ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు | No plans to visit Bengaluru today, Palaniswami | Sakshi
Sakshi News home page

ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు

Published Fri, Feb 17 2017 10:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు

ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు

చెన్నై: బెంగళూరుకు ఈ రోజు (శుక్రవారం) వెళ్లడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నట్టు తెలిపారు. నిన్న తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన పళనిస్వామి.. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోనున్నారు. ఇందుకోసం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది.

ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్ట్‌లో పళనిస్వామి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కలసి చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రేపు సభలో మెజార్టీ నిరూపించుకునేందుకు దృష్టిసారిస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్నారు. రేపు వీరిని ఇక్కడి నుంచి అసెంబ్లీకి తీసుకు వెళతారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నా డీఎంకే పార్టీ చీఫ్‌ శశికళ.. బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ రోజు పళనిస్వామి బెంగళూరుకు వెళ్లి చిన్నమ్మ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పళనిస్వామి స్పందిస్తూ.. ఇవాళ బెంగళూరు వెళ్లే యోచనలేదని, ఎమ్మెల్యేలను కలుస్తానని చెప్పారు.

మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి

జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ

చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే

బలాబలాలు తేలేది రేపే

తమిళనాడుకు పళని 'స్వామి'

కుటుంబపాలనను నిర్మూలిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement