబుకు అందించారు. ఆయన గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో బాబును కలుసుకుని చైన్నైలోని తాగునీటి ఎద్దడిని వివరించారు. నగరానికి నీరందించే నాలుగు జలాశయాలు అడుగంటాయని, ఇప్పటినుంచే చర్యలు తీసుకోకపోతే వేసవిలో తాగునీటిని అందించలేమని తెలిపారు. మానవతా దృక్పథంతో చెన్నైకు రెండు టీఎంసీల నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏపీ చేసిన సాయాన్ని మర్చిపోలేమని, ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధిని సాధిద్దామని తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... ఇరు రాష్ట్రాల అధికారులు నీటి అవసరాలపై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుందామన్నారు. ఏపీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయని 25 శాతంకు పైగా తక్కువ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. దీనికితోడు కండలేరు ప్రాజెక్టు ఉన్న నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఇంకా దయనీయంగా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వారం రోజుల్లోపే ఇరు రాష్ట్రాల అధికారులు తిరుపతిలో సమావేశం కావాలని సూచించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్‌తో ప్రభుత్వం కొనసాగుతోందని, నీటి సరఫరాకు సంబంధించి గతం నుంచి తమిళనాడు చెల్లించాల్సిన రూ.413 కోట్ల బకాయిలను చెల్లించాలని కోరారు. -
బీజేపీ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం?
-
పన్నీరు సెల్వానికి జయ శాఖల అప్పగింత
-
తమిళనాడులో కీలక పరిణామం
-
అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం
చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సిన నేపథ్యంలో పరిపాలనను సంబంధించి తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సీఎం జయలలిత నిర్వహించిన శాఖలన్నింటినీ ఆమె నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి అయిన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఈ మేరకు రాజ్ భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. (సీఎంపై ట్విట్టర్లో భారీగా ప్రచారం) గత 18 రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత.. సోమవారం నాటికి కొద్దిగా కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. తన శాఖలను పన్నీర్ సెల్వంకు అప్పగించాలనే నిర్ణయం కూడా అమ్మదేనని తెలిసింది. రాజ్యాంగంలోని 166వ ఆర్టికల్ క్లాజ్ నెంబర్ -3 ను అనుసరిస్తూ ముఖ్యమంత్రి శాఖలను ఆర్థిక మంత్రికి అప్పగించడంతో పాటు కేబినేట్ సమావేశాలను నిర్వహించే బాధ్యతలను అప్పగిస్తున్నట్లు రాజ్ భవన్ ప్రకటనలో తెలిపింది. (జయ పోరాట యోధురాలు) సీఎం జయలలిత.. కీలకమైన హోం శాఖతోపాటు రెవెన్యూ, సాధారణ పరిపాలన, ప్రజా సంబంధాల శాఖలను తన వద్దే ఉంచుకుని నిర్వహిస్తున్నారు. అయితే సెప్టెంబర్ మూడో వారం నుంచి ఆమె ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం తలెత్తుతున్నది. ఒక దశలో డిప్యూటీ సీఎం లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. (జయకు పాసివ్ ఫిజియోథెరపీ!) వీటన్నింటి నడుమ పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు కట్టబెడుతున్నట్లు రాజ్ భవన్ ప్రకటించడంతో సస్సెన్స్ కు తెరపడింది. జయలలిత ఆరోగ్యం మెరుగుపడే వరకు పన్నీర్ సెల్వమే కీలక శాఖలను నిర్వహించాల్సి ఉంటుంది. (జయలలిత వారసుడిగా హీరో అజిత్ కుమార్!) -
