
సాక్షి, తిరుమల : తిరుమలేశుని శోభ విశ్వవ్యాప్తంగా వెలుగొందుతోందని, అన్ని ప్రాంతాల భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని టీటీడీ విధి విధానాలు అమలు చేస్తోందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. చెన్నై నుంచి తిరుమల వస్తూ గురువారం సాయంత్రం అడయార్ లో సీఎం పళని స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా టీటీడీలో చేపడుతున్న సంస్కరణల గురించి వారి మధ్య చర్చ జరిగింది. భక్తులకు మరింత సులువుగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు సీఎం పలు సూచనలు చేశారు. వసతులను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇరువురు చర్చించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి తీర్ధప్రసాదాలను సీఎం పళని స్వామికి అందజేసి శాలువాతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment