సాక్షి, చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీరు సెల్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత సోదరుడిపైనే వేటు వేశారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి తన సోదరుడు ఒ రాజాను బహిష్కరించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా స్థానిక పాల సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నట్టు పన్నీరు సెల్వం, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సంయుక్త ప్రకటనలో తెలిపారు. క్రమశిక్షణ ఉల్లఘించినందుకు రాజాను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించామని.. ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేశామని వెల్లడించారు. ఆయనతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.
థేని జిల్లాలోని పెరియకులం పంచాయతీ సర్పంచ్‌గా గతంలో రాజా పనిచేశారు. పన్నీరు సెల్వంకు ఇష్టం లేకపోయినా ఇటీవల జరిగిన మధురైలోని ఆవిన్ పాల సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరోవైపు తనను కాదని కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారని పన్నీరు సెల్వంపై రాజా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment