తొలి విజయం సాధించాం: పన్నీర్ సెల్వం
చెన్నై: ధర్మయుద్ధంలో మొదటి విజయం సాధించామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం(ఓపీస్) ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబ సభ్యులను వెళ్లగొట్టడాన్ని తొలి విజయంగా ఆయన వర్ణించారు. కుటుంబ పాలనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింసూచబోమని పునరుద్ఘాటించారు. తన మద్దతుదారులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చివరకు న్యాయం గెలిచిందన్నారు.
అన్నాడీఎంకే విలీనమవుతామని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. పార్టీ ఒక్కటిగా ఉండాలన్న లక్షలాది కార్యకర్తల అభీష్టం నెరవేందుకు రెండు వర్గాలు చర్చలు జరుపుతున్నాయని వెల్లడించారు. అమ్మ’ ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశిస్తే విలీనమవడానికి సిద్ధమని ప్రకటించారు. 11 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, సీనియర్ నాయకులతో అంతకుముందు పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై మంతనాలు సాగించారు.