తండ్రి కోసం తనయుడు యాగం
తండ్రి కోసం తనయుడి యాగం ఆయన బలి అవుతున్నారా..? రామకృష్ణన్ అనుమానం వివరణకు కరుణ డిమాండ్ చెన్నై : ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలి అవుతున్న చందంగా మంత్రి ఓ పన్నీరు సెల్వం పరిస్థితి మారుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు బయలు దేరాయి. ఇక, తండ్రి కోసం అన్నట్టు శతృవినాస యాగాన్ని ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ నిర్వహించడం గమనార్హం. ఇక, తన నిజాయితీని నిరూపించుకునేందుకు జయలలిత కొత్త నాటకాన్ని రచించి ఉన్నారని సీపీఎం నేత రామకృష్ణన్ విమర్శించారు. మంత్రులపై బయలు దేరిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేశారు. అన్నాడిఎంకేలో జయలలిత తదుపరి స్థానంలో ఉన్న మంత్రి, పార్టీ కోశాధికారి ఓ పన్నీరు సెల్వం ప్రస్తుతం సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఇందుకు ఎన్నికల్లో వంద సీట్ల వరకు తన మద్దతు దారులకు ఇప్పించుకుని, తదుపరి తన బలాన్ని చాటుకునే వ్యూహంతో ఉన్నట్టు ఆయనపై బయలు దేరిన ఆరోపణలు కారణంగా పరిగణించ వచ్చు. అదే సమయంలో రోజుకో రూపంలో పన్నీరుకు వ్యతిరేకంగా, నత్తం విశ్వనాథన్ తదితర మంత్రులకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలతో అన్నాడీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉన్నది. తిరునల్వేలిలో అజ్ఞాతంలో ఉన్న పన్నీరు మద్దతు దారుడు ఓఎస్ మురుగన్ బండారాలు సైతం వెలుగులోకి రావడంతో ఓ పీఎస్‌కు కష్టాలు చుట్టుముట్టినట్టే. వంద కోట్ల మేరకు పూడిక తీత పనుల్లో అవినీతి జరిగినట్టు, ఇందుకు ఓఎస్ మురుగన్సూత్రదారుడిగా ఆరోపణలు వస్తున్నా, మంత్రులపై రోజుకో కథనం వెలువడుతున్నా, అన్నాడీఎంకేలో ఎలాంటి స్పందన లేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత , తాజాగా మంత్రుల భరతం పట్టే విధంగా వ్యవహరిస్తుండటం చర్చకు తెర లేపి ఉన్నది. అలాగే, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంను నిర్బంధంలో ఉంచినట్టుగా ప్రచారం , పుకార్లు బయలు దేరి ఉండటం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకేను చీల్చి ఎంజీయార్ అన్నాడీఎంకే ఏర్పాటు కసరత్తుల్లో ఉండబట్టే ఆయన్ను నిర్బంధంలో ఉంచినట్టుగా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కనున్నట్టుగా ప్రచారం కూడా సాగినా, ఎంతకూ ఆయన రాలేదు. రెండు రోజుల క్రితం మాత్రం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి పళనియమ్మాల్ను పరామర్శించి ఆగమేఘాలపై విమానంలో చెన్నైకు వచ్చినట్టు తదుపరి ఆయన ఇంటి కి లేదా, నగరంలోని ఓ హోటల్‌కు పరిమితమైనట్టుగా మద్దతు దారులు వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. తాజాగా, మంత్రులకు వ్యతిరేకంగా వెలువడుతున్న కథనాలను సైతం తమకు అనుకూల అస్త్రంగా మలచుకునేందుకు ప్రతి పక్షాలు సిద్ధమైనట్టున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా సీఎం జయలలిత కొత్త నాటకాన్ని రచించినట్టుందని సీపీఎం నేత రామకృష్ణన్ వ్యాఖ్యానించారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఓపీఎస్‌ను బలి చేయడానికి సిద్ధమైనట్టుందని ఆరోపించారు. ఇక, డిఎంకే అధినేత ఎం కరునానిధి పేర్కొంటూ, మంత్రులపై ఇస్తున్న కథనాలు, ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, శతృవినాసం కాంక్షిస్తూ ఓపీఎస్ తనయుడు రవిచంద్రన్ శ్రీవిల్లి పుత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో యాగం చేయడం కొసమెరుపు. -
సంకటంలో ఓపీఎస్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఎన్నికల కసరత్తుల కన్నా, ఫిర్యాదులు, ఆరోపణాస్త్రాల మీదే టాపిక్ హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఫిర్యాదులు, ఆరోపణలు పెరుగుతున్నా, ఖండించే వాళ్లు లేని దృష్ట్యా, రోజుకో సమాచారాల గుట్టు బయట పడుతున్నాయి. ఇవన్నీ అమ్మ నమ్మిన బంటు ఓ పన్నీరు సెల్వం(ఓపీఎస్)కు సంకటం సృష్టించే రీతిలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనలో గుట్టుగా సాగిన వ్యవహారాలు ఒక్కొక్కటి బట్ట బయలు అవుతున్నాయి. మంత్రుల అవినీతి బండారాలు ప్రతి పక్షాలకు ప్రచార అస్త్రాలుగా మారాయి. ఇక, పార్టీలో, ప్రభుత్వంలో అధినేత్రి జయలలిత తదుపరి స్థానంలో ఉన్న పన్నీరు సెల్వం మీద కొద్ది రోజులుగా బయలు దేరిన ప్రచారాలను ఖండించే వాళ్లు అన్నాడీఎంకేలో కరువయ్యారని చెప్పవచ్చు. సీట్ల పేరిట కోట్లు దండుకున్నారంటూ ఆయన మీద వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణల్ని అమ్మ తీవ్రంగానే పరిగణించినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పన్నీరు మద్దతు దారులకు అక్కడక్కడ చెక్ పెట్టే ఉద్వాసన పర్వం సాగుతూ రావడమే. ఇక, మరో మంత్రి నత్తం విశ్వనాథన్ మద్దతు దారుల పరిస్థితి కూడా అంతే. తాజాగా పర్యాటక మంత్రి షణ్ముగనాథన్ పీఏ ఎం కృష్ణమూర్తి తూత్తుకుడిలో బుధవారం అరెస్టు కావడం అన్నాడీఎంకేలో చర్చ బయలు దేరింది. మంత్రుల ప్రమేయాలతో సాగిన వ్యవహారాల గట్టును తేల్చే దిశగా అరెస్టుల పర్వం, ఉద్వాసనల పర్వం సాగుతున్న నేపథ్యంలో గురువారం పన్నీరు మద్దతు సన్నిహితుడు, కాంట్రాక్టర్ ఏఎస్ మురుగానందంపై తిరునల్వేలిలో కేసు నమోదు కావడం గమనించాల్సిన విషయం. పన్నీరుకు బినామీగా కూడా మురుగానందం పేరు విన్పించేది. ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు కావడం, వారం రోజుల క్రితం పన్నీరు సన్నిహితుడు ఒకరు అరెస్టు కావడం బట్టి చూస్తే, తీవ్ర సంకట పరిస్థితుల్ని అమ్మ నమ్మిన బంటు ఎదుర్కొంటుండడం స్పష్టం కాక తప్పదు. చిన్నపాటి వ్యవహారంలో తన మీద కేసు నమోదు తరువాయి, మురుగానందం అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. ఓపీఎస్ మద్దతు దారులకు, మరో మంత్రి నత్తం మద్దతు దారులు సీట్లకు కోట్లు దండుకున్నారంటూ ఫిర్యాదులు పోయెస్ గార్డెన్‌కు వచ్చి చేరుతున్న సమయంలో మరో మంత్రి సెల్వూరు రాజుతో పాటుగా పలువురు ముఖ్య నాయకులకు సీట్లు ఇవ్వొద్దంటే ఇవ్వొద్దంటూ పోయెస్ గార్డెన్‌కు, అన్నాడీఎంకే కార్యాలయానికి ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం. ఇక, ఏకంగా అన్నాడీఎంకేకు చెందిన మరో మహి ళా ఎంపీ ఫోన్ సంభాషణల గుట్టు రట్టు కావడంతో పార్టీలో తీవ్ర గందరగోళం బయలు దేరి ఉన్నది. ఇప్పటికే ఓ మహి ళా ఎంపి బెదిరింపు ధోరణులు వాట్సాప్, సోషల్ మీడియా ల్లో హల్ చల్ సృష్టించగా, తాజాగా మరో మహిళా ఎంపి తన సన్నిహితుడితో మత్తులతో సాగించిన సంభాషణలు హల్ చల్ సృష్టిస్తుండడం గమనార్హం. అయితే, వీటిని ఖం డించే వాళ్లు అన్నాడీఎంకేలో కరువు కావడం ఆలోచించదగ్గ విషయమే. -
