'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి' | Subramanian Swamy again criticises Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి'

Published Sun, Feb 12 2017 1:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి'

'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి'

చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరును రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక పోవటం ప్రలోభాల కిందకే వస్తుందన్నారు. తమిళనాడు సీఎంగా ఎవరికి అవకాశమివ్వాలన్న అంశంలో గవర్నర్ ఇంకా నాన్చడం సరికాదని హితవు పలికారు. రేపటికల్లా గవర్నర్ విద్యాసాగర్ రావు దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఆర్టికల్ 32 కింద రిట్ దాఖలు చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. న్యాయపోరాటం చేసి అయినా తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించుతామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జాప్యం చేయడం ప్రలోభాల కిందకే వస్తుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. వారం రోజుల కిందట పన్నీర్ సెల్వం రాజీనామా అనంతరం.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతే పదివి వదిలేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శశికళను పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్ధతు ఆమెకు ఉన్న తరుణంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలంటూ ఇటీవల ఆయన సూచించారు. మరోవైపు పన్నీర్ సెల్వానికి రోజురోజుకు మద్ధతు పెరిగిపోవడం శశికళ వర్గంలో గుబులు రేపుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement