Panneerselvam
-
తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. పన్నీర్ సెల్వానికి షాక్
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐడీఎంకే పన్నీర్ సెల్వానికి ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో, రెండాకుల గుర్తను పళనిస్వామి దక్కించుకున్నారు. ఇక, ఈసీ నిర్ణయంతో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాగా ఈ విషయాన్నిఆ పార్టీ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ గురువారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక, అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షురాలు, దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పన్నీరు సెల్వానికి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది. Election Commission approves Edappadi K Palaniswami as the general secretary of AIADMK.#EdappadiPalaniswami #AIADMK pic.twitter.com/Nuobq4IVzj — Shankar (@Shankar38630530) April 20, 2023 -
పన్నీరు ‘ఉప’ పదవికి ఎసరు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పళణి స్వామి గుప్పెట్లోకి చేరడంతో డైలమాలో పడ్డ పన్నీరు సెల్వంకు మరో దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన చేతిలో ఉన్న పార్టీ శాసన సభా పక్ష ఉప నేత పదవికి ఎసరు పెట్టేందుకు పళణి శిబిరం సిద్ధమైంది. బుధవారం స్పీకర్ అప్పావును కలిసి అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి కోర్టు తీర్పుపై చర్చించారు. వివరాలు.. అన్నాడీఎంకే ఆధిపత్య సమరంలో కోర్టు తీర్పుతో పళణి స్వామి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టినానంతరం పార్టీపై పట్టు బిగించే పనిలో పళణి నిమగ్నం అయ్యారు. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి పన్నీరును బయటకుపంపించడం, కోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా రావడం వంటి అంశాలను పళణి శిబిరం పరిగణనలోకి తీసుకుంది. పన్నీరు సెల్వం పదవికి ఎసరు పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది వరకే పన్నీరు సెల్వంను ఆ పదవి నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే శాసన సభాపక్షం తీర్మానం చేసినా, స్పీకర్ అప్పావు ఇంత వరకు స్పందించ లేదు. పన్నీరును తప్పించి ఆ పదవిలో తమ శిబిరం నేత ఆర్బీ ఉదయకుమార్‌ను నియమించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. దీంతో సభలో పళణి, పన్నీరు పక్క పక్కనే కూర్చోవాల్సిన పరిస్థితి. ఈసారి వదలి పెట్టం.. ఇది వరకు వ్యవహారం కోర్టులో ఉండడంతో స్పీకర్ ఉప నేత పదవి విషయంగా ఆచీ తూచీ స్పందించారు. పన్నీరును ఆ సీటులో కూర్చునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే వ్యవహారంలో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడం,ప్రధాన కార్యదర్శి పదవిని తమ నేత పళని స్వామి స్వీకరించడంతో ఇక, పన్నీరును ఆ సీటులో కూర్చోబెట్టేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని మెజారిటీశాతం ఎమ్మెల్యేలు స్పీకర్‌పై ఒత్తిడికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముందుగా అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి బుధవారం స్పీకర్ అప్పావును కలిసి విషయాన్ని ప్రస్తావించారు. తమ పార్టీతో సంబంధం లేని వ్యక్తిని ఎలా ఉప నేత సీటులో కూర్చోబెడుతారని, తక్షణం ఆయన్ని తప్పించి, ఆర్బీ ఉదయకుమార్ ఆ స్థానంలో నియమించాలని కోరారు. స్పీకర్ ఒకటి రెండు రోజుల్లో స్పందించని పక్షంలో ఎమ్మెల్యేలతో సభను స్తంభింప చేయడానికి పళణి స్వామి సిద్ధం అవుతుండడం గమనార్హం. కాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయం అసెంబ్లీలో పళణిస్వామి అడుగుపెట్టగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు గుద్ది మరీ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలకడం విశేషం. ఇదిలా ఉండగా మంగళవారం వెలువడ్డ తీర్పునకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ విచారణ గురువారం ప్రారంభం కానుంది. బుధవారం పన్నీరు శిబిరానికి చెందిన వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్‌లు సైతం వేర్వేరుగా పళణికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. అందుకే బుధవారం జరగాల్సిన విచారణ ఒక రోజు వెనక్కి వెళ్లింది. -
ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా.. అని పరోక్షంగా పళణి స్వామి శిబిరాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చున్నా, ఒకరి ముఖాలు, మరొకరు చూసుకోవడం లేదు. పలకరించుకోవడం కూడా లేదు. ఈ నేపథ్యంలో మంళవారం మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న సంధించగా, ఏకం అయ్యేందుకే తన ప్రయత్నమంటూ పరోక్షంగా పళణితో చేతులు కలిపేందుకు తాను రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే పళణి శిబిరం పన్నీరుకు ఇక పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
పన్నీరు ఆకర్షణ మంత్రం!.. చిన్నమ్మతో కలిసి వ్యూహం అమలు?
సాక్షి, చెన్నై: పళనిస్వామి వెన్నంటి ఉన్న వారిని తన వైపునకు తిప్పుకునేందుకు పన్నీరు సెల్వం ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో కలిసి ఈ వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు ఫలితంగా పళని శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే , మరికొందరు నేతలు జంప్ అయ్యారు. వీరంతా ఆదివారం పన్నీరుకు జై కొట్టారు. అడీఎంకేలో పళని స్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోర్టు రూపంలో పార్టీ సమన్వయ కమిటీ తన గుప్పెట్లోకి రావడంతో పన్నీరు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తి వాదులకు గాలం వేసే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏకంగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళతో కలిసి పన్నీరు కొత్తఎత్తులు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు క్యూలో.. చిన్నమ్మ శశికళతో కలిసి రచిస్తున్న వ్యూహానికి ఫలితం ఆదివారం లభించడం గమనార్హం. మదురై జిల్లా ఉసిలం పట్టి ఎమ్మెల్యే అయ్యప్పన్‌తోపాటుగా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు పన్నీరుకు ఆదివారం జై కొట్టారు. పళని శిబిరంలో ఉంటూ పన్నీరుపై విరుచుకు పడ్డ ఈ అయ్యప్పన్ ప్రస్తుతం శిబిరం మార్చేశారు. కోర్టు ఆదేశాలు, అందులోని అంశాలకు కట్టుబడి తాను పన్నీరు సెల్వం శిబిరంలోకి వచ్చానని అయ్యప్పన్ ప్రకటించారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు నివాసంలో జరిగిన భేటీ అనంతరం అయ్యప్పన్ మీడియాతో మాట్లాడారు. తానే కాకుండా తనతో పాటుగా మరి కొందరు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని, అందరూ పన్నీరు సెల్వం వైపుగా వచ్చేడం ఖాయమని ప్రకటించారు. చదవండి: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’ అదే సమయంలో పన్నీరు సెల్వం పేర్కొంటూ, మరి కొద్ది రోజుల్లో చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌ను కలవనున్నానని, వారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో పళని శిబిరానికి చెందిన నేతలు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్ స్పందిస్తూ, నోట్లను ఎరగా వేసి నాయకులు, స్వర సభ్య సమావేశం సభ్యులను తన వైపుగా తిప్పుకునే ప్రయత్నంలో పన్నీరు సెల్వం ఉన్నారని ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
-
తమిళనాడు.. దిక్కుతోచని స్థితితో పన్నీరుసెల్వం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలన్నీ ఎడపాడి పళనిస్వామికే అనుకూలంగా మారడంతో పన్నీర్‌సెల్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎడపాడి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చెల్లదు..అని ఆదేశించాలని కోరుతూ వేసిన అప్పీల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా మద్రాసు హైకోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలని ఆదేశించడం,అప్పటి వరకు అన్నాడీఎంకేలో యథాతధ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేయడం ఓపీఎస్‌కు మింగుడుపడలేదు. అన్నాడీఎంకే వ్యవహారంపై 3 వారాల్లోగా తీర్పు చెప్పాలని కూడా మద్రాసు హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 1వ తేదీన విచారణ ప్రారంభం కానుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించి చేపట్టాల్సిన తదుపరి చర్యలపై తన మద్దతుదారులు, చట్ట నిపుణులతో ఓపీఎస్ శనివారం సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఇక అన్నాడీఎంకేలో కుమ్ములాటలు ఇలా ఉండగా, శశికళ, పన్నీర్‌సెల్వం ఏకమై రాజకీయంగా ముందుకు సాగాలని వంద దేవర్ సంఘాల ప్రతినిధులు వారిద్దరికీ శనివారం లేఖలు పంపడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: రాష్ట్రపతి అంటే గౌరవం లేదా? కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే.. అఖిలపక్ష సమావేశానికి ఈపీఎస్.. ఓటరు కార్డుతో ఆధార్‌కార్డు అనుసంధానంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 1వతేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. దీనికి డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే తదితర గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే తరపున ఎడపాడి పళనిస్వామికి ఈసీ నుంచి పిలుపు వచ్చింది. చెన్నై రాయపేటలోని అన్నాడీంకే ప్రధాన కార్యాలయానికి ఆహ్వానపత్రం అందింది. దీంతో అన్నాడీఎంకే కో కన్వీనర్ పదవి నుంచి ఎడపాడిని బహిష్కరించినట్లు, ఆయన స్థానంలో వైద్యలింగంను నియమించినట్లుగా ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పన్నీర్‌సెల్వం ఉత్తరం పంపారు. ఓపీఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు ఎడపాడి సైతం శనివారం తన అనుచరగణంతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. -
తమిళనాడు పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్
Panneerselvam.. పన్నీర్‌సెల్వం రాజకీయ జీవితంలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన అన్నాడీఎంకే కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యారు. ఇక తాజాగా ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపిక కావడంతో పన్నీర్ చేతి నుంచి ఈ పదవి కూడా చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో గందరగోళ పరిస్థితులు కొనసా..గుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ఎడపాడి పళనిస్వామి వర్గానికి చెందిన నాయకుడు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని స్పీకర్ అప్పావుకు ఎస్పీ వేలుమణి బుధవారం అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పన్నీర్‌సెల్వం పదవీచ్యుతులయ్యే అవకాశం ఉంది. కాగా ఈనెల 11వ తేదీ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకాగా, పన్నీర్‌సెల్వంను శాశ్వతంగా బహిష్కరించారు. అదే సమయంలో కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఓపీఎస్‌ను తప్పించారు. అతని మద్దతుదారులపై కూడా వేటు వేశారు. ఉన్న ఆ ఒక్క పదవీ..? ప్రస్తుతం పన్నీర్‌సెల్వం చేతులో ప్రస్తుతం ఉండేది ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి మాత్రమే. పార్టీ బహిష్కరణ వేటు వేసినా.. ప్రజాప్రతినిధిగా పన్నీరు సెల్వం అసెంబ్లీలో కొనసాగే అవకాశం మాత్రం ఉంటుంది. దీంతో ఎడపాడి ఆలోచనలో పడ్డారు. ఆ పదవి నుంచి కూడా పన్నీర్‌ను ఎలాగైనా తప్పించేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పన్నీర్స్థానంలో ప్రత్యామ్నాయ నేత కోసం చెన్నై అడయారులోని ఓ ప్రయివేటు హోటల్లో ఎడపాడి మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఉదయకుమార్ పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఎడపాడి పళనిస్వామి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష ఉప నాయకుడిగా తిరుమంగలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్బీ ఉదయకుమార్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. తరువాత మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చెన్నై సచివాలయంలో స్పీకర్ అప్పావును కలిసి ఉదయకుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. ఈసీ, కోర్టు తీర్పు పైనే.. అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్‌ను తొలగించినందున వారిని అధికారికంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగా పరిగణించే పరిస్థితి ఉండదు. అయితే ఈ అంశంపై ఓపీఎస్ కోర్టు, ఎన్నికల కమిషన్‌లో పిటిషన్లు వేసి ఉన్నందున ఆ రెండు చోట్ల నుంచి స్పష్టత వచ్చేవరకు ఎమ్మెల్యేల గుర్తింపుపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అలాగే ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి ఈ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయానికి తావులేకుండా చట్ట ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ అప్పావు తెలిపా రు. ఎస్పీవేలుమణి ఓ ఉత్తరం అందజేశారని, అయితే అంతకు ముందే పన్నీర్‌సెల్వం సమరి్పంచిన వినతిపత్రం పరిశీలనతో ఉందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 11వ తేదీన చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల కార్యకర్తలకు పోలీసులు సమన్లు పంపారు. వీటిలో పేర్కొన్న ప్రకారం చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఓపీఎస్‌కు చెందిన 30 మంది బుధవారం హాజరుకాలేదు. అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో వారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక 12 మంది పళనిస్వామి మద్దతుదారులు కూడా గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. అయితే ఎడపాడి వర్గం కూడా బుధవారం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలియడంతో.. వారు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. -
కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్‌సెల్వం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వం కోవిడ్-19తో ఆస్పత్రిలో చేరారు. కరోనాకి సంబంధించిన లక్షణాలతో ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ఉదయమే ఆయన అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు పన్నీర్ సెల్వం ఐసోలేషన్ యూనిట్లో చికిత్స తీసుకుంటున్నట్లు ఎంజీఎం హెల్త్‌కేర్ ఓ మెడికల్ బులిటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులెటన్లో పేర్కొన్నారు.. పన్నీర్ సెల్వం త్వరితగతిన కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన ఆకాంక్షించారు. ఇటీవలే పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా, సీఎం స్టాలిన్ సైతం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఇది ఆమోదయోగ్యం కాదు! బలవంతపు ఏకపక్షవాదం: కపిల్ సిబల్) -
అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను జస్టిస్ కృష్ణన్ రామసామి తిరస్కరించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే చీఫ్ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేడు(సోమవారం) జరగనున్న సర్వసభ్య సమావేశంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య సాగుతున్న ఆధిపత్యపోరుకు తెరపడుతుంది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. ఓపీఎస్-ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వసం అయ్యాయి. అసలు కథ ఏంటంటే.. అన్నాడీఎంకేలో ఒక ఒరలో రెండుకత్తులు ఇమడవన్నట్లుగా ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పన్నీర్‌సెల్వంను పక్కనపెట్టడం ద్వారా ప్రధాన కార్యదర్శిగా అవతరించాలని ఎడపాడి ఎత్తులు వేయడం ప్రారంభించగానే.. పన్నీర్‌సెల్వం కూడా తానేమీ తక్కువకాదన్నట్లు పైఎత్తులతో న్యాయపోరాటానికి దిగారు. గత నెల 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం వేదికగా ఈపీఎస్, ఓపీఎస్ మద్దతుదారులు భౌతికదాడులకు కూడా సాహసించారు. పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించమే శ్రేయస్కరమనే స్థాయికి ఎడపాడి వర్గం సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవరాం మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా పన్నీర్‌పై రాజకీయ బాణం ఎక్కుపెట్టనున్నారు. ఎడపాడిని ప్రధాన కార్యదర్శిని చేయడం, పన్నీర్‌సెల్వంను ఇంటిబాట పట్టించాలనే పట్టుదలతో ఉన్నారు. మెజార్టీ వర్గం ఎడపాడి పంచన చేరిపోవడంతో సర్వసభ్య సమావేశం జరగకుండా స్టే కోరుతూ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుండగా 9 గంటలకు తీర్పు చెబుతామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రెండురోజుల క్రితం ప్రకటించారు. కోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా ఎడపాడి వర్గీయులు ఆదివారం సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి వచ్చారు. పన్నీర్ ఆశిస్తున్నట్లుగా స్టే మంజూరవుతుందా..? లేక ఎడపాడి ఏర్పాట్లకు అనుగుణంగా సర్వసభ్య సమావేశానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా..? అని ఇరువర్గాలు నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. ఇదిగాక, రూ.4,800 కోట్ల టెండర్ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగం కింద ఎడపాడి పళనిస్వామిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ప్రారంభం కానుండటం ఆయన మద్దతుదారులకు మరో తలనొప్పిగా మారింది. చదవండి: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’ ఎవరికి వారు.. ఈపీఎస్, ఓపీఎస్ ఎవరికివారు సర్వసభ్య సమావేశానికి సమాయత్తం అవుతున్నారు. ‘విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం’ అన్నట్లుగా ఎడపాడి, పన్నీర్ మద్దతుదారులు కార్లు, వ్యాన్లు, బస్సుల్లో, మరికొందరు విమానాల్లో ఆదివారం చెన్నైకి చేరుకున్నారు. సుమారు 2,650 మంది కోసం చెన్నై నగరం, శివార్లలోని లగ్జరీ హోటళ్లలో ముందుగానే రిజర్వ్ చేసుకున్న గదుల్లో బసచేసి ఉన్న తమ వర్గం నేతలతో ఈపీఎస్, ఓపీఎస్ సమాలోచనల్లో మునిగిపోయారు. వీరుగాక నేతలు, కార్యకర్తలతో హోటళ్లన్నీ నిండిపోయాయి. పార్టీపరంగా 75 జిల్లాలకు గాను 70 జిల్లాల కార్యదర్శులు ఎడపాడి వైపు ధీమాగా నిలిచి ఉన్నారు. ఎడపాడి దూకుడును అడ్డుకోవడం ఎలా.. అని న్యాయనిపుణులతో ఓపీఎస్ ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ఓపీఎస్ మరోసారి మద్దతుదారులతో సమావేశం అవుతుండగా, ఎలాంటి వ్యూహం పన్నుతాడోనని ఎడపాడి వర్గం అప్రమత్తంగా గమనిస్తోంది. సమావేశం జరుపుకునేలా తీర్పు వెలువడటంతో పన్నీర్‌సెల్వం సహా ఆయన మద్దతుదారులు కార్యక్రమాన్ని బహిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
AIADMK: ఊ అంటారా.. ఊహూ అంటారా !
సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం విషయంలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ‘ఊ’అంటూ మార్గాన్ని సుగమం చేసేనా...లేదా ‘ఊ..హూ’అంటూ అడ్డు పడేనా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే నెలకొంది. సోమవారం ఉదయం 9.15 గంటల నుంచి పది గంటలలోపు సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శుక్రవారం నిర్ణయించారు. అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, ఎడపాడి పళని స్వామి మధ్య సాగుతున్న వార్ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పళని ప్లాన్లు.. పన్నీరు సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టేందుకు ఎడపాడి పళని స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఇందు కోసం ఈనెల 11వ తేదీ ఉదయం వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ వేదికగా సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటలలోపు ప్రారంభం అవుతుందని ముందుగానే ప్రకటించారు. ఇందుకు తగ్గ ఆహ్వానాలు సభ్యులకు పంపించారు. 2441 మంది సభ్యులు ఈనెల 10వ తేదీ ఉదయానికి చెన్నైకి చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. వీరి కోసం చెన్నైలో పలు చోట్ల ప్రత్యేక క్యాంపుల్లో వసతి సౌకర్యాలు సిద్ధం చేశారు. అలాగే, పార్టీ పరంగా ఉన్న 75 జిల్లాల కార్యదర్శుల పర్యవేక్షణలో సభ్యుల హాజరు వివరాల సేకరణకు ప్రత్యేక సాంకేతికను ఉపయోగించేందుకు నిర్ణయించారు. శరవేగంగా సర్వ సభ్య సమావేశ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ప్రత్యేక బెంచ్ చేసిన ప్రకటన అన్నాడీఎంకే వర్గాలను ఉత్కంఠలో పడేసింది. చదవండి: (Priya Anand: 'నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా') వాడీ వేడిగా వాదనలు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి స్టే విధించాలని కోరుతూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట వాదనలు జరిగాయి. స్టే విధించాల్సిన అవసరం లేదని, వ్యక్తిగత స్వలాభం కోసం పన్నీరు సెల్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పళని స్వామి తరఫున వాదనలు వినిపించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ సోమవారం ఉదయం 9 గంటలకు ఉత్తర్వులు వెలువరిస్తామ న్నారు. అయితే, శనివారం లేదా ఆదివారం ఉత్తర్వులు వెలువరించాలని పన్నీరు సెల్వం తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా న్యాయమూర్తి అంగీకరించ లేదు. అయితే, సర్వసభ్య సమావేశానికి కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుందన్న ఆశాభావం పన్నీరు వర్గంలో వ్యక్తమవుతోంది. అదే సమయంలో సమావేశానికి వ్యతిరేకంగా ఏదైనా ఉత్తర్వులు వెలువడిన పక్షంలో సీజే బెంచ్ లేదా, ద్విసభ్య బెంచ్‌ను ఆశ్రయించి అడ్డంకులను తొలగించుకునేందుకు తగ్గ ముందస్తు కసరత్తుల్లో పళని స్వామి తరఫున న్యాయవాదులు ఉన్నారు. అయితే, 9.15 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 9 గంటలకు ఉత్తర్వుల ప్రకటనతో న్యాయమూర్తి ‘ఊ.. అంటారా.. ఊహూ’అంటారా..? అనే ఉత్కంఠ పన్నీరు, పళని శిబిరాలతో పాటు, అన్నాడీఎంకే కేడర్‌లోనూ నెలకొంది. -
అన్నాడీఎంకే: రెండాకుల్లో.. మూడుముక్కలాట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రబలశక్తి. రెండాకుల గుర్తుపై గణనీయమైన ఓటు బ్యాంకు ఈ పార్టీకి సొంతం. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి క్రమశిక్షణ కనుమరుగైపోగా, రెండాకుల పార్టీ కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్ మధ్య మూడుముక్కలాట తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్, ఆ తరువాత పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రధాన కార్యదర్శిగా పార్టీని పరుగులు పెట్టించారు. జయ మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం వీకే శశికళ (వీకేఎస్), ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) పోటీపడ్డారు. ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్,ఈపీఎస్‌ల జంట నాయకత్వం అనివార్యమైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం, పార్టీ ఓటమి తరువాత అంతః కలహాలు మొదలయ్యాయి. ఏక నాయకత్వం నినాదంతో గద్దెనెక్కాలని ఎడపాడి చేస్తున్న ముమ్మురమైన ప్రయత్నాలపై ఓపీఎస్ న్యాయపోరాటానికి దిగారు. పోటీగా ఈపీఎస్ సైతం కోర్టు మెట్లెక్కారు. ముచ్చటగా మూడో నేత.. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడం ద్వారా పార్టీని కైవసం చేసుకుకోవాలని ఎడపాడి పళనిస్వామి భావిస్తుండగా ఆ ప్రయత్నాలకు పన్నీర్‌సెల్వం గండికొడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ కుమ్ములాటతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఈసీ (ఎన్నికల కమిషన్) నిషేధం విధించింది. ఇక అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ కలవరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులనే నిజమైన నేతలుగా పరిగణించాలి, కార్యకర్తలను కలుపుకుపోగల ఏక నాయకత్వమే పార్టీకి శ్రేయస్కరమని ఈనెల 4వ తేదీన పూందమల్లి జరిపిన పర్యటనలో శశికళ అన్నారు. క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించేందుకు పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుతున్నారని ఆమె చెప్పారు. చదవండి: Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య స్టే కోసం ఓపీఎస్ పిటిషన్ ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఈనెల 11వ తేదీన తలపెట్టిన సర్వసభ్య సమావేశం నిర్వహణపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఓపీఎస్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈమేరకు స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టే కోసం ఒకవైపు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఈపీఎస్ సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీన సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా తనను కార్యకర్తలే ఎన్నుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ సమావేశానికి పోలీసు బందోబస్తు కల్పించాలని మాజీ మంత్రి జయకుమార్ డీజీపీకి మంగళవారం దరఖాస్తు చేశారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. జనరల్‌బాడీ సమావేశానికి హాజరయ్యే సభ్యులకు బార్‌కోడ్‌తో కూడిన గుర్తింపుకార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక, పన్నీర్‌సెల్వం వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేలా ఎడపాడి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పనిలో పనిగా పన్నీర్‌సెల్వంకు సైతం ఎడపాడి ఆహ్వానం పంపడం విశేషం. -
పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు; అన్నాడీఎంకేలో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశముందా?.. తమిళనాడు రాజకీయాల్లో తాజాగా ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం చేసిన తాజా వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు శశికళను ఉద్దేశించి చేశారని ప్రచారం మొదలైంది. అయితే శశికళను క్షమించేది లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. చెన్నైలోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పార్టీ కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామితో కలిసి పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని పేర్కొంటూ ఒక చిన్న కథ చెప్పారు. అయితే శశికళను ఇరుకున పెట్టేందుకే పన్నీర్ సెల్వం ఇలా మాట్లాడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి జయకుమార్ స్పందిస్తూ.. ‘శశికళ లేకుండా అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఎన్నికలొస్తున్నాయిగా.. మీకోసమే ఐయామ్.. వెయిటింగ్) శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఇప్పటికీ అన్నాడీఎంకే నాయకురాలినని చెప్పుకుంటున్నారని శశికళపై పోలీసులకు జయకుమార్ ఫిర్యాదు చేశారు. పార్టీతో ఆమె ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ శశికళ తన అధికారిక ప్రకటనలలో 'ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ'ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై పన్నీర్‌సెల్వం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. గత అక్టోబర్‌లోనూ శశికళపై అన్నాడీఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఎన్నికలుంటే ఇలా.. లేకుంటే అలా!) -
AIADMK: అమ్మ పార్టీలో అల్పపీడనం
సాక్షి, చెన్నై : అమ్మ పార్టీలో ‘అల్పపీడనం’ మరింతగా బలపడి అన్నాడీఎంకే శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో బుధవారం పార్టీ కార్యవర్గం సమావేశం అవుతోంది. అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన నాటి నుంచి అంతర్గత విబేధాలు మరింత ముదురుతున్నాయి. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి మధ్య మొదలైన ఆధిపత్యపోరు అనేక పరిణామాలకు దారితీస్తోంది. ఇద్దరి కుమ్మలాటల మధ్య కేడర్ నలిగి పోతుండగా మాజీమంత్రి సెంగొట్టయ్యన్ ముచ్చటగా తెరమీదకు వచ్చాడు. పార్టీ శ్రేణుల్లో అధిగశాతం ఓపీఎస్ లేదా ఈపీఎస్ వైపు నిలిచి ఉండగా, సెంగొట్టయ్యన్ ఇద్దరితోనూ విబేధిస్తూ మూడో శక్తిగా ఎదిగిగేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు మరో కల్లోలానికి కారణమయ్యాయి. అమ్మ మరణం తరువాత.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత వచ్చిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని చవిచూసింది. అలాగే ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. గత కొన్నేళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఓపీఎస్, ఈపీఎస్ మధ్య సఖ్యత లేకపోవడం, ఎన్నికల ప్రచారంలో అధికార పక్షంపై చేస్తున్న విమర్శలు చేయడంలో సరిగా విఫలమవడం ఓటమికి ఒక కారణంగా కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో జిల్లా కార్యదర్శుల సమావేశం నవంబరు 24వ తేదీన ఓపీఎస్, ఈపీఎఎస్ అధ్యక్షతన చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. త్వరలో రానున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. అయితే ఆ అంశానికి తావులేకుండా పార్టీ నాయకత్వంలో మార్పు, నిర్వాహకుల నియామకాలను కొందరు లేవనెత్తడం సమావేశాన్ని దారిమళ్లించి ఒకరిపై ఒకరు భౌతికదాడులకు పాల్పడే పరిస్థితి తలెత్తింది. మాజీ ఎంపీ అన్వర్‌రాజా మాట్లాడే సమయంలో మాజీమంత్రి సీవీ షణ్ముగం అతడిపైకి దూసుకెళ్లారు. మాజీమంత్రి వైద్యలింగం, సీవీ షణ్ముగం మధ్య వాగ్వాదం ఉద్రిక్తలకు దారితీసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారు మాత్రమే లాభపడ్డారని, ద్వితీయశ్రేణి క్యాడర్‌ను ఎవరూ పట్టించుకోలేదని సెంగొట్టయ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తనవైపు బలం కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్టీ కార్యకర్గ సమావేశానికి బుధవారం సమాయుత్తం అయ్యారు. అజెండాలోని అంశాలకు అనుగుణంగా సమావేశం సాగేనా ? మరింత గందరగోళ పరిస్థితులకు దారితీసేనా అని అన్నాడీఎంకే శ్రేణులు ఉన్నారు. -
తమిళనాడు: అమ్మపార్టీలో.. అంతర్గత పోరు
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సోమవారం మరోసారి తెరపైకివచ్చింది. ఖాళీ అయిన ప్రిసీడియం చైర్మన్ పదవిని తమఖాతాలో వేసుకునేందుకు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, ఉపకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పోటీపడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, చెన్నై: గడిచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజార్చుకున్న తరువాత ప్రధాన నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. అయితే కొంగుమండలం నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారనే కారణంతో ఎడపాడినే ఆ పదవి వరించింది. అప్పటి నుంచి అధికారికంగా స్పందించకపోయినా ఎవరికి వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీలో సమన్వయం కొరవడిందనే విమర్శలకు ఊతమిచ్చేలా, అన్నాడీఎంకే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ పీఎంకే ఒంటరిగానే పోటీచేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే 50 వసంతాల వేడుకలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. కాగా 16వ తేదీన శశికళ చెన్నై మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సమాయుత్తం అవుతారనే అంశం సమాచారం ప్రచారంలో ఉంది. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు ‘ప్రిసీడియం’ కోసం పట్టు పార్టీలో ప్రిసీడియం చైర్మన్ అత్యంత కీలకపదవి. ఈ పదవిలో ఉండిన మధుసూదనన్ ఇటీవల మరణించారు. దీంతో ఈ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం పోటాపోటీగా మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆరంభంలో పన్నీర్‌సెల్వం అనుచరుడిగా వ్యవహరించిన మధుసూదనన్ ఆ తరువాత ఎడపాడి పంచన చేరారు. అంతేగాక పార్టీలో మెజార్టీ నేతలు ఎడపాడి వెనుకే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రిసీడియం చైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టాలని ఎడపాడి పట్టుదలతో ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా ముగించాల్సి ఉన్నందున ప్రిసీడియం చైర్మన్ పదవి భర్తీని ఆ తరువాత చూసుకోవచ్చని పన్నీర్‌సెల్వం దాటవేస్తున్నారు. పార్టీలో ఇలాంటి గరంగరం వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో నిర్వాహక కార్యవర్గం సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైంది. పన్నీర్‌సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనగలమని అగ్రనేతలు తమ ప్రసంగాల్లో సూచించారు. సావనీర్ విడుదలపై.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏటా ప్రిసీడియం చైర్మన్ చేతుల మీదుగా సావనీర్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మధుసూదనన్ మరణం వల్ల ఈ ఏడాది సావనీర్‌ను ఎవరు విడుదల చేస్తారనే అంశం చర్చకు వచ్చింది. ప్రిసీడియం పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడడంతో సంస్థాగత ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని సమావేశంలో వాయిదా వేశారు. ఇక పార్టీని శశికళ తన చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కొనాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. -
పన్నీరుకు ‘ఇంటిగండం’..?
పులియాంతోపు గృహ నిర్మాణాల్లో అక్రమాల గొడవ రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వానికి.. కన్నీరు తెప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. గురువారం అసెంబ్లీలో మంత్రి అన్భరసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. సాక్షి, చెన్నై: పులియాంతోపు బహుళ అంతస్తుల గృహ నిర్మాణాల్లో నాణ్యతాలోపంపై రచ్చమొదలైంది. ఈ వ్యవహరం గురువారం అసెంబ్లీకి చేరింది. ప్రత్యేక విచారణ, భవన సామర్థ్యం పరిశీలన నివేదికల మేరకు క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి అన్భరసన్ ప్రకటించారు. దీంతో ఇది వరకు గృహ నిర్మాణశాఖకు సైతం మంత్రిగా వ్యవహరించిన పన్నీరు సెల్వంను పాలకులు టార్గెట్ చేయనున్నారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకంగా 2 వేల గృహాలు..? చెన్నై పులియాంతోపు కేపీ పార్క్‌లో గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బహుళ అంతస్తుల తరహాలో రెండు వేల మేరకు గృహాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. నిర్మాణం పూర్తై నెలలు కూడా గడవని ఈ గృహాల్లో తాకిన చోటల్లా పెచ్చులు ఊడుతుండటం, మెట్లు కుంగినట్టు కనిపిస్తుండంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వీటిల్లోని ప్రజలు బిక్కుబిక్కుమనక తప్పడం లేదు. బుధవారం నుంచి తాత్కాలిక మరమ్మతులు ఆగమేఘాలపై సాగుతున్నాయి. ఆలస్యం చేస్తే.. అంతే గురువారం అసెంబ్లీలో పులియాంతోపు బహుళ అంతస్తుల వ్యవహారం చర్చకు దారి తీసింది. డీఎంకే ఎగ్మూర్ ఎమ్మెల్యే పరంథామన్ సభ దృష్టికి ప్రత్యేక తీర్మానంగా ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. కోట్లాది రూపాయల వ్యయంతో సాగిన ఈ భవనాల నిర్మాణంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. నాణ్యత, సామర్థ్యం మీద విచారణ, పరిశోధన జరిపి, త్వరితగతిన నివేదిక తెప్పించుకోవాలని కోరారు. లేనిపక్షంలో భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల బృందంతో పరిశీలన.. మంత్రి అన్భరసన్ సమాధానం ఇస్తూ, ఈ వ్యవహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, ఐఐటీ, అన్నా వర్సిటీల నిపుణుల బృందంతో పరిశీలన చేపట్టి.. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమాలు నిజమని తేలితే.. ఏ ఒక్కర్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఒప్పంద దారుడైనా, వెనుక ఉన్న వాళ్లు ఎంతటి వారైనా క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ నిర్మాణాల సమయంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, గృహ నిర్మాణ మంత్రిగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంను డీఎంకే ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది. ముగిసిన బడ్జెట్ చర్చ అసెంబ్లీలో ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌పై చర్చ గురువారం ముగిసింది. ప్రతి పక్షాలు, మిత్ర పక్షాల సభ్యులు చర్చ సమయంలో సంధించిన ప్రశ్నలకు తొలుత ఆర్థికమంత్రి పళని వేల్ త్యాగరాజన్ సమాధానమిచ్చారు. అలాగే, నందనంలోని ఆర్థికశాఖ భవనం ఇక, దివంగత డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ మాళిగైగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర పన్ను తగ్గింపుతో పెట్రోల్ విక్రయాలు జోరందుకున్నాయని వివరించారు. అలాగే, విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూ. 200 కోట్లు ప్రకటించారు. గత అన్నాడీఎంకే హయంలో 110 నిబంధన కింద అసెంబ్లీలో చేసిన ప్రత్యేక ప్రకటనల తీరు తెన్నులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక, వ్యవసాయ మంత్రి ఎంఆర్కే పన్నీరు సెల్వం వ్యవసాయ బడ్జెట్ మీద ప్రసంగించారు. ఐదేళ్లల్లో రాష్ట్రం పచ్చదనంతో నిండుతుందని, గ్రీన్ స్టేట్‌గా తమిళనాడును తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కాగా, బుధవారం అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యుల్ని గెంటి వేయలేదని, వారే వాకౌట్ చేసి బయటకు వెళ్లినట్టుగా స్పీకర్ అప్పావు వివరణ ఇచ్చారు. అలాగే, గత ప్రభుత్వం తాటి చెట్లను నరికేయగా, తాజా ప్రభుత్వం పరిరక్షించేందుకు ముందుకు సాగడం అభినందనీయమని కొనియాడారు. -
సీఎం, మాజీ సీఎంలకు షాక్.. కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పుహలేంది దెబ్బకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు ఏర్పడింది. ఆ మేరకు మంగళవారం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా బెంగళూరు పుహలేంది ఇది వరకు వ్యవహరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి తొలగించారు. తనను అకారణంగా తొలగించారంటూ కోర్టు తలుపుల్ని పుహలేంది తట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఈ పిటిషన్ మంగళవారం చేరింది. వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ పన్నీరుసెల్వం, పళనిస్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేశారు. విచారణను ఈనెల 23కు వాయిదా వేశారు. అయితే ఈ ఆదేశాలపై స్టే కోరడమే కాకుండా, పిటిషన్ విచారణ యోగ్యం కాదని ప్రకటించాలని కోరుతూ మరో కోర్టులో పిటిషన్ల దాఖలకు అన్నాడీఎంకే సన్నద్ధం అవుతోంది. -
మోదీతో ఓపీఎస్, ఈపీఎస్ భేటీ: చిన్నమ్మ గురించే చర్చ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారం కోల్పొయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. జయ మరణం తరువాత పార్టీకి ‘పెద్ద’దిక్కుగా మారిన ప్రధాని నరేంద్రమోదీతో ఆ పార్టీ రథసారధులు అనేక సమస్యలపై మొరపెట్టుకున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు, మాజీ మంత్రుల ఇళ్లపై ఏసీబీ దాడులు, ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి సవాలుగా మారాయి. ఈ సవాళ్లను ఎదుర్కొవడంపై సీనియర్ నేతల మధ్య సయోధ్య కరువైంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి ఆదివారం ఉదయం, రాత్రి వేర్వేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే వారిద్దరూ ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. పన్నీర్‌సెల్వం కుమారుడు, తేనీ లోక్‌సభ సభ్యుడు రవీంద్రనాథ్‌కు కేంద్రం కేటాయించిన వసతి గృహంలో సోమవారం ఉదయం జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి ఓపీఎస్, ఈపీఎస్ సహా పలువురు మాజీ మంత్రులు హాజరయ్యారు. అక్కడి నుంచి ఒకే కారులో ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని ఇంటికి చేరుకున్నారు. తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాలు, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పనితీరు, కేంద్ర క్యాబినెట్లో అన్నాడీఎంకేకు చోటు, స్థానిక సంస్థల ఎన్నికలు, అన్నాడీఎంకే మాజీ మంత్రుల ఇళ్లలో ఎసీబీ తనిఖీలు, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వ్యవహారం తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీకానున్నాయి. తమిళనాడు నుంచి కేంద్రమంత్రిగా మారిన ఎల్ మురుగన్ ఆరునెలల్లోగా ఎంపీగా ఎన్నికకావడం అవశ్యంగా మారింది. ఇందుకు సంబంధించి సైతం ప్రధాని, ఓపీఎస్, ఈపీఎస్ మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు. చిన్నమ్మ గురించే చర్చ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 66 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయాలకు స్వస్థి పలికినట్లు ఎన్నికల ముందు ప్రకటించిన శశికళ మళ్లీ అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ప్రధానిని కలిసిన సమయంలో అన్నిటి కంటే శశికళ సాగిస్తున్న తెరవెనుక రాజకీయాలపైనే ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. శశికళ సహకారం లేకుండానే 66 స్థానాల్లో గెలుపొందిన అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను ఎడపాడి పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని సీనియర్ నేతలతో ఎడపాడి చెబుతూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో పన్నీర్‌సెల్వం వైఖరి భిన్నంగా ఉంది. శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానిస్తే ఆమెకున్న 5శాతం ఓటు బ్యాంకుతో పార్టీని బలోపేతం చేయవచ్చని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ఓపీఎస్ వాదిస్తున్నారు. శశికళ గురించి ఏకాభిప్రాయం కుదరకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు. కావేరీ నదీజలాలకు అడ్డుగా మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న ఆనకట్ట, నీట్ ప్రవేశ పరీక్ష రద్దు, కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు, మధురైలో ఎయిమ్స్ స్థాపనపై ఏర్పడిన జాప్యం తదితర అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓపీఎస్, ఈపీఎస్‌లు సోమవారం ఉదయం 11 గంటల నుంచి సుమారు గంటపాటు మోదీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కూడా కలిశారు. -
గెలుపుపై అనుమానం.. చిన్నమ్మకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయంగా అస్త్రసన్యాసం చేసిన చిన్నమ్మ శశికళను అన్నాడీఎంకేలోకి రావమ్మా అని పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మాటమాత్రమైనా తనతో చెప్పకుండా పన్నీర్ చేసిన ప్రకటనపై సహ సమన్వయ కర్త, సీఎం ఎడపాడి పళనిస్వామి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తారని అందరూ అనుకున్నారు. బెంగళూరు నుంచి చెన్నైలోని ఇంటికి చేరుకున్న తరువాత కొన్నాళ్లు అదే తరహాలో వ్యవహరించినా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించారు. అంతేగాక ప్రస్తుతం ఆలయాల చుట్టూ తిరుగుతూ ఆధ్యాత్మిక పర్యటనలతో గడుపుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు సిద్దమని ఆ పార్టీ సమన్వయకర్త, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇటీవల సంచలన ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధ్యక్ష విధానం ఎంజీఆర్‌తో, ప్రధాన కార్యదర్శి హోదా జయలలితతో ముగిసింది. సమన్వయకర్త, సహ సమన్వయకర్త హోదాల్లో పన్నీర్, ఎడపాడి పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఇదే తరహా కొనసాగేందుకు శశికళ సమ్మతిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ఒకసారి, పరిశీలిస్తామని మరోసారి పన్నీర్ అన్నారు. శశికళతో తనకు విబేధాలు, మనస్తాపాలు లేవు, అమ్మ మరణించినపుడు కొన్ని సందేహాలు ఉండేవని పన్నీర్ చెప్పారు. పన్నీర్ చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో తీవ్ర చర్చనీయాంశమైంది. పన్నీర్ చేసిన వ్యాఖ్యలకు ఓటర్లు ఏ విధంగా ప్రభావితం అవుతారోనని ఎడపాడికి బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎడపాడికి గెలుపు కోసం ఈనెల 24వ తేదీ నుంచి పన్నీర్‌సెల్వం ప్రచారం చేస్తున్నారు. అంతకు ముందు వీరిద్దరూ శశికళ అంశంపై రహస్యంగా మంతనాలు చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే గెలుపు అవకాశాలు, టీటీవీ దినకరన్ పార్టీ అభ్యర్థుల వల్ల ఓట్ల చీలిక, ఉత్తర, దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే పరపతి, కొంగుమండలంలోని అన్నా డీఎంకే ఓట్ బ్యాంకు అంశాలపై కూడా ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. శశికళను అన్నాడీఎంకేలో ఆహ్వానించడంపై ఎడపాడి, పన్నీర్ మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అదేమీ లేదని ప్రజలకు, పార్టీ నేతలకు సంకేతాలు ఇవ్వడమే ఎడపాడి, పన్నీర్ ఏకాంత చర్చల వెనుక అసలు ఉద్దేశమని వాదిస్తున్నారు. చదవండి: తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ -
పన్నీరు వస్తే.. ఆహ్వానానికి రెడీ
సాక్షి, చెన్నై: విశ్రాంతిలో ఉన్న శశికళ ఇక, రాజకీయ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24న జయలలిత జయంతి రోజున ముఖ్యులతో భేటీ, ఆలయ దర్శనానికి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. జైలు నుంచి టీనగర్ ఇంటికి చేరిన శశికళ వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్భంధంలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. వారం రోజులు చిన్నమ్మ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 22న జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు శశికళ నిర్ణయించారు. వైద్యులతో సంప్రదించినానంతరం కేడర్‌లోకి చొచ్చుకెళ్లే రీతిలో కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతున్నారు. జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు. వీరితోపాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన వారితో భేటీ కానుండడంతో ఇక రాజకీయంగా దూకుడు పెంచ వచ్చన్న చర్చ జోరందుకుంది. అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలకు తగ్గ ఏర్పాట్లలో శశికళ ఉన్నట్టు సమాచారం. పన్నీరు వస్తే ఆహ్వానం.. సీఎం కుర్చీలో తనను కూర్చోబెట్టడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటో అన్న విషయం గురించి పన్నీరుకు బాగానే తెలుసునని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ ఆయన భరతుడు అయితే, చిన్నమ్మ పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉంటే, ఆహ్వానించేందుకు తామూ రెడీ అని ప్రకటించారు. ఆయన అసంతృప్తితో ఉన్న మాట వాస్తవేమని, ఆయన వస్తానంటే, ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము బీజేపీతో సంప్రదింపులు జరపలేదని, ఎవ్వరిపై ఓత్తిడి తీసుకు రాలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. జయంతి సభలు.. ఈనెల 24న జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి. సేవా కార్యక్రమాలో పరుగులు తీయనున్నాయి. అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రజాకర్షణ దిశగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై ఆర్కేనగర్లో జరిగే సభలో సీఎం పళనిస్వామి, బోడినాయకనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పాల్గొననున్నారు. -
పార్టీ విజయానికి సమష్టిగా పనిచేద్దాం
సాక్షి, చెన్నై: పార్టీ ప్రస్థానంలో వచ్చే ఏడాది ఎంతో ముఖ్యమైందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా చరిత్ర సృష్టిద్దామని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, పన్నీర్‌సెల్వం, కో–కన్వినర్ ఎడపాడి పళనిస్వామి పార్టీ శ్రేణులకు శుక్రవారం లేఖ రాశారు. అన్నాడీఎంకే 49వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జరుపుకోనున్న సందర్భంగా వారిద్దరూ రాసిన లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘ప్రాణాల కంటే మిన్నగా కాపాడుకుంటూ వస్తున్న మన పార్టీ 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49 సంవత్సరంఅడుగుపెడుతోందని తెలిపారు. వచ్చే ఏడాది అన్నాడీఎంకే పార్టీ స్వర్ణోత్సవం జరుపుకోనుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మనం చేసే కార్యక్రమాలన్నీ స్వర్ణోత్సవాల ప్రారంభంగా ఉండాలని ప్రేమ పూర్వకంగా కోరుకుంటున్నామని తెలిపారు. పురట్చి తలైవర్ ఎంజీ రామచంద్రన్ సేవలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. అన్నాదురై మరణం తరువాత ఏర్పడిన ప్రభుత్వం, కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన వ్యక్తి ద్రవిడ పార్టీ లక్ష్యాలను విస్మరించి స్వప్రయోజనాలు, అధికారానికి వాడుకున్నారని తెలిపారు. (కాంగ్రెస్ మునిగే నౌక అని తెలిసినా.. : కుష్బూ) ఇలాంటి దుష్టశక్తుల చేతిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడేందుకే 1972 అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భవించిందని, అధికారాన్ని చేపట్టి ఎంజీఆర్ నేతృత్వంలో ప్రజావసరాలను తీర్చిందని తెలిపారు. తమిళనాడులో సరికొత్త చరిత్రను సృష్టించిందని చెప్పారు. ఆయన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఎంజీఆర్ చూపిన మార్గంలో ప్రజల మన్ననలు పొందారు. వారిద్దరిని ఆదర్శంగా తీసుకుని అందరం ముందుకు సాగుదాం. పార్టీ ప్రస్తానంలో 2021 ఎంతో ముఖ్యమైంది. పార్టీ స్వర్ణోత్సవ ఏడాదిలో అన్నాడీఎంకేను అధికార పీఠంపై కూర్చోబెట్టి చరిత్ర సృష్టిద్దాం. స్వర్ణోత్సవం దిశగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం..’ అంటూ ఆ లేఖలో పిలుపునిచ్చారు. -
అన్నాడీఎంకేలో సామరస్యత
దీర్ఘకాలం రాజకీయరంగాన్ని ప్రభావితం చేసిన దిగ్గజ నాయకులు కనుమరుగైతే... ఆ వెలితిని పూడ్చేవారు కనుచూపు మేరలో కనబడకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తమిళనాడు చాన్నాళ్లుగా నిరూపిస్తూనే వుంది. రాష్ట్ర రాజకీయాల సంగతలావుంచితే పాలకపక్షంగా వున్న అన్నా డీఎంకేలో ఒకరకమైన అనిశ్చితి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఆ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి, రెండో వర్గానికి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీరుసెల్వం నేతృత్వంవహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసివున్న తరుణంలో ఈ అని శ్చితికి ముగింపు పలకాలని ఇరు వర్గాలూ ఒక అంగీకారానికొచ్చాయి. బుధవారం కుదిరిన అవగా హన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుత సీఎం పళనిస్వామే మళ్లీ సీఎం అవు తారు. అలాగే పన్నీరుసెల్వం ఆధ్వర్యంలో పార్టీ సారథ్యబాధ్యతలను చూడటానికి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కోసం పన్నీరుసెల్వం కొంతకాలంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వమూ, పార్టీ తన చెప్పుచేతల్లో వుండాలన్నది పళనిస్వామి నిశ్చితాభిప్రాయం. ఈసారి తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలని, అది కుదరకపోతే పార్టీ పగ్గాలైనా అప్పగించాలని పన్నీరుసెల్వం కోరుకుంటున్నారు. ఈ విషయంలో వచ్చిన విభేదాలు తీవ్రమై సమస్యలు మొదలయ్యాయి. ఎన్నిక లకు ఇంకా ఆరేడు నెలల వ్యవధి వున్న తరుణంలో ఇద్దరు నేతలూ రాజీపడి ఒక అంగీకారానికి రావడం ఆ పార్టీ శ్రేయస్సుకు మంచిదే. (చదవండి: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని) ఎంజీఆర్ మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీకి పెద్ద దిక్కుగా వుంటూ వచ్చిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్లో చనిపోయాక ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్వితీయ శ్రేణి నాయకుడో, నాయకురాలో లేకపోవడంతో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. జయ ఆప్తురాలిగా వున్న వి.కె. శశికళ ఆమె బాటలోనే పన్నీరు సెల్వంను మరోసారి ఆ పదవిలో కూర్చోబెట్టారు. కానీ మరో రెండు నెలలకు తానే సీఎం కావాలనుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక అదంతా బెడిసికొట్టి పదవి రావడం మాట అటుంచి ఆమెకు అవినీతి కేసులో శిక్షపడింది. ఈలోగా పన్నీరుసెల్వం తన మద్దతుదార్లతో వేరే కుంపటి పెట్టుకున్నారు. చివరకు శశికళ పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. అయితే చాలా త్వరగానే పళనిస్వామి సైతం ఆమె నుంచి దూరం జరిగారు. బీజేపీ నాయకగణం మధ్య వర్తిత్వం ఫలితంగా అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమై అప్పటినుంచీ బండి లాగిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక్క ఎంజీఆర్ హయాంలో తప్ప ఎప్పుడూ ఒకే పార్టీ వరసగా మూడోసారి అధికారంలోకొచ్చిన దాఖలా లేదు. అలా చూస్తే అన్నాడీఎంకే కోటా అయిపోయినట్టే. ఆ పార్టీ అధికారంలో కొనసాగడం వరసగా ఇది రెండోసారి. ఇప్పుడు నేతలిద్దరి రాజీ ఫలితంగా ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలొచ్చి మూడోసారి సైతం అధికారంలోకొచ్చి చరిత్రను తిరగరాస్తుందా అన్నది ఇంకా చూడాల్సివుంది. పై స్థాయిలో ఇద్దరి మధ్యా ఏర్పడ్డ సఖ్యత ప్రభావం కింది స్థాయి కేడర్ వరకూ వెళ్తే... పాలన సైతం జనరంజకంగా సాగితే అది అసాధ్యం కాకపోవచ్చు. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పక్షానికి ఎప్పుడూ కొంత వెసులుబాటు వుంటుంది. ఏయే అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వుందో తెలుసుకుని, వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడానికి... కొత్త విధానాలతో, పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి పాలకపక్షానికే అవకాశం వుంటుంది. పాలనకు సంబంధించి ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేకపోయినా గతంలోవలే కేంద్రంతో పోరాడి దేన్నయినా సాధించే తత్వం ప్రస్తుత పాలకుల్లో కొరవడిందన్న భావన ఏర్పడింది. నీట్ విషయంలో రాష్ట్రం గట్టిగా పోరాడితే బాగుండేదన్న అభిప్రాయం వుంది. నిరుడు చెన్నైలో ఏర్పడిన మంచినీటి కొరత కనీవినీ ఎరుగనిది. దానిపై చివరకు హాలీవుడ్ నటుడు లియనార్డో డి కాప్రియో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు అంతటా నిరుడు జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళన దక్షిణాదిలోనే అతి పెద్దది. సహజంగానే ఈ అంశంపై పాలక అన్నాడీఎంకే మాట్లాడలేకపోయింది. అన్నా డీఎంకే సమష్టిగా పోరాడటం ఒక ఎత్తయితే... విపక్షమైన డీఎంకే రూపంలో ఎదురయ్యే సవాలును ఎదుర్కొనడం మరో ఎత్తు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఏర్పాటుచేసి 39 స్థానాలకూ 38 సాధించుకుంది. పొరు గునున్న పాండిచ్చేరిలోని ఒకే ఒక స్థానం సైతం కూటమికొచ్చింది. అసెంబ్లీలోని 22 స్థానాలకు అంతక్రితం జరిగిన ఉప ఎన్నికల్లో 9 చోట్ల అన్నాడీఎంకే నెగ్గింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తుడిచి పెట్టుకుపోతుందని, తగిన మెజారిటీ లేక పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని భావించిన డీఎంకేకు ఇది షాక్. దాన్నుంచి త్వరలోనే కోలుకుని లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ తన సత్తా చాట గలి గారు. అయితే నిరుడు అక్టోబర్‌లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పళనిస్వామి పరువు నిలుపుకున్నారు. సినీ నటుడు కమలహాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడా నెగ్గకపోయినా తనకంటూ వోటు బ్యాంకు వుందని నిరూ పించుకుంది. మరో నటుడు రజనీకాంత్ పార్టీ ఇంకా కళ్లు తెరవలేదు. తమ పార్టీ అసెంబ్లీలోని 234 స్థానాలకూ పోటీ చేస్తుందని మాత్రం ప్రకటించారు. కాగా, శశికళ జైలుశిక్ష పూర్తిచేసుకుని డిసెం బర్లో రాబోతున్నారు. ఆమె ఎత్తుగడలేమిటో చూడాల్సివుంది. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీ అయినా అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఏదో ఒకదానితో చెలిమి చేయడం తప్పనిసరి. ఇప్పుడు పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య ఏర్పడిన సామరస్యం ఫలితమేమిటో... కొత్త పార్టీల రాకతో డీఎంకేకు కలిగే లాభనష్టాలేమిటో, జాతీయ పార్టీల భవితవ్యమేమిటో రాగల అసెంబ్లీ ఎన్నికలు తేలుస్తాయి. -
ఉత్కంఠ : నేడే సీఎం అభ్యర్థి ప్రకటన
అన్నాడీఎంకే రాజకీయ వివాదాలకు తెరపడేనా అనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది. సీఎం అభ్యర్థి ఎవరో తేల్చేనా లేదా, నాన్చేనా అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఆమేరకు బుధవారం అన్నాడీఎంకేలో కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. వారం రోజులుగా ఓ వైపు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ , డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, మరో వైపు కో కన్వీనర్, సీఎం పళనిస్వామి వేర్వేరుగా మద్దతు నేతలతో మంతనాల్లో మునిగారు. మంగళవారం కూడా మంతనాలు జోరుగానే సాగాయి. మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, తంగమణి, ఆర్బీ ఉదయకుమార్ గంటల తరబడి పన్నీరుతో ఓ వైపు, పళనితో మరో వైపు సమావేశమయ్యారు. ఇక, తన నివాసంలో సమన్వయ కమిటీ ప్రతినిధులు వైద్యలింగం, కేపీ మునుస్వామిలతో పన్నీరుసెల్వం పొద్దుపోయే వరకు సమావేశం అయ్యారు. సీఎం అభ్యర్థి, ప్రధాన కార్యదర్శి వ్యవహారం, మార్గదర్శక కమిటీ ఎంపిక, ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలో అనే విషయంగా సుదీర్ఘంగానే సమాలోచన సాగినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్గదర్శక కమిటీ పారీ్టకి కీలకం కానున్న దృష్ట్యా, అందులో చోటు దక్కించుకునేందుకు సీనియర్లు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. నేడు కీలక ప్రకటన.. ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాల్సి ఉంది. మార్గదర్శక కమిటీ విషయంగా కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే, ప్రధాన కార్యదర్శిగా దివంగత సీఎం జయలలితే శాశ్వతం అని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఆ పదవి విషయంగా ఎలాంటి నిర్ణయం తాజాగా వెలువడుతుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. పన్నీరు, పళనిల మధ్య బయలుదేరిన ఈ కుర్చీ కొట్లాటలో కేంద్రం పెద్దలు సైతం జోక్యం చేసుకునిన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ దృష్ట్యా, బుధవారం జరిగి పార్టీ సమావేశం వ్యవహారాలన్నీ సామరస్యపూర్వంగానే సాగే అవకాశాలు ఉన్నాయని, ఐక్యతతో ప్రకటన చేయవచ్చన్నట్టుగా సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ఇక 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉండడంతో సీఎం అభ్యర్థి ఎవరో తాజాగా ప్రకటించే అవకాశాలు తక్కువేనని పేర్కొనడం గమనార్హం. మార్గదర్శక కమిటీలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాల మేరకు మరో రోజు సీఎం అభ్యర్థి విషయంగా నిర్ణయం తీసుకోవచ్చని ఓ నేత పేర్కొన్నారు. ఈ మంతనాల గురించి మంత్రి జయకుమార్‌ను కదిలించగా, ఇక, అన్నీ గోల్డెన్ డేస్ అని వ్యాఖ్యానించారు. అమ్మ పాలన మళ్లీ రావాలన్న సంకల్పంతో సమష్టిగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువేనని స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పన్నీరే సీఎం అంటూ కొన్నిచోట్ల, పళని సీఎం అభ్యర్థి అంటూ మరి కొన్ని చోట్ల మద్దతుదారుల పోస్టర్లు హల్చల్ చేశాయి. (తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్ ) నేనే ప్రిసీడియం చైర్మన్.. అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా మధుసూదన్ ఉన్న విషయం తెలిసిందే. వయోభారం దృష్ట్యా, ఆయన్ను పక్కన పెట్టవచ్చన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మధుసూదన్ మీడియా ముందుకు వచ్చారు. తాను జీవించి ఉన్నంత కాలం ప్రిసీడియం చైర్మన్‌గానే వ్యవహరించడం జరుగుతుందని, ఇది అమ్మ జయలలిత తనకు ఇచ్చిన పదవి అని వ్యాఖ్యానించారు. ధర్మయుద్ధంలో పన్నీరు విజయం సాధిస్తారని పేర్కొనడం గమనార్హం. -
తమిళనాడులో హీట్ పెంచిన ట్వీట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సోమవారం చేసిన ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. భగవద్గీతలోని సూక్తులను గుర్తు చేస్తూ ట్వీట్ ఉండడం..నలుగురు మంత్రులు పళనితో భేటీ కావడం గమనార్హం. ఈ నెల 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పేరు ప్రకటనతో కుర్చీ కొట్లాటకు ముగింపు పలకాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే తేనిలో తిష్ట వేసిన పన్నీరు సెల్వం మూడు రోజులుగా పార్టీ వర్గాలతో సుదీర్ఘ మంతనాల్లో మునగడంతో కుర్చి వార్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్ర మంత్రులంతా చెన్నైలోనే ఉండాలన్న ఆదేశాలు జారీ కావడంతో చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో సోమవారం పన్నీరు సెల్వం చేసిన ఓ ట్వీట్ అన్నాడీఎంకే రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. (కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు) ట్వీట్ సారాంశం ‘ఏది జరిగిందో అది బాగానే జరిగింది...ఏది జరుగుతుందో అది బాగానే జరుగుతుంది..ఏది జరగబోతుందో అది బాగానే జరగబోతుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇది వరకు నిర్ణయం తీసుకునే వాడినని.. అదే తరహాలో తదుపరి అడుగు.. నిర్ణయం ఉంటుందని ముగించారు. తేనిలో మూడు రోజుల మంతనాలను ముగించుకున్న పన్నీరు చెన్నైకు తిరుగు పయనమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, కేటీ రాజేంద్ర బాలాజీ, వెల్లమండి నటరాజన్‌లు సీఎం పళనిస్వామితో భేటి కావడం మరింత ఆసక్తిని పెంచింది. యువత మద్దతు పళనికే అని కేటీ రాజేంద్ర బాలాజీ చెప్పడం గమనార్హం. -
కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కుర్చీ కొట్లాట వేడెక్కింది. సర్వ సభ్య సమావేశంలో సాగిన వ్యవహారాల్ని పరిగణించిన పన్నీరుసెల్వం సచివాలయానికి దూ రంగా గ్రీన్‌వేస్ రోడ్డుకే పరిమితమయ్యారు. సీఎం పళనిస్వామి కరోనా సమీక్షను సైతం బహిష్కరించి, మద్దతుదారులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి ఈ సమావేశం వేదికగా వాదులాటకు దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం ఎవరో, 11 మందితో మార్గదర్శక కమిటీ వ్యవహారంలో ఈ ఇద్దరు నువ్వా, నేనా అన్నటు వాదులాడుకోవడమే కాదు, ఎవరు ఏ ద్రోహం చేశారో, తలబెట్టారో అంటూ తీవ్రంగానే విడుచుకు పడ్డారు. దీంతో అక్టోబర్ 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రకటన అంటూ సభను ముగించేశారు. అలాగే, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్ దూరంగా.. మద్దతు మంతనాల్లో సీఎం, కో కన్వీనర్ పళనిస్వామి వ్యాఖ్యల దాడి కాస్త స్వరాన్ని పెంచినట్టుగా సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో మంగళవారం సాగిన పరిణామాలు ఆసక్తికరంగా, చర్చకు దారి తీసే రీతిలో మారాయి. కరోనా వ్యవహారం, లాక్డౌన్ ఆంక్షలపై సీఎం పళనిస్వామి సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయగా, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం డుమ్మా కొట్టారు. సచివాలయానికి దూరంగా ఉన్న ఆయన గ్రీన్‌వేస్ రోడ్డులోని నివాసంలో మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధులు కేపీ మునుస్వామి, వైద్యలింగం సైతం గంటల తరబడి పన్నీరుతో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీకి ప్రా«ధాన్యత పెరగడంతో పన్నీరు అడుగులు ఎలా ఉంటాయో అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో పన్నీరు ఢిల్లీ వెళ్తారని కొందరు, సొంత జిల్లా తేనికి వెళ్లనున్నారంటూ మరి కొందరు చర్చించుకోవడంతో చర్చ రచ్చ వేడెక్కింది. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో పార్టీ చీలిక సందర్భంలో సాగిన పరిణామాలను ద్రోహం అంటూ తనను ఉద్దేశించి పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టుందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. పన్నీరు చుట్టూ పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరడం, కొందరు మంత్రులు ఆయనతో ఫోన్లో మాట్లాడడం వంటి పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే కుర్చీ కొట్లా ట వేడెక్కింది. ఈభేటీ ముగించుకుని బయటకు వచ్చిన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మనస్పర్థలు, విభేదాలు లేవని, అందరూ ఒక్కటేనని, పన్నీరు, పళని ఇద్దరికీ తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, మంత్రి జయకుమార్‌ను సచివాలయంలో మీడియా కదిలించగా, పార్టీలో చి న్నచిన్న వ్యవహారాలు ఉంటాయని, అయితే, తామంతా ఒక్కటే అని, ఐక్యతతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని, మళ్లీ అధికారం కైవ సం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి నివాసంలో మంత్రి ఎస్పీ వేలుమణి సాయంత్రం భేటీ కావడం గమనార్హం. మంగ ళవారం సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇళ్లకు అన్నాడీఎంకే నేతలు క్యూ కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎవరి పదవులు పోతాయో.. ఎవరిని వరిస్తాయో..?
అన్నాడీఎంకే పార్టీలో మూడేళ్ల తర్వాత కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇందుకు తగ్గ సంకేతాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు, పళని ఇవ్వడంతో నేతల్లో కలవరం నెలకొంది. మార్పు అనివార్యం అని స్వయంగా పళని, పన్నీరు ప్రకటించారు. ఈ నెల 24న అమ్మ జయంతి రోజున ఆయా ప్రాంతాల్లో నేతలు సేవా కార్యక్రమాలు చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేను రక్షించుకునేందుకు సీఎం పళనిస్వామి తీవ్రంగానే ప్రయత్నించారు. బయటకు వెళ్లిన పన్నీరుసెల్వంను మళ్లీ పార్టీలోకి రప్పించారు. అధికారంలో, పార్టీలో ఇద్దరు సమం అన్నట్టుగా సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఉపాధ్యక్షుడిగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పన్నీరు సెల్వం ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాలన మూడేళ్లు విజయవంతం కావడంతో నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన పళనిస్వామి ఇక మార్పులు చేర్పులపై దృష్టి పెట్టడం అన్నాడీఎంకే నేతల్లో కలవరం రేపుతున్నాయి. చదవండి: ‘బ్రదర్ ఇదంతా రాజకీయ కక్ష.. నాకేం తెలియదు' మార్పులు చేర్పుల దిశగా.. తొలుత పన్నీరు రూపంలో ఆ తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. అయినా అందరినీ కలుపుకుని వెళ్లడంతో చాలా మంది మళ్లీ మాతృగూటికి వస్తున్నారు. ప్రజల్లో తనకు చరిష్మా ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పళనిస్వామి చాటుకున్నారు. అదే ఊపుతో పురపాలక, కార్పొరేషన్లు, పట్టణ పంచాయతీలు, వాయిదా పడ్డ తొమ్మిది జిల్లాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం లక్ష్యంగా దూకుడు పెంచారు. ఈ పరిస్థితుల్లో నాలుగు రోజుల పాటుగా జిల్లాల వారీగా పార్టీ వర్గాలతో పన్నీరు, పళని భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా అనేక జిల్లాల కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై జిల్లాల నుంచి వచ్చిన నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పళని, పన్నీరు మార్పు అనివార్యం అని ప్రకటించడం గమనార్హం. చదవండి: శోకసంద్రంలో దర్శకుడు రాజ్‌కపూర్ కుటుంబం ప్రకటనతో కలవరం.. మంగళవారం పన్నీరు, పళని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో నాలుగైదు రోజుల పాటుగా సాగిన జిల్లాల నేతల సమావేశం గురించి వివరించారు. ఇందులో అనేక అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. బలోపేతం, రానున్న స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రతిజ్ఞ చేద్దామని, అంకిత భావంతో, ఐక్యతతో పనిచేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన సూచనలు, సలహా పాటించే దిశగా ప్రతి ఒక్కరూ హామీలు ఇచ్చారని పేర్కొంటూ, అదే సమయంలో తమ దృష్టికి తెచ్చిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా మార్పులు చేర్పుల దిశగా ముందుకు సాగబోతున్నామన్నారు. ఎంజీఆర్, అమ్మ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు. కాగా అనేక మంది మంత్రులు, జిల్లా నేతలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎవరి పదవులు ఊడుతాయో? ఎవరికి పదవులు వరిస్తాయో? అన్న చర్చ అన్నాడీఎంకేలో జరుగుతోంది. సేవల్లో.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నిర్ణయించింది. హంగు ఆర్భాటాలను పక్కన పెట్టి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని కేడర్‌కు పిలుపునిచ్చింది. అలాగే జయంతి రోజున రాయపేటలోని పార్టీ కార్యాలయంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. -
బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు..!
సాక్షి, చెన్నై: లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడుకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో కన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తులకు తన పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీరుసెల్వం సోమవారం మధురైలో పొత్తులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బలమైన కూటమి కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకించలేమని, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు మెగా కూటమిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం డీఎంకే, కాంగ్రెస్ మినహా ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరాజన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నీరుసెల్వం వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌లు మిత్రపక్షాలైన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు అధికార అన్నాడీఎంకేకు ఉమ్మడి శత్రువులు కావడంతో ఆపార్టీ తప్పక బీజేపీ పక్షాన నిలుస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మాజీ సీఎం జయలలిత మరణాంతరం శశికళను జైలుకు పంపడం, పళనిస్వామిని సీఎం చెయ్యడం వెనుక బీజేపీ పాత్ర ఉందన్న వార్తలు కూడా ఆమధ్య తమిళనాట గట్టిగానే వినిపించాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పొత్తుల విషయం కీలకం కానుంది. -
పన్నీరుకు చేసిన సాయం పామై చుట్టుకుంది
పోనీలే పాపం.. అని సానుభూతి చూపడం ఆమె పాలిట శాపంగా మారింది.రహస్యంగా చేసిన సాయం రట్టుకావడం రక్షణమంత్రి నిర్మలా సీతారామన్నుచిక్కుల్లో పడేసింది. రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల పట్టుబట్టడాన్నిఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈనెల 25వ తేదీన అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి ఎంపీ మైత్రేయన్‌ను వెంటబెట్టుకుని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను కలుసుకునేందుకు వెళ్లారు. అయితే 45 నిమిషాలైనా ఆమె లోనికి పిలవలేదు. ఆ తరువాత ఎంపీ మైత్రేయన్‌ను మాత్రమే లోనికి అనుమతించి ఐదు నిమిషాలు మాట్లాడి పంపేశారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన పన్నీర్ సెల్వంతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించడం తమిళనాడులోనే గాక ఢిల్లీ రాజకీయవర్గాల్లో సైతం తీవ్రమైన కలకలం రేపింది. ఆమెను కలవకుండానే పన్నీర్ చెన్నైకి చేరుకున్నారు. దీంతో అసలు కారణాలపై అన్వేషణ మొదలై వెలుగుచూసింది. పన్నీర్‌సెల్వం తమ్ముడు బాలమురుగన్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య కారణాలతో మదురైలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం అత్యవసరంగా చెన్నైకి తరలించాల్సి న పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా వస్తే ఆలస్యం అవుతుంది. విమానంలో తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. పన్నీర్‌సెల్వం వెంటనే రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను సంప్రదించగా రక్షణ శాఖకు చెందిన ఏయిర్ అంబులెన్స్ హెలికాప్టర్‌ను కేటాయించాల్సిందిగా కోరారు. పన్నీర్ కోర్కె ఆమె హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఉండిన హెలికాప్టర్ ఆఘమేఘాలపై మదురైకి వచ్చింది. రక్షణ శాఖకు చెందిన ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ద్వారా ఈనెల మొదటి వారంలో బాలమురుగన్ చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే గోప్యంగా ఉంచాల్సిన ఈ వివరాలన్నీ పన్నీర్‌సెల్వం మీడియా ముందు చెప్పడం నిర్మలా సీతారామన్‌కు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. ఈ కారణం చేతనే పన్నీర్‌సెల్వంకు మాట్లాడేందుకు ఆమె నిరాకరించిందని తేలింది. సాధారణ వ్యక్తి అసాధారణ సౌకర్యమా? ముఖ్యమంత్రి లేదా కేబినెట్ హోదా కలిగిన వ్యక్తులకు మాత్రమే వినియోగించాల్సిన అంబులెన్స్ హెలికాప్టర్‌ను సాధారణ వ్యక్తికి వినియోగించడం వివాదాస్పదమైంది. అంతేగాక నిర్మలాసీతారామన్ తన వ్యక్తిగత పరపతితో రహస్యంగా హెలికాప్టర్‌ను పంపడం మరింత చర్చకు దారితీసింది. రక్షణ శాఖకు సంబంధించినంత వరకు ఇది సీరియస్ వ్యవహారమని అంటున్నారు. పైగా మద్యానికి బానిసై అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఇంతటి ఉన్నతమైన సేవలు అవసరమా అని విమర్శలు చేస్తున్నారు. ఇరువూరు రాజీనామా చేయాలి :ప్రతిపక్షాలు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, తమిళనాడుఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తమ పదవులకు రాజీనామా చేయాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. పన్నీర్‌సెల్వం తమ్మునికి రక్షణశాఖ హెలికాప్టర్ పంపడం నిర్మలాసీతారామన్ చేసిన మహా తప్పని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గురువారం తిరునెల్వేలిలో వ్యాఖ్యానించారు. నిబంధనలను అతిక్రమించినట్లయితే ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకు ఉందని అన్నారు. ఏయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ వివాదానికి నైతిక బాధ్యత వహించి డిప్యూటీ సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేయాలని ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు. -
‘అమ్మ’ను చూడనే లేదు
ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ జయలలితను తాను చూడనే లేదుఅని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. కాగా, విచారణలో మంత్రుల పేర్లు బయటకు రావడం, దాన్ని ఖండించే రీతిలోమంత్రులు తమలో భయాన్ని వ్యక్తం చేయడం అనుమానాలకుదారితీస్తున్నట్టు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్వ్యాఖ్యానించారు. విచారణ కమిషన్ ఎదుట మంగళవారంజయలలిత ప్రత్యేక కార్యదర్శి రామలింగం హాజరయ్యారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జయలలితతో సన్నిహితంగా ఉన్న అధికారులు, ఆమె కార్యదర్శులు, భద్రతా అధికారులు, డ్రైవర్లు, వంట వాళ్లు, ఇలా ఏ ఒక్కరినీ వదలి పెట్టకుండా ఆ కమిషన్ విచారణ సాగిస్తోంది. అలాగే, జయలలిత నెచ్చెలి శశికళ తన వాంగ్మూలాన్ని లిఖిత పూర్వకంగా సమర్పించారు. ఆమె బంధువులు వివేక్, కృష్ణప్రియ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణల్లో జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసిందెవరు..? అన్న విషయంగా తీవ్రంగానే చర్చ సాగుతోంది. మంత్రులు చూసినట్టుగా కొందరుతమ వాంగ్మూలం ద్వారా స్పందించారు. అయితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ప్రభుత్వ, అధికారిక వ్యవహారాల్ని ఆర్థిక మంత్రిగా పన్నీరు సెల్వం తన భుజాన వేసుకున్న విషయం తెలిసిందే. ఆయన సైతం జయలలిత మరణం విషయంగా అనుమానాల్ని లేవదీశారు. ఈ పరిస్థితుల్లో జయలితను తాను చూడలేదన్న విషయానికి కట్టుబడి పన్నీరు సెల్వం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా మంగళవారం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, జయలలితను తాను చూడనే లేదని స్పష్టంచేశారు. గతంలోనూ ఇదే చెప్పానని, మళ్లీ మళ్లీ ఇదే చెబుతున్నానన్నారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఏ ఒక్క రోజూ తనకు చూడడానికి అవకాశాన్ని ఇవ్వలేదని, అలాంటప్పుడు తాను ఎలా చూస్తానని వ్యాఖ్యానించారు. కాగా, జయలలిత మరణం కేసు విచారిస్తున్న విచారణ కమిషన్ ముందు ఉంచుతున్న వాంగ్మూలాలు మంత్రుల్లో గుబులు రేకెత్తిస్తున్నట్టుందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ విమర్శించారు. మంత్రులు జయలలితను చూసినట్టు కమిషన్ ముందుకు వాదనలు చేరుతుండడంతో వారిలో ఆందోళన బయలుదేరి ఇష్టానుసారంగా స్పందిస్తున్నట్టుందని మండిపడ్డారు. విచారణకు రామలింగం జయలలిత మరణం కేసు విచారణకు హాజరవుతున్న వారిని శశికళ తరఫు న్యాయవాది రాజ చెందూర్ పాండియన్ క్రాస్ ఎగ్జామిన్ చేసే పనిలో పడ్డారు. జయలలిత ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రామలింగం సైతం మంగళవారం విచారణకు హాజరయ్యారు. జయలలితను కలవాలంటే రామలింగం అనుమతి గతంలో తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దృష్ట్యా, ఆయన్ను సైతం విచారణ వలయంలోకి తీసుకొచ్చారు. తనవద్ద ఉన్న సమాచారాలను కమిషన్ ముందు ఆయన ఉంచారు. ఈసందర్భంగా జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆమెను ఎవరెవరు పరామర్శించారు...? చూశారు..? అన్న వివరాల్ని రాబట్టే విధంగా ఆ కమిషన్ రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ప్రశ్నల్ని సంధించినట్టు సమాచారం. -
దినకరన్ రాజీ ఫార్ములా!
సాక్షి, చెన్నై: అధికార అన్నాడీఎంకేలో విలీనమయ్యేందుకు సిద్ధమని బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. తన డిమాండ్లను నెరవేరిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వంలో చేరతానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని స్పష్టం చేశారు. పళనిస్వామి మంత్రివర్గంలో తాను సూచించిన ఆరుగురిని తొలగించాలన్నారు. అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తే అన్నాడీఎంకేలో విలీనం అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. దినకరన్ డిమాండ్లపై పళనిస్వామి సర్కారు స్పందించాల్సివుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత దినకరన్ దూకుడు పెంచారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని శపథం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే అన్నాడీఎంకేలో విలీనమవుతామని ముందునుంచి ఆయన చెబుతున్నారు. తన వెంటవున్న 18 మంది ఎమ్మెల్యేలపై పళని సర్కారు అనర్హత వేటు వేయడంతో ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఆర్కే నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి దినకరన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు సమానదూరం పాటిస్తూ ఆయన తన గళం విన్పిస్తున్నారు. -
రూ.లక్షకు పెరిగిన ఎమ్మెల్యేల వేతనం
టీ.నగర్: అసెంబ్లీలో వేతనాల పెంపు ముసాయిదాను బుధవారం ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యేల వేతనం లక్ష రూపాయలకు చేరింది. రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాన్ని పెంచేందుకు సంబం«ధించిన చట్ట ముసాయిదా అసెంబ్లీ పక్షనేత, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. ఇందుకు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించడంతో ముసాయిదాకు అంగీకారం తెలిపినట్లు స్పీకర్ ధనసాల్ ప్రకటించారు. ఈ ముసాయిదాకు డీఎంకే తరఫున ఆ పార్టీ విప్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ముసాయిదాలోని వివరాలు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రిసీడియం చైర్మన్, డిప్యూటీ ప్రెసిడీయం చైర్మన్, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సభ్యుల వేతనాలు ఎనిమిది వేల రూపాయల నుంచి రూ.30 వేలకు పెరిగాయి. ఇదే విధంగా పలు రాయితీలు కల్పించారు. అసెంబ్లీ మాజీ సభ్యుల పింఛన్ 12 వేల రూపాయల నుంచి రూ.20 వేలకు పెంచారు. మాజీ సభ్యుల చట్టబద్ధమైన వారసులకు కుటుంబ పింఛన్ ఆరువేల రూపాయల నుంచి రూ.10 వేలు అందించనున్నారు. ఇలాఉండగా ఈ వేతనాలు 2017 జూలై ఒకటవ తేదీ నుంచి అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా నెరవేర్చడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ.25.32కోట్ల ఖర్చు ఏర్పడనుంది. ఈ విధంగా ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా నెరవేరడంతో ఇకపై ఎమ్మెల్యేలు నెలసరి వేతనంగా లక్ష రూపాయలు అందుకోనున్నారు. -
ఇంతకీ గుండు గీయించుకుంటారా..?
ఆర్కేనగర్లో గెలుపుతో దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. గొంతు నొప్పితో బాధ పడుతున్నా, తన వ్యూహాలకు పదును పెట్టడం లక్ష్యంగా సోమవారం మద్దతు దారులతో ఆయన మంతనాల్లో మునిగారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల్ని తన వైపునకు తిప్పుకునేందుకు పథకం రచించారు. దీన్ని అమలుచేయడానికి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ రంగంలోకి దిగనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఈపీఎస్, ఓపీఎస్ వైపు ఉన్న తన స్లీపర్ సెల్స్ ద్వారా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాలం వేయడానికి దినకరన్ వ్యూహ రచన చేసినట్టు సమాచారం. తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తదితర డెల్టా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తమ వైపునకు తిప్పుకునే బాధ్యతల్ని చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకరన్ తన భూజాన వేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వ్యూహాలకు పదును పెట్టే విధంగా దూకుడు పెంచేందుకు సిద్ధమైన దినకరన్ సోమవారం కూడా తన మద్దతు నేతలతో బిజీగా గడిపారు. సూలూరు ఎమ్మెల్యే కనకరాజ్ తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండడంతో ఆయన ద్వారా మరి కొందరు ఎమ్మెల్యేల్ని తిప్పుకోవడంతో పాటు జిల్లాల కార్యదర్శుల్ని గురిపెట్టి మద్దతుదారులతో సంప్రదింపుల్లో మునిగి ఉండడం గమనార్హం. ఓవైపు గొంతు నొప్పి ఉన్నా, మరోవైపు ఏ మాత్రం తగ్గకుండా విజయోత్సాహంతో రెట్టింపు దూకుడుతో ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నాడీఎంకే కేడర్‌లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇక, దినకరన్‌కు సాయంగా కుటుంబానికి చెందిన కృష్ణప్రియ, జయానంద్ సైతం ఇక, చురుగ్గా దూసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. స్వరం పెంచిన మద్దతు దారులు ఆర్కే నగర్ గెలుపుతో ఈపీఎస్, ఓపీఎస్‌లకు వ్యతిరేకంగా దినకరన్ మద్దతుదారులు స్వరాన్ని పెంచుతున్నారు. మీడియాతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మాట్లాడుతూ, ఆర్కేనగర్ ఎన్నికల్లో తామేదో మాయ చేశామని ఈపీఎస్, ఓపీఎస్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సహాకారాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓటర్లకు తలా రూ.ఆరు వేలు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించబోమని వ్యాఖ్యానించడం శోచనీయమని, వాస్తవానికి చెప్పాలంటే, ఇకనైనా ఈపీఎస్, ఓపీఎస్‌తో పాటు అక్కడున్న మంత్రులు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. దినకరన్ గెలిస్తే గుండు గీయించుకుంటానని ఓ మాజీ మంత్రి సవాల్ చేశారని, ఇంతకీ గుండు గీయించుకుంటారా..? అని వలర్మతిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. అమ్మ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లు, ప్రస్తుతం చిన్న పిల్లల చేష్టలతో నిందల్ని తమ మీద మోపే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం వాళ్లకు లేదని స్పష్టంచేశారు. ఓపీఎస్ ఒకప్పుడు దినకరన్, తన ముందుకు చేతులు కట్టుకుని నిలబడ్డ కార్యకర్త అని, ఇప్పుడు తమ మీదే నిందలు వేసే స్థాయికి చేరాడని మండిపడ్డారు. స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయని, ఇక రోజుకో ఎపిసోడ్ అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయని ఆయన ముగించడం గమనార్హం. ఇక, దినకరన్ మద్దతు మహిళా నాయకురాలు, నటి సీఆర్ సరస్వతి అయితే, ఆర్కేనగర్లో ఓటుకు తాము ఒక్క నోటు కూడా ఖర్చు పెట్టలేదని, వచ్చిన మెజారిటీ అంతా ప్రజాదరణే అని వ్యాఖ్యానిస్తున్నారు. అభినందనలు.. విమర్శలు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్న దినకరన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడు విశాల్, శరత్‌కుమార్ వంటి వారే కాదు, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు పలు పార్టీలు అభినందిస్తున్నాయి. అలాగే, ఆరుగురు మంత్రులు, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. అదే సమయంలో ఈ గెలుపును వ్యతిరేకించే విధంగా, విమర్శలు గుప్పించే రీతిలో స్పందించే వాళ్లూ ఉన్నారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై ముందంజలో ఉన్నారు. అసలు ఇది కూడా ఒక గెలుపేనా అని ఆమె మండిపడుతున్నారు. అలాగే, డీఎండీకే అధినేత విజయకాంత్ అయితే, గెలిచారు.. అంతే.. అంటూ ముందుకు సాగారు. శుభాకాంక్షలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, వాటితో సంబంధం లేదన్నట్టుగా దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. తన లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్‌ల వద్ద ఉన్న పార్టీ, రెండాకుల చిహ్నం కైవశం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తవైపునకు తిప్పుకునేందుకు కసరత్తుల్లో ఉన్నారు. నమ్మకంతో ఓటు వేశారు : దినకరన్ తన మీద నమ్మకంతో ఆర్కేనగర్ ఓటర్లు ఓటు వేశారేగానీ, తాయిలాలకో, నోట్ల మీదున్న ఆశతో మాత్రం కాదు అని దినకరన్ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తనకు ఫ్రెషర్ కుక్కర్ చిహ్నం వచ్చినప్పుడే అందరికీ ఫ్రెషర్ తెప్తిసానని చెప్పినట్టు గుర్తుచేశారు. అనేకమంది డిపాజిట్లు సైతం గల్లంతు కాబోతున్నాయని తాను ముందే చెప్పినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందే తాను అక్కడి ఓటర్లతో ఏ విధంగా మమేకం అయ్యానో అన్నది గుర్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి ఓటర్లు తమ మీద అపార నమ్మకాన్ని కల్గి ఉన్నారని, అందుకే తనకు పట్టం కట్టారని తెలిపారు. అంతేగానీ, తానేదో నోట్లు, తాయిలాలు వెదజల్లినట్టుగా ఆరోపించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను కాదు, అన్నాడీఎంకే పాలకులు రూ.120 కోట్లను నియోజకవర్గంలో చల్లారని, ఒక్కో ఓటుకు రూ.ఆరు వేలు ఇచ్చారని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డీఎంకేతో తానేదో కుమ్మకైన్నట్టు చెబుతున్నారని, డీఎంకే ఎంత పెద్ద పార్టీ అని, ఆ పార్టీ ఓట్లు తనకు ఎవరైనా వేయమని ఆదేశిస్తారా..? అని ప్రశ్నించారు. -
జయ వీడియోపై ఎన్నికల కమిషన్ సీరియస్
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీసిన వీడియో బయటకు రావడంపై కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీరియస్ అయింది. గురువారం ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల కావడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీడియో విడుదల అంశంపై పూర్తి నివేదికను అందజేయాలని తమిళనాడు ఎన్నికల కమిషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కాగా, జయలలిత వీడియో ప్రసారాలను నిలిపివేయాలని ఆర్కే నగర్ ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ పత్రికలు, చానెళ్లను కోరారు. మరోవైపు జయ వీడియోపై ఓ పన్నీర్‌సెల్వం వర్గీయులు స్పందించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం వీడియోను విడుదల చేసిందని ఆరోపించారు. ఇన్ని రోజులుగా వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. -
‘సీఎం’ల బినామీ శేఖర్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో సాగుతున్న ఇసుక అమ్మకాలు అక్రమాల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంలకు ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి బినామీ కథనాయకుడని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆరోపించారు. శేఖర్రెడ్డికున్న రాజకీయ అండదండల వల్లనే రూ.33.6 కోట్ల విలువైన కొత్త కరెన్సీ ఆయనకు ఎలా దక్కిందనే విషయం బయటకు రావడం లేదని స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎస్ కంపెనీ పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక క్వారీలు నడిపే కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు గత ఏడాది డిసెంబరు 8వ తేదీన దాడులు నిర్వహించి రూ.170 కోట్ల నగదు, రూ.178 కిలోల బంగారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో రూ.33.6 కోట్ల విలువైన రూ.2000 నోట్ల కొత్త కరెన్సీ ఉండడం కేసు తీవ్రతను పెంచింది. శేఖర్‌రెడ్డి చేతికి ఇంత భారీ మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందో తమకు తెలియదని సీబీఐకి ఆర్బీఐ సమాధానం చెప్పడం మరింత కలకలం రేపింది. ఈ కేసు విచారణపై స్టాలిన్ స్పందిస్తూ, ఆర్బీఐ అదుపాజ్ఞల్లో పనిచేసే కరెన్సీ ముద్రణాలయాలు, బ్యాంకుల ద్వారా మాత్రమే శేఖర్‌రెడ్డి భారీ మొత్తంలో సొమ్ము ముట్టే అవకాశం ఉంది, అయితే ఆ సొమ్ము ఎలా చేరిందో తమకు తెలియదని ఆర్బీఐ చెప్పడం ఆశ్చర్యమే కాదు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కరెన్సీ ముద్రణాలయాలు కేంద్రప్రభుత్వం, కర్ణాటక, పశ్చిమబెంగాల్లోని ముద్రణాలయాలు ఆర్బీ ఐ అదుపాజ్ఞల్లో పనిచేస్తాయని ఆయన అన్నారు. రూ. 33.6 కోట్లు ఏ ప్రెస్, బ్యాంకు నుంచి శేఖర్‌రెడ్డికి చేరా యో సీబీఐ కనుగొనలేక పోవడం నమ్మశక్యంగా లేదని అన్నారు. శేఖర్‌రెడ్డి కేసులో ఆధారాలు దొరకలేదు, రాష్ట్రంలో గుట్కా అక్రమ అమ్మకాల విచారణలో ఐటీ అధికారులు అందజేసిన ప్రకటన కనపడటం లేదు, గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంటైనర్ ద్వా రా రూ.570 కోట్ల రవాణా అయిన సంగతి ఎన్నికల కమిషన్‌కు,ఆర్బీఐకి తెలియకపోవడం విచిత్రమన్నారు. ఐటీ అధికారుల దాడులన్నీ అంతరంగికం తమిళనాడుకు సంబంధించి ఐటీ అధికారులు జరిపిన దాడులన్నీ అంతరంగికంగా మారడం గమనార్హమని స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలోని అక్రమ ఆర్థిక లావాదేవీలన్నీ పథకం ప్రకారం అటకెక్కడంపై ప్రభుత్వం వద్ద సమాధానం లేదని, ఈ పరిస్థితుల్లో సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంల అక్రమార్జనకు శేఖర్‌రెడ్డి బినామీ కథానాయకుడన్న సంగతిని గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్థిక అవకతవకలపై తమ పార్టీ వచ్చేనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌డే అనుసరిస్తుండగా, తమకు పోటీగా అదే రోజున దేశవ్యాప్తంగా నల్లధన నిర్మూల దినం పాటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించడం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికేనని విమర్శించారు. శేఖర్‌రెడ్డికి రూ.33.6 కోట్లు ఎలా వచ్చాయా తెలియని స్థితిలో ఆర్బీఐ ఉన్నపుడు కేంద్రప్రభుత్వ నల్లధన నిర్మూలన ఏ రీతిలో సాగుతోందో అర్థం అవుతోందని ఎద్దేవా చేశారు. శేఖర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమార్జనలపై జరిపిన ఐటీ దాడులపై వెంటనే చర్య తీసుకునేలా నల్లధన నిర్మూలనం రోజున కేంద్రం ఒక ప్రకటన చేయాలని ఆయన కోరారు. అలాగే, శేఖర్‌రెడ్డికి రూ.2000 కొత్త నోట్లు ఎలా వచ్చాయనే వివరాలను ఆర్బీఐ అధికారులు వెంటనే సీబీఐకి అందజేసి చార్జీషీటు దాఖలుకు సహకరించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. -
విచారణలో జాప్యం
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీపై న్యాయ విచారణలో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. విచారణ కమిషన్ కార్యాలయ ఏర్పాటు పనులు పూర్తికాకపోవడమే జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్య కారణాలతో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయ కోలుకుంటున్నారు.. కోలుకున్నారు.. నేడో రేపో డిశ్చార్జ్.. అంటూ పార్టీ నేతలు, వైద్యులు ప్రచారం చేశారు. 75 రోజులపాటు జరిగిన ప్రచారానికి భిన్నంగా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జయ కన్నుమూశారు. చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలు విడుదల చేయాలని పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోర్కెను ఎవరూ వినిపించుకోలేదు. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. జయ మరణంపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చీలిక వర్గ నేతగా ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం సైతం న్యాయవిచారణకు డిమాండ్ చేశారు. నలువైపులా ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి న్యాయవిచారణ కమిషన్ ఏర్పాటుచేసి రిటైర్డు న్యాయమూర్తి ఆరుముగస్వామిని చైర్మన్‌గా నియమించారు. జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదికను సమర్పించాలని గత నెల 25వ తేదీన సీఎం ఆదేశాలు జారీచేశారు. చెన్నై మెరీనాబీచ్ రోడ్డులోని ఎళిలగం భవనంలోని ప్రత్యేక కార్యాలయంలో విచారణ కమిషన్ చైర్మన్‌గా ఆర్ముగస్వామి గత నెల 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. గతంలో నిర్ణయించిన ప్రకారం బుధవారం నుంచి విచారణ ప్రారంభించాల్సి ఉంది. చైర్మన్ ఆరుముగస్వామి బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభిస్తారని అధికార వర్గాల్లో మంగళవారం ప్రచారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఉదయం 10 గంటలకల్లా కార్యాలయానికి చేరుకున్నారు. మ«ధ్యాహ్నం 2 గంటలు దాటినా చైర్మన్ రాలేదు. కారణం కోసం ఆరా తీయగా, రిటైర్డు న్యాయమూర్తికి కేటాయించిన చాంబర్లో తలుపులు, కిటికీలు, టైల్స్ అమరిక పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పారు. అంతేగాక టేబులు, కుర్చీలు, టెలిఫోన్ వసతి కూడా కల్పించలేదని తెలిపారు. విచారణ కమిషన్‌కు సహకరించే సిబ్బంది కార్యాలయపు గదుల్లో సైతం పనులు సాగుతున్నాయని అన్నారు. విచారణ ప్రారంభించడానికి ఇంకా కొన్నిరోజులు పడుతుందని సిబ్బంది వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి పరిశీలిస్తే నివేదిక సమర్పణకు ఇచ్చిన మూడు నెలల గడువులో ఒక నెల పూర్తయింది. విచారణ ప్రారంభం కాకుండానే నెలరోజులు పూర్తికావడం, కార్యాలయ పనులు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో గడువు ప్రకారం డిసెంబరు 25వ తేదీ నాటికి నివేదిక అనుమానమేని నిర్ధారించుకోవాల్సి వస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న పన్నీరు సెల్వం
సాక్షి, తిరుమల: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వేకువజాము 2.30 గంటలకు ఆలయానికి వచ్చారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సూపరింటెండెంట్ మాధవకుమార్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఆయనకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
'సారీ.. నేను రాలేను.. పన్నీర్ వస్తారు'
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరుకాలేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీస్వామి చెప్పారు. తన బదులు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వస్తారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తన తండ్రి విగ్రహ ప్రారంభానికి రాకుండా తనను అవమానించారని నటుడు ప్రభు ఇటీవల రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కే రాజుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం నేరుగా ప్రభుకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. తాను రాలేకపోవడానికి కారణాలు వివరించారు. 'గణేశన్ మెమోరియల్‌ను స్వయంగా ప్రారంభించాలని నాకు ఆశగా ఉంది. అయినప్పటికీ ముందుకు ఖరారు అయిన కొన్ని కార్యక్రమాల కారణంగా నేను ఆరోజు అందుబాటులో ఉండటం లేదు. అందుకే, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రారంభోత్సవానికి వస్తారు' అని పళనీ స్వామి చెప్పారు. అక్టోబర్ 1 శివాజీ గణేశన్ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. గతంలో ఆయన విగ్రహం చెన్నైలోని కామరాజర్ సాలయ్ వద్ద ఉండేది. అయితే, ప్రజల సౌకర్యం రీత్యా వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో తిరిగి రూ.2.80కోట్ల వ్యయంతో ఆద్యార్ ప్రాంతంలో పూర్తిగా ద్రవిడియన్ పద్థతిలో నిర్మించారు. -
దినకరన్‌కు షాక్!
సాక్షి, చెన్నై: తెన్కాశి ఎంపీ వసంతి మురుగేషన్ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు షాక్ ఇచ్చారు. ఆ శిబిరం నుంచి సీపీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ల శిబిరంలోకి చేరారు. దినకరన్‌ను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలతో మంతనాల నిమిత్తం కుడగులోని క్యాంప్‌లో దినకరన్ తిష్ట వేశారు. సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ల కలయికతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఆయనకు మద్దతుగా 21 మంది ఎమ్మెల్యేలు కదిలినా, 18 మంది మాత్రం కుడుగు క్యాంప్‌లో ఉన్నారు. ఈ 18 మందిపై అనర్హత వేటు పడడంతో మిగిలిన ముగ్గురు డైలమాలో పడ్డారు. అలాగే, దినకరన్‌కు మద్దతుగా ఇన్నాళ్లు ఎంపీలు నాగరాజన్, విజిలా సత్యనంద్, సెంగుట్టవన్, ఉదయకుమార్, గోకులకృష్ణన్, నవనీత కృష్ణన్, రాధాకృష్ణన్, వసంతీ మురుగేషన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడడంతో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఎనిమిది మంది ఎంపీల్లో ఆందోళన బయలు దేరింది. దినకరన్‌కు దూరంగా ఉండడం మంచిదన్న భావనలో ఎంపీలు ఉండగా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డైలమాలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎంపీ వసంతీ మురుగేషన్ దినకరన్‌కు షాక్ ఇచ్చి సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లకు జిందాబాద్ కొట్టారు. దినకరన్‌కు షాక్: తెన్కాశి పార్లమెంట్‌సభ్యురాలు వసంతీమురుగేషన్ ఉదయాన్నే గ్రీమ్స్ రోడ్డులోని సీఎం పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆశీస్సులు అందుకుంటూ, ఆ శిబిరంలోకి చేరారు. అలాగే, పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం ఓ పన్నీరు సెల్వం ఇంటికి చేరుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఈపీఎస్, ఓపీఎస్‌లతో కలిసి పయనం సాగించనున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను సర్వనాశనం చేయడం లక్ష్యంగా దినకరన్ కుట్రలు చేస్తున్నాడని, అందుకే ఆ శిబిరాన్ని వీడినట్టు పేర్కొన్నారు. దినకరన్‌కు ఇన్నాళ్లు వెన్నంటి ఉంటూ, ఈపీఎస్, ఓపీఎస్‌లపై దుమ్మెత్తి పోశారే అని ప్రశ్నించగా, తమ చేత బలవంతంగా పలికించారని దాట వేయడం గమనార్హం. అలాగే, మిగిలిన ఏడుగురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలతో భేటీ కానున్నారని ప్రకటించారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అనేక మంది సీఎం వైపే ఉన్నారని, వాళ్లను క్యాంప్‌లో పెట్టి ఉన్న దృష్ట్యా, బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కుడగుకు దినకరన్: మైసూర్ సమీపంలోని కుడగు క్యాంప్‌లో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్యాంప్‌నకు శుక్రవారం దినకరన్ చేరుకున్నారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో తదుపరి కార్యాచరణ మీద మంతనాలు సాగిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా, స్పీకర్ ధనపాల్ జారీ చేసిన అనర్హత ఉత్తర్వులను రద్దు చేయాలని మదురైకు చెందిన సామాజిక కార్యకర్త కేకే రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ విచారణ న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్ బెంచ్ ముందుకు ఉదయం వచ్చింది. ఇలాంటి పిటిషన్ విచారణ మద్రాసు హైకోర్టు సాగుతుండడం, తదుపరి విచారణ అక్టోబరు నాలుగో తేదీ జరగనున్నడాన్ని గుర్తు చేస్తూ, ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని కోర్టు తిరస్కరించింది. -
మరో రిసార్ట్‌కు తరలిన ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ సర్కార్‌ను కూల్చితీరుతామన్న టీటీవీ దినకరన్ వర్గం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న దినకరన్ శిబిరం... వారిని జారిపోకుండా చూసుకునే క్రమంలో శుక్రవారం ఎమ్మెల్యేలను మరో రిసార్ట్స్‌కు తరలించింది. ఎమ్మెల్యేలను వేరే రిసార్ట్స్‌కు తరలిస్తున్నామని, విండ్‌ఫ్లవర్ రిసార్ట్ కేవలం రెండురోజులకే బుక్ చేశామని దినకరన్ సహచరుడు, ఏఐఏడీఎంకే నేత టీటీ సెల్వం తెలిపారు. ఇవాళ దినకరన్‌తో సమావేశమై భవిష్యత వ్యూహాన్ని ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. శశికళను పార్టీ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను దినకరన్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. పార్టీలో గ్రూపుల విలీనంతో తాము విభేదించకపోయినా చిన్మమ్మను దూరం పెట్టడం సరికాదని దినకరన్ మండిపడుతున్నారు. -
మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు
-
గవర్నర్ ఏం చేస్తారో?
♦‘రాజ్’భవన్‌కు చేరిన రాజకీయం ♦నేడు కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గవర్నర్ చర్చలు ♦పుదుచ్చేరిలో పన్నీర్, దిష్టిబొమ్మల దహనం ♦ఎవరి జాగ్రత్తల్లో వారు అన్నాడీఎంకే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రాష్ట్రప్రభుత్వ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరుకున్నాయి. సీఎం ఎడపాడి బంతి గవర్నర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎలాంటి నిర్ణయం తీసుకునేనో, బంతిని ఎవరివైపు విసిరేనో అనే ఉత్కంఠ బయలుదేరింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి, పన్నీర్వర్గాల విలీనమైన ముచ్చట తీరకముందే దినకరన్ రూపంలో ముప్పు ముంచుకొచ్చింది. ఎడపాడి ప్రభుత్వాన్ని ఏకంగా మైనార్టీలోకి నెట్టివేసింది. పలు రాజకీయ పక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరిగాయి. అవిశ్వాస తీర్మానం పెడతానని ఒకవైపు, బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌పై ఒత్తిడి తెస్తూ మరోవైపు స్టాలిన్ పట్టుదలతో ఉన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ (బీజేపీ మినహా) స్టాలిన్‌తో గొంతు కలిపాయి. 19 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించినట్లు దినకరన్ చెబుతుండగా, ముగ్గురు మిత్రపక్ష ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో కొనసాగుతున్నారని స్టాలిన్ చెబుతున్నారు. బలపరీక్షకు ఆదేశించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బుధవారం గవర్నర్‌కు లేఖ రాశారు. ఐదుగురు ఎమ్మెల్యేలను కూడగట్టుకోకుంటే ఎడపాడి ప్రభుత్వం ఐదు నిమిషాల్లో కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోంమంత్రితో గవర్నర్ భేటీ ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు గురువారం ఢిల్లీలో కేంద్రహోంమంత్రి రాజ్నా«థ్ సింగ్‌ను కలుస్తున్నారు. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన తమిళనాడు రాజకీయాలపై ఇరువురూ చర్చించే అవకాశం ఉంది. ఎడపాడి ప్రభుత్వానికి బలపరీక్ష అవకాశం ఇవ్వడమా.. మైనార్టీలో పడిపోయినట్లు స్పష్టంగా తెలుస్తున్నందున ప్రభుత్వాన్ని రద్దుచేసి మరలా ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియకు ఆదేశాలు జారీచేయడమా.. అనే విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర మంత్రితో జరుపుతున్న చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. పది రోజుల్లోగా అసెంబ్లీని సమావేశపరచడం తప్పనిసరి అని అసెంబ్లీ మాజీ కార్యదర్శి సెల్వరాజ్ బుధవారం మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్ వెంటనే ఆదేశించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యేలే కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దిష్టిబొమ్మల దహనం ఇదిలా ఉండగా పన్నీర్‌సెల్వం, దినకరన్ వర్గాలు పుదుచ్చేరిలో పోటాపోటీగా ఆందోళన చేపట్టాయి. పన్నీర్‌సెల్వం మద్దతుదారులు ఉదయం నగరంలో ర్యాలీ నిర్వహించి రిసార్టును ముట్టడించారు. ఆ తరువాత దినకరన్ దిíష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే దినకరన్ వర్గం కార్యకర్తలు బు«ధవారం సాయంత్రం రిసార్టు వద్దకు చేరుకుని పన్నీర్‌సెల్వం, ఎంపీ వైద్యలింగం పొటోలను, దిష్టిబొమ్మలను తగులబెట్టారు. పదవీ ప్రమాణం చెల్లదు : దివాకరన్ అసెంబ్లీలో తగిన మెజార్టీలేని ఎడపాడి ప్రభుత్వంలోకి డిప్యూటీ సీఎం, మంత్రిగా గవర్నర్ చేయించిన పదవీ ప్రమాణ స్వీకారం చెల్లదని శశికళ సోదరుడు దివాకరన్ అన్నారు. కుంభకోణంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎడపాడి సంఖ్యా బలాన్ని గుర్తించడంలో గవర్నర్ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. స్పీకర్ ధనపాల్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు తమ వర్గం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఎడపాడి ప్రభుత్వం కూలిపోకుండా ఎవరూ ఆపలేరని అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పుహలేంది అన్నారు. -
ఈ చెలిమి గెలుస్తుందా?
తమిళనాట ఆర్నెల్లనాడు మొదలై ఎడతెగకుండా సాగుతున్న అసంబద్ధ రాజకీయ నాటకానికి ఎట్టకేలకు తెరపడింది. అన్నా డీఎంకేకు చెందిన ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గాలు రెండూ సోమవారం విలీనమ య్యాయి. పార్టీ పగ్గాలను పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ సారథ్యాన్ని పళనిస్వామి చేపట్టాలని ఇరుపక్షాలూ ఒప్పందానికొచ్చాయి. పన్నీర్‌సెల్వానికి పార్టీ పగ్గాలు మాత్రమే కాదు... అదనంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆయనకు కీల కమైన ఆర్ధిక శాఖతోపాటు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ప్లానింగ్, శాసనసభా వ్యవహారాలు వంటి అరడజనుకు పైగా శాఖలు కేటాయించారు. అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణించాక ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పన్నీర్ సెల్వం రెండు నెలల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఆ పదవిని వదులుకుని తానే స్వయంగా శశికళను ప్రతిపాదించి ఆమె ఏకగ్రీవ ఎన్నికకు దోహదపడ్డారు. మరికొన్ని రోజులకే తిరుగుబాటు చేశారు. అమ్మ జయలలిత ఆత్మ ఆదేశించడం పర్యవసానంగానే ఇదంతా చేస్తున్నానని ప్రకటించి కలకలం సృష్టించారు. మళ్లీ ఆ పదవిని పొందడానికి అన్ని ప్రయత్నాలూ చేశారు. ఈలోగా శశికళ జైలుపాలు కావడంతో ఆమె వర్గం తరఫున పళనిస్వామి తెరపైకి వచ్చారు. తన శిబిరంలోని ఎమ్మెల్యేలను చెదరగొట్టడానికీ, బలహీనపర్చడానికీ ఎవరెన్ని ఎత్తుగడలు పన్నినా పళనిస్వామి నిబ్బరంగా ఎదుర్కొని చివరకు విశ్వాస పరీక్షలో విజయం సాధిం చారు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు అందరికీ అర్ధమయ్యాయి. అధికార కుమ్ములాటలుండే ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఎత్తులు, పైయెత్తులు సర్వసాధార ణమే. కానీ ఆ తర్వాతే చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. తమిళనాడు రాజకీయాలు విలక్షణమైనవి. సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం... ఆ వీరాభిమానం రాజకీయ రంగానికి కూడా బదిలీ కావడం అక్కడ కనబడే ధోరణి. రాష్ట్రంలో మొదటినుంచీ ద్రవిడ ఉద్యమం బలంగా ఉండటం వల్ల ఈ ధోరణికి మరింత ఊపు వచ్చింది. జయలలిత మరణానంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఈ విలక్షణతకు కూడా భిన్నమైనవి. నిన్నమొన్నటి వరకూ పన్నీర్, పళని వర్గాలు కత్తులు నూరుకున్నాయి. అవినీతి పరురాలైన శశికళ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నారని పళనిపై పన్నీర్ నిప్పులు చెరిగితే...అందుకు దీటుగా ఆ వర్గం స్పందించింది. అమ్మ వారసులం మేమే నంటూ ఇరు పక్షాలూ వీధికెక్కాయి. అయితే ఉన్నట్టుండి అవి రెండూ స్వరం తగ్గించాయి. అమ్మ కలలు నెరవేర్చడం కోసం కలిసి పనిచేస్తామని సంకేతాలివ్వడం ప్రారంభించాయి. ఫిబ్రవరిలో జరిగిన విశ్వాస పరీక్షలో కేవలం 11 ఓట్లు మాత్రమే సంపాదించిన పన్నీర్ సెల్వాన్ని 122మంది ఎమ్మెల్యేల బలం ఉన్న సీఎం పళని స్వామి కలిసుందాం... రమ్మని అభ్యర్ధించడం, ఆయన షరతులు విధిస్తూ పోవడం, మొదట బెట్టు చేసినట్టు కనబడిన పళని ఒక్కో మెట్టే దిగుతూ దాదాపుగా అన్ని డిమాండ్లకూ అంగీకారం తెలపడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. శశికళ జైలు పాలయ్యాక తన బంధువు టీటీవీ దినకరన్‌ను విశ్వాసపాత్రునిగా ఎంచుకుని ఆయనకు పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పదవి కట్టబెట్టారు. అది పళనికి ఆగ్రహం కలిగించి ఉండొచ్చుగానీ... అందుకు బలహీనుడిగా మిగిలిన పన్నీర్ సెల్వంతో చేతులు కలపడం వల్ల ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. దినకరన్ శిబి రంలో 28మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష డీఎంకే సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వారికి దినకరన్ వర్గం మద్దతుగా నిలిస్తే ప్రభుత్వం కుప్ప కూలుతుంది. అయినా ఆయన పన్నీర్‌ను ప్రాధేయపడ్డారు తప్ప దినకరన్‌తో ఏదో రకమైన సర్దుబాటుకు సిద్ధపడదామనుకోలేదు. ఏమైతేనేం ఇప్పుడు పళని, పన్నీరు వర్గాలు కలిసిపోయాయి. పన్నీర్‌సెల్వం డిమాండు మేరకు జయలలిత మరణంపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న మరో కీలక డిమాండు మాత్రం పెండింగ్‌లో పడింది. అందుకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం తప్పనిసరని చెబుతున్నారు. ఆ ప్రక్రియ సజావుగా పూర్తి కావడం పళనిస్వామికి పెద్ద సవాలే. తమిళనాట జరుగుతున్న పరిణామాల్లో తమ ప్రమేయం లేదని బీజేపీ నాయకత్వం చెబుతోంది. అయితే అలాంటి బలమైన శక్తేదో లేకుండానే ఆ రాష్ట్రంలో ఈ మాదిరి పరిణామాలు చోటుచేసుకుంటాయంటే ఎవరూ నమ్మ జాలరు. నిజానికి కొన్ని రోజుల క్రితం బిహార్‌లో జరిగిన పరిణామాలు కూడా ఆశ్చర్యకరమైనవే. అక్కడ అధికార పక్షమైన జేడీ(యూ)...తన కూటమిలోని భాగస్వామి ఆర్జేడీని బయటకు నెట్టి కొత్త భాగస్వామి బీజేపీని తెచ్చుకుంది. తమిళనాడులో ఇప్పుడు ఏర్పడ్డ కొత్త చెలిమి పర్యవసానంగా అంతా సర్దు కుంటుందని, ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని భావించడానికి లేదు. పన్నీర్ సెల్వం మొన్న ఫిబ్రవరిలో అమ్మ పేరు చెప్పి ప్రత్యర్ధి వర్గంపై విరుచుకు పడినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన కమల్‌హాసన్ తదితర సినీ నటులు ఇప్పుడు తాజా విలీనాన్ని హేళన చేస్తున్నారు. తమిళ ప్రజల నెత్తిన టోపీ పెడు తున్నారంటూ కమల్ వ్యాఖ్యానించారు. డీఎంకే పెట్టబోయే అవిశ్వాస తీర్మానం సంగతలా ఉంచి తమిళ ప్రజలు ఈ వింత పరిణామాలను ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. అన్నాడీఎంకేలో గౌండర్, తీవర్ రెండూ బలమైన కులాలు. జయలలిత బలమైన నాయకురాలు గనుక ఈ రెండు కులాలకు తగినంత ప్రాధాన్యమిచ్చి పార్టీ వెనక దృఢంగా ఉండేలా చూసుకోగలిగారు. ఆ స్థాయిలో పళని, పన్నీర్లు పార్టీని పటిష్టంగా నడపగలరా అన్నది సందేహమే. పళనిస్వామి గౌండర్ అయితే పన్నీర్ తీవర్ కులస్తుడు. రాజకీయ సుస్థిరత లేనప్పుడు పాలన కుంటుబడుతుంది. ఫలి తంగా ప్రజలు ఇబ్బంది పడతారు. తమిళనాడులో గత ఆర్నెల్ల పరిణామాలు దీన్నే రుజువు చేశాయి. ఇప్పుడు కుదిరిన సఖ్యత ఎంతవరకూ దాన్ని మెరుగుపరచ గలదో చూడాలి. -
విలీనం ఓకే..అదే మిలియన్ డాలర్ క్వశ్చన్
చెన్నై:తమిళనాట సంచలనంగా మారిన పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనంపై శశికళవర్గం స్పందించింది. విలీనం సంతోషమే...కానీ తమను (టీటీవీ దినకరన్, సరస్వతి) ఎందుకు దూరం పెడుతున్నారని ఏఐఏడీఎంకే నేత సీఆర్ సరస్వతి ప్రశ్నించారు. అదే మిలియన్ డాలర్ల క్వశ్చన్ అని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరో కీలక మార్పుకు నాంది పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా పాగా వేయాలని భావించిన శశికళ 'చిన్నమ్మ' వరుస చిక్కుల్లో చిక్కుకుంటుండగా తాజా పరిణామాలు ఆసక్తి కరంగా మారాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీని చీల్చి, భంగపడిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం దిగి వచ్చి పళని స్వామితో ఒక అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. ఈ మేరకు సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి విలీనానికి ఇరువర్గాలు అంగీకరించినట్టు సోమవారం అధికారింగా ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు ఎంజీఆర్ మెమోరియల్, మెరినా మెమోరియల్‌ను సందర్శించి దివంగత మాజీ ముఖ్యమంత్రికి,అమ్మ జయలలితకు నివాళులర్పించారు. అలాగే పార్టీ పదవినుంచి శశికళ తొలగించడంపై పార్టీ జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయించనున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా పళని స్వామి తెలిపారు. మరోవైపు డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేయగా, పన్నీరు సన్నిహితుడు పాండి రాజన్ కూడా కొత్త క్యాబినెట్లో మంత్రిగా చేరారు. -
విలీనం దిశగా అన్నాడీఎంకే అడుగులు
-
21న ముహూర్తం?
► విలీనం దిశగా అన్నాడీఎంకే అడుగులు ► ఎడపాడి, పన్నీర్ శిబిరాల్లో కొనసాగుతున్న మంతనాలు ► సీనియర్ నేతలతో పన్నీరుకు చిక్కులు అన్నాడీఎంకే విలీనం కథ క్లైమాక్స్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమయ్యేందుకు ఈనెల 21వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మంచివార్త వింటారని శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పన్నీర్ సెల్వం అన్నారు. అలాగే ఎడపాడి వర్గ అధికార ప్రతినిధి ధీరన్ సైతం అదే విషయాన్ని మీడియాకు తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: పళని, పన్నీర్ శిబిరాల విలీనం నేడో రేపు ఖరారయ్యే అకాశముంది. ఎడపాడి, పన్నీర్‌సెల్వం, దినకరన్‌లతో మూడు ముక్కలు, ఆరు చెక్కలుగా మారిన అన్నాడీఎంకే వర్గ విభేదాల కారణంగా ప్రజల్లో పలుకుబడి, ప్రతిష్టను కోల్పోయింది. ఎంజీఆర్ స్థాపించిన పార్టీ, రెండాకుల చిహ్నం ఎన్నికల కమిషన్ చేతుల్లో చిక్కిపోయింది. విలీనమైతేనే కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుందని ప్రధాని మోదీ సైతం అల్టిమేటం ఇచ్చారు. పార్టీ లేదు, చిహ్నం లేదు, ప్రధాని తోడ్పాటు లేదు, పార్టీపై ప్రజల్లో విలువ కూడా అడుగంటి పోతున్న తరుణంలో విలీనం కావడం మినహా గత్యంతరం లేదనే వాస్తవాన్ని ఇరువర్గాలు గ్రహించాయి. ఇప్పటికే సిద్ధమైనా.. పదవులపై పట్టుపట్టకుండా విలీనం కావాలని ఇరువర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు వంటి ఆదేశాలు జారీచేశారు. ఆలస్యమైతే దినకరన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తగలవని ఆందోళన చెందిన ఎడపాడి, పన్నీర్ వర్గాలు శుక్రవారం ఒకేసారి విలీనానికి సిద్ధమయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశమయ్యాయి. పన్నీర్ వర్గం పెట్టిన షరతులను 90 శాతం వరకు ఎడపాడి వర్గం ఆమోదించింది. చర్చలు కొలిక్కివచ్చి ఎడపాడి, పన్నీర్ వర్గాలు అమ్మ సమాధి వద్ద ఏకమై సాయంత్రం 7 గంటల తరువాత అధికారికంగా ప్రకటిస్తారని అందరూ ఆశించారు. అయితే అందరి ఆశలను తల్లకిందులు చేస్తూ రాత్రి 10 గంటల సమయంలో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అన్ని విధాలా మనకు న్యాయం ‘విలీనం వల్ల అన్ని విధాలా మనకు న్యాయం జరుగుతుంది, ఇందుకు నేను హామీ’ అంటూ పన్నీర్‌సెల్వం తన వర్గానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కాని మాజీ మంత్రులు నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి మంత్రి పదవులు కావాలని కోరారు. ఉప ఎన్నికల ద్వారా తమ గెలుపు కోసం రాజీనామా చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా వారు పన్నీర్‌పై ఒత్తిడి తెచ్చారు. ప్రధానంగా సీనియర్ నేతలు పాండియరాజన్, కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, ఎంపీ మైత్రేయన్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకా అనేక డిమాండ్లు పన్నీర్ ముందు పెట్టడంతో ఆవన్నీ ఇప్పుడు కాదని నిరాకరించారు. చర్చల్లో పాల్గొన్న నేతలంతా పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకుని రావడంతో వారికి నచ్చజెప్పడం పన్నీర్ వల్లకాక పోవడం, నేతల మొండిపట్టుతో విలీనంలో ప్రతిష్టంభన ఏర్పడింది. కొందరు నేతలు వెళ్లిపోయిన అనంతరం కూడా శనివారం తెల్ల వారుజాము 3 గంటల వరకు పన్నీర్‌సెల్వం నేతలో చర్చలు జరిపారు. శనివారం సైతం ఎడపాడి, పన్నీర్ వర్గాలు వేర్వేరుగా చర్చల్లో మునిగితేలాయి. ఒకటి రెండు రోజుల్లో ఒక మంచి వార్త వింటారని, విలీనం ఖాయమని పన్నీర్‌సెల్వం, ఎడపాడి వర్గ అధికార ప్రతినిధి ధీరన్ శనివారం మీడియాకు చెప్పారు. శుక్రవారం నాటి చర్చలకు కొనసాగింపుగా శనివారం సైతం ఇరువర్గాలు సమావేశంకాగా, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈనెల 21వ తేదీన ఇరువర్గాలు విలీనంపై ప్రకటన చేస్తారని అంచనా. పదవుల కోసం పన్నీర్ వర్గం పట్టు చర్చల ప్రారంభ దశలోనే విలీనం ద్వారా తమకు పార్టీ, ప్రభుత్వంలో పదవులు కావాలని పన్నీర్ వర్గం పట్టుబట్టడం ప్రారంభించారు. పన్నీర్‌సెల్వంకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ప్రజాపనులు లేదా హోంశాఖ శాఖలతో డిప్యూటీ సీఎం పదవి, చెమ్మలై, పాండియరాజన్‌లకు మంత్రి పదవులు ఖాయమని ఎడపాడి వర్గం సమాచారం ఇచ్చింది. పన్నీర్ కోరుతున్న ఆర్థిక మంత్రిత్వ శాఖను ఇచ్చేందుకు ఎడపాడి వర్గం నిరాకరించింది. ఎమ్మెల్యేలు కాని వారు సైతం మంత్రి పదవుల కోసం పట్టుపట్టారు. అంతేగాక తమ వర్గానికి కేటాయించే పదవులు ఏమిటో ఇప్పుడే లిఖితపూర్వకంగా తెలియజేయాలని పన్నీర్ వర్గ నేతలు ఎడపాడి వర్గాన్ని పట్టుబట్టారు. -
మోదీతో అరగంట పాటు పన్నీర్‌సెల్వం భేటీ
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు, సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరం, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాలు విలీనంపై చర్చ జరిగినట్లు సమాచారం. అరగంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. సమావేశం అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై ప్రధాన మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. అలాగే పళనిస్వామి సర్కార్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. రెండు వర్గాల విలీనంపై మీడియా ప్రతినిధులు... పన్నీర్ సెల్వంను ప్రశ్నించగా... ‘మీకు కావాల్సినట్లు మీరు ఊహించుకుంటారు’ అని సమాధానం ఇచ్చారు. తమిళనాడు ప్రజలతో పాటు, పార్టీ కేడర్ కోరుకునే విధంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. కాగా పన్నీర్‌సెల్వంతో పాటు అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ కూడా ప్రధాని భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు, అన్నాడీఎంకే వర్గాల విలీనంపై ప్రధానంగా చర్చ జరిగిందని, అయితే మరొక పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఉండదని ప్రధాని స్పష్టం చేసినట్లు మైత్రేయన్ వెల్లడించారు. కాగా మోదీ భేటీ అనంతరం పన్నీర్ సెల్వం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాబా సన్నిధి నుంచి ఢిల్లీకి.. చెన్నై నుంచి ముంబయి మీదుగా షిర్డీ చేరుకున్న పన్నీరు సెల్వం ఆదివారం ప్రత్యేక పూజల్లో లీనం అయ్యారు. తన శిబిరం మద్దతు నేతలు కేపీ మునుస్వామి, సెమ్మలై, మైత్రేయన్లతో కలిసి షిర్డి సాయినాథుడ్ని దర్శించుకున్నారు. అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, శని భగవానుని ఆలయంలో విశిష్ట పూజలు చేయడం గమనార్హం. ఈ పూజల అనంతరం నేరుగా ముంబయి చేరుకుని సాయంత్రం ఢిల్లీలో పన్నీరు అడుగు పెట్టారు. పదవుల పందేరం విషయంగా త్యాగాలకు పళని మెట్టు దిగడం లేదన్న విషయాన్ని పన్నీర్ సెల్వం ఈ సందర్భంగా మోదీ దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం పళనిస్వామి నేతృత్వంలోని అమ్మ శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాల విలీనానికి ప్రధాని నరేంద్ర మోదీ రాజీ ప్రయత్నాలు సాగించినట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధానితో భేటీ అయ్యారు. ఇప్పటికే అమ్మ శిబిరం తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను సాగనంపగా, ఎన్నికల కమిషన్ నుంచి వెలువడే నిర్ణయం మేరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీకి పళని, పన్నీరు వేర్వేరుగా వెళ్లినా, విలీనం విషయగా ఏ ప్రకటన వెలువడ లేదు. అదే సమయంలో పళని మాత్రం ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులతో సమావేశం అయ్యారు. -
కలుస్తున్నారు.. డిప్యూటీ సీఎంగా పన్నీర్!
సాక్షి, చెన్నై : తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనీ స్వామిని(ఈపీఎస్) తిరిగి అదే బాధ్యతల్లో కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వాన్ని(ఓపీఎస్) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కట్టబెట్టే విషయంలో ఇరు వర్గాలు అంగీకరించినట్లు కీలక వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఇక త్వరలోనే కలిసిపోనున్నాయని తెలుస్తోంది. పన్నీర్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు ప్రభుత్వంలో ప్రాధాన్యమున్న ఆర్థికశాఖ, పౌరసరఫరాలశాఖలు కట్టబెట్టనున్నారట. అలాగే, పన్నీర్ వర్గానికి చెందిన సెమ్మాలై, మాఫక్షయి పాండ్యరాజన్‌ను కూడా కేబినెట్లోకి తీసుకొని ఆరోగ్యశాఖగానీ, పరిశ్రమలకు సంబంధించిన శాఖలుగానీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే, మంత్రి డీ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15కంటే ముందే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు కలిసిపోనున్నాయని చెప్పారు. నిజంగానే ఓపీఎస్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు ఇస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు మాత్రం మౌనం వహించారు. ఇప్పటికే, దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ఆమె అక్క కొడుకు దినకరన్‌కు అధికార అన్నాడీఎంకే షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దినకరన్‌పై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేసింది. అన్నాడీఎంకే డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేలో కీలక పునరేకీకరణకు మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు. -
పన్నీర్ సెల్వం హత్యకు కుట్ర.. అంతా అబద్ధం
చెన్నై: తమిళనాడు తిరుచ్చి ఎయిర్‌పోర్టులో శనివారం అన్నాడీఎంకే మద్దతుదారుడు కత్తితో పట్టుపడిన సంఘటన కలకలం సృష్టించింది. ఆ సమయానికి అక్కడకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అనుమానాస్పదంగా సమీపిస్తుండటంతో అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అతని దగ్గర నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పన్నీర్ సెల్వంను హత్య చేయడానికే అతడు కత్తి పట్టుకొచ్చాడని తమిళ మీడియా పదే పదే ప్రసారం చేసింది. కానీ అది వాస్తవం కాదని విచారణలో పోలీసులు నిర్థారణకు వచ్చారు. నిందితుడి పేరు చోళరాజన్(50). వృత్తి రీత్యా నాయిబ్రాహ్మణుడు కావడంతో కత్తితో ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అంతేకాకుండా పన్నీర్ సెల్వం వర్గానికి అతడు మద్దతుదారుడు. తమ నాయకుడు వస్తున్నాడని తెలియడంతో కలవడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు మీడియాకు తెలిపాడు. అయితే మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తమిళ మనీల కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పన్నీర్ సెల్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తుండటం వల్లే హత్యాయత్నం జరిగినట్టు పేర్కొన్నారు. -
మళ్లీ పాతపాటే పాడిన పన్నీర్ సెల్వం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరంతో విలీనానికి ఆస్కారం లేదని పురట్చి తలైవీ శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పష్టంచేశారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీ అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవీ శిబిరాలుగా చీలిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి సారథ్యంలోని అమ్మ శిబిరం, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో సాగుతున్న పురట్చి తలైవీ శిబిరాన్ని ఏకంచేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. గత నెల ఇరు శిబిరాల నేతలు ప్రధాని నరేంద్ర మోదీతో వేర్వేరుగా భేటీ అయ్యారు. దీంతో విలీనం చర్చ తమిళనాడులో ఊపందుకుంది. ఈ చర్చకు ముగింపు పలుకుతూ పన్నీరు సెల్వం గురువారం మీడియాతో మాట్లాడారు. విలీన చర్చల గురించి ప్రశ్నించగా, ఆ శిబిరం నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఆ శిబిరం నాయకులే ప్రశ్నలు, సమాధానాలు రెండూ ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. విలీనానికి ఆస్కారం ఉందా అని మీడియా ప్రశ్నించగా.. ఇప్పటికే తాము నిర్ణయం తీసుకుని ఉన్నామని, విలీనానికి అవకాశమే లేదని పన్నీరు సెల్వం కుండబద్దలు కొట్టారు. -
పన్నీరు సెల్వంకు గట్టి షాక్
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే పురచ్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వంకు కౌండం పాళయం ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి షాక్ ఇచ్చారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం నాయకత్వంలోని పురత్చి తలైవి శిబిరాన్ని వీడి సీఎం పళనిస్వామి నేతృత్వంలోని శిబిరంలో ఆదివారం చేరారు. తన మద్దతుదారులతో కలిసి ‘చిన్నమ్మ’ శిబిరంలో చేరిపోయారు. శశికళ శిబిరంలో 122 మంది, పురచ్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుకుట్టి వెళ్లిపోవడంతో పన్నీరు సెల్వం శిబిరంలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం సీఎం పళనిస్వామికి కేంద్ర ప్రభుత్వం మద్దతు పెరుగుతుండడం, తమిళ మంత్రులకు కేంద్ర మంత్రులు ప్రాధాన్యతనిస్తుండటంతో పన్నీరు శిబిరంలోని ఎమ్మెల్యేలు ఆలోచనలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనకు హ్యాండిచ్చి అమ్మ శిబిరం వైపు కదిలే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. పన్నీరు శిబిరం నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలో అమ్మ శిబిరంలోకి రాబోతున్నారని ఆరుకుట్టి ప్రకటించారు. పోతే పోనీ: పన్నీరు ఆరుకుట్టి తమ శిబిరాన్ని వీడి వెళ్లడంపై పన్నీరు సెల్వం స్పందిస్తూ...‘తనంత తానుగా వచ్చారు.. ఆయనే వెళ్లారు.. పోతే పోనీ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్న వాళ్లనైనా దక్కించుకునే ప్రయత్నాల్లో పడి పార్టీ వర్గాలతో ఆదివారం మంతనాలు జరిపారు. ఈ మంతనాల్లో మెజారిటీ సభ్యులు పళని వర్గంతో మళ్లీ విలీన చర్చల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని ప్రకటించిన సమయంలో ఈ శిబిరంలోకి అడుగు పెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. దీంతో జంప్‌జిలానీల సంఖ్య పెరగడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. -
పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
-
పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం చెంతకు చేరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగిన తీరును పరిశీలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయలలిత మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కాగా పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకేలో ఇక ఆ రెండు వర్గాలేనా?
చెన్నై: జయలలిత మరణం తరువాత మూడు ముక్కలైన అన్నాడీఎంకే రెండుగా మారనుందా? ఇక ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు మాత్రమే మిగలనున్నాయా? అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిన్నమదురైలో ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పాండికోయిల్ సమీపంలోని అమ్మ మైదానంలో భారీ వేదికను నిర్మించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం మదురైకు వచ్చారు. అయితే పార్టీపరంగా జరపాల్సిన ఈ కార్యక్రమాలకు ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను ఎడపాడి దూరంగా పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీకి డబ్బును ఎరవేసి దినకరన్ జైలు పాలైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. అయితే బెయిల్‌పై బైటకు వచ్చిన తరువాత పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం కాగా దినకరన్‌ను దూరం పెట్టారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇందుకు తీవ్రంగా ఆగ్రహించారు. అంతేగాక మదురైలోనే పోటీగా మరో భారీ ఎత్తున ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎంజీఆర్ శత జయంతికి హాజరు కాకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తంగ తమిళ్‌సెల్వన్, బోస్ సభకు హాజరయ్యారు. దినకరన్ వర్గం ఎడపాడికి దాసోహమైందని కొందరు వ్యాఖ్యానించగా, ప్రభుత్వ కార్యక్రయం కావడంతో వచ్చామని వారు సమర్థించుకున్నారు. దినకరన్ పేరుతో పేరవై మరోవైపు దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించారు. 54 జిల్లాల నిర్వాహకులను నియమించి వారిని ఆయన స్వయంగా కలిశారు. 50 లక్షల మందిని పేరవైలో చేర్పించాలనేదే తమ లక్ష్యంగా భావిస్తున్నట్లు దినకరన్ తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లే ముందు దినకరన్, వెంకటేశ్‌లను పార్టీలో చేర్పించిన విషయం తెలిసిందే. దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. అయితే దినకరన్‌కు, ఎడపాడి వర్గాలకు ఘర్షణ ఏర్పడడంతో ఆయన పార్టీ నుంచి కొంత దూరమయ్యారు. హఠాత్తుగా దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించడం దానికి ఒకే రోజు 54 మంది జిల్లా నిర్వాహక కార్యదర్శులను నియమించిన సంఘటన అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది. -
ఏఐఏడీఎంకేలో విలీనం లేదు: పన్నీర్ సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల విలీనానికి ఇక ఎంతమాత్రం తావులేదని ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ వర్గ నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. మధురై జిల్లా ఉసిలంపట్టిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు ఉంటాయని అన్నారు. విలీనం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీని రద్దు చేసినందున ఇక ఆ ఆంశాన్ని పక్కనపెట్టేశామని తెలిపారు. శశికళ వర్గంలో చేరాలని తనకు రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు పన్నీర్‌వర్గ ఎమ్మెల్యే మనోహరన్ విరుదునగర్ జిల్లా రాజపాళయంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో తెలిపారు. -
దినకరన్ జోరు
► ఎడపాడి, పన్నీరు కంగారు ► శశికళతో రెండుగంటల ములాఖత్ సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ)లోని ఎమ్మెల్యేల తిరుగుబాటు ధోరణి సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీరును కంగారుపెడుతోంది. ప్రభుత్వం కూలిపోతుందని ఎడపాడి, అండగా ఉండి నిలబెట్టే అవకాశాలు నీరుగారిపోతున్నాయని పన్నీర్ ఆందోళనలో మునిగిపోయారు. టీటీవీ దినకరన్‌ను ఆయన వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం కలుసుకుని రహస్య చర్చలు జరపడం అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆలోచనలు రేకెత్తించింది. పార్టీ బాధ్యతలు చేపట్టాలని, కార్యాలయానికి వచ్చి క్రియాశీలకంగా వ్యవహరించాలని కొందరు ఎమ్మెల్యేలు దినకరన్‌ను పట్టుపడుతున్నారు. అయితే దినకరన్‌ను కట్టడి చేయడం ఎలాగని సీఎం ఎడపాడి అడపాదడపా పార్టీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఈ దశలో దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు తమ తరువాత ఎత్తు ఏమిటనే ఆలోచన చేసినట్లు సమాచారం. దినకరన్‌వైపు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుండగా వీరి సహాయంతో ఎడపాడి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై విశ్వాసపరీక్ష పెట్టించి సదరు 34 మంది వ్యతిరేక ఓటువేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. తన వైపున్న ఎమ్మెల్యేల బలంతో ఎడపాడి ప్రభుత్వాన్ని కాపాడడం అసాధ్యమని తెలుసుకున్న మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం కంగారుపడుతోంది. అంతేగాక అన్నాడీఎంకే రాజకీయాలు ఎడపాడి, దినకరన్‌ల చుట్టు మాత్రమే పరిభ్రమిస్తుండంతో తన వర్గాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమా అనే భయం పన్నీర్లో నెలకొంది. ఎడపాడి, దినకరన్ ప్రభుత్వం, పార్టీని పంచుకుంటే తనగతేమిటనే మీమాంశలో పన్నీర్ పడిపోయారని తెలుస్తోంది. అలాగే దినకరన్ తనవద్ద నున్న ఎమ్మెల్యేల బలంతో తనను పదవీచ్యుతుడిని చేస్తాడని ఎడపాడి సైతం భయపడుతున్నారు. దీంతో గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సాయంత్రం వేళ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. కాగా, గురువారం మధ్యాహ్నం దినకరన్ బెంగళూరు వెళ్లి శశికళతో రెండుగంటపాటు ములాఖత్ అయ్యారు. అన్నాడీఎంకేలో పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఎడపాడి వర్గం చేత బహిష్కరణకు గురైన శశికళ, దినకరన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే బెంగ అధికారపార్టీలో నెలకొంది. పన్నీర్‌సెల్వం విలీనం షరుతుల మేరకు శశికళ, దినకరన్‌లను బహిష్కరించినట్లు ప్రకటనతో సరిపెట్టిన ఎడపాడి వర్గం అ తరువాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ కారణంగా ఎడపాడి నిర్ణయాన్ని అనుమతించిన పన్నీర్ వర్గం విలీనంపై వెనక్కుతగ్గింది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఎడపాడి, దినకరన్ ప్రధానపాత్ర పోషిస్తుండగా, విలీనంపై బెట్టుచేయడం ద్వారా నష్టపోకుండా తన వర్గాన్ని నిలబెట్టుకునేందుకు పన్నీర్ ప్రయత్నాలు ప్రారంభించారు. -
అడ్డంగా దొరికిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. జయ మరణానంతరం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం, శశికళ,పళనిస్వామి వర్గాలు నడిపిన బేరసారాలు ఆలస్యంగా బయటపడ్డాయి. ఓ జాతీయ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు పన్నీర్ సెల్వం కోటి నగదు ఆఫర్ చేశారు. పళనిస్వామికి మద్దతిచ్చేందుకు శశికళ ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నగదుతో పాటు బంగారం ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకానొద దశలో ఒక్కో ఎమ్మెల్యేకు నాలుగు కోట్లు ఇచ్చేందుకు కూడా శశికళ సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిదక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ స్వయంగా కెమెరా సాక్షిగా చెప్పడం గమనార్హం. తనకు రూ.6 కోట్లు ఇస్తామన్నారని కెమెరా సాక్షిగా ఎమ్మెల్యే శరవణన్ పెదవి విప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తనియవరసు, కరుణసు, ఏకే బోస్‌లకు రూ.10 కోట్లు ముట్టాయని ఆయన వెల్లడించారు. కాగా అప్పట్లో కూవత్తూర్ గోల్డ్ బే రిసార్ట్స్ సాక్షిగా చిన్నమ్మ ...ఎమ్మెల్యేలతో క్యాంప్ నిర్వహించారు. ఆ శిబిరం నుంచి శరవణన్ మారువేషంలో తప్పించుకుని వచ్చారు. తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీఎం పదవికి పన్నీర్ సెల్వం అడ్డం తిరగడంతో మొదలైన తమిళ రాజకీయ సంక్షోభం చివరకు ప్రలోభాల వరకూ దారి తీయడం సంచలనం రేపుతోంది. పళనిస్వామి వర్గం ఇస్తామన్న నగదు ఇవ్వకపోవడం వల్లే ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శరవణన్ చెప్పిన విషయాలు వాస్తవమా, కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. -
ఆ పార్టీలో మూడు స్తంభాలాట!
♦ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ♦ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎడపాడి పాట్లు ♦ ఎడపాడి, దినకరన్, పన్నీర్‌సెల్వం వర్గాల పోరు సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ కనుసైగకు కట్టుబడి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన అన్నాడీఎంకే మూడు స్తంభాలాటలా మారింది. సీఎం ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్‌ల ఆధిపత్యపోరుతో పార్టీ అట్టుడికిపోతోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ముఖ్యమంత్రి కావాలన్న దినకరన్ కలలు ఫలించలేదు. పైగా తీహార్ జైలు జీవితం గడిపి బెయిల్‌పై వచ్చిన దినకరన్ అధికార పార్టీ నేతలపై తన రాజకీయకసిని ప్రదర్శిస్తున్నారు. ఎడపాడి ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ప్రధాన లక్ష్యంగా పావులుకదుపుతున్న దినకరన్ బుధవారం నాటికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టగలిగారు. శశికళే తమ ప్రధాన కార్యదర్శి అని మంత్రి రాజేంద్రబాలాజీ బుధవారం వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు దినకరన్‌కు మద్దతుగా సీఎంపై బహిరంగ విమర్శలు చేశారు. దినకరన్‌ను బహిష్కరించినట్లు ప్రకటించడం ద్వారా అన్నాడీఎంకేలో కల్లోలానికి మంత్రి జయకుమార్ ప్రధాన కారకుడని పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ ఆరోపించారు. ప్రజలకు, పార్టీకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరుగాక పుదుచ్చేరీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు జై కొడుతున్నారు. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడిన సీఎం ఎడపాడి తన ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దినకరన్‌ను తీవ్రంగా విభేదించే శశికళ తమ్ముడు దివాకరన్ను చేరదీయడం ద్వారా అతనివైపున్న మంత్రుల మద్దతు కూడగట్టగలిగారు. అంతేగాక ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు తన ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదని ఎడపాడి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే తనవంతు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పన్నీర్‌సెల్వంతో చేతులు కలపడం ద్వారా దినకరన్ ఢీకొట్టాలని సీఎం భావిస్తున్నారు. విలీనం చర్చలను మరోసారి ముందుకు తెచ్చారు. శశికళకు ఉద్వాసన పలికి సాధారణ సభ్యత్వం, దినకరన్ బహిష్కరణ, శశికళ తీసుకున్న నిర్ణయాలు రద్దు, వేటుపడిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం, పన్నీర్‌సెల్వంకు పార్టీ పగ్గాలు, సీఎంగా ఎడపాడి కొనసాగడం వంటి కొత్త ఒప్పందాలకు ఇరువర్గాలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే జయలలిత మరణంపై న్యాయవిచారణకు ఆదేశించాలన్న పన్నీర్‌వర్గం డిమాండ్‌పై ఇంకా స్పష్టత లేదు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం, దినకరన్‌ల మధ్య మూడు స్తంభాలాటలా సాగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ జోక్యం వల్లనే అన్నాడీఎంకే మూడు ముక్కలైందని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ విమర్శించగా, మెజార్టీ ఎమ్మెల్యేల బలం కోల్పోయిన సీఎం ఎడపాడి రాజీనామా చేయాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ అన్నారు. దినకరన్‌ను కలుసుకున్న నటి విజయశాంతి: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపుకోసం ప్రచారం చేసిన నటి విజయశాంతి బుధవారం చెన్నైకి వచ్చి ఆయన్ను కలుసుకున్నారు. దినకరన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. -
పన్నీర్ సెల్వానికి కేరళ వైద్యం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరుసెల్వం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కోయంబత్తూరు వెళ్లారు. గురువారం పన్నీరుసెల్వంకు ఆయుర్వేద వైద్యులు పరీక్షలు చేసి, చికిత్స మొదలెట్టారు. నాలుగు రోజులపాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. కాగా కోయంబత్తూరులోని ఆర్య ఆస్పత్రి కేరళ వైద్యానికి ప్రసిద్ధి చెందింది. అక్కడ మూలికలతో కూడిన వైద్యం అందిస్తుంటారు. అయితే, కేరళ ఆయుర్వేద వైద్యం చేసుకోవాలనే పన్నీరు ఆస్పత్రిలో చేరినట్టు, ఆయనకు ఎలాంటి సమస్య లేదని పురట్చి తలైవి శిబిరం వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు రోజుల పాటు ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోనే ఉంటారని చెప్పారు. -
కలకలం సృష్టించిన పన్నీర్ సెల్వం ట్వీట్
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురచ్చి తలైవీ(అమ్మ) అన్నాడీఎంకే పార్టీ నేత పన్నీర్ సెల్వం ఒక్క ట్వీట్‌తో కలకలం సృష్టించారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని ట్వీట్ చేసి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించి అనంతరం ఆ ట్వీట్‌ను తొలగించారు. ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది తర్వాత చెప్తామంటూ సవరణ చేసి మరో ట్వీట్లో స్పష్టతనిచ్చారు. ‘స్థానిక ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత మేం బీజేపీతో పొత్తు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని పన్నీర్ సెల్వం తరుపున ట్వీట్లు చేసే ఆయన కార్యాలయం ఒక ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ బయటకు రాగానే తమిళనాడులో విస్తృత చర్చ మొదలైంది. అసలు ఏం జరుగుతోందంటూ తమిళనాడులో ప్రతి ఒక్కరు స్పందించడం మొదలుపెట్టారు. ఒక రకంగా సెల్వానికి వ్యతిరేకంగానే ప్రతిస్పందనలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయన టీం వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించి పరిస్థితులకు తగినట్లుగా స్థానిక ఎన్నికల తేదీలు విడుదల చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని, అది ఏ పార్టీతో ఉంటుందనే విషయం స్పష్టం చేయలేమని చెప్పారు. -
మిస్టరీ తేల్చాల్సిందే!
♦ తేనంపేటలో న్యాయవాది పుగలేంది ఫిర్యాదు ♦ జయ మృతిపై 186 మందిపై అనుమానాలు ♦ జాబితాలో పన్నీరు, శశికళ పేర్లు ♦ కేంద్ర, రాష్ట్ర హోంశాఖలకు కూడా సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీని ఛేదిం చాల్సిందేనని పట్టుబడుతూ ఎంజీఆర్ నగర్‌కు చెందిన న్యాయవాది పుగలేంది తేనాంపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. చిన్నమ్మ శశికళ, మాజీ సీఎం పన్నీరుసెల్వంతోపాటు 186 మందిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఓ జాబితాను ఫిర్యాదుకు జత పరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, డీజీపీలకు సైతం ఫిర్యాదు చేశారు. తమిళుల అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం రాష్ట్రంలో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అమ్మ నమ్మిన బంటు పన్నీ రుసెల్వం సైతం అనుమానం వ్యక్తం చేయడంతో ఆ ప్రచారానికి బలం చేకూ రింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని పన్నీరు శిబిరం పట్టుబడుతూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా విచారణ జరిపించి తీరుతామన్న వ్యాఖ్యలను డీఎంకే వర్గాలు చేస్తూ వస్తున్నాయి. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో న్యాయవాది పుగలేంది శనివారం తేనాంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మళ్లీ అమ్మ మరణం మిస్టరీ నినాదం తెర మీదకు వచ్చింది. ఈ ఫిర్యాదులో 186 మంది పేర్లను చేర్చడం గమనార్హం. దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోం శాఖలకు, రాష్ట్ర డీజీపీకి సైతం ఆయన పంపించారు. మిస్టరీ తేల్చాల్సిందే: న్యాయవాది పుగలేంది తేనాంపేట ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అందులో... అమ్మ ఆస్పత్రి పాలు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే వర్గాలు స్పందిస్తూ వచ్చిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఆరోగ్యంగా తమ సీఎం ఉన్నారని ప్రజలందరూ భావిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే, డిసెంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి జయలలిత ఇక లేదని ప్రకటించడం తమిళ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి చేసిందని గుర్తు చేశారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి సీఎంగా పన్నీరుసెల్వం కొనసాగినట్టు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి ఏడో తేదీ వరకు ఎనిమిదిన్నర గంటల సమయంలో జయలలిత సమాధి వద్ద పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అనుమానాలు రేపినట్టు గుర్తు చేశారు. అమ్మ మరణంలో మిస్టరీ ఉందని, ఆయన సంధించిన వ్యాఖ్యల్లో ఆమె నెచ్చలి శశికళ కుటుంబం చుట్టూ అనుమానాలు బయలు దేరినట్టు వివరించారు. ఇందుకు సమాధానం ఇచ్చే రీతిలో ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా పన్నీరు మీద నిందల్ని వేశారని గుర్తు చేశారు. జరిగిన, జరుగుతున్న ఘటనలు, సాగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, జయలలిత హత్యకు గురయ్యారా? అన్న అనుమానాలు బయలు దేరాయని, రాజకీయ స్వలాభం కోసం ఉమ్మడిగా కుట్ర జరిగినట్టు తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎంను పథకం ప్రకారం మట్టుబెట్టి , సహజమరణంగా చిత్రీకరించినట్టుగా అనుమానాలకు బలం చేకూరుతున్నట్టుగా తాజా పరిణామాలు ఉన్నాయన్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళ, అన్నాడీఎంకేకు చెందిన 127 మంది ఎమ్మెల్యేలు, అన్వర్ రాజా, సెంగొట్టవన్, గోపాలకృష్ణన్, జనార్దన్, వనరోజ, ఎస్ఆర్ విజయభాస్కర్ తదితర 37 మంది పార్లమెంట్ సభ్యులు, ముత్తుకరుప్పన్, సెల్వరాజ్, విజిలా సత్యనాంద్, నవనీతకృష్ణన్, వైద్యలింగం, ఎస్ఆర్ బాలసుబ్రమణియన్ తదితర 11 మంది రాజ్య సభ సభ్యులు, అన్నాడీఎంకే నేతలు పొన్నయ్యన్, మధుసూదనన్, బన్రూటి రామచంద్రన్, వలర్మతి, గోకుల ఇందిర, సీఆర్ సర్వతిలతో పాటు అపోలో ఆస్పత్రి డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, ఆయన కుమార్తె సంగీత రెడ్డిల మీద అనుమానాలు ఉన్నాయని, జయలలిత మరణం గురించి వీళ్లందరికీ తప్పకుండా తెలిసి ఉంటుందని, అందుకే మిస్టరీ ఛేదింపునకు విచారణ జరిపించాల్సిందేనని పట్టుబట్టే పనిలో పడ్డారు. పలు సమస్యలపై మీద తరచూ కోర్టుల్లో పిటిషన్లు వేయడంలో పుగలేంది ముందున్న విషయం తెలిసిందే. తాజా ఫిర్యాదు మీద పోలీసులు స్పందించని పక్షంలో, 186 మంది పేర్లతో కూడిన పిటిషన్‌ను మరికొద్ది రోజుల్లో కోర్టులో వేసినా వేయవచ్చు. -
మళ్లీ తెరపైకి పన్నీర్ సెల్వం
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (అమ్మ వర్గం) నేత ఓ. పన్నీర్ సెల్వం మరోసారి తెర ముందుకు వచ్చారు. ఢిల్లీ వేదికగా శశికళ వర్గంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో ఎడపాడి పళనిస్వామి పాలన చెల్లదని స్పష్టం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా శశికళ నియమించినందున ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. పార్టీ బాధ్యతలను తాను మాత్రమే నిర్వహించగలనని చెప్పారు. పార్టీ చిహ్నం రెండాకుల కోసం ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న నోటుకు ఓటు అంశాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళతామన్నారు. ఉప ఎన్నికల్లో రూ. 89 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరు వెల్లడించాక ఎవరికీ మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తామంతా చర్చించుకుని నిర్ణయానికి వస్తామని పన్నీర్ సెల్వం తెలిపారు. తన చీలిక వర్గాన్ని శశికళ వర్గంలో కలిపేందుకు పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన ఢిల్లీ బాట పట్టినట్టుగా కనిపిస్తోంది. -
ధర్మ యుద్ధానికి ఆద్యుడెవరో తెలుసా ?
టీనగర్: జయలలిత ద్వారా రెండు సార్లు ముఖ్యమంత్రిగా నియమించబడిన తనకు ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు పేర్కొంటున్న జయకుమార్‌కు ఇంతటి అహంకారం పనికిరాదని మాజీ సీఎం పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. దిండుగల్ జిల్లా, అన్నాడీఎంకే పురట్చి తలైవి ఎంజీఆర్ శతజయంతి ఉత్సవం, కార్యకర్తల సమావేశం దిండుగల్ బస్టాండ్ సమీపంలోగల స్పెన్సర్ కాంపౌండ్‌లో జరిగింది. మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, మాజీ మంత్రులు పొన్నయన్, సెమ్మలై, కేపీ మునుసామి, కె.పాండ్యరాజన్, పీహెచ్ పాండియన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ ఎంజీఆర్ మృతి తర్వాత జయలలిత ఒకటిన్నర కోటిమంది కార్యకర్తలు కలిగిన కంచుకోటగా అన్నాడీఎంకేను మార్చారన్నారు. ఆమె మృతి తర్వాత అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ వర్గం ప్రయత్నించడంతో తాము ధర్మయుద్ధాన్ని ప్రారంభించామన్నారు. ఈ ధర్మయుద్ధానికి ఆద్యుడు మాజీ మంత్రి మునుసామి అని తెలిపారు. జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరపాల్సిందిగా అనేక సార్లు కోరామని, అయితే ఎడపాడి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఇందుకు సమ్మతం తెలపకుండా అనేక నాటకాలు ఆడుతున్నట్లు విమర్శించారు. -
మాతోనే భవిష్యత్తు
ఎడపాడికి పన్నీర్ వార్నింగ్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న ఎంపీ మైత్రేయన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలోని చీలికవర్గాల మధ్య రాజకీయం రసకందాయంలో పడింది. తమతో కలవకుంటే రాజకీయ ప్రమాదం తప్పదని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సీఎం ఎడపాడికి శనివారం అల్టిమేటం ఇచ్చారు. అలాగే పన్నీర్‌వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు మైత్రేయన్ సైతం ఎడపాడి ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభ మైందని వ్యాఖ్యానించారు. ఇరువురు నేతలు వేర్వేరు కార్యక్రమాల్లో ఎడపాడి ప్రభుత్వానికి ఒకేరకమైన హెచ్చరికలు జారీచేయడం గమనార్హం. జయలలిత మరణం తరువాత రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే నేతలు ఇటీవల మళ్లీ ఏకమయ్యే ప్రయత్నాలు చేశారు. విడిపోవడం వల్ల రెండాకుల చిహ్నం చేజారిపోతుందని కారణంతో రాజీబాట పట్టారు. అయితే అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ల శాశ్వత బహిష్కరణ, అమ్మ మరణంపై సీబీఐ విచారణ డిమాండ్లకు అంగీకరిస్తేనే విలీనానికి సిద్దం అవుతామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం షరతు విధించింది. ఈ షరతులకు ఎడపాడి వర్గం తలొగ్గక పోవడంతో విలీనానికి బ్రేకు పడింది. రాజీ చర్చల అంశం దాదాపుగా తెరమరుగై పోయింది. ఈ దశలో శనివారం సేలంలో జరిగిన అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ) సభలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంను కాపాడుకునేందుకు తాము ముందుకు వచ్చినా దినకరన్‌ను బహిష్కరించినట్లు ఎడపాడి వర్గం కపటనాటకం అడిందని విమర్శించారు. అలాగే మంత్రులు సైతం లేనిపోని విమర్శలతో మోకాలడ్డారని అన్నారు. శశికళ కుటుంబం చేతిలో పార్టీ, ప్రభుత్వం ఉండడంపై తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు కట్టుబడి ఉన్న తమతో చేరకుంటే రాజకీయ భవిష్యత్తు లేదని ఎడపాడి వర్గం గుర్తించాలని పన్నీర్‌సెల్వం హెచ్చరించారు. మంత్రుల అవినీతి, అసమర్ద పాలన, ప్రజావ్యతిరేకతతో ప్రభుత్వం కూలిపోతే తాము బాధ్యులం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఉంగళుక్కాగ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సునీల్ అధ్వర్యంలో చెన్నై పనగల్‌పార్కు వద్ద శనివారం ఏర్పాటు చేసిన సేవా శిబిరాన్ని ప్రారంభించిన మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ, అవినీతి మంత్రులతో కూడిన ఎడపాడి ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూల్చాల్సిన అవసరం లేదు, తనకు తానే కూలిపోతుందని వ్యాఖ్యానించారు. రెండాకుల చిహ్నంపై ఈసీ వద్ద ఇరువర్గాల వాదనలను పూర్తయ్యాయి, త్వరలో ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, రెండాకుల చిహ్నం తమకే దక్కుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఎడపాడి వైపు 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంలో తమకు ఎలాంటి చింతలేదు, మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలే ప్రభుత్వాన్ని కూల్చివేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎడపాడి ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, తాము జయించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
అతను శశికళ బినామీ
► సీఎం ఎడపాడిపై పన్నీర్ సెల్వం తీవ్ర ఆరోపణలు టీనగర్: ‘శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి’ అంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలతో అన్నాడీఎంకే విలీనం చర్చలకు ఎలాంటి సూచనలు కనిపించకుండా పోయాయి. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం కాంచీపురం ఈస్ట్ జిల్లా కార్యకర్తల సమీక్షా సమావేశం కొట్టివాక్కం వైఎంసీఏ మైదానంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న పన్నీర్ సెల్వం మాట్లాడుతూ కాంచీపురం జిల్లాలో ధర్మయుద్ధం మొదటి సమావేశం ప్రారంభించామన్నారు. తాము తలపెట్టిన ఈ ధర్మయుద్ధానికి రాష్ట్ర ప్రజలు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. సుమారు 74 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకుంటారని భావించామని, అయితే ఆమె మరణించిన వార్త ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ప్రపంచ తమిళుల గుండెల్లో కలత రేకెత్తించిందన్నారు. ఆమెను కాపాడుకోలేకపోయామన్న ఆవేదన ఉందని, జయ మృతి మర్మం చిక్కుముడిని విప్పేందుకే ఈ ధర్మయుద్ధమని ఆయన పేర్కొన్నారు. దీని కోసమే సీబీఐ విచారణ కోరుతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీగా ఉండాలంటూ ఎంజీఆర్, జయలలిత లక్ష్యం ఏర్పాటుచేసుకున్నారని, అలాంటి పార్టీ ఒక కుటుంబం గుప్పిట్లోకి వెళ్లకూడదని చెప్పారు. ప్రస్తుతం సీఎం ఎడపాడి పళనిస్వామి వేరొక మార్గంలో పయనిస్తున్నారని, ఇంకా ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ ఉన్నారన్నారు. ప్రజలు మోసపోయారని, శశికళ వర్గం కపట నాటకంగా గ్రహించగలరని తెలిపారు. శశికళ బినామీ ఎడపాడి పళనిస్వామి అని, తమరు ఎవరి పిడికిట్లో ఉంటూ పాలన సాగిస్తున్నారో అక్కడి నుంచి బయటికి రావాలని కోరారు. స్థానిక ఎన్నికలకు మునుపే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేందుకు అవకాశాలున్నాయని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యకర్తలు సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంకు కాంచీపురం ఈస్ట్ జిల్లా జయలలిత పేరవై మాజీ కార్యదర్శి పెరుంబాక్కం రాజశేఖర్ వెండి కరవాలాన్ని బహూకరించారు. మాజీ ఎమ్మెల్యే వీఎన్‌పీ వెంకట్రామన్ నిలువెత్తు రాజదండం అందజేశారు. కార్యక్రమంలో సైదై ఎంఎం బాబు సహా పలువురు పాల్గొన్నారు. ఇదిలావుండగా త్వరలో ఎన్నికలు వస్తాయంటూ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రులు జయకుమార్, దిండుగల్ శ్రీనివాసన్ ఎద్దేవా చేశారు. -
'రూటు' మార్చిన పన్నీరు సెల్వం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రజలకు చేరువయ్యేందుకు యాత్ర చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన తమిళనాడు యాత్రను ప్రారంభించారు. నెల రోజుల పాటు రోడ్డు మార్గం ద్వారా పన్నీరు తమిళనాడులో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ర్యాలీలలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రజలతోనూ, పార్టీ కార్యకర్తలను కలుస్తారు. జయలలిత మరణించాక అన్నాడీఎంకే రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. శశికళను వ్యతిరేకించిన పన్నీరు వేరు కుంపటి పెట్టుకున్నారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళ తన నమ్మినబంటు పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పన్నీరు వ్యతిరేకించినా ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శశికళ మేనల్లుడు దినకరన్.. ఈసీ అధికారికి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టయ్యారు. పళని, పన్నీరు వర్గాలు విలీనమయ్యేందుకు చర్చల ప్రతిపాదనకు తెరపైకి తెచ్చాయి. విలీన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా రకరకాలు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు పన్నీరు రూటు మార్చి యాత్రకు బయల్దేరారు. మళ్లీ తమిళనాడు సీఎం కావడమే లక్ష్యంగా పన్నీరు పావులు కదుపుతున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రజల మద్దతు కూడగట్టడంతో పాటు జయలలిత మృతిపై విచారణ చేయించాలన్న డిమాండ్‌ను ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంది. పార్టీ నుంచి శశికళ వర్గాన్ని దూరం చేసేలా పన్నీరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. -
విలీనం అనుమానమే!
⇔ మద్దతుదారులతో పన్నీరు మంతనాలు ⇔ ఆ రెండు డిమాండ్ల మీద పట్టు ⇔ నాన్చుడు వద్దు అని మంత్రి జయకుమార్ ఆగ్రహం ⇔ సేలంలో సీఎం సమాలోచన సీఎం పళని, మాజీ సీఎం పన్నీరు శిబిరాల విలీనం అనుమానంగా మారింది. మద్దతుదారులతో పన్నీరు సెల్వం శనివారం సుదీర్ఘ మంతనాల్లో మునిగారు. శశికళ, దినకరన్‌లకు శాస్వత ఉద్వాసన, అమ్మ మరణం మిస్టరీ ఛేదింపునకు న్యాయ విచారణకు పట్టుబడుతూ, అవి నెరవేరే వరకు చర్చలకు వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు. పన్నీరు శిబిరం నాన్చుడు ధోరణి సాగించడాన్ని మంత్రి జయకుమార్ తీవ్రంగా ఖండించారు. వస్తే, వస్తాం...లేదంటే ...అంటూ ఏదో ఒక విషయాన్ని తెల్చాలని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే(అమ్మ) శిబిరంలో మమేకం అయ్యేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరం నిర్ణయించిన విషయం తెలిసిందే. తమ షరతులకు తలొగ్గినప్పుడే చర్చలు అన్న అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇందుకు తగ్గట్టుగా అమ్మ శిబిరానికి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న సీఎం పళనిస్వామి అడుగులు సాగుతూ వస్తున్నాయి. చర్చలు నిమిత్తం ఒకే వేదిక మీదకు వచ్చే సమయంలో ఏదో ఒక అడ్డంకితో వాయిదాల పర్వం సాగింది. గత వారం ఇరు వర్గాల మధ్య బయలు దేరిన మాటల తూటాలతో ఇక చర్చలకు స్వస్తి పలికినట్టే అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆ మరుసటి రోజే ఎవరో ఒక్కరు తగ్గడం, తదుపరి రహస్యంగా మంతనాలు సాగడం చోటు చేసుకున్నాయి. రహస్యమంతనాల్లో పన్నీరు శిబిరానికి పళని శిబిరం ఆఫర్లు ఇచ్చినా వాటిని ఖాతరు చేయలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో అమ్మ శిబిరంతో విలీనం వద్దే వద్దన్న నినాదం సేలం వేదికగా బయలు దేరడంతో పన్నీరు డైలమాలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరిస్థితులు తమకు అనుకూలంగానే మున్ముందు ఉంటాయన్న భావనతో పన్నీరు మద్దతు దారులు ఆ వ్యాఖ్యలు అందుకున్నా, అందరి అభిప్రాయ సేకరణలో మాజీ సీఎం నిమగ్నమయ్యారు. మంతనాలు : విలీనం వద్దే వద్దంటూ బయలు దేరిన నినాదాన్ని పరిగణించి మద్దతుదారులతో పన్నీరు శనివారం మంతనాల్లో మునిగారు. చర్చలకు వెళ్దామా? వద్దా అన్నది తేల్చే రీతిలో ఈ మంతనాలు సాగాయి. ఆ శిబిరానికి చెందిన కేపీ మునుస్వామి, మధుసూదనన్, నత్తం విశ్వనాథన్, పాండియరాజన్, పొన్నయ్యన్, సెమ్మలై, మనోజ్ పాండియన్, మైత్రేయన్ నేతలతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, తదుపరి సాయంత్రం పన్నీరు సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నీరు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విషయాన్ని తేల్చుతారని భావించినా, చివరకు ఆ శిబిరం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు డిమాండ్లే తమకు ముఖ్యం అని, వాటిని నెరవేర్చని తదుపరి చర్చల గురించి ఆలోచిద్దామని స్పందించడం గమనార్హం. ఇక, పొన్నయ్యన్ మాట్లాడుతూ తమను చర్చలకు పిలిపించి, లోపల శశికళ, దినకరన్‌లకు మద్దతుగా ప్రమాణ పత్రంలో సంతకాలు ఎందుకు చేయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పాండియరాజన్ పేర్కొంటూ, తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే, ప్రమాణ పత్రంలో సంతకాలు ఎందుకు తీసుకున్నారో బయట పెట్టాలని పళని శిబిరాన్ని ప్రశ్నించడంతో, విలీనం ఇక డౌటేనన్నది స్పష్టం అవుతోంది. అయితే, తాజాగా పన్నీరు శిబిరం స్పందన మేరకు ఆదివారం పళని శిబిరం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో, ఇక ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ఉదయాన్నే మీడియా కదిలించగా, నాన్చుడు ధోరణి మంచి పద్ధతి కాదని విమర్శించారు. విలీనం చర్చలువద్దే వద్దంటూ సేలంలో బయలు దేరిన నినాదం, పన్నీరు గళమా...? లేదా అక్కడి నేతల నినాదమా అన్నది స్పష్టం చేయాలన్నారు. ఎవరు వచ్చినా రాకున్నా, తమ ప్రభుత్వం మరో నాలుగేళ్లు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం పళనిస్వామి సేలంలో పార్టీ వర్గాలతో విలీన చర్చల విషయంగా సమావేశం కావడం గమనార్హం. ఇక, ఈ విలీనం ఓ హైడ్రామా అని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. కమలం పెద్దల కనుసనల్లో ఈ డ్రామా సాగుతోందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టడం, విలీనం అంటూ, చర్చలు అంటూ కాలాన్ని నెట్టుకు రావడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఐటీ దాడులు, ఈడీ విచారణలు, రంగంలోకి ఢిల్లీ పోలీసులు, సీబీఐ ఇలా, అన్నీ కేంద్రం బెదిరింపుల వ్యవహారాల్లో భాగమేనని పేర్కొన్నారు. అయితే, స్టాలిన్ వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఖండించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అధికారం చేజిక్కంచుకోవడం లక్ష్యంగా స్టాలిన్ కుట్రలు చేస్తూ, నిందల్ని తమ మీద నెడుతున్నారని మండిపడ్డారు. -
ష్..అంతా రహస్యం!
♦ ఎవ్వరూ నోరు మెదపొద్దు.. సెంగోట్టయన్ హెచ్చరిక ♦ సీఎంగా పళని కొనసాగింపు నేతృత్వానికి ప్రత్యేక కమిటీ ♦ రహస్య మంతనాల్లో కొత్త అంశం ♦ 28 మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం ♦ పలువురు చిన్నమ్మకు మద్దతుగా గళం సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే విలీన చర్చల అంశాల్ని రహస్యంగా ఉంచేందుకు పళని, పన్నీరు శిబిరాలు నిర్ణయించాయి. కమిటీలకు నేతృత్వం వహించే వాళ్లు తప్ప, ఇతరులు ఎవ్వరూ నోరు మెదపకూడదన్న హుకుంను తమ శిబిరాల్లోని నాయకులకు జారీ చేశారు. రెండో రోజుగా సాగిన రహస్య మంతనాల్లో ఇరు శిబిరాలు ఈ మేరకు నిర్ణయంతో పాటు ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి ముందుకు సాగే పనిలో పడ్డట్టున్నాయి. ఇక, 28 మంది ఎస్పీ, ఎస్టీ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టినట్టుగా మరో చోట రహస్య మంతనాల్లో మునగడం పళని శిబిరంలో కలవరాన్ని రేపింది. అన్నాడీఎంకేలోకి సీఎం పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు శిబిరాలు ఏకం అయ్యేందుకు సాగుతున్న రహస్య ప్రయత్నాల గురించి తెలిసిందే. పన్నీరు శిబిరం నుంచి మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళని శిబిరం నుంచి ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్టయన్ నగరంలోని ఓ హోటల్ వేదికగా బుధవారం రాత్రి కూడా చర్చల్లో మునిగారు. ఇరు శిబిరాలు తమ డిమాండ్ల మీద దృష్టి పెడుతూ, పదవుల పందేరం విషయంలో మాత్రం ఆచితూచి స్పందించే పనిలో పడ్డట్టున్నాయి. అలాగే, సీఎంగా పళని స్వామిని కొనసాగిస్తూనే, రిమోట్ కంట్రోల్ మాత్రం ఓ కమిటీ గుప్పెట్లోకి తీసుకొచ్చే అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీరుసెల్వం వ్యవహరించే విధంగా, ఇరు శిబిరాలకు చెందిన ఐదుగురు లేదా ఏడుగురిని ఈ కమిటీ సభ్యులుగా ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీని, ప్రభుత్వాన్ని ఈ కమిటీ నడిపించే విధంగా ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేసుకుందామన్న అభిప్రాయాల్ని పళని శిబిరం పన్నీరు శిబిరం దృష్టికి తీసుకెళ్లింది. సమస్యలన్నీ కుదుటపడ్డాక, పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి, మెజారిటీ శాతం నిర్ణయం మేరకు తదుపరి అడుగులు వేద్దామన్న ఒడంబడికతో ముందుకు సాగుదామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్వ సభ్య సమావేశం సాగే వరకు పార్టీలోని పదవుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు వద్దన్న వాదనను పళని శిబిరం తెరమీదకు తీసుకు రాగా, ఆలోచిద్దామని పన్నీరు శిబిరం దాట వేసినట్టు సమాచారం. ఇక, పన్నీరు శిబిరానికి చెందిన పాండియరాజన్, సెమ్మలైలకు మంత్రి పదవి అప్పగించడంతో పాటు సామరస్య పూర్వకంగా వ్యవహారాలన్నీ సాగాలంటే, మార్గదర్శక కమిటీతో ముందుకు సాగడమే మంచిదన్న నిర్ణయాన్ని పళని శిబిరం స్పష్టం చేసినట్టుంది. అలాగే, కమిటీలో ఉన్న ముఖ్యులు తప్ప, మరెవ్వరూ చర్చల ప్రస్తావన మీడియా ముందుకు తీసుకురాకూడదన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టుంది. అందుకే కాబోలు గురువారం ఉదయాన్నే మీడియా ముందుకు వచ్చిన మంత్రి సెంగోట్టయన్, విలీన చర్చల విషయంగా పార్టీ వర్గాలు ఎవ్వరూ నోరు మెదిపేందుకు వీలులేదని, అనవసర గందరగోళం సృష్టించే విధంగా వ్యవహరించవద్దని హెచ్చరించడం గమనార్హం. ఎవరికి వారు వ్యాఖ్యలు పేల్చడంతో చర్చల్లో జాప్యం తప్పడం లేదని, ఇక ఏ విషయమైనా కమిటీకి నేతృత్వం వహించే వాళ్లే ప్రకటిస్తారని వ్యాఖ్యానించారు. ఈ హుకుంతో పళని శిబిరానికి చెందిన ఎంపీ తంబిదురై, మంత్రి సీవీ షణ్ముగంలను మీడియా ప్రశ్నించగా, మున్ముందు పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయని స్పందించడం గమనార్హం. అలాగే, మంత్రి జయకుమార్‌ను కదిలించగా, తలుపులు తెరిచే ఉన్నాయని, చర్చలు ఎప్పుడైనా సాగవచ్చని ముందుకు సాగారు. పళని శిబిరానికి చెందిన పాండియరాజన్‌ను కదిలించగా, డిమాండ్లు నెర వేరగానే ఒకే వేదికగా చర్చలు ఉంటాయని, అన్నీ కమిటీ పెద్ద మునుస్వామి చూసుకుంటారని స్పందించారు. చిన్నమ్మకు మద్దతుగా : పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మూడో రోజుగా 17 జిల్లాల కార్యదర్శులతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీలో పలువురు చిన్నమ్మ శశికళకు మద్దతుగా స్పందించడంతో షాక్‌కు గురికాక తప్పలేదట. ఒకరిద్దరు జిల్లాల కార్యదర్శులు అయితే, దినకరన్‌కు మద్దతుగా తమ గళాన్ని వినిపించగా, మరి కొందరు పన్నీరు అస్సలు పార్టీకి అవసరమా అని పెదవి విప్పినట్టు అన్నాడీఎంకే కార్యాలయంలో చర్చ సాగుతోంది. కొత్త నినాదం : విలీన రహస్య మంతనాలు, పార్టీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణలు జోరందుకుంటున్న వేళ అమ్మ శిబిరానికి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశ పెట్టడం సీఎం పళనిస్వామికి మరోషాక్కే. అన్నాడీఎంకేలో 33 మంది ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యం, వాసుదేవనల్లూరు ఎమ్మెల్యే మనోహరన్, ఉత్తంకరై ఎమ్మెల్యే మనోరంజితం పన్నీరు శిబిరంలో ఉన్నారు. మిగిలిన 30 మంది అమ్మ శిబిరం వెన్నంటి ఉన్నారు. ఇందులో సరోజ, బెంజమిన్, రాజలక్ష్మి మంత్రులుగా పదవుల్లో ఉన్నారు. అయితే, తమ సామాజిక వర్గానికి మంత్రి, ఇతర పదువుల్లోని స్థానాల సంఖ్యను పెంచాలని నినదిస్తూ ప్రత్యేక సమావేశం చెన్నైలో పెట్టి ఉండడం గమనార్హం. ఇందులో స్పీకర్, ఓ మంత్రి మినహా తక్కిన 28 మంది హాజరైనట్టు సమాచారం. అర్ధరాత్రి వరకు ఈ మంతనాలు సాగి ఉండడంతో మున్ముందు ఈ ఎమ్మెల్యేలు అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. -
పళని, పన్నీరు మధ్య రాజీ కుదిరిందా?
చెన్నై: అన్నా డీఎంకేలో రెండు వర్గాల మధ్య విలీన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయా? తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల మధ్య రాజీ కుదిరిందా? ఈ రెండు గ్రూపులు త్వరలో విలీనం కానున్నాయా? అంటే అవుననే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్ట్ అయ్యే వరకు ఆగాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. పళని స్వామి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేలా, పన్నీరు సెల్వానికి పార్టీ పగ్గాలు అప్పగించేలా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా దినకరన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత ఇరు వర్గాల మధ్య అధికారికంగా చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. పార్టీ గుర్తు 'రెండాకులు' కో్సం ఈసీకి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా దినకరన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి శశికళ, దినకరన్‌లను బహిష్కరించడంతో పాటు జయలలిత మృతిపై విచారణకు అంగీకరిస్తేనే విలీన చర్చలు జరుపుతామని సోమవారం వరకు పన్నీరు సెల్వం వర్గీయులు చెప్పారు. అలాగే పన్నీరుకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. తాజాగా పన్నీరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారని, పళని సీఎంగా కొనసాగుతారని, దినకరన్ అరెస్ట్ అయిన తర్వాత రెండు వర్గాలు విలీనమవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
వెనక్కు తగ్గని పన్నీరు.. వెనుక ఎవరున్నారు?
-
వెనక్కు తగ్గని పన్నీరు.. వెనుక ఎవరున్నారు?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముందు ఉంచిన డిమాండ్ల విషయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వెనక్కు తగ్గడం లేదు. అన్నా డీఎంకే రెండు గ్రూపులు విలీనం కావాలంటే పార్టీ నుంచి శశికళను, దినకరన్‌ను బహిష్కరించాల్సిందేనని, జయలలిత మృతిపై విచారణ చేయించాలని పన్నీరు వర్గం మరోసారి స్పష్టం చేసింది. అప్పటి వరకు చర్చల ప్రసక్తేలేదని చెప్పింది. దీంతో అన్నాడీఎంకే రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. మరోవైపు శశికళకు అనుకూలమైన సీఎం పళనిస్వామి వర్గం భిన్నస్వరాలు వినిపిస్తోంది. సోమవారం పన్నీరు సెల్వం వర్గంలో ఉన్న ఎంపీ మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ.. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించి మన్నార్గుడి మాఫియా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. జయలలిత మరణం తదనంతర పరిణామాల్లో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. శశికళ సారథ్యంలో ఏఐఏడీఎంకే (అమ్మ), పన్నీరు సెల్వం వర్గం ఏఐఏడీఎంకే పురచ్చి తలైవి అమ్మ పేర్లతో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. రెండు వర్గాలు విలీనం కావాలంటే పైరెండు డిమాండ్లతో పాటు ముఖ్యమంత్రి పదవిని పన్నీరుకు ఇవ్వాలనే మరో డిమాండ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీ పదవి, మంత్రుల పదవులపైనా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. సీఎం పళనిస్వామి వర్గంలో 120 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీరు సెల్వం వైపు కేవలం 12 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో పన్నీరు వర్గం వ్యతిరేకించినా పళనిస్వామి నెగ్గారు. తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పన్నీరు వర్గం విలీనం చర్చల పేరుతో పళనిస్వామికి డిమాండ్లు పెడుతూ చుక్కలు చూపిస్తోంది. పన్నీరు డిమాండ్లను అంగీకరించేందుకు పళని వర్గం విముఖత చూపుతోంది. అమ్మ మరణంపై తమకు ఎలాంటి సందేహం లేదని, అలాంటపుడు విచారణ ఎందుకని వాదిస్తోంది. అంతేగాక సీఎంగా పన్నీరు ఉన్నప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నీరు వర్గీయులు సీఎం పళనిస్వామికి హెచ్చరికలు చేసేలా మాట్లాడుతుండటంతో వారి వెనుక ఎవరున్నారన్నది తమిళ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీనే పన్నీరుకు మద్దతు ఇస్తూ నడిపిస్తోందని దినకరన్ చెప్పినట్టుగా పళని వర్గీయులు చెబుతున్నారు. పళని స్వామి వెంట ఉంటే దినకరన్ విషయంలో మాదిరిగా తమను అవినీతి కేసుల్లో ఇరికిస్తారని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లగా, ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మూడు రోజులుగా ఆయన్ను విచారిస్తున్నారు. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని బీజేపీ చెబుతోంది. -
ఓపీఎస్ వర్గంతో చర్చలకు కమిటీ
చెన్నై: అన్నాడీఎంకేలో చీలిక వర్గాలు విలీనం దిశగా మరో ముందడుగు పడింది. ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్) వర్గంతో చర్చలకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి(ఈపీఎస్) ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ ఆర్. వైద్యలింగం ఈ కమిటీ నేతృత్వం వహిస్తారు. మంత్రులు సెంగొట్టయన్, డి. జయకుమార్, సి. శ్రీనివాసన్ సభ్యులుగా ఉంటారు. ఓపీఎస్ వర్గంతో ఈ కమిటీ విలీన చర్చలు జరపనుంది. శశికళ వర్గాన్ని బయటకు పంపడంతో ఈపీఎస్ కూటమితో చర్చలకు పన్నీస్ సెల్వం మొగ్గుచూపారు. అయితే సీఎం పీఠం, పార్టీ పదవి తనకే కావాలని ఓపీఎస్ పట్టుబడుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. పన్నీర్ సెల్వం వర్గం ఎటువంటి షరతులు విధించలేదని అంటూనే ముఖ్యమంత్రిని మార్చేది లేదని ఈపీఎస్ వర్గం చెబుతుండడం గమనార్హం. పార్టీని బతికించుకోవడానికే విలీనానికి సిద్ధపడ్డామని ఇరువర్గాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య జరగనున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
-
మంతనాల్లో బిజీ
♦ చర్చలు షురూ.. ♦ భద్రత పెంపు ♦ తొలి గెలుపుతో పన్నీరు జోష్ ♦ టీటీవీకి భంగపాటు ♦ దూకుడు పెంచిన పళని ♦ ఏకం అయ్యేదెన్నడో ♦ పదవుల చర్చ..ప్రచార హోరు టీటీవీ దినకరన్‌ను సాగనంపుతూ మంత్రులు చేసిన ప్రకటనతో అన్నాడీఎంకేలో రాజకీయ చర్చ తారాస్థాయికి చేరింది. బుధవారం పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ సాగింది. ఓ వైపు పన్నీరు శిబిరం, మరో వైపు సీఎంతో మంత్రులు, ఇంకో వైపు టీటీవీ దినకరన్ ఎవరికి వారు వేర్వేరుగా మంతనాల్లో బిజిబిజీ అయ్యారు. సీఎంకు చెక్ పెట్టే రీతిలో టీటీవీ నిర్ణయం తీసుకునేనా అన్న చర్చ ఊపందుకుంది. దీంతో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఊహాగానా లు, ప్రచారాలకు చెక్ పడినా, ఇక, పన్నీరుతో చర్చలు షురూ అని సీఎం టీం ప్రకటించడంతో రాజకీయ ఆసక్తి సాఫీగా సాగింది. అయితే, చర్చల్లో పదవుల పందేరాల వ్యవహారం చర్చ హోరెత్తే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి నిత్యం అన్నాడీఎంకేలో ఏదో ఒక వివాదం, చర్చ సాగుతూనే వస్తున్నది. చిన్నమ్మ శశికళ జైలు జీవితంతో పార్టీకి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని మంగళవారం మంత్రులు తీసుకోవడం మరో పెద్ద చర్చకు, ఉత్కంఠకు దారి తీసింది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ రాష్ట్రంలో బయలు దేరింది. సీఎంకు చెక్ పెట్టే రీతిలో దినకరన్ దూకుడు పెంచవచ్చన్న సంకేతాలతో అందరి దృష్టి అన్నాడీఎంకే పరిణామాల మీద పడింది. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కల్గేనా అన్నంత ఉత్కంఠ బయలు దేరడంతో ఆగమేఘాలపై చెన్నైతో పాటు పలు నగరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం, సీఎం, మాజీ సీఎం, దినకరన్ ఇంటి పరిసరాల్ని అయితే, భద్రతా వలయంలోకి తెచ్చారు. మంతనాల్లో బిజీ బిజీ... ఈ ఉత్కంఠకర పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారు మంతనాల్లో బిజీ కావడంతో మీడియా దృష్టి అంతా అన్నాడీఎంకే వైపుగా మరలింది. రాష్ట్రంలో ఎక్కడచూసినా అన్నాడీఎంకే అంతర్గత సమరం చర్చే. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు తగ్గట్టు ఉదయాన్నే దినకరన్ ప్రయత్నాల్లో పడ్డారని చెప్పవచ్చు. తనకు మద్దతుగా కనీసం యాభై మంది వరకు ఎమ్మెల్యేలు కదిలి వస్తారని ఆశించినా, భంగపాటు తప్పలేదు. ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రం ప్రత్యక్షం కావడంతో వారితో మంతనాల్లో దినకరన్ మునిగారు. చివరకు మీడియా ముందుకు వచ్చి ఉత్కంఠకు తెర పడేలా చేశారు. పోలీసులకు కాస్త పని తగ్గినట్టు చేశారు. మీడియాతో మాట్లాడే సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడుతున్నానని, దూరం నిర్ణయం తనకు ఎలాంటి బాధను కల్గించలేదంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతం అని, పదవికి రాజీనామా అన్నది మాత్రం చిన్నమ్మ శశికళ నిర్ణయం మేరకే నంటూ ముందుకు సాగారు. పన్నీరు జోష్ : దినకరన్‌కు వ్యతిరేకంగా మంత్రుల ప్రకటనతో పన్నీరు శిబిరంలో ఆనందం తాండవం చేసిందని చెప్పవచ్చు. ఇక, చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టినట్టేనన్నంత ధీమాలో మునిగారు. ఉదయాన్నే గ్రీమ్స్ రోడ్డులోని ఆయన నివాసం వద్దకు మద్దతు నేతలు, కేడర్ తరలి రావడంతో ఆ పరిసరాలు చాలా రోజు అనంతరం మళ్లీ కిక్కిరిశాయి. ఈసందర్భంగా మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ధర్మయుద్ధంలో ఇది తొలి గెలుపుగా అభివర్ణించారు. పళని దూకుడు : దినకరన్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదేని వ్యూహాలకు పదును పెట్టిన పక్షంలో తిప్పికొట్టేందుకు తగ్గ అస్త్రాల్ని సిద్ధం చేసుకునే రీతిలో ఉదయాన్నే సీఎం ఎడపాడి పళనిస్వామి సైతం మంతనాల్లో బిజీ అయ్యారు. ఇరవై మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో హడావుడి పెరిగింది. దూకుడు పెంచే రీతిలో తరచూ ఎవరో ఒక మంత్రి బయటకు వచ్చి మీడియా ముందు దినకరన్‌కు హెచ్చరికలు చేసి వెళ్లడం గమనార్హం. పార్టీ కార్యాలయం వైపుగా అడుగులు పెడితే తీవ్ర పరిణామాలు తప్పదన్నట్టుగా హెచ్చరికలు సైతం అందులో ఉండడం గమనార్హం. ఈ మంతనాల జోరుసాగుతున్న సమయంలో దినకరన్ మీడియాతో స్పందించి తీరును పరిగణించి ఇక విలీనం విషయంగా దూకుడు పెంచేందుకు పళని సిద్ధమయ్యారు. చర్చలు షురూ : ఇక, అన్నాడీఎంకే ఒకే వేదిక అన్నట్టుగా నేతలు ముందుకు సాగే సమయం ఆసన్నం అవుతోన్నట్టు స్పష్టమైంది. గతంలో శశి అండ్ కోను అమ్మ జయలలిత సాగనంపితే, ప్రస్తుతం దినకరన్ అండ్ కోను సాగనంపుతూ తీసుకున్న నిర్ణయం పళనిస్వామి మీద ప్రజల్లో కాస్త క్రేజ్ పెంచినట్టు అయింది. పన్నీరు పంతనం నెగ్గడం, పళని దూకుడు పెంచడం వెరసి ఇక, అన్నాడీఎంకేకు మంచి రోజులు మళ్లీ వస్తాయా అన్న ఆశలు కేడర్‌లో మొలకెత్తుతున్నాయి. ఇక, శశికళ, దినకర్ అండ్ కోకు చెక్ పెట్టడాన్ని ఆహ్వానించే రీతిలో ప్రజల మధ్య చర్చలు సాగడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో విలీనం విషయంగా చర్చలు సాగించేందుకు పన్నీరు, పళని శిబిరాలు సిద్ధం అయ్యాయి. గురువారం నుంచి సాగే చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు, షరతులు తెర మీదకు రానున్నాయో అన్న కొత్త ఉత్కంఠ బయలు దేరింది. ముందుగా ఇరు పక్షాల ప్రత్యేక కమిటీలో సమావేశాలు సాగించి, చివరగా పళని, పన్నీరు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు తగ్గట్టు కార్యచరణ సాగనుంది. అయితే, ఈ చర్చల్లో తెర మీదకు రానున్న అంశాలపై రక రకాల ప్రచారాలు, పుకార్లు అప్పుడే ఊపందుకున్నాయి. పన్నీరు సీఎం అన్నట్టుగా, కాదు..కాదు ప్రధాన కార్యదర్శి అంటూ ఓ వైపు, మరో వైపు పళనికి ఇక రెండు(పార్టీ, ప్రభుత్వం) చోట్లా డిప్యూటీ పదువులే అన్నంతగా చర్చలు సాగుతుండడం గమనార్హం. తమిళ మీడియా ఇదే అంశాలను తెర మీదకు తెచ్చే కథనాలు మొదలెట్టే పనిలో పడ్డాయి. అయితే, చర్చల్లో పై అంశాలు సాధ్యమేనా..? ఏకం అయ్యేదెన్నడో..?, విలీనం మూహూర్తం ఎప్పుడో అన్నది వేచి చూడాల్సిందే. -
ఓపీఎస్.. ఈపీఎస్.. మధ్యలో సెంగొట్టియాన్
చెన్నై : తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. విలీనమైన ఈపీఎస్-ఓపీఎస్లు చిన్నమ్మ శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి వెలివేశారు. అమ్మ జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రాత్రికి రాత్రి పదవి స్వీకరించి, అనంతరం జరిగిన పరిణామాల్లో పార్టీకి, సీఎం పదవికి కూడా దూరమైన పన్నీర్ సెల్వం.. ఎలాగైనా ఆ పదవిని మరోసారి చేపట్టాలన్న ఆశతో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి తనకే ఉంచి.. ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవాలని ఓపీఎస్‌కు పళనిస్వామి ఆఫర్ ఇచ్చారు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రధాన కార్యదర్శి పదవి మీద సీనియర్ నాయకుడు సెంగొట్టియాన్ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పదవిని పన్నీర్ సెల్వానికి ఇస్తే ఆయన సంగతి ఏమవుతుందో తెలియాల్సి ఉంది. తాను ఈ పదవికి పోటీలో ఉన్నానని సెంగొట్టియాన్ ముందునుంచే చెబుతున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. రెండు వర్గాల డిమాండ్లతో తమిళ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారాయి. ఈ డిమాండ్ల నేపథ్యంలో చర్చలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. -
రెండాకులు ఒకటయ్యేనా?
♦ శశికళ ప్రమేయం లేకుండా రాజీబాట ♦ దినకరన్ వర్గం కస్సుబుస్సు ♦ మంత్రుల్లో సంతోషం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన అఖిలభారత అన్నాడీఎంకే అంతర్థ్దానం కావడం, రెండాకుల చిహ్నం రాలిపోవడం జీర్ణించుకోలేక ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రాజీ ప్రయత్నాలు ఫలించేనా, రెండాకులు మళ్లీ చిగురుతొడిగేనా అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. అమ్మ మరణం తరువాత పార్టీ, ప్రభుత్వాలను చేజిక్కించుకోవడం ద్వారా శశికళ వర్గమే పైచేయిగా నిలిచింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో శశికళ వర్గాన్ని అన్నాడీఎంకే నేతలుగా, రెండాకుల చిహ్నంపై పోటీ చేసేందుకు అర్హులుగా ఎన్నికల కమిషన్ భావించలేదు. ‘అన్నాడీఎంకే అమ్మ’ పేరున కొత్త పార్టీని స్థాపించి టోపీ గుర్తుపై పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంజీ రామచంద్రన్ స్థాపించి, జయలలిత హయాంలో ఒక బలమైన రాజకీయపార్టీగా ఎదిగిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం లేకుండా చేసిన అపప్రథను శశికళ వర్గం మూటకట్టుకుంది. తాత్కాలికంగా అధికారంలో ఉన్నా భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉండదనే సత్యాన్ని గ్రహించిన సీఎం ఎడపాడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. శశికళ, దినకరన్ వల్ల ఏర్పడిన అప్రతిష్టను తొలగించుకోవడం, పార్టీ, చిహ్నాలను దక్కించుకోవడం ప్రధాన కర్తవ్యంగా భావించారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, శాశ్వత ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత చేత నియమింపబడిన తామే పార్టీకి అసలైన వారసులమని ఎన్నికల కమిషన్ వద్ద వాదిస్తున్న పన్నీర్‌సెల్వం వర్గాన్ని చేరదీయక తప్పదని సీఎం తీర్మానించుకున్నారు. దినకరనే ప్రతిబంధకం: అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కోల్పోవడం ఇరువర్గాలకు నష్టమేనని తెలుసుకున్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో ఏకం అయ్యేందుకు సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సిద్దమైనారు. అయితే శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలన్న పన్నీర్‌సెల్వం షరతులు విలీనానికి ప్రతిభందకంగా మారుతోంది. శశికళ జైలు కెళ్లేపుడు పార్టీ బాధ్యతలను తన అక్క కుమారుడు దినకరన్‌ను ఉప ప్రధానకార్యదర్శిగా నియమించారు. అయితే దినకరన్ వైఖరితో ప్రభుత్వం అసంతృప్తి రగిలిపోతోంది. దినకరన్‌ను దూరం పెట్టడం వల్ల ప్రజల్లో ప్రతిష్టపెరగడం, పన్నీర్‌సెల్వం వర్గం ఏకం కావడం, రెండాకుల చిహ్నం దక్కడం వంటి లాభాలు ఉన్నాయని సీఎం ఆశతో ఉన్నారు. పన్నీర్‌సెల్వం డిమాండ్లకు అనుకూలంగా దినకరన్‌ను ఒప్పించాలని లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై నాయకత్వంలో 9 మందితో కూడిన మంత్రుల బృందాన్ని సీఎం సిద్దం చేశారు. అయితే పార్టీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు దినకరన్ ససేమిరా అంటున్నారు. మాట వినకుంటే డిస్మిస్ చేయాల్సి వస్తుందని సీఎం వర్గ మంత్రులు చేసిన హెచ్చరికలకు జవాబుగా ప్రభుత్వాన్ని కూల్చివేయగల సత్తా తనకు ఉందని దినకరన్ వ్యాఖ్యానించారు. రెండువర్గాల విలీన ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని పలువురు మంత్రులు మంగళవారం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా పార్టీ పరంగా ఇంతటి కీలక పరిణామాల్లో శశికళ పేరు నామమాత్రం కూడా చోటుచేసుకోక పోవడం విశేషం. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజీబాటలో ప్రయాణంలో సీఎం ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఒకటిగా నిలుస్తుండగా, దినకరన్ వైరి వర్గంగా మారిపోవడం విచిత్రకరమైన పరిణామం. మరి ఈ పరిస్థితిలో అన్నాడీఎంకే విలీనం సాధ్యమా అనే ప్రశ్నకు మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. -
విలీనానికి ఓపీఎస్ ఓకే
చెన్నై: శశికళ వర్గంలోని అధికార అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్) సూచనప్రాయంగా ప్రకటించారు. విలీనంపై చర్చలు జరిపేందుకు శశికళ వర్గం కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని పళనిస్వామి వర్గం కూడా ధ్రువీకరించింది. సీనియర్ మంత్రులతో కూడిన కమిటీ రెండు వర్గాల విలీనంపై చర్చలు జరుపుతుందని మంత్రి సెల్లూర్ రాజు తెలిపారు. రెండాకుల గుర్తును రెండు వర్గాలు కోరుకుంటున్నాయని, పార్టీ గుర్తును దక్కించుకోవాలంటే ఇరువర్గాలు కలిసి పనిచేయాల్సివుంటుందని పేర్కొన్నారు. ‘మేమంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల లాంటి వాళ్లం. రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశముందని నిన్న పన్నీర్ సెల్వం వెల్లడించారు. దీనికనుగుణంగా మేమంతా కూర్చుని, చర్చించుకుని విభేదాలు పరిష్కరించుకుంటామ’ని సెల్లూర్ రాజు చెప్పారు. పన్నీర్ సెల్వం వర్గం తమ వర్గంలో విలీనమవుతుండడం పట్ల అటవీశాఖ మంత్రి సి. శ్రీనివాసన్ సంతోషం వ్యక్తం చేశారు. తన వర్గాన్ని విలీనం చేసేందుకు పళనిస్వామి ప్రభుత్వానికి ఓపీఎస్ రాజీ ఫార్ములా ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళ కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా పెట్టాలని ఆయన షరతు విధించినట్టు తెలుస్తోంది. -
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు!
-
తమిళ రాజకీయాల్లో కీలక మలుపు!
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరిగాయి. అధికార అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు ఏకమయ్యే దిశగా కదులుతున్నాయి. ఓ పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ రోజు దీనిపై కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లాయడంతో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకోబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పన్నీర్ సెల్వం తన వర్గీయులతో సొంతగూటికి వచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఓపీఎస్ వర్గాన్ని చేర్చుకునేందుకు సీఎం పళనిస్వామి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. శశికళ వర్గీయులపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఓపీఎస్ వర్గాన్ని తమలో విలీనం చేసుకునేందుకు అధికార వర్గం ముందుకు వచ్చినట్టు విశ్వనీయవర్గాల సమాచారం. రెండాకుల గుర్తు కోసం దినకరన్ రూ. 50 కోట్లు ఇవ్వచూపినట్టు ఆరోపణలు రావడంతో మరోసారి కలకలం రేగింది. ఇప్పటికే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వంతో శశికళ వర్గం అప్రదిష్టపాలైంది. మరోవైపు బెంగళూరు జైలులో ఉన్న శశికళను ఈరోజు దినకరన్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
పన్నీరు పావులు
► అమ్మ శిబిరంతో సంప్రదింపులు ► ‘పళని’తో సంధికి యత్నమా.. ► సీనియర్లతో సీఎం మంతనాలు ► రసవత్తరంగా అన్నాడీఎంకే రాజకీయం ► మరో ఎమ్మెల్యే తిరుగుబాటు బెదిరింపు సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవీ శిబిరాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అమ్మ శిబిరం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు, సీఎం ఎడపాడి పళనిస్వామి మధ్య ఇంటి పోరు రచ్చకెక్కిన సమాచారంతో మాజీ సీఎం పన్నీరుసెల్వం పావులు కదిపే పనిలో పడ్డారు. పళనితో సంధికి ప్రయత్నాల్లో పడ్డట్టున్నారు. టీటీవీకి చరమగీతం పాడి సఖ్యతగా అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడిపిద్దామన్న సంకేతాన్ని సీఎంకు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో సీనియర్లతో సీఎం మంతనాల్లో మునగడం గమనార్హం. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో బయలు దేరిన కల్లోలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ రాజీనామా డిమాండ్ అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో వివాదాన్ని రేపింది. రాజీనామా చేయించే ప్రయత్నంలో సీఎం, అడ్డుకునే ప్రయత్నంలో టీటీవీ దినకరన్ ముందుకు సాగుతుండడంతో ఆ ఇద్దరి మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఈ విభేదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్టట్టున్నారు. చిన్నమ్మ శశికళ, టీటీవీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ శిబిరం, కొత్త ఎత్తులకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. చిన్నమ్మ శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న దృష్ట్యా, ఇక, సీనియర్లను తొక్కి పెట్టి పార్టీలో ప్రస్తుతం పెత్తనం సాగిస్తున్న దినకరన్‌ను ఇదే అదునుగా సాగనంపే వ్యూహాన్ని రచించినట్టు సమాచారం. ఇందుకుగాను, ఎడపాడి పళనిస్వామితో చేతులు కలిపి, దినకరన్‌ను బయటకు పంపించడమే కాకుండా, అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని ఇద్దరం కలిసి కట్టుగా నడిపిద్దామన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు వ్యూహాలను ఆచరణలో పెట్టే పనిలో పురట్చితలైవీ శిబిరానికి చెందిన నేతలు పాండియరాజన్, సెమ్మలై, జేసీడీ ప్రభాకర్ తమ భుజాన వేసుకుని ఉన్నట్టు తెలిసింది. సీనియర్లతో సీఎం మంతనాలు: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, అదే సమయంలో పార్టీకి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే, సఖ్యతగా ముందుకు సాగుదామన్న సఖ్యత మంత్రాన్ని సీనియర్ మంత్రుల చెవిలో పురట్చి తలైవీ శిబిరం నేతలు వేశారు. సీఎం పళని స్వామి దృష్టికి తీసుకెళ్లి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనను చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయం శుక్రవారం రాత్రి సీఎం ఎడపాడి పళనిస్వామి ఇంట్లో జరిగిన మంతనాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ చేత రాజీనామా చేయించే విషయంగా దినకరన్‌తో భేటీ అనంతరం సీనియర్ మంత్రులు ఎడపాడితోనూ సమావేశం అయ్యారు. విజయభాస్కర్ దగ్గర రాజీనామా చేయించడం లేదా, తొలగించడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎంకు ఆ సీనియర్లు సూచించారు. ఏదేని సమస్య ఎదురైన పక్షంలో ఎదుర్కొందామని, ఢీ కొడదామన్న భరోసాను ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో సీనియర్లు, పన్నీరు శిబిరం నుంచి వచ్చిన సఖ్యత సందేశాన్ని ఉపదేశించారు. దీనిని ఆసక్తిగా విన్న సీఎం, ముందు విజయభాస్కర్ విషయాన్ని తేలుద్దామని, తదుపరి మిగతావి చూసుకుందామన్న వ్యాఖ్యల్ని పలికినట్టుగా పన్నీరు శిబిరానికి సమాచారం చేరి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అమ్మ శిబిరంలో రచ్చకెక్కిన ఇంటి పోరు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నదో వేచి చూడాల్సిందే. మరో ఎమ్మెల్యే బెదిరింపు : సీఎం ఎడపాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా బెదిరింపుల స్వరాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా హెచ్చరికలు చేసి ఉండగా, శనివారం మరో ఎమ్మెల్యే ఆ జాబితాలోకి చేరారు. పెరుంతురై ఎమ్మెల్యే, మాజీ మంత్రి తోపు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ విరుచుకు పడ్డారు. అమ్మ పథకాల అమల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే కీలక నిర్ణయాన్ని తాను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. బెదిరింపుల స్వరాన్ని పెంచే ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరం వైపుగా చూస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంటి పోరు విషయంలో సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో! -
పన్నీర్‌సెల్వం వర్గంపై ఈసీకి ఫిర్యాదు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే నిప్పు ఉప్పుగా ఉన్న పన్నీర్ సెల్వం, శశికళ వర్గం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా పన్నీర్ సెల్వం వర్గంపై శశికళ గ్రూప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ పోల్ గుర్తును పన్నీర్ వర్గం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. రెండు ఆకుల గుర్తుగా ప్రచారం చేస్తున్నారని గురువారం ఈసీకి ఫిర్యాదు చేసింది. సెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి వీడియో పుటేజ్‌ను కూడా సమర్పించింది. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చేనెల 12న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. బహుముఖ సమరంగా సాగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తీవ్ర కుస్తీలే పడుతున్నారు. బరిలో 62మంది ఉన్నా, ప్రధాన సమరం మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే అమ్మ, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ మధ్య సాగుతున్నదని చెప్పవచ్చు. డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పురట్చితలైవి అమ్మ అభ్యర్థి మధుసూదనన్ ప్రచారంలో దూసుకు వెళుతున్నారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులతో కలిసి ప్రజాకర్షణ ప్రచారంలో ఉన్నారు. -
స్టాలిన్‌పై నిప్పులు చెరిగిన పన్నీర్!
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నారు. ఆ ఓటమి భయంతోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శి వీకే శశికళకు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలను బటయపెట్టాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత డీఎంకే నేతలకు లేదని, దేశంలో పెద్ద కుంభకోణాలు వారి హయాంలోనే జరిగాయని విమర్శించారు. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థి ఈ మధుసూదనన్ పై ప్రజలు నమ్మకం ఉంచారని, డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ కు ఓటమి తప్పదని పునరుద్ఘాటించారు. గత సోమవారం డీఎంకే అధినేత స్టాలిన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. జయలలిత మృతిపై పన్నీర్ సెల్వం వద్ద ఉన్న సాక్ష్యాలను, అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను బహిర్గతం చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. దీనిపై పన్నీర్ సెల్వం స్పందిస్తూ.. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత స్టాలిన్‌కు లేదన్నారు. 2జీ, ఎయిర్ మాక్సిస్ లాంటి దేశంలోనే అతిపెద్ద కుంభకోణాలు డీఎంకే నేతలు చేసినవేనంటూ నిప్పులు చెరిగారు. అయితే శశికళ తనను అమ్మ జయలలిత నుంచి దూరం చేసేందుకు 2006 నుంచి చేసిన ప్రయత్నాలే ఆ 90 శాతం రహస్యాలని చెప్పారు. అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కనీసం ఆమెను చూడలేకపోయానని, చికిత్స కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో చర్చించినట్లు వెల్లడించారు. అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావాలని.. లేనిపక్షంలో మనపైనే కాదు మన ఇళ్లమీద దాడులు జరుగుతాయని ఆరోగ్యశాఖమంత్రి సీ విజయభాస్కర్‌కు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్కే నగర్ ఎన్నికల బరిలో చివరికి రేసులో 62 మంది మిగిలారు. అయితే ఇక్కడ చతుర్మఖ పోరు తప్పదనిపిస్తోంది