చెన్నై : భారత్‌లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అయితే తమ రాష్ట్రంలో రికవరీ రేటు మాత్రం ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి పళనిస్వామి మంగళవారం ప్రకటించారు. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని తెలిపారు. కాగా, తమిళనాడులో జూన్ 15 నాటికి 46,504 కోవిడ్ కేసులు నమోదుకాగా 25,344 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,678 యాక్టివ్ కేసులుండగా 479 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
(‘కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నాం’)
రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 54.49 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లోనే 10,667 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రేటర్ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. జూన్ 19 నుంచి 30 వరకు తాజా లాక్‌డౌన్ కొనసాగనుంది. (నడిచి వచ్చిన కార్మికుల వెతలు)
Comments
Please login to add a commentAdd a comment