Parapanna Agrahara jail
-
దినకరన్ వస్తే ఒక్క మాట మాట్లడలేదా?
సాక్షి, బెంగళూర్ : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఘన విజయం తర్వాత ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లి కలిసొచ్చిన విషయం తెలిసిందే. బెంగళూర్ పరప్పన అగ్రహార జైలులో దాదాపు ఆర గంట సేపు వీరు భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె మౌన వ్రతం పాటించటమేనంట. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తొలి వర్థంతి సందర్భంగా ఆమె నెచ్చెలి అయిన శశికళ మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఏఐఏడీఎంకే శశికళ వర్గం సెక్రెటరీ వీ పుహళెంది మీడియాకు వెల్లడించారు. దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారని పుహళెంది చెప్పారు. కేవలం చూపులతోనే పలకరించారని, చిరునవ్వే ఆమె మాటలైనాయని ఆయన అన్నారు. జనవరిలో ఆమె తన మౌనవ్రతాన్ని విరమిస్తారని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లే సమయంలో అమ్మ సమాధిపై చిన్నమ్మ తట్టి శపథం చేయటం గుర్తుంది కదా. -
ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు
-
ఈ రోజు చిన్నమ్మను కలవడం లేదు
చెన్నై: బెంగళూరుకు ఈ రోజు (శుక్రవారం) వెళ్లడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నట్టు తెలిపారు. నిన్న తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన పళనిస్వామి.. రేపు (శనివారం) అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోనున్నారు. ఇందుకోసం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్ట్‌లో పళనిస్వామి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కలసి చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా రేపు సభలో మెజార్టీ నిరూపించుకునేందుకు దృష్టిసారిస్తున్నారు. గోల్డెన్ బే రిసార్ట్‌లో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్నారు. రేపు వీరిని ఇక్కడి నుంచి అసెంబ్లీకి తీసుకు వెళతారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన అన్నా డీఎంకే పార్టీ చీఫ్ శశికళ.. బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ రోజు పళనిస్వామి బెంగళూరుకు వెళ్లి చిన్నమ్మ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పళనిస్వామి స్పందిస్తూ.. ఇవాళ బెంగళూరు వెళ్లే యోచనలేదని, ఎమ్మెల్యేలను కలుస్తానని చెప్పారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం -
జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ
-
జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లినా, ముఖ్యమంత్రి పదవి చేజారినా.. అన్నా డీఎంకే చీఫ్ శశికళ తమిళనాడు ప్రభుత్వాన్ని, పార్టీని నియంత్రణలో ఉంచుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుని, తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడంలో ఆమె విజయం సాధించారు. గురువారం తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చిన్నమ్మ.. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి టీవీలో చూశారు. జైలులో మహిళల బ్యారక్‌లో శశికళ తన వదిన ఇలవరసి, ఇతర ఖైదీలతో కలసి టీవీలో పళనిస్వామి ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూసినట్టు అధికారులు చెప్పారు. నిన్న శశికళ జైలులోని లైబ్రరీకి వెళ్లి తమిళ, ఇంగ్లీష్ పత్రికలు చదివారు. తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు.. పళనిస్వామితో సీఎంగా ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన శశికళ.. బుధవారం బెంగళూరు జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఇలవరసికి కూడా శిక్షపడింది. పళనిస్వామి ఈ రోజు బెంగళూరు జైలులో చిన్నమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోనున్నారు. శశికళను కలిసేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో జైలు వద్ద భద్రతను పెంచారు. అంతేగాక శశికళ జైలుకు వస్తున్నప్పుడు తమిళులు ఆమె కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే బలాబలాలు తేలేది రేపే తమిళనాడుకు పళని 'స్వామి' కుటుంబపాలనను నిర్మూలిస్తాం