పన్నీర్‌సెల్వంకు పెద్ద పీట
చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థికమంత్రి ఓ పన్నీర్‌సెల్వంకు ప్రభుత్వంలో మళ్లీ పెద్ద పదవి లభించింది. తమిళనాడు అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వం నియమితులైనారు. గెజిట్‌నోట్‌లో అత్యంత ప్రత్యేక ప్రాధాన్యత అని మరీ ప్రస్తావిస్తూ అసెంబ్లీ కార్యదర్శి ఏఎంపీ జమాలుద్దీన్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులు గురువారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆయా పార్టీలు సమావేశమై శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అలా అత్యధిక ఎమ్మెల్యేలచే ఎన్నుకోబడిన శాసనసభాపక్షనేత ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సహజంగా జరిగే ప్రక్రియ ఇది. ఇటీవల కేకే నగర్ ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన జయలలిత ఇదే సంప్రదాయంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ఈ ఏడాది మే 23వ తేదీ నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ కార్యదర్శి గురువారం విడుదల చేసిన గెజిట్‌లో ‘లీడర్ ఆఫ్ ది లెజిస్లేటీవ్ అసెంబ్లీ’ (తమిళనాడు శాసనసభాపక్ష నేత)గా రాష్ట్ర ఆర్థిక, ప్రజాపనులశాఖా మంత్రి ఓ పన్నీర్‌సెల్వం నియమితులైనట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల ముందే ఈనెల 4వ తేదీ నుంచిఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు జమాలుద్దీన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంపూర్ణ మద్య నిషేధం అమలుచేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే మౌళివాక్కంలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్థుల అపార్టుమెంటు కూలిపోయిన దుర్ఘటనపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందంటూ మద్రాసు హైకోర్టుకు ఇచ్చిన హామీని ఈ సమావేశాల్లో నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇటువంటి కీలకమైన అసెంబ్లీ సమావేశాలు ముందున్న తరుణంలో పన్నీర్‌సెల్వంను అకస్మాత్తుగా శాసనసభాపక్ష నేతగా తెరపైకి తీసుకురావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల కొంతకాలంగా అనారోగ్య పరిస్థితులతో ముఖ్యమైన కార్యక్రమాలకు జయ దూరంగా మెలిగారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో సైతం అనారోగ్య పరిస్థితులు తలెత్తి సమావేశాలకు గైర్హాజరైన పక్షంలో ప్రతిపక్షాల విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పన్నీర్ నియామకం జరిగినట్లు అంచనావేస్తున్నారు. శాసనసభాపక్ష నేత సభలో ఉన్నందున ముఖ్యమంత్రి లేకున్నా పరవాలేదనే వ్యూహమే పన్నీర్‌సెల్వం నియామకం వెనుక రాజకీయ రహస్యమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, డీఎంకే ప్రభుత్వ హ యాంలో ముఖ్యమంత్రి కరుణానిధి కాగా ఆర్కాడు వీరాస్వామి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే ఆస్తుల కేసులో గత ఏడాది జయ జైలుకెళ్లినపుడు పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగా, విద్యుత్ శాఖా మంత్రి నత్తం విశ్వనాథన్ శాసనసభాపక్ష నేతగా నియమితులైనారు. అయితే అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్య మంత్రిగా ఉన్నపుడు శాసనసభాపక్ష నేతగా మరొకరు ఉండడం ఇదే తొలిసారి. -
నిజంగా మీరు జయలలితను అభిమానిస్తే...
