
పన్నీరు సెల్వం 2021 ఎన్నికల అన్నాడీఎంకే పార్టీ సీఎం అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్
చెన్నై : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రానున్న సార్వత్రిక ఎన్నికల అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలిసిన కొన్ని పోస్టర్లు అధికార పార్టీలో కలకలాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ మంత్రులు.. సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇళ్ల వద్దకు క్యూలు కట్టారు. అనంతరం శనివారం సాయంత్రం పళనిస్వామి, పన్నీరు సెల్వాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలు, పొత్తులు కార్యకర్తల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకునే జరుగుతాయన్నారు. ( తడబడి నిలబడిన.. ఈపీఎస్ – ఓపీఎస్! )
వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకుండా కార్యకర్తలందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళనాడులో 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో డీఎమ్‌కే పార్టీ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను సైతం రంగంలోకి దింపింది.
Comments
Please login to add a commentAdd a comment