జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లినా, ముఖ్యమంత్రి పదవి చేజారినా.. అన్నా డీఎంకే చీఫ్ శశికళ తమిళనాడు ప్రభుత్వాన్ని, పార్టీని నియంత్రణలో ఉంచుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుని, తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడంలో ఆమె విజయం సాధించారు. గురువారం తమిళనాడు సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చిన్నమ్మ.. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి టీవీలో చూశారు. జైలులో మహిళల బ్యారక్లో శశికళ తన వదిన ఇలవరసి, ఇతర ఖైదీలతో కలసి టీవీలో పళనిస్వామి ప్రమాణ స్వీకార ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని చూసినట్టు అధికారులు చెప్పారు. నిన్న శశికళ జైలులోని లైబ్రరీకి వెళ్లి తమిళ, ఇంగ్లీష్ పత్రికలు చదివారు.
తమిళనాడు రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు.. పళనిస్వామితో సీఎంగా ప్రమాణం చేయించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడిన శశికళ.. బుధవారం బెంగళూరు జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఇలవరసికి కూడా శిక్షపడింది. పళనిస్వామి ఈ రోజు బెంగళూరు జైలులో చిన్నమ్మను కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకోనున్నారు. శశికళను కలిసేందుకు అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో జైలు వద్ద భద్రతను పెంచారు. అంతేగాక శశికళ జైలుకు వస్తున్నప్పుడు తమిళులు ఆమె కాన్వాయ్‌పై దాడి చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని తమిళనాడు వార్తలు చదవండి
చిన్నమ్మ రాత్రంతా ఉపవాసమే
బలాబలాలు తేలేది రేపే
తమిళనాడుకు పళని 'స్వామి'
కుటుంబపాలనను నిర్మూలిస్తాం