చెన్నై: అన్నాడీఎంకే మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. మీరు నిజంగా జయలలితను అభిమానిస్తే సహనాన్ని పాటించాలన్నారు. మంగళవారం జయలలిత తరపున దాఖలైన పిటిషన్ ను బెంగళూరు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో జయ అభిమానులకు, అన్నాడీఎంకే మద్దతుదారులకు పన్నీర్ సెల్వం సూచించారు. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నారనే దాఖలైన కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ లభించిందంటూ పుకార్లు రావడంతో పలు మీడియా, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో వార్తల్ని ప్రసారం చేశాయి. ఆతర్వాత బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందనే వార్త బయటకు పొక్కడంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో అభిమానులు,కార్యకర్తలు అవేశానికి లోనవ్వద్దని పన్నీర్ సెల్వం సూచించారు. -
ప్రజల్లోకి వెళ్లండి
సాక్షి, చెన్నై :ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు, పార్టీ పనితీరు గురించి విశదీకరించాలని అన్నాడీఎంకే కోశాధికారి, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం పిలుపునిచ్చారు. ముల్లై పెరియార్ విజయోత్సవ సభ సక్సెస్ లక్ష్యంగా కసరత్తుల్లో మం త్రుల బృందం మునిగింది. విరుదునగర్ జిల్లా శివకాశిలో ఆదివారం పార్టీ వర్గాలతో సమీక్షలో మునిగారు. ముల్లై పెరియార్ డ్యాం నీటి మట్టాన్ని 136 నుంచి 142 అడుగులకు పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు నిచ్చింది. ఆ మేరకు అందుకు తగ్గ కార్యాచరణ వేగవంతం అయింది. నీటిమట్టం పెంపు లక్ష్యంగా ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. చారిత్రక విజయంతో ఆ డ్యాం మీద సర్వ హక్కులు తమిళనాడుకే అని చాటి చెప్పడంలో శ్రమించిన సీఎం జయలలితను సత్కరించుకునేందుకు ఆ నీటి ఆధారిత జిల్లాల రైతు సంఘాలు నిర్ణయించాయి. తేని, విరుదునగర్, శివగంగై, రామనాథపురం, మదురై జిల్లాల అన్నదాతలు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చే స్తున్నారు. ఓ వైపు అన్నదాతలు, మరో వైపు ఆ విజయోత్సవ సభ సక్సెస్ లక్ష్యంగా అన్నాడీఎంకే సీనియర్ నాయకులతోపాటు రాష్ట్ర మంత్రుల బృందం రంగంలోకి దిగింది. ఉత్తేజ పరచండి : ముల్లై పెరియార్ నీటి ఆధారిత జిల్లాల్లోని పార్టీ వర్గాలను ఉత్తేజ పరచడంతోపాటుగా సభ విజయవంతం లక్ష్యంగా అన్నాడీఎంకే కోశాధికారి, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేతృత్వంలో మంత్రుల బృందం ఆదివారం విరుదునగర్ జిల్లాలో పర్యటించింది. శివకాశి వేదికగా ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో పార్టీ వర్గాలతో ఈ బృందం సమావేశం అయింది. ఇందులో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ప్రసంగిస్తూ, మూడేళ్లలో ప్రజాహితాన్ని కాంక్షిస్తూ సీఎం జయలలిత అనేక సంక్షేమ పథకాల్ని అమల్లోకి తెచ్చారని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటీనీ మూడేళ్లలో నెరవేర్చిన ఘనత జయలలితకే దక్కుతుందన్నారు. తమిళనాడు ప్రజల జీవనాధార సమస్య ముల్లై పెరియార్, కావేరి నదీ జలాల హక్కుల విషయంలో సీఎం జయలలిత పోరాటాలకు విజయాలు వరించాయని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న పలు సమస్యలను ఎదుర్కొని విజయం సాధించారని ప్రశంసలతో ముంచెత్తారు. ముల్లై పెరి యార్ డ్యాం నీటి మట్టం పెంపు చారిత్రక విజయం అని, ప్రజల కోసం శ్రమిస్తున్న జయలలితకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మదురై వేదికగా ఈనెల 22న జరగనున్న ముల్లై పెరియార్ డ్యాం చారిత్రక విజయోత్సవ వేడుకకు వేలాదిగా కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి, సాధించిన విజయాలను ఎత్తి చూపి, వేలాదిగా ప్రజలు ఆ సభకు తరలి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వైద్యలింగం, రహదారుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామి, సమాచార, ప్రత్యేక పథకాల శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, రెవెన్యూ మంత్రి ఆర్బి ఉదయకుమార్, విరుదునగర్ ఎంపీ రాధాకృష్ణన్, ఎమెల్యేలు వైగై సెల్వన్, గోపాల స్వామి పాల్గొన్నారు.