మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు | we had booked at Wind Flower resort only for 2 days. Will meet dinakaran today | Sakshi
Sakshi News home page

మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు

Published Fri, Aug 25 2017 1:28 PM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM

మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు

మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు

సాక్షి, చెన్నై: తమిళనాడులో రిసార్ట్‌ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ సర్కార్‌ను కూల్చితీరుతామన్న టీటీవీ దినకరన్‌ వర్గం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న దినకరన్‌ శిబిరం... వారిని జారిపోకుండా చూసుకునే క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యేలను మరో రిసార్ట్స్‌కు తరలించింది.

ఎమ్మెల్యేలను వేరే రిసార్ట్స్‌కు తరలిస్తున్నామని, విండ్‌ఫ్లవర్‌ రిసార్ట్‌ కేవలం రెండురోజులకే బుక్‌ చేశామని దినకరన్‌ సహచరుడు, ఏఐఏడీఎంకే నేత టీటీ సెల్వం తెలిపారు. ఇవాళ దినకరన్‌తో సమావేశమై భవిష్యత​ వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శశికళను పార్టీ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను దినకరన్‌ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. పార్టీలో గ్రూపుల విలీనంతో తాము విభేదించకపోయినా చిన్మమ్మను దూరం పెట్టడం సరికాదని దినకరన్‌ మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement