TTD dinakaran
-
రజనీపై మండిపడ్డ సీఆర్ సరస్వతి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా నటి, శశికళ వర్గానికి చెందిన సీనియర్ నేత సీఆర్ సరస్వతి... రజనీకాంత్‌పై మండిపడ్డారు. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ కొత్త పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న సీఆర్ సరస్వతి మాట్లాడుతూ ...రజనీకాంత్ కు రాజకీయ పరిపక్వత లేదని మండిపడ్డారు. తూత్తుకుడి ఘటనలో సంఘ విద్రోహక శక్తులు చనిపోలేదని, సామాన్యులు మృతి చెందారని, నిజంగానే వారు హింసకు పాల్పడితే ఒక్క సంఘ విద్రోహక శక్తి ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. తమిళుల పోరాటాలను రజనీకాంత్ కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం ఆయన మానసిక పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనలో పూర్తగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పేందుకు ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజు త్వరలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభను బహిష్కరించటం మంచిదికాదని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉండగా ప్రభుత్వ వైఖరి నచ్చక ఈ సెషన్స్ మొత్తం బహిష్కరించటం ద్వారా సామాన్యుల సమస్యలు మరుగున పడిపోతాయని సరస్వతి వాపోయారు. -
‘అలా చేయడం అమ్మను అవమానించడమే’
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో ఐటీ సోదాలు చేయడం అమ్మను అవమానించడమే అని అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు.. పోయెస్ గార్డెన్, వేద నిలయంలో ఐటీ దాడులు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. ఈపీఎస్, ఓపీఎస్ కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని దినకరన్ మండిపడ్డారు. డీఎంకే హయాంలో జయలలిత నివాసంలో సోదాలు జరిగాయని, అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పాలనలోనే పోయెస్ గార్డెన్లో తనిఖీలు జరగడంతో జయలలిత ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇటీవల శశికళ, దినకరన్, జయ టీవీ కార్యాలయంతో పాటు దేశంలోనే 187 ప్రాంతాలలో రికార్డు స్థాయిలోదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులపై గుంభనంగానే ఉన్నా జయలలిత నివాసంలో తనిఖీలపై తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముందస్తుగానే న్యాయస్థానం అనుమతి తో జయటీవీ ఎండి వివేక్ నుండి తాళాలు తీసుకున్న అధికారులు జయ నివాసంలో సుమారు మూడు గంటలపాటు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి జయ అంతరంగిక గదితోపాటు ఆమె సహాయకుడైన పూకుండ్రన్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నుండి ఓ ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి జయ నివాసంలో ఐటీ దాడులు సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది. -
‘దినకరన్ శిబిరానికి వెళ్లే ప్రసక్తే లేదు’
సాక్షి, చెన్నై : టీటీవీ దినకరన్ శిబిరానికి వెళ్లే ప్రసక్తే లేదని, మాజీ మంత్రి ఓపీఎస్ మద్దతుదారుడు సెమ్మలై ఆదివారం స్పష్టం చేశారు. పదవి లభించకపోవడంతో సెమ్మలై అసంతృప్తితో ఉన్నట్లు పార్టీవర్గాల్లో ఊహాగానాలు చెలరేగాయి. పళనిసామి, పన్నీర్ వర్గాలు విలీనంతో పన్నీర్ వర్గానికి చెందిన సెమ్మలైకు మంత్రిగా లేదా మార్గదర్శక కమిటీలో పదవి లభిస్తుందని భావించారు. అయితే ఏ పదవీ లభించకపోవడంతో ఆయన దినకరన్ వర్గంలోకి వెళతారన్న వార్తలు వ్యాపించాయి. దీనిపై ఆయన స్పందిస్తూ తాను దినకరన్ వర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని, అన్న ఓపీఎస్‌తోనే ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే తనపై వదంతులు పుట్టిస్తున్నారన్నారు. నన్ను ఎగతాళి చేయడమా? తనకు పదవి లభించడాన్ని ఎగతాళి చేయడం సరైంది కాదని ఎంపీ కుమార్‌పై నటుడు సెంథిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే అమ్మ వర్గంలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నటుడు సెంథిల్‌కు అన్నాడీఎంకే నిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో ఉన్న మాజీ మంత్రి గోకుల ఇందిరను పదవి నుంచి తొలగించారు. దీనిపై తిరుచ్చి ఎంపీ కుమార్ మాట్లాడుతూ నటుడు సెంథిల్‌కు నిర్వాహక కార్యదర్శి పదవి ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యాఖ్యలపై సెంథిల్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆరంభం నుంచి పార్టీ కోసం కష్టపడ్డానని, అందుకే తనకు పదవి లభించిందన్నారు. తనను విమర్శించేందుకు ఎంపీకి ఎటువంటి అర్హత లేదని ఆయన చెప్పారు. -
మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ సర్కార్‌ను కూల్చితీరుతామన్న టీటీవీ దినకరన్ వర్గం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న దినకరన్ శిబిరం... వారిని జారిపోకుండా చూసుకునే క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యేలను మరో రిసార్ట్స్‌కు తరలించింది. ఎమ్మెల్యేలను వేరే రిసార్ట్స్‌కు తరలిస్తున్నామని, విండ్‌ఫ్లవర్ రిసార్ట్ కేవలం రెండురోజులకే బుక్ చేశామని దినకరన్ సహచరుడు, ఏఐఏడీఎంకే నేత టీటీ సెల్వం తెలిపారు. ఇవాళ దినకరన్‌తో సమావేశమై భవిష్యత వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శశికళను పార్టీ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను దినకరన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. పార్టీలో గ్రూపుల విలీనంతో తాము విభేదించకపోయినా చిన్మమ్మను దూరం పెట్టడం సరికాదని దినకరన్ మండిపడుతున్నారు.