ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలోనే ఉండాల్సిన నేపథ్యంలో పరిపాలనను సంబంధించి తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సీఎం జయలలిత నిర్వహించిన శాఖలన్నింటినీ ఆమె నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి అయిన పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఈ మేరకు రాజ్ భవన్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది