వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్‌సెల్వంకు ఎన్నికల అధికారులు 'పనస కాయ' గుర్తును కేటాయించారు. రామనాథపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన లాటరీ ద్వారా గుర్తును కేటాయించారు.
స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్‌సెల్వం.. తిరువాడనైలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పనసకాయతో ఫోజులిచ్చి గుర్తు కేటాయింపును అధికారికంగా ప్రకటించారు. రామనాథపురంలో అదే పేరుతో ఉన్న మరో నలుగురు అభ్యర్థులతో ఈ మాజీ సీఎం తలపడనున్నారు.
పన్నీర్‌సెల్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఏఐఏడీఎంకే జెండాను, లెటర్‌హెడ్‌ను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో 39 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment